‘కర్ణాటక సంగీత త్రయం’గా పేరుగాంచింది?
భారతదేశ సంస్కృతి – కళలు
1. సిద్ధేంద్ర యోగి, తీర్థ నారాయణ అనేవారు రూపొందించిన ‘కూచిపూడి’ నాట్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధిచెందింది?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్ 4) ఒడిశా
2. వెంపటి చిన సత్యం, వేదాంతం సత్యనారాయణ, యామినీ కృష్ణమూర్తి, రాజా-రాధారెడ్డి, శోభా నాయుడు, చింతాకృష్ణమూర్తి, నటరాజు రామకృష్ణ, జోష్యుల సీతారామయ్య, వంటి వారు ఏ నాట్యంలో ప్రసిద్ధులు?
1) భరత నాట్యం 2) కూచిపూడి
3) ఒడిస్సీ 4) కథక్
3. కూచిపూడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ గ్రామంలో అవతరించింది?
1) కుచేలపురం 2) కొండపల్లి
3) చేజర్ల 4) నిర్మల్
4. 400 శతాబ్దంలో భరత మహర్షి అనే నాట్యాచార్యుడు రూపొందిన నాట్యశాసా్త్రల నుంచి రూపొందించిన నాట్యం?
1) మణిపురి 2) కర్ణాటక నాట్యం
3) ఒడిస్సీ 4) భరతనాట్యం
5. భరతనాట్యానికి ప్రస్తుత రూపాన్ని ఎవరు సంతరించి పెట్టారు?
1) సిద్ధేంద్ర యోగి
2) పొన్నయ్య సోదరులు
3) యామినీ కృష్ణమూర్తి
4) అడయార్ సోదరులు
6. మృణాళిని సారాభాయ్, యామినీ కృష్ణమూర్తి, టి. బాల సరస్వతి, సోనాల్ మాన్సింగ్, రుక్మిణీదేవి అరండేల్, పద్మాసుబ్రహ్మణ్యం వంటి వారు ఏ నాట్యంలో ప్రసిద్ధులు?
1) కూచిపూడి 2) భరతనాట్యం
3) మణిపురి 4) మోహినీ అట్టమ్
7. ‘భరతనాట్య రాణి’గా ప్రసిద్ధిచెందిన వారు ?
1) టీ బాల సరస్వతి
2) సోనాల్ మాన్సింగ్
3) మృణాళిని సారాభాయ్
4) యామినీ కృష్ణమూర్తి
8. ‘భరతనాట్యం’ ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువగా ప్రదర్శిస్తారు?
1) ఆంధ్రప్రదేశ్ 2) కర్ణాటక
3) తమిళనాడు 4) కేరళ
9. ఒడిశా రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన నాట్యమైన ‘ఒడిస్సీ’ ఏ రాజు కాలంలో అభివృద్ధి చెందింది?
1) అశోకుడు 2) ఖారవేలుడు
3) గజపతులు 4) చంద్రగుప్త మౌర్య
10. ‘ఒడిస్సీ’ నాట్యాన్ని కృష్ణుడిని ప్రస్తుతిస్తూ జగన్నాథ ఆలయంలో ఎక్కువగా ఎవరు ప్రదర్శించేవారు?
1) మహరీలు 2) యాదవ్‌లు
3) పాండాలు 4) నాయక్‌లు
11. సంయుక్త పాణిగ్రాహి, కేలూచరణ్ మహాపాత్ర, సోనాల్ మాన్సింగ్, ప్రియంవద మొహంతి, దేవ ప్రసాద్ దాస్ మొదలైనవారు ఏ నాట్యంలో ప్రసిద్ధులు?
1) మణిపురి 2) కథాకళి
3) మోహినీ అట్టమ్ 4) ఒడిస్సీ
12. ఒడిస్సీ, భరతనాట్యం రెండిటిలోనూ ప్రతిభ కనబర్చిన ప్రముఖులు?
1) సోనాల్ మాన్సింగ్
2) సంయుక్త పాణిగ్రాహి
3) కేలూచరణ్ మహాపాత్ర
4) పై అందరూ
13. వళ్లత్తోల్ కవి కింది ఏ సాంప్రదాయ నాట్యానికి ప్రస్తుత రూపును సంతరించి పెట్టారు?
1) మోహినీ అట్టమ్ 2) చకియార్ కోతు
3) కథాకళి 4) ఒట్టమ్ థుల్లాల్
14. ‘పేదవారి కథాకళి’గా ప్రఖ్యాతిగాంచిన నృత్యం?
1) ఒట్టమ్ థుల్లాల్ 2) చకియార్ కోతు
3) మోహినీ అట్టమ్ 4) కథక్
15. కథాకళి, చకియార్ కోతు, మోహినీ అట్టమ్, ఒట్టమ్ థుల్లార్ నాట్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి?
1) కర్ణాటక 2) మహారాష్ట్ర
3) కేరళ 4) ఉత్తర భారతదేశం
16. కుంజుకురుప్, సి.ఫణిక్కర్, శాంతారావ్ రాఘవన్, గురుకృష్ణ కుట్టి కనక్రేలె వంటివారు ఏ నాట్యంలో ప్రసిద్ధులు?
1) మోహినీ అట్టమ్ 2) కథాకళి
3) కథక్ 4) చకియార్ కోతు
17. వైజయంతిమాల, శివాజీ, భారతి వంటి వారు ఏ నాట్యకళలో ప్రఖ్యాతి చెందారు?
1) కథాకళి 2) చకియార్ కోతు
3) ఒట్టమ్ థుల్లాల్ 4) మోహినీ అట్టమ్
18. ఒకే ఒక వ్యక్తి అభినయించే నాట్యం?
1) మోహినీ అట్టమ్ 2) కథాకళి
3) చకియార్ కోతు 4) కథక్
19. ‘కుంజన్ నంబియార్’ రూపొందించిన నాట్యరూపమేది?
1) కథాకళి 2) ఒట్టమ్ థుల్లాల్
3) కథక్ 4) చకియార్ కోతు
20. ‘మణిపురి’ సాంప్రదాయ నాట్యం ఏ రాష్ట్రం లో అత్యధికంగా ప్రసిద్ధి చెందింది?
1) అసోం 2) మేఘాలయ
3) మణిపూర్ 4) నాగాలాండ్
21. ‘మణిపురి’ నృత్యకారుల్లో ప్రసిద్ధిగాంచిన వారు?
1) ఝూవేరి సిస్టర్స్
2) నిర్మలా, సవితా మోహతాలు
3) రీతాదేవి 4) పై అందరూ
22. ఉత్తర భారత్‌లో ప్రసిద్ధిచెందిన నాట్యం?
1) కథాకళి 2) కథక్
3) యక్షగానం 4) మణిపురి
23. కథక్ నృత్యాన్ని ఆదరించిన ముస్లిం పాలకులు ?
1) నవాబ్ వజీర్ అలీషా (లక్నో)
2) నవాబ్ సాదత్‌ఖాన్ (ఔద్)
3) నవాబ్ అలీవర్ధీఖాన్ (బెంగాల్)
4) పై అందరూ
24. బిర్జూ మహరాజ్, శంభూ మహరాజ్, దమయంతీ జోషి, భారతీగుప్తా, సితారదేవి, దుర్గాదాస్, రామ్ నారాయణ్ మిశ్రా, ఉమాశర్మ, విష్ణుశిరోద్కర్ వంటి వారు ఏ నాట్య ప్రదర్శనలో ప్రసిద్ధులు?
1) మణిపురి 2) కూచిపూడి
3) కథక్ 4) యక్షగానం
25. కింది వాటిని జతపరచండి
నాట్యం సంబంధించిన రాష్ట్రం
ఎ. యక్షగానం 1. కర్ణాటక
బి. కథక్ 2. ఉత్తర భారతం
సి. భరతనాట్యం 3. తమిళనాడు
డి. కూచిపూడి 4. ఆంధ్రప్రదేశ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-1, బి-2, సి-4, డి-3
26. కింది నాట్యాలు – సంబంధించిన రాష్ట్రాలతో సరిగా జతపర్చినది గుర్తించండి?
1) కథాకళి-కేరళ 2) ఒడిస్సీ-ఒడిశా
3) మణిపురి-మణిపూర్
4) పైవన్నీ సరైనవే
27. వీధి నాటకం బురకథ, తోలుబొమ్మలాట, పేరిణి, కోలాటం మొదలైనవి ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన జానపద నృత్యాలు?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్ 4) మహారాష్ట్ర
28. తమాషా, బోహడా, మౌని, లెజిమ్, గఫా, లోవణి మొదలైన జానపద/గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి?
1) కర్ణాటక 2) గుజరాత్
3) బీహార్ 4) మహారాష్ట్ర
29. భాంగ్రా, గిద్దా గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినవి?
1) హర్యానా 2) పంజాబ్
3) గుజరాత్ 4) రాజస్థాన్
30. గార్బా, దాండియా, ధమాల్, ఘరయ్యారాస్, జెరియున్, గోప్ మొదలైన జానపద నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి?
1) గుజరాత్ 2) జమ్మూకశ్మీర్
3) ఒడిశా 4) రాజస్థాన్
31. కోలాటం, కరాగం, కావడి, కుమ్మి మొదలైన జానపద గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి?
1) ఆంధ్రప్రదేశ్ 2) తమిళనాడు
3) ఒడిశా 4) కర్ణాటక
32. దమాలి, దండినాచ్, హికిత్, కుడ్, రౌఫ్, చక్రి మొదలైన గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందాయి?
1) గుజరాత్ 2) పంజాబ్
3) రాజస్థాన్ 4) జమ్మూకశ్మీర్
33. చప్పెలి, జోరాకిజ్రి, కరన్, నౌతంకి, రాస్లీల మొదలైన జానపద నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి?
1) ఉత్తరప్రదేశ్ 2) ఒడిశా
3) బీహార్ 4) హర్యానా
34. బైశాఖిబి, ఖేల్గోపాల్, నాంగ్క్రెమ్, రాస్లీల, కనోయ్, తబల్చోంగ్లి మొదలైన గిరిజన/జానపద నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి?
1) మేఘాలయ 2) అసోం
3) గుజరాత్ 4) కేరళ
35. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి, బాల మురళీకృష్ణ, ఛంబైనాథ్ భాగవతార్, అరియకుడి రామానుజ అయ్యంగార్, వసంత కుమారి మొదలైనవారు ఏ కళలో ప్రసిద్ధులు?
1) హిందుస్థానీ సంగీతం
2) మృదంగం
3) కర్ణాటక సంగీతం 4) గిటార్
36. పండిట్ హరిప్రసాద్ రాసియా, పన్నాలాల్ ఘోష్, మహాలింగం మణి మొదలైనవారు ఏ వాయిద్యంలో ప్రఖ్యాతిగాంచారు?
1) వయొలిన్ 2) తబలా
3) షెహనాయ్ 4) ఫ్లూట్
37. విశ్వమోహన్ భట్, బరున్పాల్లు ఏ వాయిద్యంలో ప్రసిద్ధులు ?
1) గిటార్ 2) సారంగి
3) సంతూర్ 4) మృదంగం
38. ‘పండిట్ శివకుమార్ శర్మ’ ఏ కళలో ప్రసిద్ధులు?
1) సారంగి 2) సంతూర్
3) సరోద్ 4) వయొలిన్
39. అంజద్ అలీఖాన్, శారదారాణి, అలీ అక్బర్ ఖాన్, బుద్ధదేవ్ దాస్ గుప్తాలు ఏ రంగంలో ప్రసిద్ధులు?
1) సరోద్ 2) సితార్
3) ఫ్లూట్ 4) సారంగి
40. ‘షెహనాయ్’ కళలో ప్రసిద్ధులు?
1) బిస్మిల్లాఖాన్
2) ఉమాశంకర్ మిశ్రా
3) బడే గులాం అలీ
4) పై అందరూ
41. పండిట్ రవిశంకర్, బుద్ధాదిత్యా ముఖర్జీ, హరిశంకర్ భట్టాచార్య, విలాయత్ ఖాన్, ఉమాశంకర్ మిశ్రా, షహీద్ పర్వీన్‌లు ఏ కళలో ప్రసిద్ధులు?
1) సితార్ 2) గిటార్
3) సారంగి 4) సరోద్
42. ‘తబలా’ వాయిద్యంలో ప్రసిద్ధిచెందిన వ్యక్తులు?
1) అల్లారఖా ఖాన్, జాకీర్ స్సేన్
2) నిఖిల్ ఘోష్
3) పండిత్ శాంతి ప్రసాద్
4) పై అందరూ
43. ద్వారం వెంకటస్వామి నాయుడు, జుబిన్ మెహతా, కున్నక్కుడి వైద్యనాథన్, ఎన్. రాజన్, సుబ్రహ్మణ్యం మొదలైన వారు ఏ కళలో ప్రసిద్ధులు?
1) వీణ 2) వయొలిన్
3) మృదంగం 4) గిటార్
44. దొరైస్వామి అయ్యంగార్, శంకర్ శాస్త్రి, కుమార స్వామి భాగవతార్, సాధిక్ అలీఖాన్, చిట్టిబాబులు ఏ రంగంలో ప్రసిద్ధులు?
1) మృదంగం 2) ఫ్లూట్
3) నాదస్వరం 4) వీణ
45. రాగం-మనోభావం-సమయంలో సరిగా జతపరిచినది ఏది?
1) భైరవి-శాంతి-వేకువజామున
2) హిందోళ-మధురం-ఉదయం
3) శ్రీరాగం-సంతోషం-సాయంకాలం
4) పైవన్నీ సరైనవే
46. ప్రేమ విరహాన్ని, ఒంటితనాన్ని, జీవితం పట్ల వైరాగ్యాన్ని స్పష్టం చేసే రాగం?
1) మాల్కేస్ 2) దీపక్
3) తోడి 4) మేఘ
47. వసంతకాలం తొలిసంజలో మాత్రమే ఆలపించే రాగం?
1) దీపక్ రాగం 2) హిందోళ రాగం
3) భైరవి రాగం 4) శ్రీరాగం
48. భారతీయ సంగీతంలో ఎన్ని స్వరాలున్నాయి?
1) ఐదు 2) ఆరు
3) ఎనిమిది 4) ఏడు
49. లలితకళా అకాడమీని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1954 2) 1956
3) 1958 4) 1961
50. సంగీత నాటక అకాడమీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
1) అహ్మదాబాద్ 2) ముంబై
3) న్యూఢిల్లీ 4) చెన్నై
51. నేషనల్ బుక్ ట్రస్ట్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1961 2) 1955
3) 1953 4) 1957
52. మధుబని చిత్రకళ ఏ ప్రాంతానికి చెందినది?
1) మధ్యప్రదేశ్ 2) కర్ణాటక
3) బీహార్ 4) పశ్చిమ బెంగాల్
53. తాన్సేన్ సృష్టించిన రాగం?
1) రాగదన్నరి కన్నడి
2) మియాన్‌కి తోడి
3) మల్హర 4) సారంగ
54. డా. ఎల్. సుబ్రహ్మణ్యం ఏ సంగీత వాయిద్య కళలో పేరు పొందారు?
1) నాదస్వరం 2) వేణువు
3) వయొలిన్ 4) వీణ
55. ‘కర్ణాటక సంగీత త్రయంగా’ పేరు గాంచింది?
1) త్యాగరాజు
2) శ్యామశాస్త్రి
3) ముత్తుశాస్త్రి దీక్షితార్
4) పై అందరూ
56. కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1953 2) 1954
3) 1957 4) 1961
57. ఈమని శంకర శాస్త్రి, చిట్టిబాబులు ఏ వాయిద్యంలో ప్రసిద్ధులు?
1) సితార 2) పరోద్
3) మృదంగం 4) వీణ
58. కూచిపూడి సృష్టికర్త అయిన సిద్ధేంద్రయోగి ఏ జిల్లాకు చెందినవారు?
1) తూర్పు గోదావరి 2) పశ్చిమ గోదావరి
3) కృష్ణా 4) గుంటూరు
59. చతుశ్శష్టి కళలను పేర్కొన్న గ్రంథం?
1) మహాభారతం 2) అర్థశాస్త్రం
3) మనుధర్మ శాస్త్రం 4) కామసూత్రం
60. కింది వాటిలో అజంతా చిత్రాలు?
1) కుడ్య చిత్రాలు 2) వర్ణ చిత్రాలు
3) సూక్ష్మీకృత చిత్రాలు
4) త్రిమితీయ చిత్రాలు
61. చరిత్ర పూర్వయుగానికి చెందిన చిత్రాలు
1) ఆర్కిటైవ్స్ 2) పెట్రోగ్లిఫ్స్
3) కేవ్ పెయింట్స్ 4) మినియేచర్స్
62. ప్రాచీన రంగస్థలం చిత్రితమైన చోటు?
1) హాతిగుంఫా గుహలు
2) జోగిమెరా గుహలు
3) అజంతా గుహలు
4) ఎల్లోరా గుహలు
జవాబులు
1.3 2.2 3.1 4.4 5.2 6.2 7.1 8.3 9.2 10.1 11.4 12.1 13.3 14.1 15.3 16.2 17.4 18.1 19.2 20.3
21.4 22.2 23.1 24.3 25.1 26.4 27.3 28.4 29.2 30.1 31.2 32.4 33.1 34.2 35.3 36.4
37.1 38.2 39.1 40.4 41.1 42.4 43.2 44.4 45.4 46.3 47.2 48.4 49.1 50.3 51.4 52.3
53.2 54.3 55.4 56.3 57.4 58.3 59.4 60.1 61.2 62.2
- Tags
- arts
- Dance
- Indian Culture
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు