అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
జాతీయాదాయం – నిరుద్యోగం
1. ఉత్పత్తి మదింపు పద్ధతిని సైమన్ కుజునెట్స్ ఏమని పేర్కొన్నారు?
ఎ) వస్తుసేవల పద్ధతి
బి) నికర ఉత్పత్తి పద్ధతి
సి) ఉత్పత్తి సేవా పద్ధతి
డి) పరిశ్రమ ఆధారిత పద్ధతి
2. ఆదాయ మదింపు పద్ధతికి మరో పేరు?
ఎ) Factor payment Method
బి) Distributed share Method
సి) Income paid & received Method
డి) పైవన్నీ
3. దేశంలో జాతీయాదాయాన్ని లెక్కించడానికి ఏ పద్ధతులను ఉపయోగిస్తున్నారు?
ఎ) ఉత్పత్తి మదింపు పద్ధతి
బి) ఆదాయ మదింపు పద్ధతి
సి) వ్యయాల మదింపు పద్ధతి
డి) పైవన్నీ
4. ఏడాది కాలంలో వివిధ ఉత్పత్తి కారకాలకు లభించే ఆదాయాన్ని కూడితే జాతీయాదాయం తెలుస్తుంది. ఇది ఏ రకమైన మదింపు పద్ధతి?
ఎ) ఉత్పత్తి మదింపు పద్ధతి
బి) ఆదాయ మదింపు పద్ధతి
సి) వ్యయాల మదింపు పద్ధతి
డి) పైవన్నీ
5. జాతీయాదాయ గణనలో మినహాయించేవి?
ఎ) ఒక వస్తువు విలువను రెండుసార్లు లెక్కించరాదు
బి) బదిలీ చెల్లింపులను మినహాయించాలి
సి) పంచి పెట్టని లాభాలు కలుపాలి
డి) పైవన్నీ
6. వ్యయాల మదింపు పద్ధతికి మరో పేరు?
ఎ) Consumption and Investment Mehod
బి) Income disposal Method
సి) ఎ & బి డి) పైవేవీ కావు
7. దేశంలో జాతీయాదాయాన్ని లెక్కించడానికి వీకేఆర్వీ రావు అనుసరించిన పద్ధతులు ఏవి?
ఎ) ఉత్పత్తి మదింపు పద్ధతి
బి) ఆదాయ మదింపు పద్ధతి
సి) వ్యయాల మదింపు పద్ధతి
డి) ఎ & బి
8. ప్రస్తుతం దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తున్నది ఎవరు?
ఎ) CSO బి) NSSO
సి) NSO డి) NSC
9. జాతీయాదాయాన్ని లెక్కించడంలో ఏ పద్ధతిని పాక్షికంగా ఉపయోగిస్తారు?
ఎ) ఉత్పత్తి పద్ధతి బి) ఆదాయ పద్ధతి
సి) వ్యయాల పద్ధతి డి) పైవన్నీ
10. ప్రపంచంలో అధిక జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది?
ఎ) అమెరికా బి) చైనా
సి) రష్యా డి) భారతదేశం
11. జాతీయాదాయ అంచనాల వలన..
ఎ) ఆర్థిక పురోభివృద్ధికి సూచిక
బి) ఆర్థిక విధాన రూపకల్పనకు సూచిక
సి) బడ్జెట్ తయారీ, కేటాయంపునకు సూచిక
డి) పైవన్నీ
12. జాతీయాదాయ లెక్కింపులో..
ఎ) అంతిమ వస్తుసేవలను మాత్రమే తీసుకోవాలి
బి) మధ్యంతర వస్తువులను తీసుకోకూడదు
సి) సేవల విలువలను కూడా తీసుకోవాలి
డి) పైవన్నీ
13. ప్రపంచంలో అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం?
ఎ) భారత్ బి) పాకిస్థాన్
సి) తువాలు డి) శ్రీలంక
14. జాతీయాదాయం లెక్కించడం వల్ల..
ఎ) తలసరి ఆదాయం, జీవన ప్రమాణస్థాయి తెలుస్తుంది
బి) ప్రభుత్వ-ప్రైవేటు రంగాల పాత్ర తెలుస్తుంది
సి) వివిధ దేశాల అభివృద్ధిని పోల్చవచ్చు
డి) పైవన్నీ
15. జాతీయాదాయాన్ని లెక్కించడంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి?
ఎ) సేవల విలువ లెక్కించడం
బి) సొంత వినియోగ ఉత్పత్తిని లెక్కించడం
సి) ఏ వస్తువు అంతిమ వస్తువో, మధ్యంతర వస్తువో గుర్తించడం
డి) పైవన్నీ
16. పరిశ్రమ ఆధారిత పద్ధతి అని ఏ పద్ధతిని పిలుస్తారు?
ఎ) ఉత్పత్తి పద్ధతి బి) ఆదాయ పద్ధతి
సి) వ్యయాల పద్ధతి డి) పైవన్నీ
17. జాతీయాదాయాన్ని లెక్కించాలంటే ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా విభజిస్తారు?
ఎ) వ్యవసాయ, పారిశ్రామిక రంగం
బి) పారిశ్రామిక, సేవారంగం
సి) వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగం
డి) వ్యవసాయ, సేవారంగం
18. ఒక దేశ ఆర్థికవ్యవస్థ వెనుకబడి ఉన్నప్పుడు జాతీయాదాయంలో ఏ రంగం వాటా అధికంగా ఉంటుంది?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవారంగం డి) పైవన్నీ
19. జాతీయాదాయంలో సేవారంగం వాటా అధికంగా ఉన్నప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ?
ఎ) వెనుకబడి ఉంటుంది
బి) అభివృద్ధి చెందుతూ ఉంటుంది
సి) అభివృద్ధి చెంది ఉంటుంది డి) పైవన్నీ
20. ప్రస్తుతం జాతీయాదాయంలో ఏ రంగం వాటా తక్కువగా ఉంది?
ఎ) ప్రాథమిక రంగం
బి) ద్వితీయ రంగం
సి) తృతీయ రంగం డి) ఎ & బి
21. 1950-51లో జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎంత?
ఎ) 53.1 శాతం బి) 16.6 శాతం
సి) 30.3 శాతం డి) 20.19 శాతం
22. ప్రస్తుతం (2021-22) జీడీపీలో సేవారంగం వాటా ఎంత?
ఎ) 20.19 శాతం బి) 53.8 శాతం
సి) 30.3 శాతం డి) 58.6 శాతం
23. ఒక దేశ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు ఏ రంగం పాత్ర అధికంగా ఉంటుంది?
ఎ) ప్రాథమిక రంగం
బి) ద్వితీయ రంగం
సి) తృతీయ రంగం డి) బి & సి
24. భారతదేశం స్వాతంత్య్రం పొందే నాటికి
ఆర్థికవ్యవస్థ ఎలా ఉంది?
ఎ) అభివృద్ధి చెందుతూ ఉంది
బి) వెనుకబడి ఉంది
సి) అభివృద్ధి చెంది ఉంది డి) ఎ & బి
25. జాతీయాదాయంలో వివిధ రంగాల వాటా ప్రస్తుతం ఏ క్రమంలో ఉంది?
ఎ) ఆరోహణ క్రమం
బి) అవరోహణ క్రమం
సి) సమాన క్రమం డి) పైవేవీ కావు
26. 2020-21 ఏడాదిలో జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా?
ఎ) 25.92 శాతం బి) 28.2 శాతం
సి) 29.6 శాతం డి) 16.6 శాతం
27. 2011-12 ఏడాది నాటికి (NSSO) వ్యవస్థీకృత రంగంలో ఉపాధి పొందిన వారి శాతం ఎంత?
ఎ) 48.9 శాతం బి) 24.3 శాతం
సి) 26.9 శాతం డి) 17.3 శాతం
28. 2019-20 ఏడాది నాటికి (PLFS) దేశంలో గ్రామీణ నిరుద్యోగం ఎంత?
ఎ) 2.81 కోట్లు బి) 1.5 కోట్లు
సి) 1.31 కోట్లు డి) 8.51 కోట్లు
29. దేశంలోని నిరుద్యోగిత ఏ రకమైనదిగా చెప్పవచ్చు?
ఎ) నిర్మాణాత్మకమైనది
బి) సాంకేతికమైనది
సి) చక్రీయమైనది డి) అనుద్యోగిత గలది
30. దేశంలో నిరుద్యోగ సమస్యకు కారణం కానిది ఏది?
ఎ) మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతులు
బి) విద్యా విధానం సి) వికేంద్రీకరణ
డి) శ్రామికశక్తి పెరుగుదల
31. 2022 మార్చి నాటికి దేశ జనాభాలో శ్రామికుల శాతం?
ఎ) 65.20 శాతం బి) 67.27 శాతం
సి) 60.60 శాతం డి) 57.67 శాతం
32. కింది వాటిలో నిరుద్యోగితకు కారణాలు ఏవి?
ఎ) ఉపాధి రహిత వృద్ధి
బి) ప్రాథమిక రంగంపై ఆధారపడటం
సి) అల్ప వనరుల వినియోగం
డి) పైవన్నీ
33. వ్యవసాయ రంగంపై జనాభా ఒత్తిడివల్ల ఏర్పడే నిరుద్యోగిత?
ఎ) రుతుసంబంధ నిరుద్యోగిత
బి) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
సి) వ్యవస్థాపూరక నిరుద్యోగిత
డి) పైవన్నీ
34. దేశంలో నిరుద్యోగితకు గల కారణాలు ఏవి?
ఎ) రవాణా, బ్యాంకింగ్, బీమా, సమాచారం సౌకర్యాలు లేకపోవడం
బి) విద్యాసౌకర్యాలు పెరిగి ఉపాధి అవకాశాలు లేకపోవడం
సి) యంత్రాలు, యంత్ర పరికరాల వినియోగం
డి) పైవన్నీ
35. నిరుద్యోగితా ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థలో
ఎ) పేదరికం పెరుగుతుంది
బి) అల్పవనరుల వినియోగం జరుగుతుంది
సి) ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది
డి) పైవన్నీ
36. ఆర్థిక వ్యవస్థలో అధిక నిరుద్యోగిత వల్ల..
ఎ) శ్రమ దోపిడి జరుగుతుంది
బి) వస్తు సేవల డిమాండ్ తగ్గుతుంది
సి) సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతాయి
డి) పైవన్నీ
37. కింది వాటిలో నిరుద్యోగితకు కారణం కానిది ఏది?
ఎ) ప్రాంతీయ అసమానతలు
బి) ఆర్థిక స్థోమత కేంద్రీకరణ
సి) ఆదాయ సమానత్వం
డి) పరిశ్రమల ఆధునికీకరణ
38. 2019-20 ఏడాదికి PLFS అంచనా ప్రకారం దేశంతో పట్టణ నిరుద్యోగిత ఎంత?
ఎ) 1.5 కోట్లు బి) 1.31 కోట్లు
సి) 2.81 కోట్లు D) 4.46 కోట్లు
39. 2011-12 ఏడాది NSSO అంచనా
ప్రకారం మొత్తం ఉపాధిలో స్వయం ఉపాధి పొందేవారి శాతం?
ఎ) 52 శాతం బి) 30 శాతం
సి) 18 శాతం డి) 45 శాతం
40. నిరుద్యోగిత అంచనా కోసం ML దంత్వాలా కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1955 బి) 1965
సి) 1969 డి) 1979
41. Employment, Unemployment Survey విషయంలో NSSO తన చిట్ట చివరి నివేదికను ఎప్పుడు ప్రకటించింది?
ఎ) 2011-12 బి) 2012-13
సి) 2010-11 డి) 2013-14
42. ఆర్థిక వ్యవస్థలో ఆధునిక పద్ధతులు అవలంబించడంవల్ల ఏర్పడే నిరుద్యోగిత?
ఎ) అనుద్యోగిత
బి) సాంకేతిక నిరుద్యోగిత
సి) ఘర్షణ నిరుద్యోగిత
డి) చక్రీయ నిరుద్యోగిత
43. దాదాభాయ్ నౌరోజీ ఏ సంవత్సరంలో భారతదేశ జాతీయాదాయాన్ని లెక్కించారు?
ఎ) 1865 బి) 1868
సి) 1858 డి)1899
44. ఈ కింది వాటిలో సరి కానిది ఏది?
ఎ) DPI = PI – PT
బి) DPI = C + S
సి) DPI = PI + PT
డి) పైవేవీకావు
45. ఒక దేశ ప్రజల సగటు జీవన ప్రమాణ స్థాయిని సూచించేది?
ఎ) జాతీయాదాయం
బి) తలసరి ఆదాయం
సి) తలసరి ఆదాయ వృద్ధిరేటు
డి) తలసరి వినియోగం
46. జాతీయాదాయాన్ని క్రమ పద్ధతిలో శ్రాస్తీయంగా లెక్కించిన వారు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ
బి) డా. వీకేఆర్వీ రావు
సి) పి.సి. మహలనోబిస్
డి) గాడ్గిల్
47. జాతీయాదాయాన్ని లెక్కించే సాంకేతికతను అభివృద్ధి చేసినది?
ఎ) రిచర్డ్ స్టోన్ బి) నౌరోజీ
సి) మహలనోబిస్ డి) గాడ్గిల్
48.1868లో జాతీయాదాయం తలసరి ఆదాయం ఎంత?
ఎ) రూ.340 కోట్లు, రూ. 20
బి) రూ.545 కోట్లు, రూ.20
సి) రూ.574 కోట్లు, రూ. 27
డి) రూ.428 కోట్లు, రూ. 18.9
49. ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయాన్ని గణిస్తే..
ఎ) నిజ తలసరి ఆదాయం
బి) నామమాత్రపు తలసరి ఆదాయం
సి) వాస్తవ తలసరి ఆదాయం
డి) నామ మాత్రపు జాతీయాదాయం
50. ఒక ఏడాదిలో వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి వ్యష్టి పన్నులు చెల్లించగా మిగిలిన ఆదాయాన్ని ఏమంటారు?
ఎ) తలసరి ఆదాయం
బి) జాతీయాదాయం
సి) వ్యష్టి ఆదాయం
డి) వ్యయార్హ ఆదాయం
51. దాదాభాయ్ నౌరోజీ 1868లో జాతీయా దాయాన్ని లెక్కించేటప్పుడు అప్పటి జనాభా ఎన్ని కోట్లు?
ఎ) 15 కోట్లు బి) 16 కోట్లు
సి) 17 కోట్లు డి) 18 కోట్లు
52. బ్రిటిష్ ఇండియాలో జాతీయాదాయం
గ్రంథ రచయిత ఎవరు?
ఎ) మహలనోబిస్ బి) మార్షల్
సి) దాదాభాయ్ నౌరోజీ
డి) వీకేఆర్వీ రావు
53. జాతీయాదాయాన్ని ఎక్కువసార్లు గణించింది ఎవరు?
ఎ) షిర్రాస్ బి) మహలనోబిస్
సి) గాడ్గిల్ డి) డిగ్బీ
54. భారతదేశంలో జాతీయాదాయ అంచనాల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1947 ఆగస్టు 8
బి) 1948 ఆగస్టు 8
సి) 1949 ఆగస్టు 9
డి) 1949 ఆగస్టు 4
55. జాతీయాదాయాన్ని లెక్కించడానికి మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు?
ఎ) 1947 -48 బి) 1948-49
సి) 1949-50 డి) 1950-51
జవాబులు
1-సి 2-డి 3-డి 4-బి 5-డి 6-సి 7-డి 8-సి 9-సి 10-ఎ 11-డి 12-డి 13-సి 14-డి 15-డి 16-ఎ 17-సి 18-ఎ 19-సి 20-ఎ 21-ఎ 22-బి 23-సి 24-బి 25-బి 26-ఎ 27-డి 28-బి 29-ఎ 30-సి 31-బి 32-డి 33-బి 34-డి 35-డి 36-డి 37-సి 38-బి 39-ఎ 40-సి 41-ఎ 42-బి 43-బి 44-సి 45-బి 46-బి 47-ఎ 48-ఎ 49-బి 50-డి 51-సి 52-డి 53-ఎ 54-డి 55-బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు