మేనేజ్మెంట్ కోర్సులకు గేట్ వే ‘క్యాట్’
దేశంలో ఒక్కో రంగానికి కొన్ని సంస్థలు ప్రఖ్యాతిగాంచాయి. ఇంజినీరింగ్‌కు ఐఐటీ, మెడిసిన్‌కు ఎయిమ్స్, ఫార్మాకు నైపర్, లా కోర్సులకు ఎన్ఎల్యూ ఇలా మేనేజ్మెంట్ కోర్సులకు ఐఐఎం. మేనేజ్మెంట్ విద్యకు రారాజులుగా భాసిల్లుతున్నాయి ఈ సంస్థలు. వీటిల్లో చదువుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఎక్కడైనా వీరికి మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి 20 ఐఐఎంలతో పాటు పలు ప్రముఖ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోర్సులతోపాటు ఫెలో ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి ఏటా నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ప్రకటన విడుదలైంది. క్యాట్-2022 వివరాలు సంక్షిప్తంగా ‘నిపుణ’ పాఠకుల కోసం..
క్యాట్ – 2022
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)
-ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ నే క్యాట్ అంటారు. పలు రకాల మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. ఈ స్కోర్ ఏడాదిపాటు అంటే 2023 డిసెంబర్ 31 వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
క్యాట్‌తో ప్రవేశాలు కల్పించే సంస్థలు – కోర్సులు
-దేశవ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంలతోపాటు పలు ఇతర డీమ్డ్, ప్రముఖ కాలేజీల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
– క్యాట్ స్కోర్‌తో ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్ (పీహెచ్‌డీలకు సమానమైన) కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
నోట్: ప్రతి ఐఐఎం పీజీపీ, పీఎఫ్ఎం ప్రవేశాల కోసం వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. క్యాట్ స్కోర్‌తోపాటు అకడమిక్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితర అర్హతలతో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల కోసం సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆయా ఐఐఎంల వెబ్సైట్లు చూడవచ్చు.
ఎవరు అర్హులు..?
– కనీసం 50 శాతం మార్కులతో లేదా తత్సమానమైన సీజీపీఏతో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు.
పరీక్ష విధానం
– క్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్. డిజిటల్/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనిలో మూడు సెక్షన్లు ఉంటాయి.
-సెక్షన్-I: వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్
-సెక్షన్-II: డాటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్
-సెక్షన్-III: క్వాంటిటేటివ్ ఎబిలిటీ
– పరీక్షలో మల్టిపుల్ చాయిస్, నాన్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. నాన్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలను టైప్ చేయాలి. మల్టిపుల్‌చాయిస్ ప్రశ్నలు కానివాటికి ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
-పరీక్షను ఉదయం/మధ్యాహ్నం సెషన్లలో నిర్వహిస్తారు.
-దేశవ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 14
అడ్మిట్ కార్డులు డౌన్లోడ్: అక్టోబర్ 27- నవంబర్ 27
పరీక్ష తేదీ: నవంబర్ 27
ఫలితాల వెల్లడి: 2023, జనవరి రెండోవారం
వెబ్సైట్: https://iimcat.ac.in
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?