మీకు తెలుసా?
ఇథాలజీ
-జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఇథాలజీ అంటారు.
– ఇథాలజీ ముఖ్య ఉద్దేశం సహజ వాతావరణంలోని జంతువుల ప్రవర్తనను పరిశీలించడం.
-ఉత్తర అమెరికాలో నివసించే బీవర్ క్షీరదం నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుంది.competitive exams, tspsc, groups
– స్క్రబ్జీ అనే పక్షి దాని ఆహారాన్ని మరొక పక్షి సమక్షంలో దాచిపెడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి ఒక పథకం ప్రకారం దాన్ని దొంగిలిస్తుంది. ఈ దృగ్విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించారు.
-కందిరీగలు బురద మట్టిని ఉపయోగించి గోడలపై గూడు కట్టుకుంటాయి. వాటి ఆహారం ముఖ్యంగా ఇతర జీవుల లార్వాలు కనిపించగానే వాటిని కుట్టి విషం ఎక్కించి సేకరించి అవి తయారు చేసుకున్న గూటిలో దాచిపెడతాయి.
-డాల్ఫిన్లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఉంటుందని హెర్మన్ ప్రయోగపూర్వకంగా నిరూపించాడు.
– 1977లో ఇర్విన్ పెప్పర్బర్గ్ అనే శాస్త్రవేత్త అలెక్స్ అనే ఒక చిలుకను తెచ్చి దానికి 100 పదాలు నేర్పాడు. ఆ చిలుక చనిపోయేటప్పటికీ గణితంలో 7వ ఎక్కం దాకా నేర్చుకుంది.
– కొన్ని జంతువులు శత్రువుల నుంచి తమను రక్షించుకోవడానికి శరీరం నుంచి దుర్వాసన వెదజల్లుతాయి.
ఉదా: టాస్మేనియన్ డెవిల్, బాంబార్డియర్ బీటిల్
-బొద్దింకలు ఎల్లప్పుడూ చీకటి, తడి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అందువల్లనే తడి, చీకటి అరల్లో ఎక్కువ చేరతాయి.
– శత్రువుల నుంచి తమను రక్షించుకోవడానికి కొన్ని జంతువులు ప్రత్యేక భావాలను ప్రదర్శిస్తాయి.
ఉదా: పాము బుసలు కొట్టడం, కుక్కలు మొరగడం, ముళ్లపంది దాని గట్టి రోమాలను నిక్కబొడుచుకునేలా చేయడం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు