బయో రెమిడియేషన్ విధానంలో కీలక పాత్ర పోషిస్తున్న శిలీంధ్రం ఏది?
జీవ సాంకేతికత
1. క్లోనింగ్ ద్వారా పరిపక్వ గొర్రెను సృష్టించి విజయం సాధించింది ఎవరు?
1) ఇయాన్ విల్మట్
2) డగ్లస్ జార్డిన్
3) రాబర్ట్ కె చార్లిసన్
4) పైవారెవరూ కాదు
2. ఉత్పరివర్తనాలను ప్రేరేపించే కారకాలను ఏమని అంటారు.
1) మ్యుటేషన్స్
2) మ్యూటాజెన్స్
3) మూటెంట్స్
4) ఎలెల్లి
3. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ దేశంలో ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) బెంగళూర్
3) విశాఖపట్నం 4) కోల్కతా
4. హైడ్రోఫోనిక్స్ అంటే ఏమిటి?
1) నీటి మొక్కల గురించి చదివే శాస్త్రం
2) మొక్కలను పోషక ద్రావణంలో పెంచడం
3) మొక్క నీరు లేకపోవడంతో వడలిపోవడం
4) మొక్కలో జరిగే జీవక్రియల గురించి తెలిపే శాస్త్రం
5. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దేని వల్ల కలుగుతుంది?
1) వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం
2) వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ పెరగడం
3) వాతావరణంలో నైట్రస్ ఆక్సైడ్ పెరగడం
4) వాతావరణంలో కార్బన్ తగ్గడం
6. కర్పూరపు ముక్కను కట్టి నీటిలో విడిచిన కాగితపు పడవ నీటిపై కదలడానికి కారణం.
1) తలతన్యత
2) కర్పూరానికి ఉండే తేలే గుణం
3) కర్పూరం మెల్లగా కరిగిపోయి దాని బరువులో మార్పు ఏర్పడటం
4) ఏదీ కాదు
7. పారాచూట్ సహాయంతో కిందికి దిగే వ్యక్తి నేలను స్వల్ప వేగంతో మాత్రమే తాకడానికి కారణం.
1) వ్యక్తి అలా దిగడానికి శిక్షణ పొందుతాడు
2) పారాచూట్ తయారీలో ప్రత్యేకత
3) గురత్వాకర్షణ పారాచూట్పై లేకపోవడం
4) గాలి స్నిగ్ధతా బలం
8. పూర్తిస్థాయిలో మానవుని క్లోనింగ్ చేయగల పరిజ్ఞానం.
1) థెరాప్యుటిక్ క్లోనింగ్
2) సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్
3) ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్ ఇండక్షన్
4) పునరుత్పత్తి క్లోనింగ్
9. పునరుత్పత్తి క్లోనింగ్ అంటే?
1) పిండాల తయారీకి అవసరమైన మూల కణాలను తయారుచేయవచ్చు
2) జన్యుపరంగా ఒకే పోలికతో ఉన్న బ కణ జీవులను సృష్టించవచ్చు
3) పురుష జీవుల ప్రమేయం లేకుండానే వివిధ జీవ జాతులను అభివృద్ధిపరచవచ్చు
4) ఒక కణం నుంచి అనేక కణాలను వర్ధనం చెందించవచ్చు
10. క్లోనింగ్కు సంబంధించి సరైన వాక్యాలను పరిశీలించండి.
ఎ. క్లోనింగ్ అనే పదం లాటిన్ భాష నుంచి ఆవిర్భవించింది
బి. ఈ పద్ధతి ద్వారా జన్యు సారూప్యత కలిగిన కణాలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చు
సి. క్లోనింగ్ ప్రక్రియలో మాలిక్యులార్ క్లోనింగ్, సెల్ క్లోనింగ్ అనే పద్ధతులు ఉన్నాయి
డి. మూలకణాల క్లోనింగ్లో సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అనుసరిస్తారు
1) బి, సి, డి మాత్రమే
2) సి, డి మాత్రమే
3) బి, సి, డి మాత్రమే
4) ఎ, బి, సి, డి
11. బయోటెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. 2013లో భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాల ఆధారంగా దీన్ని ప్రారంభించారు
బి. దేశవ్యాప్తంగా జెనిటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్కు సంబంధించిన అంశాలను నియంత్రిస్తుంది
సి. 2013లో కార్టజీనా ప్రోటోకాల్లో భారత్ చేరినందుకు దీని ఏర్పాటు ఆవశ్యకమైంది
డి. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి దీని ఏర్పాటు వివాదాస్పదమైంది
1) ఎ, బి, డి మాత్రమే
2) సి, డి మాత్రమే
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి మాత్రమే
12.బయోటెక్నాలజీ కిసాన్ ప్రోగ్రాంకు సంబం ధించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. దీన్ని రైతులే కేంద్రంగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు నిర్వహిస్తున్నాయి
బి. దేశవ్యాప్తంగా రైతుల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, నవకల్పనలను ప్రోత్సహిస్తుంది
సి. వ్యవసాయ రంగంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తుంది
డి. దేశంలో జన్యు మార్పిడి పంటల అనుమతులకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది.
పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
1) ఎ, బి, డి మాత్రమే
2) సి, డి మాత్రమే
3) బి, సి, డి మాత్రమే
4) ఎ, బి, సి మాత్రమే
13. నేషనల్ బయోటెక్నాలజీ డెవలప్మెంట్ స్ట్రాటజీ (2015-2020) ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారతదేశంలో బయో ఎకానమీని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని నిర్ణయించు కున్నారు?
1) 2040 2) 2035
3) 2030 4) 2025
14. డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1985 2) 1986
3) 1987 4) 1988
15. A: బీటీ పత్తి బోల్ వార్మ్ అనే కీటక నిరోధకతను ప్రదర్శిస్తుంది.
R: ఈ వంగడపు విత్తనాల్లోకి CRYIAC అనే కీటక నిరోధకతను ప్రదర్శించే జన్యువును చొప్పించారు
1) A, R సత్యం. Aకు R సరైన వివరణ
2) A, R సత్యం. Aకు R సరైన వివరణ కాదు
3) A సత్యం, R అసత్యం
4) A, R రెండూ అసత్యం
16. టోటిపొటెంట్ మూలకణాలను ఎన్ని రకాల ఇతర కణాలుగా మార్చవచ్చు?
1) 240 2) 429
3) 220 4) 200
17. A: ప్రపంచంలో అంతరించిపోతున్న జీవజాతులను సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ విధానంలో ఉత్పత్తి చేసి వాటి ఉనికిని కాపాడవచ్చు.
R: ఈ విధానంలో అంతరించిపోతున్న జీవజాతుల పిండాల తయారీకి అవసరమైన మూలకణాలను పునరుత్పత్తి చేయవచ్చు.
1) A, R సత్యం. Aకు R సరైన వివరణ
2) A, R సత్యం. Aకు R సరైన వివరణ కాదు
3) A సత్యం, R అసత్యం
4) A, R రెండూ అసత్యం
18. జన్యు రూపాంతర మొక్కలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
ఎ. ప్రపంచంలో మొదటి జన్యు మార్పిడి పంట పొగాకు
బి. అధిక కాలం నిల్వ ఉండే టమాటా వంగడం ఫ్లావర్ సావర్
సి. ఇక్రిశాట్ రూపొందించిన విటమిన్-ఎ తో కూడిన జన్యుమార్పిడి వేరుశనగ వంగడం గోల్డెన్ గ్రౌండ్ నట్
డి. జన్యు రూపాంతర మొక్కలను రూపొందించడంలో జీన్గన్ విధానాన్ని ఉపయోగిస్తారు.
1) ఎ, బి, సి మాత్రమే 2) సి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, బి, డి మాత్రమే
19. చమురు వ్యర్థాల శుద్ధికి ‘ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్’ అభివృద్ధి చేసిన బ్యాక్టీరియా ఏది?
ఎ. ఆయిల్ ఓరస్
బి. ఆయిల్ జాపర్
సి. మైకోప్లాస్మా జెనిటాలియమ్
డి. పెన్సిల్లియమ్
1) ఎ, బి మాత్రమే
2) సి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, బి, డి మాత్రమే
20. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో రిసోర్సెస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (IBSD) ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) మొహాలి 2) ఇంఫాల్
3) తిరువనంతపురం 4) ఫరీదాబాద్
21. బయో రెమిడియేషన్ విధానంలో కీలక పాత్ర పోషిస్తున్న శిలీంధ్రం ఏది?
1) క్లోరెల్లా 2) యూగ్లీనా
3) న్యూరోస్పోరా 4) క్లామిడోమోనాస్
22. ఫరీదాబాద్లో ఏర్పాటైన NCR Biotech Science Cluste కు సంబంధించిన జీవ సాంకేతిక సంస్థ ఏది?
1) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ
2) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రిసెర్చ్
3) నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్
4) సెంటర్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ అప్లెడ్ బయో ప్రాసెసింగ్
23. భారత్లో బయో రెమిడియేషన్ విధానంలో చమురు కాలుష్య శుద్ధికి కృషి చేస్తున్న సంస్థలు?
ఎ. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
బి. ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్
సి. జె.క్రెగ్ వెంటర్ ఇన్స్టిట్యూట్
డి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ
1) ఎ, బి, సి మాత్రమే
2) సి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, బి, డి మాత్రమే
24. సూక్ష్మజీవుల సహాయంతో లోహ సంగ్రహణ లో జరిపే బయో లీచింగ్ ప్రక్రియలో వినియోగించే సూక్ష్మజీవులను గుర్తించండి.
ఎ. ఆస్పర్జిల్లస్ నైగర్
బి. పెన్సిల్లియమ్ సింప్లిసిసిమమ్
సి. థయో బాసిల్లస్ ఫెరో ఆక్సిడాన్స్
డి. మైకోప్లాస్మా జెనిటాలియమ్
1) ఎ, బి, సి మాత్రమే
2) సి, డి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, సి, డి మాత్రమే
25. కింది వాటిలో కణజాల వర్ధనానికి సంబం ధించి సరైనవి గుర్తించండి.
ఎ. కణజాల వర్ధనాన్ని 1902లో టి.హెచ్ మోర్గాన్ కనుగొన్నాడు
బి. కణజాల వర్ధనంలో ఉపయోగించే నియమం సెల్యులార్ టోటిపొటెన్సీ
సి. కణజాల వర్ధనంలో పెరుగుదల యానకంగా అగార్ను వినియోగిస్తారు
1) ఎ, సి 2) సి మాత్రమే
3) బి, సి మాత్రమే 4) ఎ మాత్రమే
26. జీవ సాంకేతిక శాస్త్ర శాఖల ఆధారంగా కింది వాటిని జతపరచండి.
ఎ. రెడ్ బయోటెక్నాలజీ 1. బయోఇన్ఫర్మాటిక్స్
బి. వైట్ బయోటెక్నాలజీ 2. బయో ఫార్మా
సి. ఎల్లో బయోటెక్నాలజీ 3. పారిశ్రామిక జీవ సాంకేతికత
డి. గోల్డ్ బయోటెక్నాలజీ 4. ఆహారం
1) ఎ-2, బి-3, సి-4, డి-1 2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1 4) ఎ-4, బి-3, సి-2, డి-1
27. బెంగళూర్ లైఫ్ సైన్స్ క్లస్టర్లో భాగస్వామ్యం కాని సంస్థ ఏది?
1) ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్
2) సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ ప్లాట్ఫామ్స్
3) నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్
4) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ అప్లెడ్ బయోటెక్నాలజీ
28. 2020లో ది క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ రెండో సమావేశం ఎక్కడ జరిగింది?
1) తిరువనంతపురం
2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ 4) కోల్కతా
29. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) ఇంఫాల్ 2) తిరువనంతపురం
3) కళ్యాణి 4) మొహాలి
30. జన్యు మార్పిడి పంటలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
1) ప్రపంచవ్యాప్తంగా మహికో, భారతదేశంలో మోన్శాంటో కంపెనీలు వీటిని మార్కెటింగ్ చేస్తున్నాయి
2) బాసిల్లస్ తురింజియాన్సిస్ (BT) జన్యువును వివిధ వంగడాల విత్తనాల్లో ప్రవేశపెట్టి కీటక నిరోధకతను కల్పిస్తారు
3) భారత్లో 2002 నుంచి జన్యు మార్పిడి బీటీ పత్తి సాగుకు అనుమతించారు
4) భారత్లో వాణిజ్యపరంగా బీటీ వంకాయ సాగుపై 2010 నుంచి మారటోరియం విధించారు
31. r-DNA టెక్నాలజీలో భాగం కాని దశలు ఏవి?
ఎ. ఫ్రాగ్మెంటేషన్ బి. లైగేషన్
సి. ట్రాన్స్ ఫెక్షన్ డి. మైక్రోప్రాపగేషన్
1) ఎ, బి, సి మాత్రమే
2) డి మాత్రమే
3) బి, సి, డి మాత్రమే
4) ఎ, డి మాత్రమే
32. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ (GIP)కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ప్రేరణతో 238 కోట్ల వ్యయంతో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ దీన్ని ప్రారంభించింది
2) ఈ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (చెన్నై)లోని సెంటర్ ఫర్ బ్రెయిన్ రిసెర్చ్ వ్యవహరిస్తుంది
3) డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ లు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి
4) మొదటి దశలో దేశవ్యాప్తంగా 10,000 మంది నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా ‘రిఫరెన్స్ జీనోమ్ గ్రిడ్’ను అభివృద్ధి పరచనున్నారు.
33. జన్యు ఉత్పరివర్తన (జెనెటిక్ మ్యుటేషన్) వ్యవస్థ ఎక్కడ జరుగుతుంది?
1) డీఎన్ఏ 2) ఆర్ఎన్ఏ
3) క్రోమోజోమ్లు 4) రైబోజోమ్లు
34. మానవ శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం?
1) సల్ఫర్ 2) మెగ్నీషియం
3) కాల్షియం 4. పాస్ఫరస్
జవాబులు
1. 1 2. 2 3. 1 4. 2 5. 1 6. 1 7. 4 8. 4 9. 2 10. 1 11. 1 12. 4 13. 4 14. 2 15. 1 16. 3
17. 1 18. 4 19. 1 20. 2 21. 3 22. 4 23. 4 24. 1 25. 3 26. 1 27. 3 28. 3 29. 2 30. 1 31. 2 32. 2
33.1 34.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు