బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
– 1 నుంచి 15 వరకు దరఖాస్తుల ఆహ్వానం
– ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన 30న
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను డైరెక్టర్ సతీశ్‌కుమార్ గురువారం విడుదల చేశారు. టీఎస్ ఆన్లైన్, మీ సేవ కేంద్రాల admissions@rgukt.ac.in వెబ్ ద్వారా శుక్రవారం నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పీహెచ్, స్పోర్ట్, ఎన్సీసీ, క్యాప్ విద్యార్థులు జూలై 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 30న విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లకే నోటిఫికేషన్ ఇచ్చామని, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఓపెన్ క్యాటగిరికి చెందిన 15 శాతం సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మరో 75 సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.1.36 లక్షలు చెల్లించి దరఖాస్తు ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. ఒకవేళ సీట్లు మిగిలితే తెలంగాణ, ఏపీ నుంచి పేమెంట్ సీట్లకు అవకాశం కల్పిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు