మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?

1. ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదాన్ని ‘ఎన్విరా నర్’ అనే ఏ భాషా పదం నుంచి గ్రహించారు?
1) ఫ్రెంచి 2) గ్రీకు
3) జర్మన్ 4) ఆంగ్ల
2. ఏ ధృవం దగ్గర ఏర్పడే కాంతిపుంజాలను అరోరా బొరియాలిస్ అని అంటారు?
1) ఉత్తర 2) దక్షిణ
3) ఉత్తర, దక్షిణ 4) ఏదీకాదు
3. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
1) జూన్ 5 2) జూలై 5
3) జనవరి 5 4) అక్టోబర్ 5
4. మృత్తిక లేదా నేల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) లిథాలజీ 2) పెడాలజీ
3) ఆప్తాలజీ 4) హెక్టాలజీ
5. ఖనిజ వనరుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) మినరాలజీ 2) పెడాలజీ
3) ఎడపాలజీ 4) లిథాలజీ
6. నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) హైడ్రాలజీ 2) పెడాలజీ
3) లిథాలజీ 4) హెప్టాలజీ
7. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
1) జనవరి 23 2) మార్చి 23
3) సెప్టెంబర్ 23 4) డిసెంబర్ 23
8. ప్రపంచ వాతావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
1) సెప్టెంబర్ 26 2) అక్టోబర్ 26
3) నవంబర్ 26 4) డిసెంబర్ 26
9. ఎన్వియార్ అనే ఫ్రెంచ్ భాషా పదానికి అర్థం?
1) బహిర్గతమైన 2) సంవృతమైన
3) చుట్టిఉన్న 4) అంతర్గతమైన
10. వాతావరణంలో ఆక్సిజన్ శాతం?
1) 0.03% 2) 20.94%
3) 78.08% 4) 40.54%
11. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే ప్రధానమైన వాయువు?
1) ఆక్సిజన్ 2) నైట్రోజన్
3) ఆర్గాన్ 4) కార్బన్ డై ఆక్సైడ్
12. వాతావరణంలో అధిక శాతంలో ఉన్న జడవాయువు?
1) జీనాన్ 2) ఆర్గాన్
3) క్రిప్టాన్ 4) రేడాన్
13. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి ఎంత ఎత్తు వరకు ఉంటాయి?
1) 120 కి.మీ. 2) 90. కి.మీ.
3) 150 కి.మీ. 4) 100 కి.మీ.
14. ట్రోపో ఆవరణం దేని దగ్గర 18 కి.మీల వరకు ఎత్తును కలిగి ఉంటుంది?
1) భూమధ్యరేఖ దగ్గర
2) ధృవాల దగ్గర
3) సముద్రాల దగ్గర
4) ఎడారుల దగ్గర
15. మేఘాలు ఏర్పడటం, ఉరుములు, మెరుపులు, అల్పపీడనాలు, వర్షపాతం లాంటి వాతావరణ అలజడులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి?
1) ట్రోపో ఆవరణం
2) స్ట్రాటో ఆవరణం
3) థర్మో ఆవరణం
4) మీసో ఆవరణం
16. ట్రోపో ఆవరణం దానిపైన ఉన్న స్ట్రాటో ఆవరణం మధ్య సరిహద్దును ఏమని పిలుస్తారు?
1) ట్రోపో-స్ట్రాటోపాస్
2) థర్మోపాస్
3) ట్రోపో పాస్ 4) స్ట్రాటో పాస్
17. ‘ఓజోన్ ఆవరణం’ అని ఏ ఆవరణాన్ని అంటారు?
1) స్ట్రాటో ఆవరణం 2) ట్రోపో ఆవరణం
3) ఐనో ఆవరణం 4) మీసో ఆవరణం
18. జీవ సముదాయాన్ని ఆవరించి ఉన్న జీవ, నిర్జీవ అనే ఘటకాలు, వాటి మధ్య జరిగే అంతఃచర్యలనేమంటారు?
1) పర్యావరణం
2) సాంఘిక పర్యావరణం
3) జలావరణం 4) వాతావరణం
19. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) న్యూఢిల్లీ
3) బెంగళూరు 4) చెన్నై
20. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి కోసం నిర్దేశించిన 52 సూచీల్లో భారత్ ఎన్ని సూచీల్లో ప్రపంచ సగటు స్థాయిని అందుకుంటుంది?
1) 32 2) 25 3) 16 4) 15
21. ఇటీవల శేషాచలం కొండలను ఏ విధంగా ప్రకటించారు?
1) జాతీయ పార్కు
2) అభయారణ్యం
3) పావన వనం
4) జీవగోళ సురక్షిత కేంద్రం
22. ఆవరణ శాసా్త్రన్ని గ్రీకు భాషలో ఏమని పిలుస్తారు?
1) ఓయాకాలజిక్ 2) సినెకాలజీ
3) ఇథాలజీ 4) హెగ్జికాలజీ
23. దేశంలోనే తొలిసారి ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఎక్కడ నిర్మించారు?
1) మధుర 2) గోండా
3) వారణాసి 4) మీరట్
24. ప్రపంచంలోని మడ అడవులు, సరస్సులు చెరువులు చిత్తడి నేలల సంరక్షణ కోసం ఏర్పడిన ఒప్పందం?
1) పారిస్ ఒప్పందం
2) రామ్సార్ ఒప్పందం
3) బాలీ ఒప్పందం
4) బాన్ ఒప్పందం
25. ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ క్లెమేట్ ఛేంజ్ నివేదిక ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే అతివృష్టి, అనావృష్టి, అంటువ్యాధులు విజృంభిస్తాయి?
1) 1 2) 2 3) 3 4) 4
26. జీవ వైవిధ్యత అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించినది?
1) డబ్ల్యూ.జి. రోసెన్ 2) లౌజాయ్
3) ఇ.ఒ విల్సన్ 4) విట్టేకర్
27. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి ప్రతి సంవత్సరం యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఏ దాతృత్వ సంస్థ అవార్డులను అందిస్తుంది?
1) విట్లే నేచర్ ఫండ్
2) ద విట్లే ఫండ్ ఫర్ నేచర్
3) విట్లే గ్రీన్ అవార్డ్
4) విట్లే ఎన్విరాన్మెంట్ అవార్డ్
28. విట్లే అవార్డు ద్వారా ఎంత నగదును (పౌండ్లు) అవార్డు గ్రహీతకు అందజేస్తారు?
1) 50,000 2) 40,000
3) 35,000 4) 45,000
29. గ్రీన్ హౌస్ ఉద్గారాల నియంత్రణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
1) క్యోటో ప్రొటోకాల్
2) రామ్సర్ కన్వెన్షన్
3) నగోయ్ ప్రొటోకాల్
4) కార్టజీనా ప్రొటోకాల్
30. జలాశయాల్లో పోషకాల పరిమాణం పెరిగినప్పుడు జలాశయమంతా శైవల మొక్కలు పెరిగి, నీటికి ప్రత్యేక రంగును ఏర్పరచి నీటి నాణ్యతను క్షీణింపచేయడాన్ని ఏమంటారు?
1) ఓలిగో ట్రాఫికేషన్ 2) యూట్రిఫికేషన్
3) పల్వరైజేషన్ 4) మాంగ్రూవ్స్
31. స్టోన్ లెప్రసీ అంటే?
1) నేలల్లో ఆమ్లత్వం పెరిగి నేలలో బీటలు ఏర్పడటం
2) చారిత్రాత్మక కట్టడాలపై పగుళ్లు, గుంతలు, ఏర్పడి అందవిహీనంగా ఏర్పడటం
3) వృక్షాల్లో పత్రహరితం నశించే స్థితి
4) జలాశయాల్లో శైవ మొక్కలు పెరగడం
32. భారతదేశంలో ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరంగా ఉష్ణ ప్రాంతంగా పిలుస్తారు?
1) పశ్చిమ హిమాలయాలు
2) పశ్చిమ కనుమలు
3) తూర్పు కనుమలు
4) తూర్పు హిమాలయాలు
33. భోపాల్ గ్యాస్ సంఘటనకు కారణమైన వాయువు?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) ఆక్సిజన్
3) హీలియం 4) మిథైల్ ఐసోసైనైట్
34. తడి నేలలను అంతర్జాతీయంగా ఏమని పిలుస్తారు?
1) డెన్మార్క్ సైట్స్ 2) రామ్సార్ సైట్స్
3) రంగూన్ సైట్స్ 4) సుందర్బన్ సైట్స్
35. గోల్డ్‌మన్ ఎన్విరాన్మెంటల్ అవార్డుకి సంబంధించి కింది వాటిని సరిచూడండి
గ్రహీత సంవత్సరం
ఎ. మేధాపాట్కర్ 1. 1992
బి. ఎం.సి మెహతా 2. 1996
సి. రషీదా బీ 3. 2004
డి. చంపాదేవి శుక్లా 4. 2004
ఇ. రమేష్ అగర్వాల్ 5. 2014
1) ఎ-3, బి-5, సి-4, డి-2, ఇ-1
2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5
3) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
4) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
36. ఓజోన్ పొర విచ్ఛిన్నతకు కారణమైన ‘క్లోరో ఫ్లోరో కార్బన్స్’ కింది వాటిలో ఎందులో ఉపయోగిస్తున్నారు?
1) రిఫ్రిజిరేటర్స్ 2) ప్లాస్టిక్ ఫోమ్స్
3) పర్ఫ్యూమ్స్ 4) పైవన్నీ
37. అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
1) మార్చి 21 2) మార్చి 22
3) మార్చి 23 4) మార్చి 24
38. వాతావరణపు గాలిలో ఓజోన్ పొర మందాన్ని దేంతో కొలుస్తారు?
1) డాబ్సన్ యూనిట్స్
2) డెసిబెల్స్ యూనిట్స్
3) ఓమ్స్ 4) పీపీఎం
39. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలు తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతున్నాయి?
1) 38 2) 50 3) 36 4) 40
40. గ్రీన్హౌస్ ఉద్గారాల నియంత్రణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
1) క్యోటో ప్రొటోకాల్
2) రామ్సార్ కన్వెన్షన్
3) నగోయ్ ప్రొటోకాల్
4) కార్టజీనా ప్రొటోకాల్
41. ఇండియాలో ఫారెస్ట్ గార్డ్ కి శాటిలైట్ ఫోన్స్ అందించిన తొలి పార్కుగా ఏది గుర్తింపు పొందింది?
1) సుందర్బన్స్ నేషనల్ పార్క్
2) కజిరంగా నేషనల్ పార్క్
3) ఓరాంగ్ నేషనల్ పార్క్
4) మినాస్ నేషనల్ పార్క్
42. భారతీయ ఆవరణశాస్త్ర పితామడు ?
1) ఇ.పి. ఓడమ్ 2) రియిటర్
3) ఆర్.మిశ్రా 4) హెకెల్
43. ఆధునిక ఆవరణశాస్త్ర పితామడు ?
1) ఇ.పి. ఓడమ్ 2) ఆర్.మిశ్రా
3) హెకెల్ 4) రియిటర్
44. ప్రస్తుతం మన దేశంలో 22 అణు రియాక్టర్ల నుంచి ఎంత అణు శక్తి సామర్థ్యం (మెగావాట్లు) ఉత్పత్తి అవుతుంది?
1) 6,780 2) 6,880
3) 6,898 4) 6,786
45. ఎకో సిస్టం అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన బ్రిటన్ జీవావరణ శాస్త్రవేత్త?
1) ఇ.పి. ఓడమ్ 2) ఆర్. మిశ్రా
3) ఎ.జి. టాన్స్లే 4) హెకెల్
46. సముద్ర లవణీయత శాతం?
1) 6.5 2) 7.5 3) 4.5 4) 3.5
47. నదీ జలాల లవణీయత శాతం ?
1) 0.5 2) 0.6 3) 3.0 4) 4
48. జల జీవావరణ మండలాలను వేటి ఆధారంగా విభజిస్తారు?
1) నీటి కాఠిన్యత 2) నీటి లవణీయత
3) నీటి ప్రవాహం 4) నీటిలోని జీవులు
49. జీవావరణ వ్యవస్థలో ఒక పోషణ స్థాయి నుంచి మరొక పోషణ స్థాయికి ఒక నిర్దిష్ట అనుక్రమంలో ఆహార రూపంలో శక్తి ప్రసరించే విధానాన్ని ఏమంటారు?
1) ఆహార గొలుసు 2) ఆహార వల
3) ఎకోటోన్ 4) జీవావరణ అనుక్రమం
50. ఏ టైగర్ రిజర్వుకు ‘కాళి టైగర్ రిజర్వు’గా పేరు మార్చారు?
1) సైలెంట్ వ్యాలీ
2) అన్షి నేషనల్ పార్క్
3) బన్నెర్ ఘాట్ నేషనల్ పార్క్
4) పెంచ్ నేషనల్ పార్క్
51. మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన జీవావరణ పిరమిడ్లను ఏమని పిలుస్తున్నారు?
1) ఇల్లనియన్ పిరమిడ్లు
2) ఎకోటిన్ పిరమిడ్లు
3) ప్రైమరీ పిరమిడ్లు
4) జీవశాస్త్ర పిరమిడ్లు
52. జీవావరణ వ్యవస్థ నిర్మాణాన్ని, విధులను, గణితం, సంఖ్యా శాస్త్రం, దత్తాంశాలతో లేదా కంప్యూటర్లో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?
1) సమాజ శాస్త్రం
2) సిస్టమ్ ఇకాలజీ
3) ప్రవర్తన శాస్త్రం
4) వనరుల జీవావరణ శాస్త్రం
53. రామ్సార్ వెట్ ల్యాండ్స్ రిపోర్టు -2022 ప్రకారం దేశంలో చిత్తడి నేలల సంఖ్య?
1) 48 2) 47 3) 49 4) 50
54. జీవులకు, వాటి పరిసరాలకు మధ్య నీరు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చక్రీయంగా బదిలీ కావడాన్ని ఏమంటారు?
1) జల వలయం 2) కార్బన్ వలయం
3) నత్రజని వలయం 4) ఆక్సిజన్ వలయం
55. పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) 1981 2) 1986
3) 1988 4) 1990
56. జీవవైవిధ్య నిర్వహణ, సంరక్షణే ధ్యేయంగా ఏ నగరాల్లో ధరిత్రీ సదస్సులు జరిగాయి?
1) రియోడిజనీరో 2) స్టాక్ హోమ్
3) క్యోటో 4) పైవన్నీ
57. బ్రెజిల్ రాజధాని రియోడిజనీలో ధరిత్రీ సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1990 2) 1991
3) 1992 4) 1993
58. ఓజోన్ పొర పరిరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
1) క్యోటో ప్రొటోకాల్
2) మాంట్రియల్ ప్రొటోకాల్
3) స్టాక్ హోమ్ కన్వెన్షన్
4) నగోయ్ ప్రొటోకాల్
59. ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అనే విజ్ఞాన పత్రిక ఎక్కడ ప్రచురిస్తారు?
1) బెంగళూరు 2) హైదరాబాద్
3) లక్నో 4) జైపూర్
60. ‘పొల్యుటోనియం’ అనే పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు?
1) ఫ్రెంచ్ 2) గ్రీకు
3) ఇటలీ 4) లాటిన్
61. పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం మొదటిసారిగా స్టాక్ హోమ్‌లో ఐక్యరాజ సమితి ఏ సంవత్సరంలో సదుస్సును నిర్వహించింది?
1) 1975 2) 1972
3) 1971 4) 1970
జవాబులు
1.1 2.1 3.1 4.2 5.1 6.1 7.2 8.1 9.3 10.2 11.4 12.2 13.2 14.1 15.1 16.3 17.1 18.1 19.2 20.3 21.4 22.1 23.1 24.2
25.2 26.2 27.2 28.3 29.1 30.2 31.2 32.2 33.4 34.2 35.3 36.4 37.2 38.1 39.3 40.1 41.2 42.3 43.1 44.1
45.3 46.4 47.1 48.2 49.1 50.2 51.1 52.2 53.3 54.1 55.2 56.4 57.3 58.2 59.1 60.4 61.2
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
-
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
-
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
-
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
-
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
-
Economy | డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం.. పాత కొత్తల మేలు కలయిక
-
Biology | విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి?
Latest Updates
DSC Special – Social Studies | బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా జరుగుతుంది?
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
Physics – IIT/NEET Foundation | Vector Subtraction is Useful to?
RBI Recruitment | ఆర్బీఐలో 450 అసిస్టెంట్ పోస్టులు