ఓయూకు బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అవార్డు
విద్యారంగంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఉస్మానియా యూనివర్సిటీకి తాజాగా మరో గుర్తింపు పొందింది. 2022 సంవత్సరానికి దేశంలో ‘బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్’ అవార్డును సాధించింది. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసిన ‘ది ఎకానమిక్ టైమ్స్’ ఈ అవార్డును ప్రకటించింది. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) చైర్మన్ కేకే అగర్వాల్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ డాక్టర్ అనిల్ సహస్రబుద్ధి సమక్షంలో అసోం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు చేతుల మీదుగా ఈ అవార్డును ఢిల్లీలో ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జీ మల్లేశం అందుకున్నారు. ఓయూకు అవార్డు రావడం పట్ల వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు.
Previous article
బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
Next article
స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు