కోల్పోతే ప్లస్.. స్వీకరిస్తే మైనస్!
రసాయన బంధం
ఇప్పటి వరకు తెలిసిన మూలకాలు- 115
– హంప్రి డవె అనే రసాయన శాస్త్రవేత్త 250 లోహపు ఫలకలతో ఒక బ్యాటరీని నిర్మించాడు. దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా లవణ ద్రావణాల విద్యుత్ విశ్లేషణ ప్రక్రియతో పొటాషియం, సోడియంలను రాబట్టారు.
-హీలియం తప్ప మిగిలిన అన్ని జడవాయువుల వేలన్సీ కర్పరంలో 8 మూలకాలు ఉంటాయి.
-మూలక పరమాణువు, దానిలోని వేలన్సీ ఎలక్టాన్లను పటం రూపంలో చూపించే పద్ధతిని ‘లూయీస్ గుర్తు’ లేదా ఎలక్టాన్ చుక్కల నిర్మాణం అంటారు.
-బాహ్య కక్ష్యలోని ఎలక్టాన్ను (.) లేదా X గుర్తుతో సూచిస్తారు.
ఉదా: (:Ar:)
వేలన్సీ ఎలక్టాన్ సిద్ధాంతం
-కొసెల్, లూయీ అనే శాస్త్రవేత్తలు 1916లో ప్రతిపాదించారు.
– ఎలక్ట్రాన్ల ఆధారంగా వేలన్సీని నిర్వచించడమే దీని ఉద్దేశం.
-జడ వాయువుల రసాయన జడత్వం ఆధారంగా వేలన్సీకి ఒక తార్కిక వివరణ ఇచ్చారు.
– ఎలక్టాన్లను కోల్పోయిన మూలక అయాన్‌ను ‘కాటయాన్’ అని, ఎలక్టాన్ను స్వీకరించిన మూలక అయాన్‌ను ‘ఆనయాన్’ అని అంటారు.
– IA, IIA, IIIA గ్రూపు మూలకాలు కాటయాన్లను ఏర్పరుస్తాయి.
ఉదా: Na+, Mg+2, Al+3
– VIA, VIIA గ్రూపు మూలకాలు ఆనయాన్లను ఏర్పరుస్తాయి.
ఉదా: O2, Cl-1
– VIIIA గ్రూపు మూలకాలు ఎటువంటి అయాన్లను ఏర్పరచవు.
-ఒక లోహ పరమాణువు దాని వేలన్సీ నుంచి కోల్పోయే ఎలక్టానుల సంఖ్య దాని గ్రూపు సంఖ్యకు సమానం.
ఉదా: Na వేలన్సీ 1, Mg వేలన్సీ 2. ఇవి వాటి గ్రూప్ లఖ్యకు సమానం.
– అలోహ మూలకం దాని పరమాణువు నుంచి గ్రహించే సంఖ్యనే దాని వేలన్సీ అంటాం. ఇది కూడా దాని గ్రూపు సంఖ్యకు సమానం.
ఉదా: క్లోరిన్ వేలన్సీ ఎలక్టాన్లు = 8-7=1
అయానిక బంధం
కోసెల్ అనే శాస్త్రవేత్త కింది అంశాల ఆధారంగా అయానిక బంధాన్ని వివరించారు.
1. రెండు వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్య ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్టాన్ల మార్పిడి వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది.
2. ఆవర్తన పట్టికకు ఎడమ వైపున ఎక్కువ చర్యాశీలత గల లోహాలు, కుడి వైపున ఎక్కువ చర్యాశీలత గల అలోహాలు ఉన్నాయి.
3. జడ వాయువులు తక్కువ చర్యాశీలతను, ఎక్కువ స్థిరత్వాన్ని పొందుతాయి.
4. బాహ్య కక్ష్యలో 1, 2, లేదా 3 ఎలక్టాన్లు కలిగిన లోహ పరమాణువులు చివరి కక్ష్యలో 8 ఎలక్టాన్లు కలిగి జడ వాయువు స్థిర విన్యాసాన్ని పొందడానికి ఆ ఎలక్టాన్లను కోల్పోయి కాటయాన్లుగా మారుతాయి.
5. 5, 6, 7 వేలన్సీ ఎలక్టాన్లను కలిగిన అలోహాలు వాటి చివరి కక్ష్యలో 8 ఎలక్టాన్లను పొందడానికి ఎలక్టాన్లను గ్రహించి ఆనయాన్లను ఏర్పరుస్తాయి.
-రెండు ఆవేశపూరిత అయాన్ల మధ్య ఏర్పడే బంధాన్ని అయానిక బంధం అంటారు.
-ఆనయాన్ల మధ్య పనిచేసే బలాలు స్థిర విద్యుత్ బలాలు కాబట్టి ఈ బంధాన్ని స్థిర విద్యుత్ బంధం లేదా ఎలక్టోస్టాటిక్ బాండ్ అంటారు.
– వేలన్సీ భావనను ఎలక్టాన్ల పరంగా వివరించారు కాబట్టి ఎలక్టో వాలెంట్ బంధం అని అంటారు.
-అయానిక బంధం ద్వారా ఏర్పడే పదార్థాలు
NaCl, MgCl2, Na2O (డైసోడియం మోనాక్సైడ్), AlCl3 మొదలైనవి.
-ఒక నిర్ధిష్ట ఆవేశంగా అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం గల అయాన్లు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్యను అయాన్ సమన్వయ సంఖ్య అంటారు.
ఉదా: NaCl యందు Na+ సమన్వయ సంఖ్య -6
Cl సమన్వయ సంఖ్య -6
– సాధారణంగా లోహ మూలకాలు బాహ్య కక్ష్య నుంచి ఎలక్ట్రాన్లను కోల్పోయి అష్టక విన్యాసం పొందడానికి ప్రయాత్నిస్తాయి. ఈధర్మాన్ని లోహ ధర్మం లేదా ధన విద్యుదాత్మకత అంటారు.
– ధన విద్యుదాత్మకత గల మూలకాలు కాటయానులను ఏర్పరుస్తాయి.
-కాటయాన్‌గా, ఆనయాన్‌గా మారే స్వభావం 4 అంశాలపై ఆధారపడతాయి.
1. పరమాణు పరిమాణం
2. అయనీకరణ శక్మం
3. ఎలక్టాన్ ఎఫినిటీ
4. రుణ విద్యుదాత్మకత
– తక్కువ అయనీకరణ శక్మం, ఎలక్టాన్ ఎఫినిటీ, తక్కువ పరమాణు పరిమాణం గల మూలకాలు ఆనయాన్లను ఎర్పరుస్తాయి.
– 1901లో జి.ఎన్. లూయీస్ పరమాణువుల మధ్య ఎలక్టాన్ల మార్పిడి జరగకుండానే అష్టక విన్యాసం పొందుతాయని వివరించాడు.
సమయోజనీయ బంధం
– వేలన్సీ ఎలక్టాన్లను ఒకటి గానీ అంతకంటే ఎక్కువ పరమాణువులతో పంచుకోవడం వల్ల సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.
-ఇందులో ఎలక్టాన్ జంటను పరస్పరం సమష్టిగా పంచుకుంటాయి.
ఉదా: ఫ్లోరిన్, ఆక్సిజన్, మీథేన్, అమ్మోనియా, నీటి అణువు ఏర్పాటు.
-సంయోగం చెందే పరమాణువుల మధ్య రెండు ఎలక్టాన్ జంటలు పంచుకోబడితే ‘ద్విబంధం’ అని మూడు ఎలక్టాన్లు పంచుకోబడితే ‘త్రిబంధం’ అని అంటారు.
-ఒక మూలకం సంయోజనీయ బంధాలను ఏర్పరిచే సంఖ్యను సంయోజనీయత అంటారు.
-సమయోజనీయ బంధంతో కలిపిన రెండు పరమాణు కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద గల దూరాన్ని ‘బంధదూరం’ లేదా ‘బంధ దైర్ఘ్యం’ అంటారు.
దీనిని పికోమీటర్ లేదా A0 యూనిట్లలో కొలుస్తారు.
– BeCl2లో Cl-Be-Cl బంధకోణం 1800
– BF3 లో బంధకోణం 1200, మీథేన్‌లో బంధకోణం 1090 28I
-అమ్మోనియా (NH3)లో 1070 18I గానూ నీటి అణువు (H2O)లో 1040 31Iగా బంధకోణం ఉంటుంది.
– అణువుల ఆకృతులను వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం వివరించలేకపోయింది.
-మూడు అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడిన అణువుల్లో అన్ని పరమాణువులు ఒక కేంద్రక పరమాణువుతో సమయోజనీయ బంధంతో బంధించి ఉన్నప్పుడు వాటి మధ్య బంధకోణాలను వివరించడానికి VESPRT సిద్ధాంతం రూపొందించారు.
-VESPRT -Valace-shall- electron-pair-rapolsion-theory
-దీన్ని సిట్జివిక్, పావెల్‌లు 1940లో ప్రతిపాదించారు.
– 1957లో దీన్ని గిలెస్వీ, నైహామ్ అనే శాస్త్రవేత్తలు మరింత అభివృద్ధి చేశారు.
-BeCl2, CO2 ఆకృతి రేఖీయం.
-NH3 (అమ్మోనియా) ఆకృతి త్రికోణీయ ద్విపిరమిడ్.
-వెస్పర్ట్ సిద్ధాంతం బంధశక్తులను వివరించడంలో విఫలమైంది.
– వేలన్సీ బంధ సిద్ధాంతంను లైనస్ ఫౌలింగ్ ప్రతిపాదించారు.
-రెండు ఆర్బిటాళ్ల అంత్యాలు అతిపాతం చెందడం వల్ల లేదా పరమాణు కేంద్రకాలు కలిసే అక్షీయ రేఖ వెంబడి ఆర్బిటాళ్ల అతిపాతం వల్ల సిగ్మా బంధం () ఏర్పడుతుంది.
– రెండు ఆర్బిటాళ్ల పార్శ భాగాల అతిపాతం వల్ల పై బంధం () ఏర్పడుతుంది.
– బంధం కంటే బంధం బలమైనది, స్వతంత్రమైనది.
– O2 అణువు ఏర్పాటులో 1, 1 బంధం ఏర్పడుతాయి. (ద్విబంధం)
-N2 అణువు ఏర్పాటులో 1, 2 బంధాలు ఏర్పడతాయి. (త్రిక బంధం)
– లైనస్ ఫౌలింగ్ ‘పరామణు ఆర్బిటాళ్ల సంకరీకరణం’ అనే దృగ్విషయాన్ని ప్రతిపాదించాడు.
-పరమాణు ఆర్బిటాళ్లను పునర్వ్యవస్థీకరించడం ద్వారా అదే సంఖ్యలో బంధ శక్తి ఆకారం వంటి ధర్మాలు గల సర్వసమాన ఆర్బిటాళ్లను ఏర్పరిచే దృగ్విషయాన్ని సంకరీకరణం అంటారు.
– BeCl2 లో SP సంకరీకరణం, BF3లో SP2 సంకరీకరణం, అమ్మోనియంలో SP3 సంకరీకరణం ఉంటుంది.
– అయానిక పదార్థాలు ధ్రువ ద్రావణాల్లో కరుగుతాయి. అధ్రువ ద్రావణాల్లో కరగవు.
– సమయోజనీయ పదార్థాలు అధ్రువ ద్రావణాల్లో కరుగుతాయి. నీరు వంటి ధ్రువ ద్రావణాల్లో కరగవు.
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో సరైనది ఏది?(3)
ఎ. ఆర్బిటాళ్ల గరిష్ఠ అతిపాతం వల్ల బలమైన రసాయన బంధం ఏర్పడుతుంది
బి. BCl3 అణువులో SP3 సంకరీకరణం జరుగుతుంది
1) ఎ, బి 2) బి మాత్రమే
3) ఎ మాత్రమే 4) ఏదీకాదు
2. కింది వాటిలో ఏది సరైనది?(2)
ఎ. C2H4లో త్రికబంధం ఏర్పడుతుంది
బి. C2H2లో ద్విబంధం ఏర్పడుతుంది
సి. BeCl2a లో ఏక బంధం ఏర్పడుతుంది
1) బి మాత్రమే 2) సి మాత్రమే
3) ఎ, సి మాత్రమే 4) బి, సి మాత్రమే
3. కింది వాటిలో సరికానిది ఏది?(4)
ఎ. H2O అణువులో రెండు సిగ్మా బంధాలుంటాయి
బి. CH4 అణువులో నాలుగు సిగ్మా బంధాలుంటాయి
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి 4) ఏదీ కాదు
4. కింది వాటిలో బలమైన అయానిక బంధాన్ని ఏర్పరిచేవి.(2)
1) క్షార మృత్తిక లోహాలు, హాలోజన్లు
2) క్షార లోహాలు, హాలోజన్లు
3) లోహాలు, అలోహాలు
4) క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు
5. కింది వాటిలో SP అతిపాతం కలిగిన అణువులు ఏవి?(1)
ఎ. Br2 బి. HCl
సి. Cl2 డి. HBr
1) బి, డి మాత్రమే 2) ఎ, సి మాత్రమే
3) బి మాత్రమే 4) బి, సి మాత్రమే
6. CS అణువులో CS, Fల మధ్య గల బంధం ఏది?(2)
1) సంయోజనీయ బంధం
2) అయానిక బంధం
3) లోహ బంధం
4) సమన్వయ సమయోజనీయ బంధం
7. కింది ఆనయాన్లో Ne ఎలక్టాన్ విన్యాసం పొందింది ఏది?(2)
1) Cl- 2) O2- 3) p-3 4) Br-
8. ఎసిటిలీన్ (C2H2) అణువులో ఉండే సిగ్మా, పై బంధాల సంఖ్య ఎంత?(2)
1) ఒక సిగ్మా, ఒక పై
2) ఒక సిగ్మా, రెండు పై
3) రెండు సిగ్మా, ఒక పై
4) మూడు సిగ్మా, రెండు పై
9. ఆక్సిజన్ (O2) అణువులో ఉండే సిగ్మా, పై బంధాల సంఖ్య ఎంత?(1)
1)ఒక సిగ్మా, ఒక పై
2) ఒక సిగ్మా, రెండు పై
3) రెండు సిగ్మా, రెండు పై
4) మూడు సిగ్మా, రెండు పై
10. HCl అణువు కింది వాటిలో దేనికి ఉదాహరణ?(1)
1) ధ్రువ బంధం
2) అధ్రువ బంధం
3) సమన్వయ సమయోజనీయ బంధం
4) ఏదీ కాదు
పీ ఢిల్లీ బాబు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు