పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎవరి హయాంలో చేశారు?
పాలిటీ
భారత రాజ్యాంగం దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన ఏవింధగా సాగించాలో నిర్దేశించింది. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు, వాటి విధి విధానాలు, న్యాయవ్యవస్థను రూపొందించింది. రాజ్యాంగం అనే అంశం నుంచి సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో నిపుణ గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు పాఠకులకు అందిస్తుంది.
1. కింది రాష్ట్రాలను, వాటిలోని లోక్‌సభ నియోజకవర్గ సంఖ్యలతో జతపరచండి.
ఎ. బీహార్ 1. 42
బి. మహారాష్ట్ర 2. 80
సి. ఉత్తరప్రదేశ్ 3.48
డి. పశ్చిమబెంగాల్ 4. 54
5. 40
సరైన జవాబును ఎంచుకోండి.
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-5, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-3
4) ఎ-1, బి-4, సి-2, డి-5
2. ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించిన కింది విషయాలను పరిశీలించి సరైన జవాబును ఎంచుకోండి.
ఎ) ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ
బి) దీన్ని పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు
సి) దీని చైర్మన్, ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు
డి) ఇది దాని సాంవత్సరిక సామర్థ్య నివేదికను సంబంధిత రాష్ట్ర గవర్నర్లకు నివేదిస్తుంది
1) సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి
3. భారత రాజ్యాంగ ఏడో సవరణ కింది దేనికి సంబంధించినది?
1) ప్రైవేటు బ్యాంకుల జాతీయీకరణ
2) జాగీర్దారీ, జమీందారీ వ్యవస్థల రద్దు
3) భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ
4) భూ సంస్కరణలు, భూమి సీలింగులు
4. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు?
1) భారతదేశంలో మంచి మోడల్ పంచాయతీ రాజ్ వ్యవస్థ కలిగిన రాష్ట్రం- మిజోరం
2) పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం- బీహార్
3) పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట అమలు చేసిన రాష్ట్రం- రాజస్థాన్
4) పంచాయతీరాజ్ వ్యవస్థ లేని రాష్ట్రం- నాగాలాండ్
5. భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సహకార సంఘాల ఏర్పాటుకు దోహదపడి సహకార పరపతి సంఘాల చట్టం- 1904ను ఆమోదించడంలో ఎవరు కీలక పాత్ర పోషించారు?
1) లార్డ్ లిట్టన్ 2) లార్డ్ కర్జన్
3) లార్డ్ రిప్పన్ 4) లార్డ్ మింటో
6. భారతదేశంలోని పట్టణ స్థానిక సంస్థల పరిణామంలోని ప్రధాన ఘటనలను, అవి జరిగిన సంవత్సరాలతో జతపరచండి.
ఘటన సంవత్సరం
ఎ. లార్డ్ మేయో తీర్మానం 1. 1688
బి. వికేంద్రీకరణపై రాయల్ కమిషన్ 2.1726
సి. లార్డ్ రిప్పన్ తీర్మానం 3. 1870
డి. మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు 4. 1882
ఇ. బొంబాయి, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు 5. 1907
6. 1924
సరైన సమాధానం ఎంచుకోండి.
1) ఎ-4, బి-6, సి-5, డి-3, ఇ-1 2) ఎ-6, బి-5, సి-3, డి-2, ఇ-1
3) ఎ-3, బి-5, సి-4, డి-1, ఇ-2 4) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
7. 1932 కమ్యూనల్ అవార్డుకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది కాదు?
1) ముస్లిం, సిక్కు నియోజకవర్గాల్లోని అర్హత గల సాధారణ ఓటర్లందరికీ అదే నియోజకవర్గంలో ఓటు వేయడానికి అనుమతిచ్చారు
2) ముస్లింలు, సిక్కులకు ప్రత్యేక ఓటర్లు/ నియోజకవర్గాలు
3) బొంబాయిలోని కొన్ని ఎన్నుకోబడిన బళ సభ్య సాధారణ నియోజకవర్గాల్లో మరాఠాలకు కొన్ని సీట్లు రిజర్వు చేశారు
4) అణగారిన వర్గాలకు ప్రత్యేక సీట్లు రిజర్వు చేశారు. అయితే కేవలం అర్హత కలిగిన అణగారిని వర్గాలకు మాత్రమే ఓటు వేసే హక్కు కల్పించారు
8. భారత పార్లమెంటరీ గ్రూపునకు సంబంధించి ఈ కింది వాటిని గ్రహించండి?
ఎ. ఇది 1949లో ఏర్పాటు చేసిన ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రూపు
బి. పార్లమెంటు సభ్యులకు, పార్లమెంటు మాజీ సభ్యులకు అందరికీ దీనిలో సభ్యత్వం ఉంటుంది
సి. దీని అధ్యక్షుడిని గ్రూపు సభ్యులందరూ ఎన్నుకుంటారు
డి. ఈ గ్రూపు భారత పార్లమెంటుకు, ప్రపంచంలోని ఇతర పార్లమెంట్లకు అనుసంధాన కర్తగా ఉంటుంది
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
1) ఎ, బి, సి, డి
2) బి, సి, డి మాత్రమే
3) ఎ, బి, సి మాత్రమే
4) ఎ, బి, డి మాత్రమే
9. పంచాయత్‌రాజ్ సంస్థలకు సంబంధించిన కింది సిఫారసులను పరిశీలించి వాటిలో ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ సూచించినవి ఏమిటో గుర్తించండి.
ఎ. పంచాయత్‌రాజ్ సంస్థలకు రాజ్యాంగపరమైన హోదా కల్పించడం
బి. కొన్ని గ్రామాల సముదాయానికి ఒక న్యాయ పంచాయతీని ఏర్పాటు చేయడం
సి. మూడంచెల పంచాయత్‌రాజ్ స్థానంలో రెండంచెల విధానం ఏర్పాటు
డి. జిల్లాను ప్రణాళిక రచనకు ప్రధాన యూనిట్‌గా చేయడం
సరైన సమాధానం ఎంచుకోండి.
1) బి, సి, డి 2) ఎ, బి
3) సి, డి 4) ఎ, బి, సి
10. కింది వాటిని పరిశీలించి ఒక రాష్ట్ర హైకోర్టు జడ్జి నియామకానికి సంబంధించిన సరైన పద్ధతిని సూచించండి.
1) భారత రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమిస్తాడు
2) భారత రాష్ట్రపతి తన సొంత నిర్ణయం మేరకు నియమిస్తాడు
3) భారత రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమిస్తాడు
4) భారత రాష్ట్రపతి ప్రధాన మంత్రిని, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమిస్తాడు
11. 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992, తప్పనిసరి, స్వచ్ఛంద అనే రెండు రకాల నిబంధనలను ప్రతిపాదించింది. కింది వాటిలో ఏది తప్పనిసరి నిబంధనో గుర్తించండి.
ఎ. గ్రామ సభలను నిర్వహించడం
బి. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం
సి. ఓబీసీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం
డి. పంచాయతీల్లో మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పించడం
సరైన సమాధానం ఎంచుకోండి.
1) ఎ, బి, సి మాత్రమే
2) ఎ, బి, డి మాత్రమే
3) ఎ, సి, డి మాత్రమే
4) ఎ, బి, సి, డి
12. రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలు నిర్వహించవలసిన కింది పౌర విధులను పరిశీలించండి.
ఎ. పట్టణ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్
బి. భూ వినియోగం క్రమబద్ధీకరణ, భవనాల నిర్మాణం
సి. పట్టణ/టౌన్ సివిల్, క్రిమినల్ కోర్టులు
డి. సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాలను సంరక్షించడం
సరైన సమాధానాలను ఎంచుకోండి.
1) ఎ, బి, సి, డి
2) ఎ, సి, డి మాత్రమే
3) ఎ, బి, సి మాత్రమే
4) ఎ, బి, డి మాత్రమే
13. కింది వాటిలో బంగ్లాదేశ్ నుంచి భారతదేశం కొన్ని భూభాగాలు పొందడానికి, కొన్ని భూభాగాలను వారికి ఇవ్వడానికి దోహదపడింది ఏది?
1) భారత రాజ్యాంగ (100వ సవరణ) చట్టం-2015
2) భారత రాజ్యాంగ (99వ సవరణ) చట్టం- 2014
3) భారత రాజ్యాంగ (101వ సవరణ) చట్టం- 2016
4) భారత రాజ్యాంగ (98వ సవరణ) చట్టం- 2013
14. నగర పంచాయతీలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రతి నగర పంచాయతీ గ్రామీణ, పట్టణ అనే రెండు రకాల విధులను నిర్వహించాల్సి ఉంటుంది
2) గ్రామం నుంచి పట్టణంగా పరివర్తన చెందుతున్న ప్రాంతానికి నగర పంచాయతీని ఏర్పాటు చేస్తారు
3) నగర పంచాయతీని ప్రత్యామ్నాయంగా నోటిఫైడ్ ఏరియా కమిటీ అని కూడా పిలుస్తారు
4) నగర పంచాయతీ ప్రాథమికంగా గ్రామీణ లక్షణాలను కలిగి ఉండి, కొంత కాలానికి అది పట్టణ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటుంది
15. భారత శిక్షా స్మృతి (IPC) విభాగం 124Aకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవో సూచించండి?
ఎ. ఇది రాజ్యానికి వ్యతిరేకంగా చేసే నేరాలను తెలియజేస్తుంది
బి. ఇటీవల శార్జీల్ ఇమాం అనే విద్యార్థిని ఈ చట్టం కిందనే బంధించారు
సి. కేదార్‌నాథ్‌సింగ్ వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసు విషయంలో వెలువడిన తీర్పు కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుంది
సరైన సమాధానం ఎంచుకోండి.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
16. ‘‘ప్రభుత్వ అనవసర ఆక్రమణలు/ దుర్వినియోగాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించడం’’ కింది ఎవరి పని?
1) భారత సొలిసిటర్ జనరల్
2) భారత అటార్నీ జనరల్
3) ప్రతి పౌరుడు 4) న్యాయ సమీక్ష
17. భారత రాజ్యాంగ ప్రవేశికలో మొదట్లో ‘‘సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం’’గా ప్రకటించారు. కానీ తర్వాత ‘‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం’’గా మార్చారు. దాన్ని ఏ సవరణ ద్వారా చేశారు?
1) 44వ సవరణ 2) 46వ సవరణ
3) 38వ సవరణ 4) 42వ సవరణ
18. రాజ్యాంగ ప్రవేశిక ఔన్నత్యంపై వ్యాఖ్యానిస్తూ ‘‘వాస్తవానికి ఇది జీవన విధానం. ఇందులో నిక్షిప్తమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఒకదానితో మరొకటి విడదీయలేనంతగా పెనవేసుకుని ఉండే జీవన నియమాలుగా గుర్తించబడినాయి’’ అని ఎవరన్నారు?
1) బీఆర్ అబేద్కర్ 2) సర్ధార్ పటేల్
3) గాంధీ 4) జవహర్లాల్ నెహ్రూ
19. గణతంత్ర దినోత్సవానికి జనవరి 26ను మాత్రమే ఎందుకు ఎంపిక చేశారు?
1) సుభాష్ చంద్రబోస్ జన్మదినానికి గుర్తుగా
2) ఆరోజు శుభ దినం కాబట్టి
3) 1930 అదేరోజున ఐఎన్‌సీ లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ ప్రకటనకు గుర్తుగా
4) మొదటి ఇండోనేషియన్ అధ్యక్షుడైన సుఖర్నో భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనెందుకు రావడాన్ని పురస్కరించుకొని
20. రాజ్యాంగంలోని 52వ నిబంధన దేన్ని గురించి తెలియజేస్తుంది?
1) మంత్రి మండలి
2) రాష్ట్రాల గవర్నర్లు
3) భారత రాష్ట్రపతి
4) ప్రధాన మంత్రి
21. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనాధికారాల విభజన ప్రస్తావన ఉంది?
1) తొమ్మిదో షెడ్యూల్ 2) పదో షెడ్యూల్
3) ఏడో షెడ్యూల్ 4) ఎనిమిదో షెడ్యూల్
22. లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల్లోని శాసన సభలకు ఆంగ్లో ఇండియన్లను నామ నిర్దేశం చేయడాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిషేధించారు?
1) 103వ రాజ్యాంగ సవరణ
2) 104వ రాజ్యాంగ సవరణ
3) 101వ రాజ్యాంగ సవరణ
4) 102వ రాజ్యాంగ సవరణ
23. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎవరి హయాంలో చేశారు?
1) పీవీ నరసింహారావు
2) అటల్ బిహారి వాజ్‌పేయి
3) ఇందిరా గాంధీ
4) రాజీవ్ గాంధీ
24. రాజ్యాంగ ప్రవేశిక కింద ఇచ్చిన నియమాల్లోని దేనికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది?
1) న్యాయం 2) స్వేచ్ఛ
3) సమానత్వం 4) సౌభ్రాతృత్వం
25. 2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో కింది ఏ రెండు రాజకీయ పార్టీలు 22 సీట్ల చొప్పున గెలుపొందాయి?
1) అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
2) అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ , ద్రవిడ మున్నేట్ర కజగం
3) శివసేన, బిజు జనతా దళ్
4) ద్రవిడ మున్నేట్ర కజగం, యవజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
26. 17వ లోక్‌సభలో మహిళా సభ్యుల ప్రాతినిధ్యం అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవి?
1) కేరళ, పశ్చిమబెంగాల్
2) ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్
3) ఒడిశా, మహారాష్ట్ర
4) ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్
27. ది క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్-1871ని ఏ సంత్సరంలో తొలగించారు?
1) 1956 2) 1958
3) 1951 4) 1952
28. ప్రాథమిక హక్కులకు సబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.
1) ప్రాథమిక హక్కులు రాజ్య అధికారాలను పరిమితం చేస్తాయి
2) ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. ఇవి నిరుపేక్షమైనవి
3) కొన్ని ప్రాథమిక హక్కులు సకారాత్మక భాషలో ఉన్నాయి
4) ప్రాథమిక హక్కులు ప్రజలకు కొన్ని స్వేచ్ఛలు, స్వాతంత్య్రాలకు హామీగా ఉన్నాయి
29. పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపు) చట్టాన్ని ఎప్పుడు రూపొందిచారు?
1) 2005 2) 1996
3) 2004 4) 1998
30. కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. ఇది ఒక రాజ్యాంగపరమైన సంస్థ దీని సిఫారసులను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి
బి. ఆర్థిక సంఘ చైర్మన్ రాష్ట్రపతి ద్వారా నియమితమవుతారు
సరైన సమాధానాన్ని గుర్తించండి.
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి 4) పైవేవీ కావు
సమాధానాలు
1. 2 2. 2 3. 3 4. 1 5. 2 6. 3 7. 1 8. 4 9. 2 10. 3 11. 2 12. 4 13. 1 14. 3 15. 2 16. 4 17. 4 18. 1 19. 3 20. 3
21. 3 22. 2 23. 4 24. 1 25. 1 26. 4 27. 4 28. 2 29. 2 30. 2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు