డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
– ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్
-ఈ-కామర్స్, గేమింగ్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్
కోర్సులో అంతర్భాగంగా ఇంటర్న్‌షిప్ అమలు
-కొత్తగా బీఏ ఆనర్స్ హిస్టరీ కోర్సు సైతం ప్రారంభం
– 11 అటానమస్ కాలేజీల్లో నిర్వహణకు అనుమతి
నేటి సాంకేతిక అవసరాలకు తగ్గట్టుగా, డిగ్రీ పూర్తిచేసినవారికి జాబ్ గ్యారెంటీని ఇచ్చే కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్.. ఇంజినీరింగ్‌లో అనతికాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన కోర్సు. ఇంతకాలం ఇంజినీరింగ్‌కే పరిమితమవగా, ఇప్పుడు బీఎస్సీ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నది. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకొన్నది. ఇవేగాక ఈ కామర్స్, గేమింగ్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ కోర్సుల ప్రవేశపెడుతున్నారు. వీటి కరిక్యులం, కోర్సు మెటీరియల్‌ను సిద్ధం చేశారు. ఈ కోర్సులను అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులుగా వ్యవహరిస్తున్నారు. ఈ కోర్సుల్లో చేరేవారు ఏదైనా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఆ కాలానికి స్టెపెండ్ అందజేస్తారు. బీబీఏ రిటైల్ చేస్తున్నవారు రిటైల్ సంస్థలు, ఈ కామర్స్‌లో చేరిన వారు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఏ సంస్థలో చేయాలన్నది స్థానికంగా ఉండే సంస్థలను బట్టి అవకాశం కల్పిస్తారు. బీఏలో ఆనర్స్ కోర్సులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తుండగా, తాజాగా ఈ విద్యాసంవత్సరం బీఏ ఆనర్స్-హిస్టరీ కోర్సు అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్ సిటీ కాలేజీలో ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కాలేజీల వారిగా కోర్సులివే..
కాలేజీ కోర్సులు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ – నయాపూల్ బీబీఏ – రిటైలింగ్, బీఏ- కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్
ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ,నాంపల్లి బీకాం ఈ కామర్స్ ఆపరేషన్స్
ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ,బేగంపేట బీఎస్సీ- గేమింగ్, బీఏ- కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, బీకాం- ఈ కామర్స్ ఆపరేషన్స్
ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కరీంనగర్ బీబీఏ- రిటైలింగ్, బీకాం- ఈ కామర్స్ ఆపరేషన్స్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖమ్మం బీఎస్సీ – గ్రాఫిక్ డిజైన్ అండ్ డిజిటల్ అడ్వర్టయిజింగ్, బీబీఏ – రిటైలింగ్, బీఏ పర్ఫార్మింగ్ ఆర్ట్
పింగలి మహిళా డిగ్రీ కాలేజీ, హనుమకొండ బీబీఏ- రిటైలింగ్, బీకాం – ఈ కామర్స్ ఆపరేషన్స్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మహబూబ్‌నగర్ బీబీఏ – లాజిస్టిక్స్, బీకాం – అగ్రిస్టోరేజీ అండ్ సప్లయ్ చైన్, బీఏ – కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్లగొండ బీకాం- ఈ కామర్స్ ఆపరేషన్స్, బీఎస్సీ-గ్రాఫిక్ డిజైన్ అండ్ డిజిటల్ అడ్వర్టయిజింగ్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిజామాబాద్ బీబీఏ- లాజిస్టిక్స్, బీకాం- అగ్రిస్టోరేజీ అండ్ సప్లయ్‌చైన్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సంగారెడ్డి బీబీఏ- అగ్రిస్టోరేజీ అండ్ సప్లయ్‌చైన్, బీఏ- కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సిద్దిపేట బీకాం- ఈ కామర్స్ ఆపరేషన్స్, బీఎస్సీ-యానిమేషన్, బీబీఏ- రిటైలింగ్
- Tags
- courses
- Degree
- Job Guarantee
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు