రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే మూలకం ఏది?
1. కింది వాటిలో ప్లాస్మాకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ. రక్తం ప్లాస్మాలో అల్బుమిన్, గ్లోబ్యులిన్స్ అనే ప్రొటీన్లుంటాయి
బి. ప్లాస్మాలో బైకార్బొనేట్లు, పాస్ఫేట్లు ఉంటాయి
సి. ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉంటాయి
డి. ప్లాస్మాలో రక్తస్కందన నిరోధక హెపారిన్ ఉంటుంది
1) ఎ, బి సరైనవి 2) ఎ, బి, సి సరైనవి
3) సి, డి సరైనవి 4) అన్నీ సరైనవే
2. ఎర రక్తకణాల శ్మశానవాటిక అని దేన్ని పిలుస్తారు?
1) ప్లీహం 2) కాలేయం
3) ఎముక మజ్జ 4) ప్లాస్మా
3. కింది వాటిని జతపరచండి.
ఎ బి
1. ఇసినోఫిల్స్ ఎ. క్షార రంజకాలు
2. బేసోఫిల్స్ బి. ఆమ్ల రంజకాలు
3. న్యూట్రోఫిల్స్ సి. తటస్థ రంజకాలు
1) 1-బి, 2-సి, 3-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
4. శరీర వ్యాధి నిరోధక ప్రతిచర్యల్లో ప్రముఖ పాత్ర వహించే ఎగ్రాన్యులోసైట్లు ఏవి?
1) న్యూట్రోఫిల్స్ 2) మోనోసైట్స్
3) బి-లింఫోసైట్స్ 4) టి-లింఫోసైట్స్
5. కింది వాటిని జతపరచండి.
ఎ బి
1. ఎర రక్తకణాలు ఎ. 120 రోజులు
2. తెల్ల రక్తకణాలు బి. 12-13 రోజులు
3. రక్త ఫలకికలు సి. 5-9 రోజులు
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-సి, 2-ఎ, 3-బి
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-బి, 2-ఎ, 3-సి
6. కింది వాటిలో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి?
ఎ. తెల్ల రక్తకణాల తగ్గుదల లుకేమియాకు దారితీస్తుంది
బి. తెల్ల రక్తకణాల్లో గ్రాన్యులోసైట్, ఎగ్రాన్యులోసైట్ విభజన కనిపిస్తుంది
సి. ఎర రక్తకణాల అసాధారణ పెరుగుదల పాలీ సైథీమియాకు దారి తీస్తుంది
డి. ఎర రక్తకణాల పరిపక్వతకు విటమిన్-బి6, పాంటోథెనిక్ ఆమ్లం అవసరమవుతాయి
1) ఎ, డి సరికాదు 2) బి, సి సరికాదు
3) ఎ, సి సరికాదు 4) సి, డి సరికాదు
7. కింది వాటిని జతపరచండి.
ఎ బి
1. బ్లడ్ డోనర్స్ డే ఎ. మే 8
2. తలసేమియా డే బి. ఏప్రిల్ 17
3. హీమోఫీలియా డే సి. జూన్ 14
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-ఎ, 2-సి, 3-బి
8. సూక్ష్మ రక్షకభటులు అని కింది వేటిని పిలుస్తారు?
1) బేసోఫిల్స్ 2) ఇసినోఫిల్స్
3) లింఫోసైట్స్ 4) న్యూట్రోఫిల్స్
9. రక్తం నీలి రంగులో ఉండటానికి కారణమైన వర్ణకం ఏది?
1) హీమోగ్లోబిన్ 2) హీమోసయనిన్
3) హీమోఎరిత్రిన్ 4) క్లోరోక్రూవారిన్
10. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) ఎర రక్తకణాలు-రొలెక్స్
2) తెల్ల రక్తకణాలు-డయాపెడిసిస్
3) రక్త ఫలకికలు- హీమోటోక్రిట్
4) రక్తం- హిమటాలజీ
11. శ్వాస వర్ణకమైన హీమోగ్లోబిన్‌లో ఉండే మూలకం ఏది?
1) కాపర్ 2) మెగ్నీషియం
3) సోడియం 4) ఐరన్
12. రక్తనాళాల్లో, బ్లడ్ బ్యాంకుల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండే రసాయనాలు ఏవి?
1) థ్రాంబోకైనేజ్+హెపారిన్
2) హెపారిన్+సోడియం సిట్రేట్
3) థ్రాంబోకైనేజ్+సోడియం సిట్రేట్
4) థ్రాంబోప్లాస్టిన్+హెపారిన్
13. అస్థిమజ్జలోని బృహత్ కేంద్రక కణాలు శకలీకరణం చెందడం ద్వారా ఏర్పడే రక్తకణాలు ఏవి?
1) ఎరిత్రోసైట్స్ 2) ల్యూకోసైట్స్
3) థ్రాంబోసైట్స్ 4) మోనోసైట్స్
14. ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉండని వ్యక్తులు ఏ రక్తవర్గానికి చెందుతారు?
1) O రక్త వర్గం 2) AB రక్త వర్గం
3) A రక్త వర్గం 4) B రక్త వర్గం
15. ఏ వ్యాధి వల్ల ఎర రక్తకణాల విచ్ఛిత్తి, ప్లీహం వాపునకు గురవుతుంది?
1) హీమోఫీలియా 2) లుకేమియా
3) మలేరియా 4) ఎనీమియా
16. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి సంతానానికి సంక్రమించే రక్త సంబంధిత వ్యాధి ఏది?
1) తలసేమియా 2) ఎరిత్రోపీనియా
3) పాలీసైథీమియా
4) ఫెర్నీషియస్ ఎనీమియా
17. రక్త వర్గాల పితామడిగా పిలిచే కారల్ లాండ్ స్టీనర్ కనుగొన్న రక్త వర్గాలు ఎన్ని?
1) 5 2) 3 3) 4 4) 2
18. Rh కారకానికి సంబంధించి చిన్న పిల్లల్లో సంభవించే అరుదైన వ్యాధి ఏది?
1) లూకేమియా
2) ఎరిత్రోబ్లాస్టోసిస్ ఫీటలిస్
3) థ్రాంబోప్లాస్టిన్ ఫీటలిస్
4) ఎరిత్రో సైటోపీనియా
19. రక్తంలో తెల్ల, ఎర రక్తకణాల నిష్పత్తి ఎంత?
1) 1:500 2) 500:1
3) 5:100 4) 100:5
20. డెంగీ వ్యాధి సంభవించినప్పుడు వైరస్ ప్రభావం వల్ల తగ్గే రక్తకణాలు ఏవి?
1) ల్యూకోసైట్లు 2) ఎరిత్రోసైట్లు
3) థ్రాంబోసైట్లు 4) మోనోసైట్లు
21. కింది వాటిని జతపరచండి.
ఎ బి
1. బేసోఫిల్స్ ఎ. చనిపోయిన బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి
2. మోనోసైట్లు బి. ఎలర్జీ ప్రతిచర్యలకు కారణం
3. ఇసినోఫిల్స్ సి. గాయాలు మానడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి
1) 1-సి, 2-బి, 3-ఎ 2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-ఎ, 3-బి 4) 1-బి, 2-ఎ, 3-సి
22. రక్తానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.
ఎ. రక్తంలో 55 శాతం, ప్లాస్మాలో 45 శాతం రక్తకణాలు ఉంటాయి
బి. రక్తంలోని ద్రవాన్ని సీరం అంటారు
సి. రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే ద్రవం ప్లాస్మా
డి. రక్త పరిమాణంలో ఎర రక్తకణాలు ఆక్రమించిన శాతాన్ని హిమటోక్రిట్ విలువ అంటారు
1) బి, సి సరైనవి 2) డి మాత్రమే సరైనది
3) ఎ, డి సరైనవి 4) అన్నీ సరైనవే
23. రక్త ప్లాస్మాలో అల్బుమిన్ల స్థాయి తగ్గడం వల్ల కణజాలాల్లో ద్రవం చేరే స్థితి?
1) రక్తహీనత 2) లుకేమియా
3) ఎడిమా 4) ఇసినోఫీలియా
24. కింది వాటిని జతపరచండి.
ఎ బి
1. ఎరిత్రోపాయిసిస్ ఎ. ఎర రక్తకణాలు ఏర్పడే విధానం
2. హీమోపాయిసిస్ బి. రక్త కణాలు ఏర్పడే విధానం
3.ల్యూకోసైటోపీనియా సి. తెల్ల రక్తకణాల సంఖ్య క్షీణించే స్థితి
1) 1-సి, 2-బి, 3-ఎ 2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-ఎ, 2-బి, 3-సి 4) 1-ఎ, 2-సి, 3-బి
25. రక్తంలో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు మూత్రపిండాలు విడుదల చేసే హార్మోన్ ఏది?
1) అల్బుమిన్ 2) ఎరిత్రోపాయిటిన్
3) ల్యూకోసిస్టిన్ 4) గ్లోబ్యులిన్
26. రక్తప్రసరణ వ్యవస్థ పితామడిగా ఎవరిని పిలుస్తారు?
1) మార్సెల్లో మాల్ఫీజి
2) విలియం హార్వే
3) కారల్ లాండ్ స్టీనర్
4) ఆంటోని వాన్ ల్యూవెన్ క్
27. రక్త స్కందన ప్రక్రియలో ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్‌గా మార్చే ఎంజైమ్ ఏది?
1) థ్రాంబోసిస్ 2) థ్రాంబోకైనేజ్
3) ఫైబ్రినోజిన్ 4) ఫైబ్రిన్
28. రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర వహించే విటమిన్ ఏది?
1)విటమిన్-ఎ 2) విటమిన్-డి
3) విటమిన్-ఇ 4) విటమిన్-కె
29. Ph ఆధారంగా రక్తం ఏ లక్షణాన్ని కలిగి ఉంటుంది?
1) క్షార 2) ఆమ్ల 3) లవణ 4) తటస్థ
30. అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
1) కారల్ లాండ్ స్టీనర్
2) అలెగ్జాండర్ వీనర్
3) వై.ఎం భెండె
4) లూయీ పాశ్చర్
31. ఏ జీవిలో ఎర రక్తకణాలు లేకున్నా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది?
1) నెమలి 2) కప్ప
3) వానపాము 4) గొల్లభామ
32. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే మూలకం ఏది?
1) ఐరన్ 2) కాపర్
3) మెగ్నీషియం 4) కాల్షియం
33. తండ్రి రక్తవర్గం O, తల్లి రక్తవర్గం AB అయితే వారికి పుట్టి పిల్లలకు ఏ రక్తం గ్రూపులు వచ్చే అవకాశం ఉంటుంది?
1. A, B, AB, O 2. A, O
3. B, AB 4. A లేదా B
34. ఆరోగ్యవంతమైన మానవుడిలో ఉండే రక్త పరిమాణం ఎంత?
1) 6 లీటర్లు 2) 4 లీటర్లు
3) 5 లీటర్లు 4) 3 లీటర్లు
35. లింఫ్ కణాలు, ప్లీహం, థైమస్ గ్రంథిలో ఏర్పడే రక్తకణాలు ఏవి?
1) ఎర రక్తకణాలు 2) తెల్ల రక్తకణాలు
3) రక్త ఫలకికలు 4) గ్రాన్యులోసైట్లు
36. సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్థుల్లో ఏర్పడే అపస్థితి ఏంటి?
1) ఎర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది
2) ఎర రక్తకణాల సంఖ్య తగ్గుతుంది
3) ఎముక మజ్జ నుంచి ఎర రక్తకణాలు ఏర్పడకపోవడం
4) ఎర రక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారడం
37. రక్త నాళాలు తెగినప్పుడు రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర వహించేది?
1) ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్
2) అల్బుమిన్, గ్లోబ్యులిన్
3) హెపారిన్, ఫైబ్రిన్
4) లింఫోసైట్స్, థ్రాంబోసైట్స్
38. మానవ శరీరంలో ఎక్కువ శాతం గల రక్తకణాలు ఏవి?
1) ఇసినోఫిల్స్ 2) బేసోఫిల్స్
3) న్యూట్రోఫిల్స్ 4) మోనోసైట్స్
39. జనాభాలో అధిక వ్యక్తులు కలిగిన రక్త వర్గం ఏది?
1) O 2) B 3) A 4) AB
40. రక్తం, రక్తం ద్వారా కలిగే వ్యాధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) యాంజియాలజీ 2) ఎంజైమాలజీ
3) హిమటాలజీ 4) ఎంటమాలజీ
జవాబులు
1. 4 2. 1 3. 2 4. 4 5. 3 6. 1 7. 3 8. 4 9. 2 10. 3 11. 4 12. 2 13. 3 14. 2 15. 3 16. 1 17. 2 18. 2 19. 1 20. 3
21. 3 22. 3 23. 3 24. 3 25. 2 26. 2 27. 2 28. 4 29. 1 30. 3 31. 3 32. 4 33. 4 34. 3 35. 2 36. 4
37. 1 38. 3 39. 2 40. 3
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు