యుద్ధానికో దేవాలయం
దక్షిణదేశంలో చాళుక్యులు 6 నుంచి 12వ శతాబ్దం వరకు పాలించారు. వీరి పాలనా కాలాన్ని మహోన్నత యుగంగా వర్ణించవచ్చు. విదేశీ దండయాత్ర లను సమర్థవం తంగా ఎదుర్కొన్న పాలకులు. ఉత్తర భారతదేశంలోకి వచ్చిన అరబ్బులను, పశ్చిమ ప్రాంతాలకు రాకుండా అడ్డుకో గలిగారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ నిజామాబాద్ ప్రాంతాలను వేములవాడ చాళుక్యులు, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలను ముదిగొండ చాళుక్యులు పరిపాలించారు. తెలంగాణ ప్రాంతంలో వారు కట్టించిన దేవాలయాలు, తవ్వించిన చెరువులు, వారి పరిపాలన విధానానికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి.
ముదిగొండ చాళుక్యులు
తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ ప్రాంతాలను కలిపి ‘కొరవిసీమ’ అంటారు. కొరవి సీమలో ముదిగొండ రాజధానిగా మంచికొండనాడును పాలించిన వారు ముదిగొండ చాళుక్యులు. కొరవిసీమలో తూర్పు ప్రాంతాన్ని మంచికొండనాడని పిలిచేవారు. వేములవాడ చాళుక్య రాజ్యంలాగానే ముదిగొండ రాజ్యం కూడా వేంగీ మాలేడ్ సామ్రాజ్యాల సరిహద్దుల్లో ఉంది. అయితే ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కృష్ణా, గోదావరి ప్రవహించే అటవీ భూములన్నీ ముదిగొండ రాజ్యంలోనివే. ఈ రాజ్యం వేంగీ రాజ్యంలోకి ప్రవేశించే అన్ని రాజ్యాలను శాసించింది. వేంగీ చాళుక్యుల వాయవ్య సరిహద్దును రక్షించే బాధ్యతను ముదిగొండ చాళుక్యులు వహించారు. వీరుకూడా రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి పాలన సాగించారు. వీరి చరిత్రను తెలుసుకోవడానికి కొరవి తామ్రశాసనం(క్రీ.శ.935), మొఘలిచెరువు శాసనం, గూడూరు శాసనం (క్రీ.శ.1124), క్రివ్వక(కుక్కనూరు) శాసనం ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.
# రణమర్ధుడు ముదిగొండ చాళుక్య వంశానికి మూల పురుషుడు. తూర్పు చాళుక్యుల సహాయంతో కొరవి మండలాన్ని సంపాదించి ముదిగొండ నుంచి పరిపాలించాడు.
# చాళుక్యుల కాలంలో తీరాంధ్ర వేంగీ రాజ్యం కింద సమైక్య పశ్చిమాంధ్రలో సామంత రాజ వంశాలు పాలిస్తూ ఉండేవి. వీరు సార్వ భౌములకు యుద్ధాల్లో తోడ్పడుతూ తమ రాజ్యాలను సర్వస్వతంత్రులుగానే పరిపా లించారు. వీరి ఆస్థానాలు సార్వభౌముని స్థానాలకు నమూనాలుగా ఉండేవి. నాడు సైన్యాలు దేశంలో యదేచ్ఛగా వీరవిహారం చేస్త్తు ఉండేవి. వేంగీ, ధరణికోట, నెల్లూరు, ఖమ్మం అనేకమార్లు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు భస్మీపటలమయ్యాయి. దేశం మొత్తం యుద్ధ శిబిరంగా మారింది. అయితే కొన్ని రాజ్యాలు స్వర్ణయుగంగా కూడా వర్థిల్లాయి. వేములవాడ చాళుక్యుల పరిపాలన, ఆర్థిక, మత విధానాలు, సాంఘిక జీవన విధానం, వాస్తు శిల్పకళ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పిన దేవాలయాలు, వాటి నిర్మాణం, భాష, సాహిత్యం, లలిత కళల పోషణ అభివృద్ధి తర్వాతి రాజవంశాలకు మార్గదర్శకంగా నిలిచాయి.
# చాళుక్యులు పరిపాలన రాచరికం. వంశాల పారంపర్యంగా వచ్చింది. రాజే సర్వాధికారి. రాజు అధికారం సప్తాంగ సమన్వితం. (రాజు, మంత్రి, రాజ్యం, కోశం, సైన్యం, మిత్రం, దుర్గం) రాజ్య వ్యవహార నిర్వహణలో యువరాజు తోడ్పడేవాడు. చాళుక్య రాజులు ధర్మశాసా్త్రల ప్రకారం ధర్మబద్దంగా పరిపాలన సాగించేవారు.
#చక్రవర్తి పరిపాలనలో సహాయ పడటానికి మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రి మండలిలో ధర్మ శాసా్త్రలు తెలిసినవారు, సేనాధిపతులు, ముఖ్య రాజబంధువులు సభ్యులుగా ఉండేవారు. ప్రాచీన నీతి శాసా్త్రల్లో పద్దెనిమిది మంది తీర్థులు – సప్తాంగాల వారు ఈ పదవులను నిర్వహించినట్లు తెలుస్తుంది.
#చాళుక్యుల కాలంలో ‘ప్రాడ్వివాకులు’ అనే న్యాయాధికారులుండేవారు.గ్రామాల మధ్య పొలిమేరలకు సంబంధించి, చెరువుల్లో నీటికి సంబంధించి వివాదాలు తలెత్తినప్పుడు ప్రాడ్వికుల ద్వారా లేదా మంత్రులు, కులపెద్దలు ద్వారా తీర్పులు చెప్పించేవారు.
#శ్రేణులకు కూడా ప్రత్యేక న్యాయస్థానాలుండేవి. మొదటి తెలుగు శాసనంగా పరిగణించే కొరవి శాసనం చాళుక్యులు పాటించిన నేరవిచారణ పద్ధతి గురించి వివరిస్తుంది.
#రెండో పులకేశి ఐనవోలు శాసనం 6 రకాలైన సైన్యవ్యవస్థ గురించి వివరిస్తుంది.
1) మూల – వంశ పారంపర్యపు సైన్యం
2) భృత్య – సైనికుల వెంట ఉండేవారు
3) శ్రేణి – వృత్తి సంఘ సామంత సైన్యాలు
4) మిత్ర – మిత్రరాజ్యాల సేనలు
5) ఆటవిక – ఆటవిక జాతుల సేనలు
6) అమిత్ర- బంధితులైన సేనలు.
#సైనిక ఉద్యోగులను మహాబలాధికృత (మహా సేనాని), బలాధ్యక్ష (సేనాని) అని వ్యవహ రించేవారు.
#చాళుక్యుల కాలంలో అరి, తగ్గు, తెరె, సిద్దాయం మొదలైన వ్యవసాయ సంబంధ పన్నులుండేవి
సామాజిక పరిస్థితులు
#వైదిక మతం విదేశ నౌకాయానాన్ని అనుమతించ లేదు. అందువల్ల విదేశీ వ్యాపారం చేసింది తక్కువే. వీరి కాలంలోనే చాతుర్వర్ణ వ్యవస్థ స్థిరపడింది. అనేక కులాలు పుట్టుకొచ్చాయి. ఎవరి కులధర్మాలను మార్చుకునే, నిలుపుకొనే అధికారం ఆయా కులాలకే ఉండేది. మత సంబంధ వైదిక విద్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అత్యంత ఉన్నతమైన విద్యా కేంద్రాన్ని ఘటిక స్థానం అనేవారు.
#చాళుక్యులు ఎన్ని యుద్ధాలు చేస్తారో అన్ని దేవాలయాలను నిర్మించడం వారి సంప్రదా యంగా మారింది. పంచారామాలైన శైవ క్షేత్రాలు చాళుక్య భీముడు నిర్మించాడు. ఈ యుగ కవుల్లో అగ్రగణ్యుడు నన్నెచోడుడు. మొట్ట మొదటగా తెలుగుకు రాజభాషా గౌరవం ఇచ్చింది తూర్పు చాళుక్యులు.
#చాళుక్యుల కాలంలో నాటి రాజాస్థానాలు, ఆలయాలు, సంగీత, నృత్య, వాస్తు శిల్ప కళలకు నిలయాలు. బాదామి చాళుక్యులు బాదామి పరిసర ప్రాంతాల్లో అనేక గుహాలయాలు, ఐహోలు, పట్టడకల్‌లో దేవాలయాలు వారి వాస్తు శిల్ప కళాశైలి ఉట్టిపడే విధంగా నిర్మించారు.
#తెలంగాణ ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో తుంగభద్ర నదీ తీరాన ఉన్న అలంపూర్‌లోని నవబ్రహ్మ దేవాలయాలు నిర్మించారు. వేములవాడ రాజ రాజేశ్వరాలయం, భీమేశ్వరాలయం, వేములవాడ చాళుక్యులు నిర్మించినవే.
#వేంగీ చాళుక్యులు తీరాంధ్రలో అనేక దేవాల యాలు నిర్మించారు. బిక్కవోలులోని ఆలయ సముదాయం గుణగ విజయాదిత్యుని కాలంలో నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి.
#వీరి కాలంలోనే శైవం, వైష్ణం కోసం తీవ్ర ఉద్యమాలు జరిగాయి. రామానుజాచార్యులు కింది వర్ణాల వారికి వైష్ణవ దీక్షను ఇచ్చాడు.
#వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని అయిన పోదనపురం(బోధన్) ప్రముఖ జైన కేంద్రంగా వర్థిల్లింది. ఒక్క పొట్లచెరువు (పఠాన్‌చెరువు)లోనే 500 జైనబసదులుండేవి. వేములవాడ చాళుక్యుల కాలంలో యుద్ధమల్ల జినాలయం, వేములవాడలో బద్దెగ జినాలయం, రేపాకలో అరికేసరి జినాలయం నిర్మించారు. వీరికాలంలో బౌద్ధం వెనుకబడినప్పటికీ జైనమతం గొప్పగా వర్థిల్లింది.
#చాళుక్యులు చెరువుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. వీరు తవ్వించిన చైత మహా తటాకం, భీమ సముద్రం చెరువులు ఈ నాటికీ సేద్య భూములకు నీరు అందిస్తు న్నాయి.
ముదిగొండ చాళుక్యుల్లో ముఖ్యులు
కుసుమాయుధుడు (క్రీ.శ.870-895)
గొణగయ్య (క్రీ.శ.895-910)
నిరవద్య (క్రీ.శ.910-935)
బద్దెగ (క్రీ.శ.935-941)
రెండో కుసుమాయుధుడు (కీ.శ.935-960)
రెండో విజయాదిత్యుడు (క్రీ.శ.960-980)
మూడో కుసుమాయుధుడు (క్రీ.శ.980-1000)
గొణగ (క్రీ.శ.1000-1025)
నిజ్జయరాజ మల్లప్ప (క్రీ.శ.1025-1050)
నాలుగో కుసుమాయుధుడు (క్రీ.శ.1050-1075)
బేతరాజు (క్రీ.శ.1075-1100)
ఐదో కుసుమాయుధుడు (క్రీ.శ.1100-1125)
బొట్టుబేతడు (క్రీ.శ.1125-1150)
ఆరో కుసుమాయుధుడు (క్రీ.శ.1150-1175)
నాగటిరాజు (క్రీ.శ.1175-1200)
మాదిరి ప్రశ్నలు
1. ముదిగొండ చాళుక్యులు పాలించిన కొరవిసీమ దేనిలో భాగంగా ఉండేది?
1) మంచికొండనాడు 2) విరుసునాడు
3) కొండపల్లి 4) పైవేవీకావు
2. మంచికొండనాడు కృష్ణాజిల్లా కొండపల్లి నుంచి వరంగల్ జిల్లాలోని కొరవిసీమ వరకు వ్యాపించి ఉండేది.
కొరవిసీమకు ఉండే మరో పేరేమిటి?
1) పాలంపేట 2) కొండనాడు
3) విరుసునాడు 4) పైవన్నీ
3. ముదిగొండ చాళుక్యులకు సమకాలీన రాజవంశాలు?
ఎ) వేములవాడ చాళుక్యులు
బి) వేంగీ చాళుక్యులు
సి) కళ్యాణి చాళుక్యులు డి) రాష్ట్రకూటులు
1) ఎ, బి 2) ఎ, సి
3) డి, ఏ 4) ఎ, బి, సి, డి
4. ముదిగొండ చాళుక్యరాజైన నిరవద్యుడు వేయించిన ఏ శాసనం రాజులు గ్రామ నాయకుల నుంచి గుత్తగా పన్నులు వసూలు చేసేవారని తెలియజేస్తుంది?
1) కొరవి శాసనం 2) పాలంపేట శాసనం
3) ముదిగొండశాసనం
4) వేములవాడ శాసనం
5. ముదిగొండ చాళుక్యుల పతనం గురించి తెలియజేసే శాసనం?
1) కొరవి శాసనం
2) పాలంపేట శాసనం
3) మొఘలి చెరువు శాసనం
4) ముదిగొండ శాసనం
6. ముదిగొండ చాళుక్య రాజ్య స్థాపకుడు?
1) రణమర్ధుడు 2) కొక్కిరాజు
3) మొదటి కుసుమాయుధుడు
4) విజయాదిత్య గొణగ
7. ముదిగొండ చాళుక్యులు ఎవరికి సామంతు లుగా ఉన్నారు?
1) వేములవాడ చాళుక్యులు
2) తూర్పు చాళుక్యులు
3) కళ్యాణి చాళుక్యులు 4) రాష్ట్రకూటులు
8. రణమర్ధను యుద్ధభూమిలో రాముడితో సమానమైన వీరునిగా పేర్కొన్న శాసనం?
1) ముదిగొండ శాసనం 2) కొరవి శాసనం
3) పాలంపల్లి శాసనం
4) మొఘలి చెరువు శాసనం
9. కుసుమాయుధుడు రాష్ట్రకూటులతో పోరాడి చాళుక్య భీముడ్ని విడిపించిన తర్వాత కుసుమాయుధుడి అభ్యర్థన మేరకు చాళుక్య భీముడు పోతమయ్య అనే బ్రాహ్మణుడికి కీపరు అనే గ్రామాన్ని దానం చేసినట్లు తెలుపుతున్న శాసనం?
1) ముదిగొండ శాసనం
2) కొరవి శాసనం
3) పాలంపల్లి శాసనం
4) మొఘలి చెరువు శాసనం
10. ఎవరి కాలంలో ముదిగొండ చాళుక్యులను ఓడించి వారిని తెలంగాణ ప్రాంతం నుంచితరిమివేశారు?
1) గణపతి దేవుడు 2) ప్రతాపరుద్రుడు
3) రుద్రమదేవి 4) ఎవరూ కాదు
11. గ్రామాల్లో దొంగతానాలు జరగకుండా చూసే బాధ్యత గ్రామానికి చెందిన ప్రముఖ సేవకుడిగా భావించే గ్రామ తలారనే ఉద్యోగిది. ఇతడికి ఉన్న ఇతర పేర్లేవి?
1) గ్రామ రక్షక భటుడు 2) పట్టిలక
3) పట్టేరా, పటేల్ 4) పైవన్నీ
12. పంటల పరిస్థితుల్ని, రకాల్ని వర్షానికున్న సంబంధాన్ని ఏ గ్రంథం వర్ణిస్తుంది?
1) జినేంద్రపురాణం 2) యుక్తి చింతామణి
3) సస్యానంద 4) పైవేవీకాదు
13. చాళుక్యుల కాలంలో వాడుకలో ఉన్న కొల మానాలేవి?
ఎ) నివర్తన బి) మర్తు
సి) ఖండిక డి) పుట్టి
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, డి
14. భూమి కొలతలకు వాడుకలో ఉన్న గెడలు ఏవి?
ఎ) రాజమాన బి) ముమ్మిడి భీమకోల
సి) జేనకోల డి) రాజరాజ కోల
1) ఎ, బి 2) సి, డి
3) సి, డి 4) ఎ, బి, సి, డి
15. మొదట తెలుగులో శాసనాలను రాయించే పద్ధతిని ప్రవేశ పెట్టినవారు?
1) రేనాటి చోడులు
2) వేములవాడ చాళుక్యులు
3) ముదిగొండ చాళుక్యులు
4) బాదామి చాళుక్యులు
16. తెలంగాణలో వేములవాడ చాళుక్యులు నిర్మించిన జినాలయాలేవి?
1) శుభదామ జినాలయం
2) అరికేసరి జినాలయం
3) యుద్ధమల్ల జినాలయం
4) పైవన్నీ
17. కుబ్జ విష్ణువర్ధనుడి పట్టపురాణి అయ్యణ మహాదేవి బెజవాడలో ‘నెడుంబవసది’ని నెలకొల్పి దానికి ఏ గ్రామాన్ని దానం చేసింది?
1) కలచుంబరు 2) ముషిని కొండ
3) పెదగాదెలవరు 4) దానవులపాడు
18. 400లకుపైగా కంద పద్యాలున్న శివతత్వ సారాన్ని రచించినవారు ఎవరు?
1) సోమదేవ సూరి 2) నన్నెచోడుడు
3) మల్లికార్జున పండితారాధ్యుడు
4) ఎవరూకాదు
19. 360 యుద్ధాలు చేసి 360 దేవాలయాలను నిర్మించిన వేంగీ చాళుక్య రాజు ఎవరు?
ఎ) రెండో విజయాదిత్యుడు
2) గుణగ విజయాదిత్యుడు
3) చాళుక్య భీముడు
4) వినయాదిత్య యుద్ధమల్లుడు
సమాధానాలు
1-1 2-3 3-4 4-1 5-2 6-1 7-2 8-4 9-2 10-1 11-4 12-3 13-3 14-4 15-1 16-4 17-2 18-3 19-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు