తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
తెలంగాణ నైసర్గిక స్వరూపానికి ఒక ప్రత్యేకత ఉంది. అతి పురాతన దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ప్రాంతం విస్తరించి ఉంది. ఒకవైపు తూర్పు కనుమలు, మరోవైపు పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్న ప్రాంతం. బొగ్గు ఖనిజం పుష్కలంగా లభించే గోండ్వానా శిలలతో కూడిన ప్రాంతం. జీవనదులైన కృష్ణా గోదావరి నదులు ఈ ప్రాంతం నుంచే ప్రవహిస్తాయి. ఎర్రనేలలు, నల్లరేగడి నేలల సమ్మిళితం.
తెలంగాణ నైసర్గిక స్వరూపం
# దక్షిణ భారతదేశంలో అతిపురాతన దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ప్రాంతం విస్తరించి ఉంది.
#దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంలో ఉంది. స్పటిక, రూపాంతర శిలలు అవరించి ఉన్నాయి.
# ఈ పీఠభూమి సముద్ర మట్టానికి సగటున 450 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది.
#రాష్ట్ర రాజధాని హైదారాబాద్ -600 మీటర్ల ఎత్తులో ఉంది.
# గోదావరి, భీమా నదుల మధ్య ఈ పీఠభూమి ఎత్తు సగటున 730 మీటర్లు. కృష్ణా తుంగభద్ర నదీ లోయల మధ్య ప్రాంతంలో 300-450 మీటర్ల వరకు ఉంటుంది.
#నిర్మల్. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దిగువ గోదావరి వెంబడి అనేక ముడతలు పడిన గోండ్వానా శిలలు, బొగ్గు ఖనిజాలతో ఉన్నాయి.
#తెలంగాణలో అధిక భాగం ఎర్రమృత్తికలతో, కొంతభాగం లావ శిలల నుండి ఏర్పడిన నల్లరేగడి నేలలతో కొంత భాగం, గోదుమ వర్ణం రంగుతో ఉన్న నేలలతోనూ కొంత భాగం నేలలు ఉన్నాయి.
# తెలంగాణలో పశ్చిమ కనుమలు, సహ్యద్రిలను సాత్నాలపంక్తిగా పిలుస్తారు.
#తెలంగాణ రాష్ట్రంలో ఆర్కియన్, వింధ్య, గోండ్వానా, ద్రవిడియన్ శిలలున్నట్లు జియాలజికల్ సర్వే తెలిపింది.
# తెలంగాణ ప్రాంత నిర్మాణం, స్వరూపాన్ని బట్టి రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించవచ్చు.
#తెలంగాణ పీఠభూమి
# గోదావరి బేసిన్ ప్రాంతం
# కృష్ణ పర్వత పాద ప్రాంతం
తెలంగాణ పీఠభూమి
# తెలంగాణ పీఠభూమి సుమారు 59,903 చ.కి.మీ విస్తీర్ణంతో తూర్పు దిశగా వాలి ఉంది.
# ఈ పీఠభూమి ప్రాంతం అంతా చిన్న కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాల స్థలాకృతిని కలిగి ఉంది. ఈ పీఠభూమిని స్థానిక ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లుతో పిలుస్తారు.
# తెలంగాణ పీఠభూమి ఉత్తర వాయవ్య దిశల్లో పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి పర్వతాలు అజంతా శ్రేణి నుండి విడిపోయి ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
# తెలంగాణలో పశ్చిమ కనుమల్లోని అత్యంత ఎత్తైన శ్రేణి నిర్మల్ జిల్లా నిర్మల్ గుట్టల్లోని మహబుబాఘాట్
# తెలంగాణలో పశ్చిమ కనుమల్లోని అత్యంత ఎత్తైన ప్రాంతం ధోలిగుట్ట (965 మీటర్లు)
#ఇది ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది.
# తెలంగాణ పీఠభూమికి తూర్పు కనుమలు ఈశాన్య ఆగ్నేయ సరిహద్దుగా ఖమ్మం, భద్రాది కొత్తగూడెం , నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
# ఆమ్రాబాద్ లేదా షాబాద్ గుట్టలనే నల్లమల కొండలు అని కూడా అంటారు. నాగర్ కర్నూలు జిల్లాలో విస్తరించి ఉంది. ఇది నీస్ గ్రానైట్ శిలతో కూడిన పురాతన పనిప్లెన్.
# పాపికొండలు ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
#అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. మూసీ నది జన్మస్థానం.
గోదావరి బేసిన్
# పశ్చిమ కనుమల నుంచి విడిపోయిన సాత్మాలా శ్రేణులు ఉత్తర తెలంగాణ ప్రాంతమంతా విస్తరించి ఉన్నాయి.
#ఈ ప్రాంతం కార్బోనిఫెరస్ రాళ్ళు ఆర్కియన్ నీస్ శిలలతో ఉంటుంది. గోదావరి నది ప్రవహిస్తుండటంతో దీన్ని గోదావరి పరివాహక ప్రాంతంగా పిలుస్తారు.
# సుమారు 37,934 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండే ఈ పరివాహక ప్రాంతంలో శబరి, ఆకేరు. పాలేరు. వైరా, మున్నేరు నదులు ప్రవహిస్తున్నాయి.
# గోదావరి నదీ పరివాహక ప్రాంతం ప్రధానంగా గోడ్వానా శిలలతో ఏర్పడి ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ప్రధానంగా లభించే ఖనిజం బొగ్గు.
# ఈ ప్రాంతం నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం జిలాల్లో విస్తరించి ఉంది.
కృష్ణా పర్వత పాద ప్రాంతం
ఈ ప్రాంతం మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 14,240 చ.కి.మీ విస్తీర్ణం కలిగి ఉంది.
#ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉంటుంది. కృష్ణానది నల్లగొండ జిల్లా సరిహద్దుగుండా ప్రవహిస్తుంది.
#తెలంగాణ తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ లక్ష్మిదేవి పల్లి కొండ.
#సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీ.ల ఎత్తయిన ప్రాంతానికి ఉత్తరాన గోండ్వానా, దక్షిణాన తుంగభద్రలోయ విస్తరించి ఉన్నాయి.
#సముద్ర మట్టానికి 300 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న ప్రాంతంలో దక్కన్ పీఠభూమికి తూర్పున ఉన్న తూర్పు కనుమలు, దక్షిణాన ఉన్న పశ్చిమ కనుమలు రెండూ తెలంగాణలోనికి ప్రవేశించాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం భారతదేశ విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమించింది?
ఎ) 2.42 శాతం బి) 3.41 శాతం
సి) 4.2 శాతం డి) 4.9 శాతం
2) తెలంగాణ ప్రాంత నిర్మాణం, స్వరూపాన్ని బట్టి రాష్ట్రాన్ని ఏ ప్రాంతాలుగా విభజించారు?
ఎ) తెలంగాణ పీఠభూమి
బి) గోదావరి బేసిన్ ప్రాంతం
సి) కృష్ణాపర్వతపాద ప్రాంతం
డి) పైవన్నీ
3. తెలంగాణ పీఠభూమి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎన్ని చ.కి.మీ. వ్యాపించి ఉంది?
ఎ) 47.231 చ.కి.మీ.
బి) 59,903 చ.కి.మీ.
సి) 62,452 చ.కి.మీ.
డి) 69,726 చ.కి.మీ.
4. వైశాల్యపరంగా గోదావరి బేసిన్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చ.కి.మీ. విస్తరించి ఉంది?
ఎ) 27,721 చ.కి.మీ.
బి) 29,242 చ.కి.మీ.
సి) 37,934 చ.కి.మీ.
డి) 38,768 చ.కి.మీ.
5. కృష్ణా పర్వత పాద ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చ.కి.మీ. విస్తరించి ఉంది?
ఎ) 11,120 చ.కి.మీ.
బి) 12,636 చ.కి.మీ
సి) 13,573 చ.కి.మీ.
డి) 14,240 చ.క.మీ.
6. హైదరాబాద్ జిల్లా ప్రత్యేకంగా ఏ శిలలతో నిర్మితమైంది?
ఎ) కార్డియోరైట్నైసిస్
బి) హార్న్బ్లెండ్ -బయోటైట్
సి) అవిచ్ఛిన్న స్పటిక శిలలు
డి) పైవన్నీ
7. భారతదేశం జియోలాజికల్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన శిలలను ఎన్ని కేటగిరీలుగా విభజించారు.
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
8. తెలంగాణలో పశ్చిమ కనుమలను ఏమని పిలుస్తారు?
ఎ) సహ్యాద్రి / సత్నాల
బి) బాలఘాట్
సి) పెనుగొండలు డి) అనంతగిరి
9. జగిత్యాలలో పశ్చిమ కనుమలను ఏ పేరుతో పిలుస్తారు?
ఎ) రామగిరి కొండలు
బి) కందికల్ కొండలు
సి) రాఖీగుట్టలు
డి) సిర్నపల్లికొండలు
10. తెలంగాణలో పశ్చిమకనుమల్లో ఎతైన శ్రేణి మహబూబ్ ఘాట్ ఏ జిల్లాలో ఉంది?
ఎ) జయశంకర్ భూపాల పల్లి
బి) కుమ్రంభీం అసిఫాబాద్ ఆదిలాబాద్
సి) ఆదిలాబాద్ డి) నిర్మల్
11. తెలంగాణ పూర్తి వైశాల్యం ఎన్ని లక్షల హెక్టార్లు?
ఎ) 119.48 బి) 112.07
సి) 124.32 డి) 136.38
12. తెలంగాణ మొత్తంలో అటవీ విస్తీర్ణం శాతం ఎంత?
ఎ) 20.7 శాతం బి) 21.7 శాతం
సి) 24.07 శాతం డి) 23.7 శాతం
13. తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి?
ఎ) 12,151 బి) 12,000
సి) 12,769 డి)12,407
14. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఎంత శాతం?
ఎ) 44.20 శాతం బి) 36.5 శాతం
సి) 37. 5 శాతం డి) 42.59 శాతం
15. తూర్పు కనుమలను రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏ పేరుతో పిలుస్తారు?
ఎ) పాపికొండలు
బి) అనంతగిరి కొండలు
సి) కందిగల్ గుట్టలు డి) పైవన్నీ
16. తూర్పు కనుమలను నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఏ పేరుతో పిలుస్తారు?
ఎ) శేషాచలం కొండలు
బి) నంది కొండలు
సి) నల్లమల కొండలు
డి) అనంతగిరి కొండలు
17. తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
ఎ) 380-420 మీటర్లు
బి) 480-600 మీటర్లు
సి) 260-360 మీటర్లు
డి) 350-530 మీటర్లు
18. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
ఎ) 600 మీటర్లు బి) 400 మీటర్లు
సి) 300 మీటర్లు డి) 700 మీటర్లు
19. రాష్ట్ర విభజన మూలంగా ఏ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది?
ఎ) జారండ్ బి) ఒడిశా
సి) ఆంధ్రప్రదేశ్ డి) కర్ణాటక
20. భూపరివేష్టిత జిల్లాకానిది ఏది?
ఎ) సిద్దిపేట బి) యాదగిరి
సి) రంగారెడ్డి డి) భద్రాద్రి కొత్తగూడెం
21. గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న ప్రాంతం ఎత్తు ఎంత?
ఎ) 600 మీటర్లు బి) 300 మీటర్లు
సి) 400 మీటర్లు డి) 700 మీటర్లు
22. తెలంగాణలో అతిపెద్ద నైసర్గిక స్వరూపం
ఎ) తెలంగాణ పీఠభూమి
బి) గోదావరి బేసిన్
సి) కృష్ణా బేసిన్ డి) చార్మినార్ జోన్
23. ఈ కింది వాటిలో సరికానిది ఏది ?
ఎ) జోగులాంబ 1) నల్లమల
బి) రంగారెడ్డి 2) లక్ష్మీదేవిపల్లి
సి) మహబూబ్నగర్ 3) షాబాద్ గుట్టలు
డి) జగిత్యాల 4) బూజు గుట్టలు
24. ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా విస్తరించి ఉన్న శ్రేణులు?
ఎ) సాత్నాల శ్రేణులు
బి) నల్లమల కొండలు
సి) కోయల్ కొండలు
డి) పాపికొండలు
25. తెలంగాణలో అత్యంత ఎత్తులో ఉన్న జిల్లా?
ఎ) జగిత్యాల బి) పెద్దపల్లి
సి) కరీంనగర్ డి) హైదరాబాద్
సమాధానాలు
1-బి 2-డి 3-బి 4-సి 5-డి 6-డి 7-సి 8-ఎ 9-సి 10-డి 11-2 12-3 13-3 14-4 15-2 16-2 17-2 18-1 19-2 20-4
21-2 22-1 23-4 24-1 25-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?