మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
– జీరో సర్వీస్ అండర్టేకెన్ ఇచ్చిన వారికే..
– జీవో విడుదల చేసిన విద్యాశాఖ
పాఠశాల విద్యాశాఖలో మరికొందరు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు (మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 532 టీచర్లను సోమవారం బదిలీచేసింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఇందుకు సంబంధించిన జీవో-17ను జారీచేశారు. పరస్పర బదిలీల్లో ఇద్దరు పరస్పరం ఒకచోటి నుంచి మరోచోటికి బదిలీ కావాల్సి ఉండగా, సోమవారం 266 దరఖాస్తులను పరిష్కరించి మొత్తం 532 టీచర్లను బదిలీచేశారు. తాజాగా బదిలీ అయిన వారు పాత సర్వీసును కోల్పోతారని, వీరంతా జిల్లాలో రెగ్యులర్ టీచర్ల తర్వాత చివరి ర్యాంక్‌లో ఉండాల్సి ఉంటుందని ఆయా జీవోలో స్పష్టంచేశారు. తాజాగా బదిలీ అయిన 532 టీచర్లు జీరో సర్వీస్‌కు అంగీకారం తెలపడంతోనే వీరిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీచేశారు. ఇప్పటికే జూన్ 20న 2,538 మంది టీచర్లు, ఉద్యోగులను పరస్పరం బదిలీచేయగా, తాజాగా మరో 532 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
జిల్లాల వారిగా బదిలీలు
జిల్లా బదిలీలు
ఖమ్మం 24
హనుమకొండ 32
వికారాబాద్ 56
జనగామ 62
మహబూబాబాద్ 37
త్వరలో మరికొంత మంది..
పరస్పర బదిలీలపై హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ కేసు ఈ నెల 18న విచారణకు రానున్నది. ఈ లోపు జీరో సర్వీస్‌కు అంగీకరించిన వారిని బదిలీచేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకొని, జీరో సర్వీస్‌కు అంగీకారం తెలియజేస్తూ తాజాగా అండర్‌టేకింగ్ సమర్పిస్తే వారిని బదిలీచేస్తామని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మరికొంత మందిని బదిలీచేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తున్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు