పల్లె బ్యాంకుల్లో కొలువులు
– డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం
బ్యాంక్ కొలువు.. సొంత రాష్ట్రంలో ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతభత్యాలు. గౌరవ మర్యాదలు. అంతేకాదు.. భరోసా కల్పించే కొలువులు. భవిష్యత్లో పదోన్నతులకు అవకాశాలు మెండు. రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నిర్వహించే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా ఆ వివరాలు నిపుణ పాఠకుల కోసం…
ఐబీపీఎస్
సరైన ఉద్యోగానికి సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ. దీని ఏర్పాటు అనేక దశల్లో జరిగింది. 1969లో ప్రారంభమైన నియామక సంస్థ నేడు ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)గా మారింది. దేశంలోని జాతీయ బ్యాంకుల్లో ఆఫీసర్, అసిస్టెంట్, స్పెషలిస్ట్ తదితర పోస్టుల భర్తీ ప్రక్రియలను ఐబీపీఎస్ నిర్వహిస్తుంది.
ఆర్ఆర్బీ
రీజినల్ రూరల్ బ్యాంక్లు. ప్రస్తుత నోటిఫికేషన్లో దేశంలోని 43 ఆర్ఆర్బీలు పాల్గొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (హైదరాబాద్), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (వరంగల్), ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు (కడప)ల్లో ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
ఖాళీలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టిపర్పస్) 4483
స్కేల్-1 ఆఫీసర్ 2676
స్కేల్-2 అగ్రికల్చర్ ఆఫీసర్ 12
స్కేల్-2 మార్కెటింగ్ ఆఫీసర్ 6
స్కేల్-2 ట్రేజరీ మేనేజర్ 10
స్కేల్-2 లా ఆఫీసర్ 18
స్కేల్-2 సీఏ ఆఫీసర్ 19
స్కేల్-2 ఐటీ ఆఫీసర్ 57
స్కేల్-2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 745
స్కేల్-3 ఆఫీసర్ 80
ముఖ్య తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 27
ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆగస్టులో ఉంటుంది.
మెయిన్ ఎగ్జామ్: సెప్టెంబర్/అక్టోబర్లో ఉంటుంది.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://www.ibps.in
ఎవరు అర్హులు?
పోస్టుల్ని బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ, ఎంసీఏ, సీఏ తదితర కోర్సులు ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
వయస్సు 18- 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
వివరాలు : వెబ్సైట్లో చూడవచ్చు.
ఎంపిక విధానం : ఆన్లైన్ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
…కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- IBPS
- jobs
- rural banks
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?