కొండలు తొలచి… గుడులు నిర్మించి… (పోటీ పరీక్షల ప్రత్యేకం)
తెలుగు చరిత్రలో అత్యంత ప్రాధాన్యం గల రాజవంశాల్లో విష్ణుకుండినులకు ప్రముఖస్థానం ఉంది. తమ రాజకీయ ప్రస్థానాన్ని కృష్ణానది ఉత్తర గట్టున ప్రారంభించి నర్మదనది వరకు విస్తరించి మూడు సముద్రాల మధ్య దేశాన్ని కూడా వీరు కొంత కాలం పరిపాలించారు. ప్రధానంగా క్రీ.శ.358 నుంచి క్రీ.శ.569 వరకు సుమారు 210 సంవత్సరాలు వీరు కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న తెలంగాణ, ఉత్తరాంధ్రను పరిపాలించారు. వీరి రాజధాను లు అమరపురం, ఇంద్రపాల నగరం, దెందులూరు. ఆంధ్రప్రదేశ్లోని బెజవాడ కూడా విష్ణుకుండినులకు కొంత కాలం రాజధానిగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరు సాంస్కృతిక రంగాల్లో ఎన్నో కొత్త ఒరవడులను ప్రవేశ పెట్టారు. కొండలను తొలచి గుడులను నిర్మించే పద్ధతికి వీరే ఆధ్యులు..
శాసనాలు
#విష్ణు కుండినుల చరిత్రకు ప్రధాన ఆధారాలు శాసనాలు వారికాలంలో వేసిన 13 శాసనాలు, వారి తర్వాత కాలంలో వేసిన 8 శాసనాలు కూడా విష్ణుకుండినుల చరిత్రను తెలియజేస్తున్నాయి. 21 శాసనాల్లో 16 రాగి రేకుల శాసనాలు, 5 శిలా శాసనాలు.
#క్రీ.శ. 355 వరకు విజయపురి రాజధానిగా కృష్ణానదికి ఇరువైపులా ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంతం జిల్లాలను ఇక్షాకులు పాలించారు. వారిని పల్లవులు ఓడించి శ్రీశైలం వరకు ఉన్న ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. క్రీ.శ.358 కాలంలో సముద్ర గుప్తుడు దక్షిణ దిగ్విజయ యాత్రలో పల్లవులను ఓడించి తిరిగి వెళ్లిపోయాడు. ఇదే అదనుగా తీసుకొని ఇక్ష్వాక సామంతులైన ఆనందగోత్రికులు, కృష్ణా గుంటూరు, ఏలూరు ప్రాంతంలో శాలంకాయనులు, తెలంగాణలో విష్ణుకుండినులు స్వతంత్రించారు.
#విష్ణుకుండినులు 200 ఏండ్ల పాలనా కాలంలో తెలంగాణ మొత్తం వారి పాలనలోనే ఉంది. కొంతకాలం(5వ శతాబ్ది ఉత్తరార్థం వరకు) మహారాష్ట్ర ప్రాంతాన్ని కూడా పాలించారు.
#రెండో మాధవ వర్మ విష్ణుకుండినుల రాజులందరిలో గొప్పవాడు. ఇతను ఇంచుమించు వందకు పైగా యుద్ధాలు చేసి ఒక్కో యుద్ధ విజయానికి గుర్తుగా కీసరగుట్టపై ఒక్కో లింగాన్ని ప్రతిష్ఠించాడు. విజయం సాధించిన ప్రతీచోట రామలింగేశ్వర దేవాలయం కట్టించాడు. ఈయన కట్టించిన రామలింగేశ్వర దేవాలయాలు, వేల్పూరు, ఈపూరు, ఇంద్రపాలనగరం, కీసర గుట్టల్లో పూజలందుకొంటున్నాయి.
#రెండోమాధవ వర్మ రాజ్యం తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం వరకు, దక్షిణ సముద్రం(పులికాట్ సరస్సు) నుంచి ఉత్తరాన రేవా(నర్మదా) నది వరకు విస్తరించాడు. ఆయన శాసనం ఒకటి మహారాష్ట్రలోని ఖానాపూర్లో, విష్ణుకుండినుల నాణేలు మహారాష్ట్ర అంతటా దొరికాయి.
పరిపాలన
#శాతవాహనుల తర్వాత దక్కన్లో విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఘనత విష్ణుకుండినులకే దక్కుతుంది. కాకతీయులు మాధవ వర్మను తమ వంశకర్త్తగా చెప్పుకొన్నారు. పిఠాపురం రాజులు, వెలమలు కూడా ఇదే మాట చెప్పుకొన్నారు. న్యాయపాలనకు విష్ణుకుండినులు పెట్టింది పేరు. మాదవవర్మ దివ్యాలు అనే న్యాయవిధులను కనిపెట్టాడు. చింతకాయలు అమ్ముకొనే మహిళ కొడుకుపై ఏమరుపాటున తనరథాన్ని పోనిచ్చి చంపిన రాకుమారుడికి మాధవవర్మ ఉరిశిక్ష విధించినట్లు శాసనాల్లో ఉంది.
#విష్ణుకుండినుల రాజ్యంలో రాజే సర్వాధికారి నిరంకుశుడు. ఆయనమాటే అంతిమం. అయితే రాజు నిర్ణయాలు ప్రజాభిప్రాయాన్ని, ప్రజాక్షేమాన్ని అనుసరించి ఉండేవి. మంత్రిమండలి నిర్ణయాలకు కూడా రాజాస్థానంలో సముచితమైన స్థానం ఉండేది.
# విష్ణుకుండినులు తమ దేశాన్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాలను విషయాలుగా, విషయాలను గ్రామాలుగా విభజించారు.
#విష్ణుకుండినుల దేశంలో పఱకి, ప్లక్కి, కర్మ, కళింగ మొదలైన రాష్ట్రాలు ఉండేవి. రాష్ట్రానికి పాలకుడు రాష్ట్రికుడు. విషయానికి పాలకుడు విషయాధిపతి. రాష్ట్రంలో గృధ్రవాడి, నేత్రపాటి విషయాలుండేవి. ఈ పాలన విభాగాలే కాకుండా రాజ్యంలో కొంత భాగానికి రాజు కొడుకును పాలకుడిగా నియమించేవారు. కొందరు సామంతులు విష్ణుకుండినులకు లోబడి ఉండే వారు. మాధవ వర్మ కింద అనేక సామంతులు, గోవింద వర్మ కింది అన్యసామంతులు, సకల సామంతులు ఉండేవారని శాసనాల్లో ఉంది. సామంతులతో వైవాహిక సంబంధాలుండేవి అవి కూడా వారి రాజ్య రక్షణకు విస్తృతికి దోహదం చేశాయి.
# రాజ్య విస్తరణలో భాగంగా విష్ణుకుండినులు అనేక కోటలను కట్టించారు. అలా కట్టిన వాటికి వారి మొదటి రాజధాని పేరో లేదా అలా అర్థం వచ్చేలా మరో పేరో పెట్టేవారు.
# విష్ణు కుండినులు వైష్ణవ మతస్థులు అయినప్పటికీ శైవాన్ని ఆరాధించారు. సంస్కృతాన్ని అధికార భాష చేసుకొని పాలించిన మొదటి రాజవంశం విష్ణుకుండినులు.కానీ సామాన్య ప్రజల భాష మాత్రం తెలుగు.
# వీరి నాణేలు తెలంగాణలోని ఏలేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా), ఆంధ్రప్రదేశ్లోని బొజ్జన్న కొండ, యలమంచిలి (విశాఖపట్నం జిల్లా), మహారాష్ట్రలోని నాసిక్ ఖానాపూర్ నాగపూర్, మధ్యప్రదేశ్లోని బ్రహ్మగిరి మొదలైన ప్రదేశాల్లో దొరికాయి.
#విష్ణుకుండినుల కాలంలోనే దక్షిణాన తొలి సారిగా కొండలను తొలచి ఆలయాలను నిర్మించే సంప్రదాయం ప్రారంభమైంది.
# ఉండవల్లి, మొగల్రాజపురం, భైవరకొండ గుహాలయాలు వీరు నిర్మించినవే.
-ఇంద్రవర్మ (క్రీ.శ. 358-370)
-మొదటి మాధవవర్మ (క్రీ.శ.370-398)
– గోవిందవర్మ (క్రీ.శ.398-440)
-రెండో మాధవవర్మ (క్రీ.శ. 440-495)
-దేవవర్మ (క్రీ.శ. 495-496)
-మూడో మాధవవర్మ (క్రీ.శ.496-510)
-మొదటి విక్రమేంద్రవర్మ (క్రీ.శ. 510- 525)
-రెండో ఇంద్ర(భట్టారిక) వర్మ
(క్రీ.శ. 525-555)
– రెండో విక్రమేంద్ర వర్మ
(క్రీ.శ.555-569)
శాసనం పేరు ప్రాంతం
తుమ్మలగూడెం రాగి శాసనాలు -2 వలిగొండ మండలం నల్లగొండ జిల్లా
చైతన్యపురి శిలాశాసనం హైదరాబాద్
కీసరగుట్ట శిలాశాసనం రంగారెడ్డి జిల్లా
సలేశ్వరం శిలాశాసనం ఆమ్రాబాద్ మండలం,మహబూబ్నగర్ జిల్లా
వేల్పూరు శిలా శాసనం సత్తెన పల్లి గుంటూరు
ఈపూరు రాగి శాసనాలు -2 తెనాలి, గుంటూరు జిల్లా
రామతీర్థం రాగి శాసనం విశాఖపట్నం జిల్లా
చిక్కుళ్ల రాగి శాసనం తుని, తూర్పుగోదావరి జిల్లా
తుండి రాగి శాసనం తుని. తూర్పుగోదావరి జిల్లా
పాలమూరు రాగి శాసనాలు రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా
ఖానాపూర్ రాగి శాసనం సతార జిల్లా, మహారాష్ట్ర
ప్రాక్టీస్ బిట్స్
1. బౌద్ధమతాన్ని షోషించిన చివరి తెలుగు రాజ వంశం ఏది?
1) విష్ణుకుండినులు 2) ఇక్షాకులు
3) శాతవాహనులు 4) వాకాటకులు
2. 5వ శతాబ్దానికి చెందిన, తర్కపండితుడు దిజ్ఞాగుడు తెలంగాణలో ఎక్కడ నివసించాడు?
1) వేంగి 2) రామగిరి
3) మునులగుట్ట 4) పైవన్నీ
3. ‘ప్రమాణ సముచ్ఛయం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని సంస్కృతంలో రాసిన బౌద్ధ మహా పండితుడు ఎవరు?
1) దిజ్ఞాగుడు 2) నాగార్జునుడు
3) భదంత సంఘదేవుడు
4) పిండపతిక దామధరుడు
4. 2011లో పురావస్తుశాఖ తవ్వకాల్లో ఏడు ఆరామాలు, ఒక్కో ఆరామంలో 7 గదులున్నాయి. ఇవి ఏ ప్రాంతంలో బయటపడ్డాయి?
1) కోటిలింగాల 2) ఫణిగిరి
3) కీసర 4) చైతన్యపురి
5. తొలి తెలంగాణ సంస్కృతి వ్యాకరణ గ్రంథం ఏది? ఎవరు రచించారు?
1) జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి –గణస్వామి
2) ప్రబోధ చంద్రోదయం –నందిమల్లయ్య
3) నాచికేతోపాఖ్యానం – దుగ్గుపల్లి దుగ్గన్న
4) ఎవరూకాదు
6. తెలంగాణాలో లభించిన మొట్టమొదటి ప్రాకృత శాసనం ఏది?
1) కీసర 2) ఫణిగిరి
3) చైతన్యపురి 4) ఏలేశ్వరం
7. తెలంగాణలో అతి ప్రాచీన శాసనం ఎక్కడ ఉన్నట్లు ఇటీవల చరిత్రకారులు కనుక్కొన్నారు?
1) ఫణిగిరి 2) ఏలేశ్వరం
3) కీసర 4) చైతన్యపురి
8. విష్ణుకుండినులు, వాకాటకుల మధ్య వైవాహిక సంబంధాలను గురించి తెలియజేసే శాసనం?
1) వేల్పూరు శాసనం
2) ఇంద్రపాలనగర శాసనం
3) పాలమూరు శాసనం
4) చిక్కుళ్ల తామ్ర శాసనం
9. ఎవరి పాలనాకాలంలో విష్ణుకుండినుల రాజ్యం తెలంగాణలో మహబూబ్నగర్, కరీంనగర్, ఖమ్మం, కీసర, ఆమ్రాబాద్, భువనగిరి, కొల్లాపూర్ వరకు విస్తరించింది?
1) మొదటి మాధవవర్మ
2) మొదటి విక్రమేంద్రవర్మ
3) మొదటి గోవిందవర్మ
4) రెండవ మాధవ వర్మ
10. రెండవ మాధవ వర్మ తెలంగాణలో నిర్మించిన దేవాలయాలు ఏవి?
ఎ) అమరేశ్వరాలయం –ఇంద్రపాలనగరం
బి) జడల రామలింగేశ్వరాలయం- చెరువుగట్టు
సి) రామలింగేశ్వరాలయం – కీసర
డి) రామేశ్వరాలయం – ఇంద్రపాలనగరం
1) ఎ,బి 2) బి,సి
3) సి,డి 4) ఎ,బి,సి,డి
11. ఎవరి పాలనా కాలాన్ని వైదికమతానికి స్వర్ణయుగంగా చెబుతారు?
1) రెండవ మాధవవర్మ
2) మొదటి విక్రమేంద్రవర్మ
3) మొదటి గోవిందవర్మ 4) ఇంద్రవర్మ
12. విష్ణుకుండినుల వంశంలో జనాశ్రయ, అనిసిత వివిధ దివ్య అనే బిరులున్న ఏ రాజు 65 సంవత్సరాలుపాటు సుదీర్ఘకాలం పరిపాలించారు?
1) ఇంద్రభట్టారిక వర్మ
2) మొదటి విక్రమేంద్రవర్మ
3) మొదటి గోవిందవర్మ
4) మూడవ మాధవ వర్మ
13. శ్రీ పర్వతస్వామి, శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులైన విష్ణుకుండినులు శ్రీశైలాన్ని ఏ పేరుతో పిలిచేవారు?
1) సిరిటన పర్వతం 2) శ్రీపర్వతం
3) శివ పర్వతం 4) శ్రీశైలం
14. విష్ణు కుండినులు తమ రాజ్యాన్ని ఎలా విభజించారు?
ఎ) పర్కాలు, విషయాలు
2) గ్రామాలు, రాష్ట్రాలు
3) రాష్ట్రాలు, విషయాలు 4) పైవేవీకాదు
15. ఎవరికాలంలో ఘటికలు అనే పిలిచే వైదిక విద్యాలయాలు ఎక్కువగా స్థాపించారు?
1) మొదటి మాధవవర్మ
2) మొదటి గోవిందవర్మ
3) ఇంద్రభట్టారిక వర్మ
4) మొదటి విక్రమేంద్రవర్మ
సమాధానాలు
1-1 2-4 3-1 4-2 5-1 6-3 7-2 8-4 9-1 10-4 11-1 12-4 13-1 14-3 15-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?