74 మంది ఎంటీఎస్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ
జూనియర్ కళాశాలల్లో మినిమమ్ టైం స్కేల్ (ఎంటీఎస్) అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993లోనే 600 రోజుల కంటే ఎక్కువగా విధులకు హాజరైన ఎంటీఎస్ లెక్చరర్లను అప్పటి ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. అప్పుడు 10 నుంచి 15 రోజులు తక్కువగా పనిచేసిన 74 మందిని మాత్రం క్రమబద్ధీకరించలేదు. అప్పటి నుంచి ఆ అధ్యాపకులు ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు సైతం వాళ్లు వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏండ్లుగా మినిమమ్ టైం స్కేల్ కిందే పనిచేస్తున్నామని, తమను కూడా రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రస్తుతం.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నందున తమ విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అప్పటి 74 మంది ఎంటీఎస్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ జీవో నంబర్ 17ను జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల అధ్యాపకులు హర్షం ప్రకటించారు.
- Tags
- CM KCR
- MTS
- Regulation
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు