రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినబడటానికి కారణం? (జనరల్ సైన్స్-2)
57. అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) పాదరస భారమితి
2) ఆల్కహాల్ భారమితి
3) రెసిస్టెన్స్ థర్మామీటర్
4) పైరో మీటర్
58. పాదరస భారమితిని ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కొలవడానికి ఉపయోగిస్తారు?
1) 360 2) 500
3) 212 4) 100
59. పాలను శుభ్రపరిచేవి?
1) అతిధ్వనికాలు 2) కీచునాదాలు
3) సంగీత నాదాలు 4) అతిధ్వనులు
60. పారిస్‌లోని సీన్ నదిమీద బ్రిడ్జి, సైన్యం వెళ్లినప్పుడు పడిపోయింది. దీనికి కారణం?
1) సహజ కంపనాలు
2) బలాత్కృత కంపనలు
3) అనునాదం 4) బలహీనత
61. ‘సోనార్’ వ్యవస్థను దేనికి ఉపయోగిస్తారు?
ఎ. మహాసముద్రపు లోతును కచ్చితంగా కనుగొనడానికి
బి. ఓడ వేగాన్ని కనుగొనడానికి
సి. నీటి అడుగున ఉన్న కంటికి కనపడని వస్తువులను కనిపెట్టడానికి
1) ఎ 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
62. ధ్వని వేగం ఏ పదార్థంలో ఎక్కువ?
1) ఘన 2) ద్రవ
3) వాయు 4) శూన్యం
63. శబ్ద తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) తరచుదనం 2) పిచ్
3) అతిస్వరం 4) కంపన పరిమితి
64. స్థాయిని నిర్ణయించడంలో దేనికి ప్రాముఖ్యత ఎక్కువ?
1) కంపన పరిమితి 2) తరచుదనం
3) శబ్దతీవ్రత 4) అతిస్వరాలు
65. గ్రాంఫోన్ను కనుగొన్న శాస్త్రవేత్త?
1) మార్కోని
2) థామస్ ఆల్వా ఎడిసన్
3) హెర్ట్ 4) గ్రాహంబెల్
66. గాలిలో ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణం చేసే విమానాలకు పేరు?
1) జెట్ విమానాలు
2) సూపర్ జెట్ విమానాలు
3) సోనిక్ విమానాలు
4) సూపర్సోనిక్ విమానాలు
67. భూకంపాల పుట్టుక స్థానాన్ని కనుగొనడానికి ఉపయోగించే పరికరం?
1) అవపాత సూచిక 2) గ్రాంఫోన్
3) రాడార్ 4) భూకంప లేఖిని
68. భూకంప అఘాత తరంగాల్లో అత్యధిక వేగంతో ప్రయాణించే తరంగాలు?
1) గౌణ తరంగాలు
2) ప్రాథమిక తరంగాలు
3) తల తరంగాలు
4) గురుత్వ తరంగాలు
69. భూకంప తరంగాలను పంపి భూమిలో వేటి ఉనికిని కనుగొంటారు?
1) నిధి నిక్షేపాలు 2) ఖనిజాలు
3) నీరు 4) రాళ్లు
70. అనునాదం ఏర్పడినప్పుడు ఏవి సమానం?
1) కంపన పరిమితి 2) తరచుదనం
3) తరంగదైర్ఘ్యం 4) వేగం
71. ఒక ఎరుపు వర్ణపు కాంతి పుంజం గులాబి పుష్పంపై పడితే ఆ గులాబీ ఏ వర్ణంలో కనిపిస్తుంది?
1) ఎరుపు 2) నలుపు
3) ఆకుపచ్చ 4) పసుపు
72. తరంగంలో కణం అత్యధిక స్థానభ్రంశం?
1) కంపన పరిమితి 2) ప్రావస్థ
3) ప్రతిధ్వని 4) పౌనఃపున్యం
73. ధ్వని ఏవిధమైన శక్తి?
1) విద్యుత్ శక్తి 2) ఉష్ణశక్తి
3) యాంత్రికశక్తి 4) స్థితిశక్తి
74. ధ్వని వేటిలో ప్రయాణించదు?
1) ఇనుపకడ్డీ 2) నీరు
3) శూన్యం 4) హైడ్రోజన్ వాయువు
75. ధ్వని వేగం అత్యధికంగా ఎప్పుడు ఉంటుంది?
1) వేసవికాలం 2) చలికాలం
3) వర్షాకాలం 4) అన్నిటిలో సమానం
76. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, ధ్వనివేగం
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు 4) పెరగవచ్చు
77. సముద్రలోతును కొలిచే సాధనం?
1) ఆల్టీమీటర్ 2) ఫాతోమీటర్
3) హైడ్రోమీటర్ 4) మానోమీటర్
78. గబ్బిలాలు రాత్రిపూట ఎగరగలుగుతాయి. దీనికి కారణం?
1) అవి చీకటిలో స్పష్టంగా చూడగలవు
2) వాటి కనుపాపలు పెద్దవిగా ఉంటాయి
3) అవి అతిధ్వనులను ప్రసారం చేస్తాయి
4) ఏ పక్షి అయినా రాత్రిపూట ఎగరగలదు
79. ప్రతిధ్వనులు ఏర్పడటానికి కారణం?
1) ధ్వని పరావర్తనం
2) ధ్వని వక్రీభవనం
3) వివర్తనం 4) ధృవణం
80. సంగీత సభలు నిర్వహించే భవనం గోడలు ధ్వనిని..?
1) పెంచాలి
2) పరావర్తనం చెందించాలి
3) ప్రసరింపచేయాలి
4) గ్రహించాలి
81. మాక్ నంబర్‌కు దేని వేగంతో సంబంధం ఉంది?
1) ధ్వని 2) ఓడలు
3) విమానం 4) అంతరిక్షనౌక
82. డెసిబుల్ అనేది?
1) ఒక సంగీత సాధనం
2) ఒక సంగీత సంకేతం
3) ధ్వని తీవ్రతకు ప్రమాణం
4) ధ్వని తరంగదైర్ఘ్యం
83. గంటలను కొయ్యతో కాకుండా, లోహంతో తయారుచేయడానికి కారణం?
1) లోహానికి ఉష్ణవాహకత్వం ఎక్కువ
2) లోహానికి సాంద్రత ఎక్కువ
3) లోహాలు ధ్వని వాహకాలు కావు
4) కొయ్య ధ్వని తీవ్రతను తగ్గిస్తుంది
84. చంద్రుని మీద వ్యోమగామి, తోటి వ్యోమగామి మాటలు వినలేడు. కారణం?
1) అధిక పౌనఃపున్యం
2) యానకం లేకపోవడం
3) తక్కువ ఉష్ణోగ్రతలు
4) చంద్రుని మీద పెద్ద గుంటలు ఉండటం
85. ఏదైనా వలయంలో విద్యుత్ ప్రవహిస్తున్నదీ లేనిదీ తెలుసుకోవడం కోసం ఉపయోగించేది?
1) గాల్వనోమీటర్ 2) అమ్మీటర్
3) ఫారన్ హీటర్ 4) హీటర్
86. రాపిడి వల్ల ఒక ఉపరితలం నుంచి మరొక ఉపరితలం పైకి ఎలక్టాన్లను బదిలీ చేయడమే
1) విద్యుద్విశ్లేషణం
2) విద్యుత్ ప్రవాహం
3) విద్యుద్దీకరణ
4) విద్యుత్ వాహకం
87. సాధారణ నేత్రం తన దృష్టిని ఎంత వరకు సర్దుబాటు చేయగలదు?
1) అనంతం నుంచి సుమారు 25 సెంటీమీటర్ల మధ్య
2) మన చుట్టూ ఉన్న అన్ని దూరాలకు
3) 25 సెం.మీ నుంచి కంటి నాభ్యాంతరం 2.5 సెం.మీ ఉండేవరకు
4) చెప్పలేం
88. ఒక వాహకం నుంచి ప్రవహిస్తున్న కరెంటును దేనితో కొలుస్తారు?
1) వోల్ట్‌మీటర్ 2) అమ్మీటర్
3) కెపాసిటర్ 4) కండెన్సర్
89. విద్యుత్ నిరోధానికి ప్రమాణం?
1) వోల్ట్ 2) ఆంపియర్ లేదా ఓమ్
3) 1, 2 4) ఏదీకాదు
90. 1 కిలోవాట్ అవర్ అంటే ఎంత?
1) 6x1036J
2) 0.6x1036J
3) 3.6x1036J
4) 36x1036J
91. కాంతి ఏ విధంగా ప్రయాణిస్తుంది?
1) వృత్తాకార మార్గంలో
2) వక్ర మార్గంలో
3) తరంగాల్లో 4) రుజు మార్గంలో
92. కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం?
1) సముద్రపు లోతు కొలవడానికి
2) వాతావరణం కొలవడానికి
3) ఉష్ణం 4) ఖగోళ దూరం
93. కాంతి తరంగాలు
1) దైర్ఘ్య తరంగాలు
2) తిర్యక్ తరంగాలు
3) స్వయం ప్రకాశకాలు
4) స్వయం ప్రకాశకాలు కాదు
94. విద్యుత్ జనరేటర్ ఏ లక్షణంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) అయస్కాంత ప్రేరణ
2) విద్యుదయస్కాంత ప్రేరణ
3) అయస్కాంతత్వం
4) పాస్కల్ నియమం
95. పురోగామి, తిరోగామి తరంగాల కలయిక వల్ల ఏ తరంగం ఏర్పడుతుంది?
1) అనుదైర్ఘ్య 2) తిర్యక్
3) స్థిర 4) విద్యుదయస్కాంత
96. సాంద్రీకరణాలు, విరళీకరణాలు ఉండే తరంగాలు?
1) తిర్యక్ 2) అనుదైర్ఘ్య
3) స్థిర 4) పైవన్నీ
97. వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాలను తిరిగి భూమికి పంపుతుంది?
1) స్ట్రాటోస్పియర్ 2) ట్రోపోపాస్
3) అయనోస్పియర్ 4) ట్రోపోస్పియర్
98. రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినపడటానికి కారణం?
1) బయటి చప్పుళ్లు చాలా తగ్గుతాయి
2) పగటి వలే కాకుండా, రాత్రి కొన్ని రేడియో స్టేషన్లు మాత్రమే పనిచేస్తాయి
3) పగటిపూట సూర్యకిరణాలు రేడియో కిరణాలను అడ్డుకుంటాయి
4) భూ అయస్కాంత క్షేత్రం రాత్రిపూట తక్కువ శక్తితో పనిచేస్తుంది
99. రాడార్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?
1) రేడియో రిసీవర్లో సంకేతాలను గ్రహించటానికి
2) గ్రహాల కదలికలను అధ్యయనం చేయటానికి
3) విమానాల వంటి వస్తువుల స్థానాన్ని కనుగొని, నిర్ణయించటానికి
4) సన్స్పాట్స్ను అధ్యయనం చేయటానికి
100. అత్యల్ప తరంగదైర్ఘ్యాలున్న విద్యుదయాస్కాంత కిరణాలు
1) X-కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) గామా కిరణాలు
4) రేడియో తరంగాలు
101. అయస్కాంతాల తయారీకి ఉపయోగించే మిశ్రమ లోహం?
1) మెత్తని ఇనుము 2) అల్యూమినియం
3) ఆల్నికో 4) నికెల్
102. జతపరచండి
1. పారా అయస్కాంత పదార్థాలు
ఎ. నికెల్, కోబాల్ట్
2. ఫెరో అయస్కాంత పదార్థాలు
బి. పాదరసం, నీరు
3. డయా అయస్కాంత పదార్థాలు
సి. అల్యూమినియం, ఆక్సిజన్
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-ఎ, 2-సి, 3-బి
103. ఒక అనయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చే పద్ధతి కానిది?
1) అయస్కాంత ప్రేరణ
2) ద్విస్పర్శ పద్ధతి
3) విద్యుదీకరణ పద్ధతి
4) వేడి చేయడం
104. అయస్కాంతాన్ని సుత్తితో కొడితే, దాని అయస్కాంతతత్వం
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు 4) శూన్యం అవుతుంది
105. నీటిని 00 నుంచి 100 వరకు వేడి చేసినప్పుడు, నీటి పరిమాణం ఏ విధంగా ఉంటుంది?
1) మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది
2) మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది
3) ఒకే మాదిరిగా నెమ్మదిగా తగ్గుతుంది
4) ఒకే మాదిరిగా నెమ్మదిగా పెరుగుతుంది
106. అయస్కాంత బలరేఖలు ఎప్పుడూ అయస్కాంతపు ఏ ప్రాంతం నుంచి మొదలవుతాయి?
1) దక్షిణ ధృవం 2) మధ్య బిందువు
3) ఉత్తర ధృవం 4) ఈక్విటోరియల్ లైన్
107. ఒక ప్రదేశం దగ్గర భూ అయస్కాంత క్షేత్ర దిశ దాని క్షితిజ సమాంతర దిశతో చేసే కోణానికి పేరు?
1) అవపాతం 2) భౌగోళిక రేఖా వృత్తం
3) దిక్పాతం 4) రేఖావృత్తం
108. తాత్కాలిక అయస్కాంతాలకు ఉపయోగించే పదార్థం?
1) ఇనుము 2) ఉక్కు
3) నికెల్ 4) కోబాల్ట్
109. మెత్తని ఇనుముతో ఏర్పడే అయస్కాంతత్వం
1) శాశ్వతమైనది 2) తాత్కాలికమైనది
3) బలహీనమైనది 4) ఏదీకాదు
110. అయస్కాంతంతో నేరుగా స్పర్శ లేకుండానే దానికి దగ్గర ఉండటం వల్ల పొందే అయస్కాంతతత్వానికి పేరు?
1) ప్రేరణ అయస్కాంతీకరణ
2) డయా అయస్కాంతీకరణ
3) ఫెరో అయస్కాంతీకరణ
4) పారా అయస్కాంతీకరణ
111. ఒక శాశ్వతయస్కాంతం
1) అన్ని పదార్థాలను ఆకర్షిస్తుంది
2) ఫెరో అయస్కాంత పదార్థాలను మాత్రం ఆకర్షిస్తుంది
3) ఫెరో అయస్కాంత పదార్థాలను ఆకర్షించి, మిగతా వాటిని వికర్షిస్తుంది
4) కొన్ని పదార్థాలను ఆకర్షించి, కొన్నింటిని వికర్షిస్తుంది
112. పరమశూన్య ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే అయస్కాంత ఉష్ణోగ్రత మాపకంలో ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు?
1) సోడియం 2) హీలిమం
3) ద్రవ హీలియం 4) ద్రవ సోడియం
113. భూమి అయస్కాంతత్వం గురించి అధ్యయనం చేయడానికి ‘Indian Institute of Geomagnetism’ కేంద్రాన్ని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు?
1) ముంబై 2) పుణె
3) మద్రాసు 4) కొల్కతా
114. మన నిత్య జీవితంలో ఉపయోగించే అయస్కాంతం ఏ రకానికి చెందినది?
1) డయా అయస్కాంతం
2) ఫెరో అయస్కాంతం
3) పారా అయస్కాంతం
4) ఏదీకాదు
115. అయస్కాంత క్షేత్రంతో స్వల్పంగా ఆకర్షింపబడే పదార్థాలు
1) పారా అయస్కాంత పదార్థాలు
2) డయా అయస్కాంత పదార్థాలు
3) ఫెరో అయస్కాంత పదార్థాలు
4) పైవన్నీ
116. ధృవసత్వానికి MKS ప్రమాణం
1) వెబర్ 2) టెస్లా
3) హెన్రీ 4) ఆంపియర్
జవాబులు
57.4 58.1 59.4 60.3 61.3 62.1 63.4 64.2 65.2 66.4 67.4 68.2 69.2 70.2 71.1 72.1 73.3 74.3 75.1 76.1
77.2 78.3 79.1 80.4 81.3 82.3 83.4 84.2 85.1 86.3 87.1 88.2 89.3 90.3 91.4 92.4 93.2 94.2 95.3 96.2
97.3 98.3 99.3 100.3 101.3 102.3 103.4 104.2 105.1 106.3 107.1 108.1 109.2 110.1 111.4 112.3
113.1 114.2 115.1 116.1
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు