గర్వాల్ హిమాలయాల్లో జరిగిన ఉద్యమం? పోటీ పరీక్షల ప్రత్యేకం
గత తరువాయి..
2) ధౌలధర్ శ్రేణి
# పీర్‌పంజల్ శ్రేణికి దక్షిణ భాగాన, హిమాచల్ ప్రదేశ్‌లో విస్తరించిన శ్రేణి.
#పీర్‌పంజల్ శ్రేణికి, ధౌలధర్ శ్రేణికి మధ్యలో చంబల్ లోయ ఉంది. చంబ లోయ రావి నది ఒడ్డున ఉంది.
# వీటిలో ఎత్తయిన శిఖరం ‘వైట్ మౌంటెయిన్ (5639 మీ.)’. దీన్నే ‘హనుమాన్ జీ కా తిబ’ అని కూడా అంటారు.
ఇక్కడ ఉన్న వేసవి విడుదులు
ధర్మశాల (1475 మీ.) సిమ్లా (2,205 మీ.)
కులు (1297 మీ.) మనాలి (2,025 మీ.)
కీలాంగ్ డల్హౌసీ
మెక్లియోడ్ గంజ్ (2,082 మీ.)
ఖిజ్జియార్
#రోహతంగ్ టన్నెల్, బనిహాల్ రోడ్ టన్నెల్, బనిహాల్ రైల్వే టన్నెళ్లను పీర్‌పంజల్, ధౌలధర్ శ్రేణుల గుండా నిర్మించారు.
# ఖిజ్జియార్ వేసవి విడిదిని భారతదేశపు స్విట్జర్లాండ్‌గా పిలుస్తారు.
#ఈ శ్రేణుల్లో కాంగ్రా, కిన్నేరు, సోలాంగ్, కులూ, మనాలి, స్పితి, పార్వతి, సాంగ్‌ల లోయలు ఉన్నాయి.
#హిమాద్రి, ధౌలధర్ శ్రేణులకు మధ్యలో కాంగ్రా లోయ ఉంది. ఈ లోయలో బియాస్ నది ప్రవహిస్తుంది. ధర్మశాల, కాంగ్రా పట్టణాలు ఈ లోయలో ఉన్నాయి.
# హిమాచల్ పర్వత శ్రేణుల్లో ఉన్న సన్నని గడ్డి భూములు గల మైదానాలను ‘మార్గ్’ అంటారు. ఉదా: జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్, ఉత్తరాఖండ్‌లోని భూజ్వాల్ మార్గ్, పాయిల్ మార్గ్.
3) నాగతిబ శ్రేణి
# ఉత్తరాఖండ్‌లో విస్తరించిన శ్రేణి. చక్రాట వేసవి విడిది దీనిలో ఉంది.
4) ముస్సోరి శ్రేణి
# ఉత్తరాఖండ్‌లో ఉంది.
# దీనిలో ముస్సోరి, డెహ్రాడూన్, రాణిఖేత్, ఆల్మోరా, నైనిటాల్ వేసవి విడుదులు ఉన్నాయి.
#భారత్‌లోనే ఎత్తయిన డ్యాంలలో ఒకటైన ‘తెహ్రీ డ్యామ్’ దీనిలో ఉంది.
5) మహాభారత్ శ్రేణి
#ఇది నేపాల్‌లో విస్తరించిన శ్రేణి.
#హిమాద్రి శ్రేణులు, మహాభారత్ శ్రేణులకు మధ్యలో ‘కఠ్మాండు లోయ’ ఉంది.
#గండక్, గాగ్ర, కార్నాలి, బూరిగండక్, కోసి నదులతో క్రమక్షయం గావిస్తూ, పెద్ద గార్జ్‌లు ఏర్పడటమే గాక అత్యధిక జల విద్యుచ్ఛక్తి శక్మతను కలిగి ఉన్నాయి.
#ఈ శ్రేణుల తూర్పు భాగాన పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో డార్జిలింగ్, కాలింపాంగ్ అనే వేసవి విడుదులు ఉన్నాయి.
6) నలుపు పర్వతాలు (Black Mountains)
#ఇవి భూటాన్ దేశంలోని హిమాచల్ శ్రేణుల్లో ఉన్నాయి.
#హిమాద్రి శ్రేణులు, బ్లాక్ పర్వతాలకు మధ్య ‘థింపూ లోయ’ ఉంది.
7) శివాలిక్ శ్రేణులు (బాహ్య హిమాలయాలు)
#హిమాలయాల్లో అత్యంత దక్షిణాన గల పర్వత శ్రేణి (ఔటర్ మోస్ట్ రేంజ్)
#పశ్చిమాన పోట్వార్ పీఠభూమి నుంచి తూర్పున తీస్తా నది వరకు విస్తరించాయి.
# పశ్చిమం నుంచి తూర్పునకు వెళ్లే కొద్ది వీటి వెడల్పు, ఎత్తు తగ్గిపోతాయి.
# ఈ స్వరూపాలను బెంగాల్, అసోంలలో ‘డ్యూయర్’ స్వరూపాలు అంటారు. ఇవి తేయాకు పంటలకు అత్యంత ప్రసిద్ధి.
# ఇవి విచ్ఛిన్న శ్రేణులు, అవక్షేప శిలలను (Sediment ary Rocks) కలిగి ఉంటాయి.
#900 నుంచి 1100 మీటర్ల ఎత్తులో దక్షిణాన గల శ్రేణులు 10 కి.మీ. (అరుణాచల్ ప్రదేశ్) నుంచి 50 కి.మీ. (హిమాచల్ ప్రదేశ్) వెడల్పును కలిగి ఉంటాయి. వీటి పొడవు 1600 కి.మీ..
#ఇవి భూకంపాలకు ప్రసిద్ధి.
# ఇవి అత్యధిక జల విద్యుత్ ఉత్పత్తి శక్మతను కలిగి ఉంటాయి.
#భారతదేశ మొదటి ఆదిమానవులైన ‘రామా పిథికస్’ ఇక్కడ నివసించారు.
# శివాలిక్ శ్రేణులను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.
1) జమ్ము కశ్మీర్- జమ్ము కొండలు
2) ఉత్తరప్రదేశ్- దుద్వా కొండలు
3) నేపాల్- దుద్వా కొండలు, చురియా కొండలు, థాంగ్ శ్రేణి.
4) అసోం- కచార్ కొండలు
5) పశ్చిమ బెంగాల్- డ్వార్ఫ్ కొండలు
6) అరుణాచల్ ప్రదేశ్- డాప్లా, మిర్, మిష్మి, అబోర్
#హిమాచల్ శ్రేణులకు, శివాలిక్ శ్రేణులకు మధ్యగల ‘U’ ఆకారపు లోయలను ‘డూన్స్’ అంటారు.
#ఇవి పండ్ల తోటలకు ప్రసిద్ధి. నదీ ప్రవాహాలకు ఏర్పడే అవరోధాల వల్ల ఇక్కడ తాత్కాలిక సరస్సులు ఏర్పడుతూ ఉంటాయి.
ముఖ్యమైన డూన్స్
1) డెహ్రాడూన్- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, ముస్సోరి శ్రేణుల పాదాల వద్దగల అతిపెద్ద డూన్ (1524 కి.మీ.). దీనిలో రాజాజీ నేషనల్ పార్క్ ఉంది.
2) పాట్లి డూన్, 3) చాఖం డూన్- ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.
4) జమ్ము డూన్, 5) కోట్లి డూన్, 6) ఉదంపూర్ డూన్- జమ్ము కశ్మీర్లో ఉన్నాయి.
7) పింజార్ డూన్- ఇది హిమాచల్ ప్రదేశ్‌లో 150 కి.మీ. పొడవైనది.
8) చిత్వాన్ డూన్- నేపాల్‌లో ఉంది.
హిమాలయాల ప్రాంతీయ విభజన
# హిమాలయాలను సర్ సిడ్నీ బరాడ్ కింది విధంగా విభజించారు.
1) పశ్చిమ (పంజాబ్) హిమాలయాలు- సింధూ నుంచి సట్లెజ్ నది మధ్యలో
2) కుమాయూన్ హిమాలయాలు- సట్లెజ్ నుంచి కాళీ మధ్యలో
3) నేపాల్ హిమాలయాలు- కాళీ నుంచి తీస్తా మధ్యలో
4) అసోం హిమాలయాలు- తీస్తా నుంచి బ్రహ్మపుత్ర మధ్యలో
#ఎస్పీ చటర్జీ హిమాలయాలను ప్రాంతీయంగా కింది విధంగా విభజించారు.
1) కశ్మీర్ హిమాలయాలు
2) హిమాచల్, ఉత్తరాఖండ్ హిమాలయాలు
3) మధ్య హిమాలయాలు
4) అరుణాచల్ హిమాలయాలు
5) పూర్వాంచల్ హిమాలయాలు
1) కశ్మీర్ హిమాలయాలు
#సింధూ నదికి ఉత్తరంగా ఉన్న హిమాలయాలను ‘కశ్మీర్ హిమాలయాలు’ అంటారు.
# కారకోరం, లఢక్, జష్కార్, హిమాద్రి, పీర్‌పంజల్, జమ్ముకొండలు దీనిలో ఉన్నాయి.
# సింధూ, దాని ఎడమవైపు ఉపనదులన్నీ ఇక్కడే ప్రవహిస్తాయి.
#ప్రసిద్ధి చెందిన కశ్మీర్‌లోయ, దాల్, ఉలార్ సరస్సులు ఇక్కడ గల హిమాద్రి, పీర్‌పంజల్ శ్రేణుల మధ్య ఉన్నాయి.
# కశ్మీర్ లోయలో హిమానీ నద నిక్షేపణ వల్ల ఏర్పడిన ‘కరేవా’ మృత్తికలు ఉన్నాయి. ఇవి కుంకుమ పువ్వు సాగుకు అనుకూలం. ఇక్కడ ‘కుల్స్’ అనే నీటిపారుదల ప్రవాహాలు ఉన్నాయి.
#మొత్తం హిమాలయాల్లో కశ్మీర్ హిమాలయాలు అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతాయి. శీతాకాలంలో పశ్చిమ విక్షోబాల (Western Disturbances) వల్ల కొంచెం వర్షాన్ని పొందుతాయి. దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ద్రాస్ ప్రాంతం ఇక్కడే ఉన్నది.
కశ్మీర్ లోయ: ఇది హిమాద్రి శ్రేణులు, పీర్‌పంజల్ శ్రేణికి మధ్యలో విస్తరించి ఉన్న అభినతి లోయ ప్రాంతం.
# 32 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 34 డిగ్రీల అక్షాంశాల మధ్య వాయవ్యం నుంచి ఆగ్నేయంగా 135 కి.మీ. పొడవు, 32 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉంది.
# దీని మొత్తం విస్తీర్ణం 15,520 కి.మీ2., సముద్ర మట్టానికి 1620 మీ. ఎత్తులో ఉంది.
# ఈ లోయ గుండా జీలం నది ప్రవహిస్తుంది. ఇక్కడ ఉలార్, దాల్ సరస్సులు ఉన్నాయి. ప్రముఖ పట్టణం శ్రీనగర్‌లో ఉంది.
2) హిమాచల్, ఉత్తరాఖండ్ హిమాలయాలు
#ఇది రావి, కాళి నదుల మధ్య విస్తరించిన పర్వత విభాగం.
# ధౌలధర్, నాగతిబ, ముస్సోరి శ్రేణులు ఇక్కడ ప్రధానమైనవి.
#ఉత్తరాఖండ్‌లో వీటిని కుమాయున్ హిమాలయాలు పశ్చిమ భాగాన్ని ‘గర్వాల్ హిమాలయాలు’ అని అంటారు. ఈ గర్వాల్ హిమాలయాల్లోనే ప్రసిద్ధ ‘చిప్కో’ ఉద్యమం జరిగింది.
#భగీరథి, అలకనంద, వీటి ఉపనదుల వల్ల ఏర్పడే ‘పంచ ప్రయాగలు’ ఇక్కడ ఉన్నాయి.
#ఇక్కడి దర్శనీయ ప్రదేశాలు- పంచ ప్రయాగలు, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్, హిమకుండ్ సాహెబ్, రిషికేశ్
# ఇక్కడ ఉన్న నేషనల్ పార్కులు- వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందా దేవి బయోస్పియర్ రిజర్వ్, కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్
3) నేపాల్ (మధ్య) హిమాలయాలు
l కాళీ నది నుంచి తీస్తా నది మధ్యలో విస్తరించిన పర్వతాలు, వీటి తూర్పు భాగాన్ని సిక్కిం హిమాలయాలు అంటారు.
l ఎవరెస్ట్ (8,848 మీ.), కాంచనగంగ (8,598 మీ.), మకాలు (8,481 మీ.), ధవళగిరి (8,172 మీ.), అన్నపూర్ణ (8078 మీ.) మొదలైన ఎత్తయిన శిఖరాలు ఇక్కడ ఉన్నాయి.
l ఇక్కడ గల హిమాద్రి, మహాభారత్ శ్రేణుల మధ్య ‘కఠ్మాండు లోయ’ ఉంది.
l గంగా నది ఎడమవైపు ఉపనదులన్నీ కూడా ఈ హిమాలయాల నుంచి ప్రారంభమవుతాయి.
l సిక్కిం, డార్జిలింగ్, ప్రాంతంలో లెప్చాలు అనే తెగ ప్రజలు ఉన్నారు.
l ఇక్కడ ఉన్న జాతీయ పార్కులు- కాంచన జంగ బయోస్పియర్ రిజర్వ్, సింగాలిలీ నేషనల్ పార్క్, నియోర వ్యాలీ.
l సిక్కిం ఉత్తర భాగాన గల కాంచన జంగ వద్ద ‘జెమ్ హిమనదం’ ఉంది. ఇది తూర్పు హిమాలయాల్లో పొడవైన (26 కి.మీ.) హిమానీనదం.
4) అరుణాచల్ హిమాలయాలు
# తీస్తా నుంచి బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించాయి.
#భూటాన్ హిమాలయాల నుంచి దిపు కనుమ వరకు విస్తరించిన పర్వతశ్రేణి
#మిగిలిన హిమాలయాలన్నీ వాయవ్యం నుంచి ఆగ్నేయ దిశలో విస్తరించగా, ఇవి మాత్రం నైరుతి నుంచి ఈశాన్యానికి విస్తరించాయి.
#ఈ హిమాలయాల్లో ఎత్తయిన శిఖరం ‘నామ్చాబర్వా (7,756 మీ.)’. ఇది అరుణాచల్ ప్రదేశ్‌కు ఉత్తరాన టిబెట్ ప్రాంతంలో ఉంది.
#అరుణాచల్ ప్రదేశ్‌లో ఎత్తయిన శిఖరం కాంగ్టో (7090 మీ.). దీనిలో డాఫ్లా, మిరి, అబోర్, మిష్మి కొండలు ఉన్నాయి.
# అరుణాచల్ హిమాలయాల్లో ‘పోడు వ్యవసాయం’ అమల్లో ఉంది.
# ఇక్కడ ఉన్న వేసవి విడుదులు- ఈటానగర్, బొమ్డిలా, జీరో వ్యాలీ, తవాంగ్, పాసీఘాట్.
5) పూర్వాంచల్ హిమాలయాలు
#దిహంగ్ గార్జ్, ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది.
# వీటిని 6 సమాంతర శ్రేణులుగా విభజించారు. అవి.. 1) పాట్కాయ్ శ్రేణి, 2) నాగ శ్రేణి, 3) మణిపురి కొండలు, 4) ఉత్తర కచార్ కొండలు, 5 మిజో కొండలు, 6) త్రిపుర కొండలు
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?