భారతీయ గ్రామాలు లిటిల్ రిపబ్లిక్లు
భారతీయ సమాజం వైవిధ్య భరితమైన జాతులు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాల సమ్మిళితం. భారతీయ సమాజ ప్రధాన లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మెకైవర్ ప్రకారం సమాజం అంటే సామాజిక సంబంధాల సాలెగూడు. సమాజ సభ్యుల మధ్య జరిగే పరస్పర సామాజిక చర్యల వ్యవస్థీకృత రూపమే సమాజం.
– సమాజానికి పునాది కుటుంబం. కుటుంబానికి ఆధారం వివాహం. అంటే వైవాహిక రక్త సంబంధాల సమ్మేళనమే సమాజం. సమాజం శాశ్వతం, సభ్యులు అశాశ్వతం సమాజం ఎప్పుడు అంతరించదు. నిరంతరం మార్పు చెందుతూ ముందుకు సాగుతూనే ఉంటుంది.
– సొసైటీ అనే పదం సొసైటస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది.
-సమాజ శాస్త్రం అనే భావనను మొదటిసారిగా వెలుగులోనికి తీసుకుచ్చింది సమాజ శాస్త్ర పితామడైన ఆగస్టు కామ్టే.
-సమాజంలో సభ్యులు వివిధ అంతస్తులను కలిగి ఉంటారు. వివిధ నిర్ణీత ప్రమాణాలను అనుసరిస్తూ వివిధ రకాలైన పాత్రలను నిర్వహిస్తూ ఆ క్రమంలో మిగిలిన వ్యక్తులతో సామాజిక సంబంధాలను ఏర్పరుచుకుంటారు. ఈ విధమైన సామాజిక సంబంధాల సమ్మేళనమే సామాజిక నిర్మితి.
-సమాజ శాస్త్రం ముందు యూరప్‌లో ఆవిర్భవించింది. అక్కడ సంభవించిన పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచి విప్లవం కారణంగా మతం క్షీణించటం, శాస్త్ర విజ్ఞానం పెరగడం మొదలైన కారణాలు సమాజశాస్త్ర ఆవిర్భావానికి తోడ్పడ్డాయి. సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం.
– ఫ్రెంచి విప్లవం యూరప్‌లోని భూస్వామ్య సమాజాన్ని అంతం చేయడమే కాకుండా సేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ప్రపంచానికి అందించింది.
సమాజం విధులు
-సభ్యులను పునః స్థాపించి సమాజం శాశ్వతంగా కొనసాగేటట్లు చూడటం
-సమాజంలోని సభ్యుల జైవిక అవసరాలను తీర్చటం (వివాహం).
-సంస్కృతిని, వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందజేయడం.
– సభ్యులకు నైపుణ్యాలు, శిక్షణను అందించటం.
– ఉత్పత్తి, పంపిణీ
-సాంఘికీకరణ
సామాజిక నియంత్రణ
-సమాజంలోని సభ్యుల మధ్య మనం అనే భావన, సామాజిక వ్యవస్థాపన, సమష్టి లక్ష్యాలు ఉంటాయి. వీటి సాధన కోసం సమాజంలో సభ్యులు సమష్టిగా కృషి చేస్తారు.
– మానవ జీవనంలోని ఆచార సంప్రదా యాలు, అలవాట్లు, వేషభాషలు, సాంస్కృతిక నియమాలు కట్టుబాట్లు, సామాజిక నింబంధనలు, విలువలు వంటివి వారు నివసించే భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
భారతీయ సమాజ విశిష్ట లక్షణాలు
– ప్రపంచవ్యాప్తంగా వివిధ సమాజాలున్నాయి. వాటిలో భారతీయ సమాజం ఒక ప్రత్యేక సమాజంగా కొనసాగుతున్నది.
– సాధారణంగా ఒక దేశానికి ఒకేజాతి, ఒకేమతం, ఒకే భాష వంటివి ఉంటాయి. భారతదేశంలో మాత్రం వీటన్నింటిలో భిన్నత్వం కనపడుతుంది.
-భారతీయ సమాజం ప్రధాన లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సమాజం సాంప్రదాయకం, కుల ఆధారిత సమాజం. వ్యక్తి నిర్వహించే వృత్తిని కులం నిర్ణయిస్తుంది.
– మలివేద కాలంలో ఆవిర్భవించిన వర్ణ వ్యవస్థ క్రమంగా కులవ్యవస్థగా రూపాంతరం చెందింది. హిందువులతోపాటు మిగిలిన మతాల్లో కూడా కులవ్యవస్థ కనపడుతుంది.
– కాలక్రమంగా శ్రమ విభజన వ్యవస్థీకృతం కావడం వల్ల సమాజంలో విభిన్న కులాలు వేర్వేరు కార్యకలాపాల్లో పాల్గొని మొత్తం సమాజం అవసరాలను తీర్చడానికి దోహద పడ్డాయి. అయితే ఈ విభజన అనివార్యంగా సామాజిక అసమానతలకు, వివక్షతలకు దారితీసింది. ఫలితంగా సమాజంలో కొన్ని కులాలు, వర్గాలు సామాజిక అసమానతలకు దోపిడీకి, సామాజిక మినహాయింపునకు గురయ్యాయి.
– శతాబ్దాలుగా భారతీయ సమాజం విదేశీ, స్వదేశీ మతాల ప్రభావానికి గురయ్యింది. ఫలితంగా పరిణామక్రమంలో భారతీయ సమాజం స్థిరత్వం, వైవిధ్యం కలిగిన మిశ్రమ సంస్కృతిగా రూపాంతరం చెందింది.
– క్రీస్తు పూర్వం మూడువేల సంవత్సరాలు, క్రీస్తు శకం రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ సమాజం వైవిధ్య భరితమైంది. బముఖమైంది. ఇది బాళ్య సమాజం
-భారత దేశాన్ని వివిధ దేశాలకు సంబంధించిన విదేశీ యాత్రికులు సందర్శించారు. వారు తమ రచనల్లో భారతీయ సమాజం గురించి వివరించారు.
-భారతీయ సమాజం 7 వర్గాలుగా విభజన అయినట్లు మెగస్తనీస్ పేర్కొన్నాడు.
1) తత్వవేత్తలు- పవిత్ర సంస్కారాలను, యజ్ఞయాగాలను నిర్వహించేవారు.
2) గృహ యజమానులు
5) పశు పాలకులు, వేటగాళ్ళు
4) వ్యాపారస్థులు, శారీరక శ్రమ చేసేవారు
5) యుద్ధం చేసేవారు
6) తనిఖీదారులు
7) మంత్రులు, రాజు సలహాదారులు
-మెగస్తనీస్ ప్రకారం పై ఏడు వర్గాలు అంతర్వివాహ సముహాలు, వృత్తులను మార్చుకునే అవకాశం లేని సమూహాలు.
– అరబ్ యాత్రికులు కూడా భారతీయ సమాజంలో 7 వర్గాలున్నట్లు పేర్కొన్నాడు.
-తొలి పోర్చుగీసు యాత్రికుడైన డ్యూర్టె బార్బోసా భారతీయ సమాజపు సాంస్కృతిక లక్షణాలను వివరించాడు.
-భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లోని సామాజిక, సాంస్కృతిక జీవనం సామాజిక వ్యవస్థలు భారతీయ సామాజిక జీవనాన్ని ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి.
– భౌగోళిక పరిస్థితులు భారతదేశాన్ని విలక్షణ సహజ మండలాలుగా విభజించాయి.
– గ్రామీణ భారతీయ సమాజం వ్యవసాయాధారిత సమాజం ఆ సమాజంలో కుల వృత్తులు, చేతివృత్తులు గ్రామీణ కుటీర పరిశ్రమలపై ఆధారపడిన జనాభా ఎక్కువ. ప్రాచీన భారతీయ సమాజం హిందూ ధర్మం ఆధారంగా కొనసాగింది, మానవ జీవన ప్రమాణంలో నాలుగు రకాల ఆశ్రమ వ్యవస్థలుంటాయి. నాలుగు రకాల పురుషార్థాలు ఆచరిస్తారు. హిందూ సామాజిక వ్యవస్థలో ధర్మం కీలకమైన పాత్ర పోషిస్తుంది. సామాజిక సంస్థల విధులను, పాత్రలను ధర్మం వివరిస్తుంది. భారతీయ ఆలోచనా స్రవంతిని కలిపి ఉంచుతుంది.
-భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రత్యేక లక్షణాన్ని, శాస్త్రీయదృక్పథాన్ని కలిగి ఉన్నది. ప్రాచీన కాలానికి సంబంధించిన చరక సంహిత, అష్టాంగ హృదయం వంటి వైద్యశాస్త్ర ఆయుర్వేద గ్రంథాలు, శస్త్ర చికిత్సను వివరించే శుశ్రుత సంహిత వంటి గ్రంథాలను ఆధునిక వైద్యులు కూడా అధ్యయనం చేస్తున్నారు.
-ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, కులవ్యవస్థ భారతీయ సమాజం విశిష్ట లక్షణాలు
– భారతీయ సమాజం విభిన్న జాతుల సమాహారం. సర్ హెర్బర్ట్ రిస్లే, బి.ఎస్.గుహ భారతదేశంలో విభిన్న రకాల జాతులు ఉన్నట్లు గుర్తించారు.
సమాజ సహజ లక్షణాలు
-నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దులు
– పరస్పర సామాజిక సంబంధాలున్న స్థిరీకృత జనాభా
-సామాజిక వ్యవస్థాపన
-విశిష్టమైన సంస్కృతి
-పరస్పర అశ్రయత, సహకారం, పోటీ, సంఘర్షణ
– శ్రమవిభజన
-వైవిధ్యం( స్త్రీ- పురుష, వృత్తిపరమైన)
-ఏకరూపత, సదృఢత
ప్రాక్టీస్ బిట్స్
1. పాశ్చాత్యీకరణ అనే భావనను ప్రవేశ పెట్టినవారు?
1) ఎం.ఎన్. శ్రీనివాస్ 2) ఆండ్రెబీటిలె
3) ఘుర్యే 4) గిల్బర్ట్
2. మతసంస్కారాల నిర్వహణ వంశపారంపర్యంగా సంక్రమించి కులాలు రూపొందాయని మత సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు?
1) జె.హెచ్ హట్టన్ 2) గిల్బర్ట్
3) ఎం.ఎం.హోకార్ట్ 4) కాథలీన్ గౌ
3. ఏ రాష్ట్రాల జనాభాల్లో బౌద్ధులు అధిక శాతం ఉన్నారు?
1) మిజోరాం, నాగాలాండ్
2) అస్సాం, సిక్కిం
3) మేఘాలయ, నాగాలాండ్
4) సిక్కిం, మేఘాలయ
4. దళితులు పెద్ద సంఖ్యలో ఇస్లాంను స్వీకరించడం వల్ల పెద్ద ఎత్తున మత ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతం?
1) కారంచెడు- ఆంధ్రప్రదేశ్
2) మీనాక్షిపురం, తమిళనాడు
3) రానిఖెరా – ఢిల్లీ 4) పైవేవీకాదు
5. భారతదేశ గ్రామాలు చార్లెస్ మెట్ కాఫ్ చెప్పినట్లుగా ఎన్నడూ స్వయం సమృద్ధిగా లేవని చెప్తూ రూరల్ కాస్మోపాలిటన్ అనే భావననను ప్రవేశపెట్టినది?
1) అస్కార్ లూయిస్ 2) ఎఫ్.జి. బెయిలీ
3) దుర్క్‌హైమ్ 4) మాక్స్‌ముల్లర్
6. కులవ్యవస్థ ఆవిర్భావం గురించి రిస్లే ప్రతిపాదించిన జాతి సిద్ధాంతాన్ని ఎవరు బలపర్చారు?
1) మెకిమ్ మారియంట్
2) అలన్ ఆర్.బీల్స్
3) డి.ఎన్.మజుందార్, ఎన్.కె.దత్
4) పాలివ్ ఎం. కోహిందా
7. భారతీయ సమాజంలోని మూడు ప్రధాన అంశాలేవి?
1) గ్రామ సముదాయం 2) కులం
3) సమిష్టి కుటుంబం 4) పైవన్నీ
8. భారతదేశ గ్రామాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన లిటిల్ రిపబ్లిక్‌లుగా వర్ణించింది వారు?
1) చార్లెస్ మెట్ కాఫ్
2) ఎఫ్.జి బెయిలీ
3) ఆండ్రెబీటల్
4) మెకిమ్ మారియట్
9. ఈశాన్య భారతంలోని మంగోలాయిడ్ జాతికి చెందిన తెగల భాషలు ఏ భాషా కుటుంబానికి చెందుతాయి?
1) సైనో – టిబెటన్
2) ఇండో- యురోపియన్
3) ఆస్ట్రిక్
4) పైవేవీకాదు
10. భారతీయ ఆదిమ వాసులను ఏ ఒక్క జాతి కింద పరిగణించడానికి వీల్లేని వింత పరిస్థితి నెలకొందని, కాబట్టి వీరిని అంతరించిపోతున్న జాతులుగా వర్ణించవచ్చని పేర్కొన్నది ఎవరు?
1) డబ్ల్యూ. క్రుక్
2) డి.ఎన్. మజుందార్
3) సర్ హెర్బర్ట్ రిస్లే
4) నీగ్రిటో
11. నరవర్గ సమూహం అని వేటిని అంటారు?
1) జాతి, మత 2) కుల, వర్గ
3) మత, భాషా 4) పైవన్నీ
12. భారతీయ జనాభాను జాతులుగా వర్గీకరించడం కష్టం అని పేర్కొన్నది ఎవరు?
1) డబ్ల్యూ. క్రుక్
2) డి.ఎన్. మంజుందార్
3) సర్ హెర్బర్ట్ రిస్లే 4) నీగ్రిటో
13. భారతీయ జనాభాను శాస్త్రీయంగా తొలిసారి జాతులుగా వర్గీకరించిన శాస్త్రవేత్త?
1) డబ్ల్యూ. క్రుక్
2) డి.ఎన్. మంజుందార్
3) సర్ హెర్బర్ట్ రిస్లే 4) నీగ్రిటో
14. భారత జనాభాను రిస్లే ఎన్ని జాతులుగా వర్గీకరించాడు?
1) 7 2) 8 3) 6 4) 5
సమాధానాలు
1-1 2-3 3-1 4-2 5-1 6-3 7-4 8-1 9-1 10.2 11-4 12-2 13-3 14-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు