నత్రజని లోపం ఉన్న నేలలో జీవించగలిగే మొక్క? (జనరల్ సైన్స్)
గత తరువాయి..
43. చక్రీయ పత్ర విన్యాసం (Whorled Phyllotaxy) ఏ మొక్కల్లో చూడవచ్చు?
1) నీరియం (గన్నేరు) 2) ఆల్స్టోనియా
3) 1, 2 4) జామ
44. అతిపెద్ద పత్రాన్ని ఏ మొక్కల్లో చూడవచ్చు?
1) రాఫియా వినిఫెరా 2) మోనోఫిల్లియా
3) వెల్విట్చియా 4) విక్టోరియా రిజియా
45. కింది వాటిలో ఉపవాయుగత కాండ రూపాం తరాలు?
1) పత్రాభ కాండాలు 2) క్లాడోఫిల్లు
3) స్టోలన్లు 4) కొక్కేలు
46. వేటిలో మనం పిలక మొక్కలను చూడవచ్చు?
1) అరటి 2) అనాస
3) చామంతి 4) పైవన్నీ
47. వాయుగత కాండ రూపాంతరం ఏది?
1) కాండ నులితీగ 2) రన్నర్లు
3) స్టోలన్లు 4) ఆఫ్సెట్లు
48. కింది వాటిలో భూగర్భ కాండ రూపాంతరం ఏది?
1) దుంపకాండం 2) కొమ్ము
3) కందం, లశునం 4) పైవన్నీ
49. అల్లం, పసుపు దేని రూపాంతరం?
1) కాండం 2) వేరు
3) పత్రం 4) పుష్పం
50. బంగాళదుంప, కంద, చామగడ్డలు వేటి రూపాంతరాలు?
1) కాండం 2) వేరు
3) పత్రం 4) పుష్పం
51. నీరుల్లి దేని రూపాంతరం?
1) కాండం 2) వేరు
3) పత్రం 4) పుష్పం
52. బుడిపె వేర్లు ఏ మొక్కల్లో ఉంటాయి?
1) ఆస్టరేసి కుటుంబం మొక్కలు
2) ఫాబేసి కుటుంబం మొక్కలు
3) సొలనేసి కుటుంబం మొక్కలు
4) లిలియేసి కుటుంబం మొక్కలు
53. సంతులనం జరిపే వేర్లు (Balancing roots)
ఏ మొక్కల్లో ఉంటాయి?
1) టీనియోఫిల్లమ్
2) ఫిస్టియా (అంతర తామర)
3) చిక్కుడు 4) బఠానీ
54. ఊతవేర్లు గల మొక్కలు ఏవి?
1) చెరుకు, మొక్కజొన్న, జొన్న
2) వెదురు
3) మొగలి 4) పైవన్నీ
55. క్యారెట్, ముల్లంగి (రాడిష్), చిలగడ దుంప (Sweet potato), బీట్రూట్లు వేటి రూపాంతరం?
1) వేరు 2) కాండం
3) పత్రం 4) పుష్పం
56. వేర్లు లేని మొక్కలు ఏవి?
1) ఉల్ఫియా 2) యుట్రిక్యులేరియా
3) 1, 2 4) ఆస్పరాగస్
57. ఏ మొక్కలు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి?
1) వరి 2) గోధుమ
3) వేరుశనగ 4) ఆస్పరాగస్
58. ఏ మొక్కల్లో పీచు వేరువ్యవస్థ ఉంటుంది?
1) వరి 2) గోధుమ
3) ఆస్పరాగస్ 4) పైవన్నీ
59. కింది వాటిలో అబ్బురపు వేరువ్యవస్థగల చెట్టు ఏది?
1) వేప 2) మామిడి
3) దానిమ్మ 4) మరి
60. విత్తనాల సంఖ్య ఫలాల సంఖ్యకు సమానం కాని మొక్కను గుర్తించండి.
1) ట్రైడాక్స్ 2) వరి
3) మామిడి 4) యాపిల్
61. పనస మొక్క శాస్త్రీయ నామం?
1) పైరస్ మేలస్
2) అనోనా స్కామోజా
3) ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా
4) అనానస్ సెటైవస్
62. అకేషియా, ఆముదంలో ఫలాలు ఏవిధంగా విడిపోతాయి?
1) చిరు ఫలాలు 2) ఫలాంశాలు
3) అనృత ఫలాలు 4) బీజరహిత ఫలాలు
63. మామిడి, కొబ్బరిలోని ఫలం ఏ రకం?
1) పోమ్ 2) హెస్పరీడియం
3) టెంకగల ఫలం 4) పెపో
64. అనృతఫలం దేనిలో ఉంటుంది?
1) వంగ, యాపిల్, కొబ్బరి
2) జామ, ద్రాక్ష, టమాటా
3) దోస, నిమ్మ, మామడి
4) యాపిల్, జీడి మామిడి, స్ట్రాబెరీ
65. పనస పండు ఒక..
1) సంయుక్త ఫలం 2) సంకల్పిత ఫలం
3) సరళ ఫలం 4) అనృత ఫలం
66. పుష్పం ఆవశ్యక అంగాలు?
1) రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు
2) ఆకర్షణ పత్రాలు, పుష్పాసనం (టోరస్)
3) పరిపత్రం, పుష్పాసనం
4) కేసరావళి, అండకోశం
67. పుష్పంలోని అనావశ్యక అంగాలు?
1) రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి
2) కేసరావళి, అండకోశం
3) పుష్పాసనం 4) 2, 3
68. పుష్ప విన్యాసం అంటే..
1) పుష్పాల సమూహం
2) పుష్పాలు, పత్రాల అమరిక
3) విన్యాసాక్షం మీద పుష్పాల అమరిక
4) పుష్పాసనం మీద పుష్పభాగాల అమరిక
69. తినదగిన పుష్పవిన్యాసం గల మొక్క?
1) ఉల్లి 2) క్యాబేజీ
3) కేషియా 4) క్యాలీఫ్లవర్
70. పత్రరహిత మొక్కకు ఉదాహరణ ఏది?
1) టీనియోఫిల్లమ్ 2) విస్కమ్
3)స్ట్రెయిగా 4) వాండా
71. జాలాకార ఈనెల వ్యాపనం చూపే ఏకదళబీజం ఏది?
1) అలియమ్ 2) గ్లోరియోసా
3) ఆస్పరాగస్ 4) స్మైలాక్స్
72. కాండంపైన పత్రాల అమరికను ఏమంటారు?
1) ఈనెల వ్యాపనం
2) కిసలయ విన్యాసం
3) ఆంథోటాక్సీ 4) పత్ర విన్యాసం
73. నత్రజని లోపం ఉండి నేలలో జీవించగలిగిన మొక్క?
1) డయోనియా 2) మందార
3) అకేషియా 4) బ్రయోఫిల్లం
74. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. ఏకలింగక పుష్పాలు
1. రఫ్లీషియా ఆర్నాల్డె
బి. ద్విలింగక పుష్పాలు
2. దోస, సొర, కాకర
సి. అతిపెద్ద పుష్పం 3. ఉల్ఫియా అంగుస్టా
డి. అతిచిన్న పుష్పం 4. మందార, ఉమ్మెత్త
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4
75. కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడే ముఖ్య మైన శాఖీయ అంగం?
1) వేరు 2) కాండం
3) పుష్పం 4) పత్రం
76. కాండం ప్రాథమిక విధి?
1) శాఖీయోత్పత్తికి తోడ్పడటం
2) నేలలో మొక్క స్థాపన
3) పత్రాలను, శాఖలను కలిగి ఉండటం
4) నీరు, ఖనిజాలను శోషించడం
77. బంగాళదుంపలో తినదగిన భాగం?
1) కాండం 2) దుంపలాంటి వేరు
3) అబ్బురపు వేరు 4) ఫలం
78. పత్రం ఏర్పడే కాండం భాగం?
1) గ్రీవం 2) కణుపు మధ్యభాగం
3) కణుపు 4) అగ్రం
79. వేరుబుడిపెలో ఉండే బ్యాక్టీరియం?
1) క్లాస్ట్రీడియం 2) రైజోబియం
3) మైకోబాక్టీరియా 4) సాల్మోనెల్లా
80. మొక్క దేహంలో నీరు, ఖనిజ శోషణకు ఉపయోగపడే భాగం?
1) కాండం 2) పత్రం
3) పుష్పం 4) వేరు
81. కింది అంకురణ రకాలు, సంబంధిత మొక్క లను జతపర్చండి.
ఎ. వివిపారి అంకురణ 1. మొక్కజొన్న
బి. అధోభూమిజ అంకురణ
2. మాంగ్రూవ్ మొక్కలు
సి. ఊర్ధభూమిజ అంకురణ 3. చిక్కుడు
1) ఎ-3, బి-1, సి-2
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-3, బి-2, సి-1
82. కింద పేర్కొన్న ఫల రకాలు, సంబంధిత ఉదాహరణలను జతపర్చండి.
ఎ. పోమ్ 1. బఠాని
బి. ద్వివిదారక ఫలం 2. మామిడి
సి. కవచబీజకం 3. యాపిల్
డి. టెంకగల ఫలం 4. వరి
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
83. కింద పేర్కొన్న ఫల రకాలను, వాటి ఉదా హరణలను జతపర్చండి.
ఎ. సైకోనస్ (సంయోగ ఫలం) 1. మరి
బి. మృదుఫలం 2. టమాటా
సి. ద్వివిదారక ఫలం 3. చిక్కుడు
డి. పెపో 4. దోస
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
84. కింద పేర్కొన్న ఫల రకాలు, వాటి ఉదాహరణలను జతపర్చండి.
ఎ. టెంకగల ఫలం
1. తీపి ఆరెంజ్ (నారింజ)
బి. హెస్పరిడియం 2. పనస
సి. సోరోసిస్ (సంయోగ ఫలం) 3. కొబ్బరి
డి. ద్వివిదారక ఫలం 4. వేరుశనగ
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-3, బి-1, సి-4, డి-2
85. కింద పేర్కొన్న ఫల రకాలు, ఉదాహరణలను జతపర్చండి.
ఎ. మృదుఫలాలతో కూడిన సంకలిత ఫలం 1. సీతాఫలం
బి. సోరోసిస్ (సంయోగ ఫలం)
2. జీడిమామిడి
సి. పెంకుగల ఫలం 3. అనాస
డి. మృదుఫలం 4. టమాటా
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4
86. కింది పరాగసంపర్క రకాలు, కారకాలను జతపర్చండి.
ఎ. మెలకోఫిలి 1. పక్షులు
బి. థెరోఫిలి 2. ఉడుతలు
సి. ఖైరాప్టెరోఫిలి 3. నత్తలు
డి. ఆర్నిథోఫిలి 4. గబ్బిలాలు
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-3, బి-2, సి-4, డి-1
87. కింది పరాగసంపర్క రకాలు, కారకాలను జతపర్చండి.
ఎ. ఎంటమోఫిలి 1. నీరు
బి. జూఫిలి 2. గాలి
సి. హైడ్రోఫిలి 3. కీటకాలు
డి. ఎనిమోఫిలి 4. జంతువులు
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
88. అండన్యాస రకాలు, వాటి ఉదాహరణలను జతపర్చండి.
ఎ. అక్షీయ అండన్యాసం
1. ఆవ, ఆరిమోస్, డయాంథస్, ప్రైమ్రోజ్
బి. పీఠ అండన్యాసం 2. మందార, టమాటా
సి. స్వేచ్ఛాకేంద్ర అండన్యాసం 3. బఠాని
డి. ఉపాంత అండన్యాసం
4. బంతి, పొద్దు తిరుగుడు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
89. కింద పేర్కొన్న మొక్కలు, అవి పుష్పించే కాలాలను జతపర్చండి.
ఎ. బంతి, చామంతి 1. శీతాకాలం
బి. మల్లె, మామిడి, వేప 2. ఎండాకాలం
సి. గులాబి, గన్నేరు 3. వర్షాకాలం
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-1, బి-3, సి-2
90. కింది వాటిని జతపర్చండి.
ఎ. లవంగాలు 1. ఆవశ్యక అంగాలు
బి. కుంకుమ పువ్వు 2. ఎండిన కీలాగ్రం
సి. కేసరావళి, అండకోశం
3. అనావశ్యక అంగాలు
డి. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి
4. ఎండిన మొగ్గ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-2, డి-4
91. పుష్ప భాగాలు అమరి ఉండే విధానానికి సంబంధించి కింది వాటిని జతపర్చండి.
ఎ. రక్షక పత్రావళి 1. మూడో వలయం
బి. కేసరావళి 2. రెండో వలయం
సి. ఆకర్షణ పత్రావళి 3. మొదటి వలయం
డి. అండాశయం 4. నాలుగో వలయం
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-2, బి-1, సి-3, డి-4
92. కింది పుష్పరచన రకాలు, సంబంధిత మొక్క లను జతపర్చండి.
ఎ. కవాటయుత పుష్పరచన 1. తంగేడు
బి. మెలితిరిగిన పుష్పరచన 2. జిల్లేడు
సి. చిక్కైన పుష్పరచన 3. మందార, పత్తి
డి. వెక్సిల్లరి/పాపిలియోనేయస్ పుష్పరచన 4. బఠానీ, చిక్కుడు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
93. కింది వాటిని జతపర్చండి.
ఎ. బలింగాశ్రయ స్థితి
1. బొరాసస్, బొప్పాయి, సొరకాయ
బి. ఏకలింగాశ్రయ స్థితి 2. మామిడి
సి. ద్విలింగాశ్రయ స్థితి 3. కోకస్, కారా
1) ఎ-3, బి-1, సి-2
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1, బి-2, సి-3
సమాధానాలు
43. 3 44. 4 45. 3 46. 4 47. 1 48. 4 49. 1 50. 1 51. 1 52. 2 53. 2 54. 4 55. 1 56. 3 57. 3 58. 4 59. 4 60. 4 61. 3 62. 2 63. 3 64. 4 65. 1 66. 4 67. 1 68. 3 69. 4 70. 1 71. 4 72. 4 73. 1 74. 1 75. 4 76. 3 77. 1 78. 3
79. 2 80. 4 81. 2 82. 1 83. 4 84. 2 85. 1 86. 4 87. 2 88. 3 89. 1 90. 3 91. 1 92. 2 93. 2
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు