TS TET GRAND TEST PAPER-I ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
సమయం: 2 గం: 30 ని. గరిష్ఠ మార్కులు : 150
సైకాలజీ
1. థార్న్ డైక్ CAVD ప్రజ్ఞా పరీక్షలో C అనే అక్షరం సూచించే సామర్థ్యం?
1) వాక్య పూరణం 2) అవగాహన
3) పదజాలం 4) పద ధారాళత
2. వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకుని నివేదించే పద్ధతి?
1) పరిశీలనా పద్ధతి
2) వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి
3) ప్రయోగాత్మక పద్ధతి
4) అంతఃపరిశీలనా పద్ధతి
3. ఒక 9 ఏండ్ల బాలుడు.. 8 ఏండ్ల బాలుడికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తిచేయగలిగినట్లయితే అతని ప్రజ్ఞాలబ్ధి?
1) 112.5 2) 88.8
3) 102.5 4) 98.8
4. కింది వాటిలో వికాస లక్షణం కానిది?
1) గుణాత్మకమైనది 2) సమగ్రమైనది
3) అంతర్గతమైన చర్య
4) ఒక ప్రత్యేకాంశానికి పరిమితం
5. ఏ రకమైన బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు సంరక్షకుల అవసరంగల వికలాంగులుగా పరిగణించబడుతారు?
1) స్వల్ప బుద్ధిమాంద్యులు
2) మిత బుద్ధిమాంద్యులు
3) తీవ్ర బుద్ధిమాంద్యులు
4) అభ్యసన వైకల్యంగలవారు
6. పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పినవారు?
1) జాన్ డ్యూయీ 2) టెర్మన్
3) థార్న్‌డైక్ 4) జీన్ పియాజె
7. వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావునిగా, మానసిక స్థిరత్వం కలిగినవాడిగా తయారుచేసే హార్మోన్లను స్రవించే గ్రంథి?
1) అవటు గ్రంథి
2) పార్శ అవటు గ్రంథి
3) పిట్యూటరీ గ్రంథి
4) అడ్రినల్ గ్రంథి
8. వ్యక్తి శారీరక ఆత్మప్రతిమ, మానసిక ఆత్మప్రతిమ పరిపక్వత చెందే దశ?
1) బాల్యదశ 2) కౌమార దశ
3) మధ్య వయస్సు 4) వయోజన దశ
9. ఒక అబ్బాయికి చదవడం ఇష్టం లేదు, అలాగని పరీక్షలో ఫెయిల్ అవడమూ ఇష్టం లేదు – ఇక్కడి సంఘర్షణ?
1) ఉపగమ – ఉపగమ
2) ద్వి ఉపగమ – పరిహార
3) పరిహార – పరిహార
4) ఉపగమ – పరిహార
10. ఎరిక్సన్ ప్రకారం సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక, ఉత్పాదక కృత్యాల్లో పాల్గొనే వ్యక్తుల మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి?
1) ఉత్పాదకత Vs స్తబ్దత
2) సన్నిహితత్వం Vs ఏకాంతం
3) శ్రమించడం Vs న్యూనత
4) చిత్తశుద్ధి Vs స్తబ్దత
11. ఐస్‌క్రీమ్ ఇస్తానంటే చదువుకుంటాననే పిల్లవాడి నైతిక దశ?
1) 3వ దశ – సాంప్రదాయ స్థాయి
2) 2వ దశ – పూర్వసాంప్రదాయ స్థాయి
3) 1వ దశ – పూర్వసాంప్రదాయ స్థాయి
4) 4వ దశ – సాంప్రదాయ స్థాయి
12. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లవాడిలా ఏడవటంలో రక్షకతంత్రం?
1) ప్రక్షేపణం 2) ప్రతిగమనం
3) పరిహారం 4) దమనం
13. వైగోట్స్కీ ప్రకారం పిల్లలు..
1) పునర్బలనం ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు
2) పెద్దలు, సమవయస్కులతో ప్రతిచర్యలు
జరపడం ద్వారా నేర్చుకుంటారు
3) అనుకరణ ద్వారా నేర్చుకుంటారు
4) అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటారు
14. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. దీన్ని కింది విధంగా చూపవచ్చు.
1) CR+CS – UCR
2) UCS+CS – CR
3) UCS+UCR – CR
4) CS+UCS – UCR
15. 25 అర్థరహిత పదాలుగల జాబితాను శ్రీధర్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. రెండు నెలల తర్వాత మళ్లీ అదే జాబితాను తిరిగి నేర్చుకొమ్మనగా అతను 16 ప్రయత్నాలు తీసుకున్నాడు. శ్రీధర్ పొదుపు గణన?
1) 16 శాతం 2) 4 శాతం
3) 20 శాతం 4) 40 శాతం
16. మాస్లోవ్ ప్రకారం.. దాదాపు అందరు వ్యక్తులు మొదట సంతృప్తిపర్చుకోవడానికి ప్రయత్నించే అవసరం?
1) శారీరక అవసరం 2) రక్షణ అవసరం
3) ప్రేమ, సంబంధిత అవసరం
4) గుర్తింపు అవసరం
17. అభ్యసనం గురించి సరైన ప్రవచనం?
1) అభ్యసన అభ్యాసకుని ఉద్వేగాలతో ప్రభావితం కాదు
2) అభ్యసనకు పరిపక్వతతో సంబంధం లేదు
3) అభ్యసనం పరిపక్వత, ఉద్వేగాలచే ప్రభావితమవుతూ ఉంటుంది
4) అభ్యసన మన ప్రవర్తనలో కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది
18. సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు?
1) ద్విపార్శ బదలాయింపు
2) శూన్య బదలాయింపు
3) ప్రతికూల బదలాయింపు
4) అనుకూల బదలాయింపు
19. తిరోగమన అవరోధంలో..
1) గతంలో నేర్చుకున్న విషయం ప్రస్తుతం అభ్యసన ధారణపై ప్రభావం చూపుతుంది
2) ప్రస్తుత అభ్యసన, గత అభ్యసనమును పునఃస్మరణ చేయడంలో ఆటంకం కలిగిస్తుంది
3) ప్రస్తుత అభ్యసన, గత అభ్యసన పునఃస్మరణకు సాయపడుతుంది
4) ప్రస్తుత అభ్యసన పునఃస్మరణపై గత అభ్యసన ప్రభావం ఉండదు
20. ఫలిత సూత్రాన్ని ప్రతిపాదించినవారు?
1) వాట్సన్ 2) థార్న్‌డైక్
3) పావ్లోవ్ 4) బండూరా
21. అభ్యాసకుడు స్థిరమైన జీవిత తత్వాన్ని దేని ద్వారా అభివృద్ధిపర్చుకుంటాడు?
1) హస్తలాఘవం 2) స్వభావీకరణ
3) భావన నిర్మాణం 4) శీలస్థాపన
22. ఆకృతీకరణ భావన దేనికి సంబంధించినది?
1) శాస్త్రీయ నిబంధన
2) కార్యసాధక నిబంధన
3) అంతర్దృష్టి అభ్యసన
4) యత్నదోష సిద్ధాంతం
23. బుద్ధిమాంద్యుల విద్యలో పునర్బలనంతో సంబంధం లేనిది?
1) క్రమీణ ఆస్తిత్వం 2) ఆకృతీకరణ
3) గొలుసు విధానం 4) త్వరణం
24. సహభాగి, సహకార అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం?
1) విద్యార్థులు నేర్చుకునే విషయానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది
2) ఉపాధ్యాయుల విషయజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది
3) ఉపాధ్యాయుల మధ్య పరస్పర చర్యలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది
4) విద్యార్థుల మధ్య పరస్పర చర్యలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది
25. ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం?
1) బ్రూనర్ బోధనా సిద్ధాంతం
2) థార్న్‌డైక్ యత్న-దోష సిద్ధాంతం
3) బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం
4) స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం
26. బోధనా విషయం విద్యార్థులకు అందించే హెర్బర్ట్ సోపానం?
1) సన్నాహం 2) సంసర్గం
3) సమర్పణ 4) అన్వయం
27. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు నిర్ధారించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి?
1) 1:25 2) 1:30
3) 1:35 4) 1:40
28. నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్టు పనులకు ఇచ్చిన భారత్వం?
1) 10 శాతం 2) 20 శాతం
3) 30 శాతం 4) 40 శాతం
29. కింది వాటిలో జాతీయ విద్యాప్రణాళికా చట్రం – 2005లో పనివిద్యకు సంబంధించిన భావన కానిది?
1) పనివిద్య సంస్థాగతం చేయబడాలి
2) పనివిద్య ద్వారా నైపుణ్యంగల పనివారిని తయారు చేయడం
3) ఉత్పత్తిదాయక పనిని జ్ఞాన సంపాదనకు బోధనా మాధ్యమంగా మలచాలి
4) పనివిద్య బళ నైపుణ్యాల సాధనకు సాయపడాలి
30. మార్గదర్శనం గురించి తప్పు ప్రవచనం?
1) సర్దుబాటు సమస్యలుగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం
2) చదువుపట్ల అనాసక్తిగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం
3) కుటుంబ సమస్యలుగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం
4) పాఠశాలపట్ల ప్రతికూల వైఖరిగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం
తెలుగు
31. కామారి అనే పదానికి వ్యుత్పత్యార్థం?
1) చేతులు జోడించి చేయునది
2) వయస్సుకు నిధి వంటిది
3) తీవ్రంగా పోవునది
4) మన్మధునికి శత్రువు
32. తెలుగు సంవత్సరాలు 60. అయితే అంగీరస సంవత్సరం తర్వాత వచ్చే తెలుగు సంవత్సరం ఏది?
1) శ్రీముఖ 2) ప్రజోత్పత్తి
3) తారణ 4) ఈశ్వర
33. నిజమూహింప అనే పదాన్ని విడదీసి, ఏ సంధి కార్యమో పేర్కొనండి?
1) నిజము+ఊహింప – సవర్ణదీర్ఘసంధి
2) నిజము+ఊహింప – అత్వసంధి
3) నిజము+ఉహింప – అత్వసంధి
4) నిజము+ఉహింప – సవర్ణదీర్ఘసంధి
34. బతుకమ్మ సిగలోన తంగేడు పువ్వు. బతుకంతా బంగారమైన నవ్వు – అనే వాక్యంలో ఉన్న అలంకారం?
1) ముక్తపదగ్రస్థాలంకారం
2) మరుకాలంకారం
3) అంత్యానుప్రాసాలంకారం
4) ఛేకానుప్రాసాలంకారం
35. సామ్యత అనే పదం తొలిసారిగా ఏ పురాణంలో ప్రయోగించబడింది?
1) మత్స్యపురాణం 2) బసవపురాణం
3) అగ్నిపురాణం 4) వరాహపురాణం
36. ఏ భాషా సామెతలను సేకరించిన అరిస్టాటిల్ ప్రపంచంలోనే మొట్టమొదటి సంకలనకారుడు?
1) పోర్చుగీసు 2) గ్రీకు
3) లాటిన్ 4) ఆంగ్లం
37. సామెతకు పర్యాయపదాలుగా చెప్పబడనివి?
1) నానుడి, నుడికారం, జనశ్రుతి
2) నానుడి, పదజాలం, శాస్త్రం
3) నానుడి, శాస్త్రం, జనశ్రుతి
4) నానుడి, లోకోక్తి, నుడికారం
38. సామెతకు లక్షణంగా చెప్పబడినది?
1) వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత
2) పుస్తకాల్లో నుంచి పుట్టి జనవ్యవహారంలోకి రావడం
3) అనుభవ రూపంలో ఉండటం
4) వాక్యరూపంలో ఉండి సార్వజనీనత కలిగి ఉండటం
అపరిచిత గద్యం
అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన అన్న వాక్యానికి సామెతలు ఉదాహరణగా నిలిచాయి. సామెత అనే పదానికి సమానమైన పదం కన్నడంలో సామతి. ఈ సామతి సామ్యెత నుంచి ఉద్భవించినట్లయితే తెలుగులో సామ్యము నుంచి సామెత ఆవిర్భవించింది. సామ్యశబ్దానికి సామ్యత అనే అసాధారణ రూపమేర్పడి సామెతగా మారి ప్రచారంలో ఉందని చిలుకూరి నారాయణరావుగారి అభిప్రాయం. సామ్యత అనే పదం 15వ శతాబ్దంలోని వరాహపురాణంలో తొలిసారిగా ప్రయోగించబడింది. సామెతకు పర్యాయపదాల నానుడి, లోకోక్తి, శాస్త్రం, జనశ్రుతి, గ్రేశు సామెతలను సేకరించిన అరిస్టాటిల్ ప్రపంచంలోనే మొట్టమొదటి శాస్త్రీయ సంకలనకారుడు. మార్పక్ వంగ సామెతల పుస్తకం భారతీయ భాషల్లో మొట్టమొదటి సంకలనం సామెతను అరబ్బీలో మతేత అని, సంస్కృతంలో సూక్తి, సుభాషితం అని, తమిళంలో పళమొళి అని, కన్నడంలో గాదె అని, హిందీలో కహవల్ అని, మలయాళంలో పళించార్ అని పిలుస్తారు. సామెత అనుభవ రూపంలో ఉండాలి. సార్వజనీనత క్లుప్తత, వాక్యరూపంలో ఉండుట, సంక్షిప్తత, వాచ్చార్థంకంటే వ్యంగ్యార్థానికే ప్రాధాన్యత సామెత లక్షణాలు.
39. సామ్య శబ్దానికి ఏ అసాధారణ రూపమేర్పడి సామెతగా మారిందని ప్రచారంలో ఉంది?
1) సామ్యత 2) సౌమ్యత
3) సమ్యత 4) సాయ్యెత
40. ఈ పద్యకర్త ఎవరు?
1) పండిత రామసింహకవి
2) కాకుత్థం శేషప్పకవి
3) వేంకటరావు పంతులు
4) సూరోజు బాలనరసింహకవి
41. పట్టెడన్నమో అనేది?
1) పట్టెడ+ అన్నమో
2) పట్టెడు + అన్నమో
3) పట్టెడు + అన్నము
4) పట్టె + అన్నమో
42. ఈ పద్యంలో బాకవడంలో వెలసిన వారు ఎవరు?
1) అంజనేయుడు 2) శివుడు
3) విష్ణుమూర్తి 4) శ్రీరాముడు
43. ఆకలి దప్పులతో అలమటించేవారికి ఏమిచ్చి శాంతపరిస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయి?
1) విద్యా, సంపద, వర్షం
2) సిరులు, నగలు, అన్నం
3) నీళ్ళు, విద్యా, శాకం
4) అన్నం, శాకం, నీళ్ళు
44. ఖలం- అనే పదానికి అర్థం
1) పాపం 2) పుణ్యం
3) శ్రేయం 4) ప్రేమ
45. ‘హంస’ అనే పదమునకు పర్యాయపదాలను గుర్తించండి?
1) ముక్తి, నిర్వాణం, కడగండ్లు
2) మరాళము, చక్రాంగం, మౌనసౌకము
3) కైవల్యం, ముక్తి, నిర్వాణం
4) ఇక్కట్టు, శ్రమ, ఇడుము
46. మంజీరనాదాలు, వివేకవిజయం అనే రచనలు ఎవరివి?
1) సుద్ధాల హనుమంతు
2) కాళోజీ నారాయణరావు
3) వట్టికోట ఆళ్వారుస్వామి
4) ఏదీకాదు
47. వర్ణం అనే పదానికి వికృతి పదం?
1) వన్నె 2) వరం
3) వరణం 4) వన్న
48. అమంగళం, తిలన్ధరుడు – అనేవి
1) నఞ్ + తత్పురుష, తృతీయతత్పురుష
2) ద్వితీయ తత్పురుష. నఞ్ + తత్పురుష
3) నఞ్+తత్పురుష, ద్వితీయాతత్పురుష
4) తృతీయ తత్పురుష, షష్ఠీతత్పురుష
49. అశ్విత్ అరగంటలో అరవై పద్యాలు రాయగలడు. ఏ వాక్యం?
1) విధ్యర్థక వాక్యం
2) నిశ్చయార్థక వాక్యం
3) ప్రార్థనార్థక వాక్యం
4) సామర్థ్యాక వాక్యం
50. తే, ఇతే, ఐతే అనే ఛేదర్థక ప్రత్యయాలు ఈ సంబంధాన్ని తెలుపుతాయి?
1) భూతకాల వ్యాపారార్థం
2) ఏకకాల కలార్థం
3) కార్యకారణం
4) అవృంతకార్యకారణం
51. వైతాళికుడు-ముష్టి అనేవి వరుసగా ఈ అర్థవిపరిణామానికి చెందుతాయి?
1) అర్ధోత్కర్ధ – అర్ధాపకర్ష
2) అర్ధాపకర్ష – అర్ధాపకర్ష
3) అర్ధోత్కర్థ – లక్ష్యార్థసిద్ధి
4) అర్ధాపకర్ష- లక్ష్యార్థసిద్ధి
52. వీటిని ఉచ్ఛరించినపుడు నాదతంత్రులు మిక్కిలి దగ్గరగా ఉంటాయి.
1) ఘోషాలు , కఠినవ్యండనాలు
2) అఘోషాలు, మహాప్రాణులు
3) ఘోషాలు, అల్ప ప్రాణులు
4) అఘోషాలు, అల్ప ప్రాణులు
53. పొట్లపల్లి రామారావు రచించిన ‘చీమలబారు’ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది?
ఎ) ద్విపద బి) ఖండకావ్యం
సి) జానపదకథ డి) వచన కవిత
54. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ఆడవారి అతిపెద్ద పండుగలో భాగంగా నాలుగోరోజు జరుపుకొనే పండుగ?
1) ముద్దపప్పు బతుకమ్మ
2) వెన్నెముద్దల బతుకమ్మ
3) నానబియ్యం బతుకమ్మ
4) అట్ల బతుకమ్మ
తెలుగు మెథడ్స్
55. గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయడం అనేది ఏ విద్యా ప్రమాణం
1) ప్రశంస 2) పదజాలం
3) స్వీయరచన 4) సృజనాత్మకత
56. ఉక్త రచనకు మరొక పేరు?
1) స్వీయ రచన 2) చూచిరాత
3) వక్తృత్వం 4) మూల్యాంకనం
57. విద్యార్థులకు భాషపైన అభిరుచిని, ఆసక్తిని కలిగించే బోధన పద్ధతి?
1) పూర్ణపద్ధతి 2) పఠన పద్ధతి
3) ప్రశంస పద్ధతి 4) చర్చపద్ధతి
58. విద్యార్ధుల్లో, ఉపాధ్యాయుల్లో ఉచ్చారణ సామర్థ్యాన్ని పెంపొందించే పరికరం.
1) టేప్ రికార్డర్ 2) కంప్యూటర్
3) టెలివిజన్ 4) చలనచిత్రాలు
59. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం?
1) సెప్టెంబర్ 9 2) అక్టోబర్ 8
3) ఫిబ్రవరి 21 4) సెప్టెంబర్ 8
60. ప్రత్యేక పరీక్ష శ్రేణులు దేనికి సంబంధించినవి?
1) ప్రామాణిక పరీక్షలు
2) ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు
3) లోప నిర్దారణ పరీక్షలు
4) మనోవైజానిక పరీక్షలు
ENGLISH
61. Manjula and Sruthi play…. ……guitar well.
1. a 2. an 3.the 4.no article
62. The teacher explained the pro blem…………the students
1. with 2. to 3. by 4. up
63. I built a high wall – change ! into passive voice
l. A high wall is built by me
2. A high wall was built by me
3. A high wall had been built by me
4. A high wall did built by me
64. Rakesh set up a new business choose the meaning of the ’phrasal verb’
1. bought 2. offered
3. started 4. showed
65. If you are thirsty, you can drink butter milk This is;
1. a simple sentence
2. a compound sentence
3. a complex sentence
4. an itetnoagative sentence
66. How can you ………..that?
– choose the correct form of the ’verb’
1. say 2. said
3. says 4.have said
67. Delhi is too expensive
Choose the antonym of the word ’expensive’
1. dull 2. cheap
3. Costlly 4. busy
68. My father is ………school teacher
1. an 2. a 3. the
4. No article
69. The train …….before we reached the station.
l. left 2. had left
3. is leaving 4. would left
70. They will never believe us,……..?
l. will they 2. won’t they
3. don’t they 4. didn’t they
71. He says, ‘1 am a teacher‘ – change into Indirect Speech.
l. He says that he was a teacher
2. He says that he had a teacher
3. He says that he is a teacher
4. He says that he would a teacher
72. They……. (write) TET exam by june 12th,2022
1. will wrote 2. will have write
3. will have written 4. wrote
73. I am not responsible……this issue
l. with 2. to 3. For 4. by
74. Work hard you will get success choose the correct conditional clause to combine the above sentence
l. If you work hard, you will not get success
2. If you work hard. you would get success
3. If you work hard, you will get success
4. If you worked hard, you will got success.
75. The bird——-out if you leave the door of the cage
1. flies 2. Will fly
3. fly 4. would fly
76. Choose the sentence that ex press ability
1. He can carry this bad
2. He carries bags
3. He may carry this bag
4. He should carry this bag
77. Walking improves health in the above sentence ’walking’ is
1. a present participle 2. agerund
3. a helping verb 4. a past participle
78. I forget his name in the above sentence the underlined word is
1. noun 2. verb
3, conjunction 4. pronoun
79. They……. living here since 1999.
1. have been 2. has been 3. are being 4. had
80. Identify the correctly spelt word
1. accomodation
2. accommodation
3. acommodation
4. accommodetion
81. The opposite of ‘equality’ is……..
1. unequlity 2. disequlity
3. nonequlity 4 inequality
82. Mumbai is one of the most populated cities chanege into Positive Degree
1. No other city is so populated as Mumbai
2. very few cities are as populated as Mumbai
3. Mumbai is the most populated city 4. None
83. Letter is a…………..
1. Oral communication
2. Verbal communication
3. Writter communication
4. none
84. A person who never takes alco holic drinks
1. Samaritan 2. teetotaller
3. pruitan 4. progmatis
English Methods
85. Identify the sentence which does not have a gerund in it.
1. Walking is good for health.
2. I was tired of waiting.
3. It is no use running after shadows,
4. He is citirig a car.
86. Which of the following Is an authentic material?
l. Text book 2. Electricity bill
3. Supplementary text
4. Dictionary
87. The principles of selecting and grading the content area
1. Frequency, coverage, simplicity
2. Frequency, range, usefulness
3. Coverage, beauty, difficulty level
4. Learnability, availability, Interest
88. I went to a bank to save some money. The minister walked along the bank of the river. The words underlined in the above two sentcnces are known as
1. Antonyms 2. Homophones
3. Synonyms 4. Phrasal Verbs
89. The test prepared by experts at state or national level to measure the achievement or students in a large number of schools is a/an
1. Standardized test
2. Diagnostic test
3. Aptitude test
4. Placement test
90. An approach deals with….
l. how to teach language.
2. how languages are learnt.
3. how a thing is done in the classroom.
4. classroom procedures.
గణితం
91. 10-12కు సమానమైన విలువ
1) 1/1012 2) 1/1210
3) -1012 4) -1210
92. ఒక సంఖ్యలో 25 శాతం 40 అయిన ఆ సంఖ్య
1) 10 2) 100 3) 140 4) 160
93. 3:4, 2:3ల బళ నిష్పత్తి
1) 1:2 2) 2:1
3) 8:9 4) 9:8
94. a,b రెండు పూర్ణసంఖ్యలైతే కింది వాటిలో పూర్ణసంఖ్య కానిది?
1) a+b 2) a-b 3) axb 4) a/b
95. [(-3/8) x (-7/13)] వ్యుత్క్రమం
1) -104/21 2) 104/21
3) 21/104 4) పైవేవీ కావు
96. 4 a b 5 అనే నాలుగంకెల సంఖ్య 55తో భాగించబడితే b-a విలువ ఎంత?
1) 0 2) 1 3) 4 4) 5
97. రూ. 50,000 లకు 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ
1) 4000 2) 4050
3) 4080 4) 4280
98. (0.216+0.064)/(0.36+0.16-0.24) విలువ
1) -2 2) -1 3) 0 4) 1
99. 7 2/3 మీటర్ల వస్త్రం ఖరీదు రూ. 120 3/4 అయిన 1మీ. వస్త్రం ఖరీదు (రూ.లలో)
1) 4/63 2) 19 5/7
3) 19 5/12 4) 15 3/4
100. ABCలో AB+BC=10 సెం. మీ. BC+CA=12 సెం. మీ. CA+AB=16 సెం. మీ. అయిన ఆ త్రిభుజ చుట్టు కొలత?
1) 9.5 2) 19 3) 38 4) 36
101. ఒక చతుర్భుజంలో, కోణాలు వరుసగా x0, (x-10)0,(x+30)0, 2×0 అయిన వాటిలో చిన్న కోణం
1) 480 2) 520
3) 580 4) 68 0
102. 48, 56, 72ల క.సా.గు
1) 108 2) 1080 3) 1008 4) 180
103. రవి దగ్గర రూ.20 ఉన్నవి. మధు దగ్గర రవి కంటే 30 రెట్లు ఎక్కువ డబ్బు ఉన్నవి. అయిన మధు దగ్గర ఉన్నది?(రూపాయలలో)
1) 400 2) 600
3) 450 4) 650
104. మహేష్ ప్రతి రోజు రూ. 375 సంపాదిస్తాడు. అతను రూ. 200 ఖర్చు చేసిన, ప్రతిరోజు అతను పొదుపు చేసే మొత్తం (రూపాయల్లో)
1) 275 2) 175 3) 205 4) 105
105. దీర్ఘచతురస్రానికి సౌష్టవ రేఖల సంఖ్య?
1) 2 2) 3 3) 1 4) 4
106. (x/2)+(1/3)=1 అయిన ‘x’ విలువ
1) 3/4 2) 4/3
3) 3/2 4) పైవేవీ కావు
107. 3x=729 అయిన x2 విలువ?
1) 25 2) 49
3) 16 4) 36
108. రెండు పూర్ణసంఖ్యల మొత్తం 18. అందులో ఒకటి (-20) అయిన రెండవది?
1) 8 2) 18
3) 28 4) 38
109. (-4), 0 అనే వాటి మధ్య పూర్ణసంఖ్యల లబ్దం?
1) 6 2) 5 3) -6 4) 0
110. 16, 13, 8, 12, 19, 17, 12, 16, x, 19 అనే దత్తాంశపు బళకం 12 అయిన x విలువ?
1) 19 2) 16 3) 12 4) 8
111. ఒక వ్యక్తి నెల జీతం రూ. 15,000 అతను ఆహారం, అద్దె నిమిత్తం ఖర్చు చేసిన భాగాన్ని వృత్త రేఖాచిత్రంలో కేంద్రం చేసే కోణం 600గా చూపించిన అతను ఆహారం, అద్దె నిమిత్తం ఖర్చు చేసింది(రూపాయలలో)
1) 2500 2) 5000
3) 6000 4) 9000
112. x=2, y=-1, z=3 అయిన3xyz-x3-y3+z3 విలువ
1) 0 2) 2 3) 36 4) 54
113. మూడు విభిన్న అంకెలతో ఏర్పడిన ఐదంకెల అతి పెద్ద సంఖ్య
1) 99999 2) 97989
3) 98987 4) 99987
114. మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి?
1) 3 2) 4.4 3) 5 4) 5.6
ట్రైమెథడ్స్
115. పెద్దవిగా ఉన్న సమస్యలు వచ్చినప్పుడు విద్యార్థులకు అవగాహన పరచడానికి, సమస్యను పోలిన మరో చిన్న సమస్యను విద్యార్థులకు పరిచయం చేసిన తద్వారా అసలు సమస్యను పరిష్కరించడం అనేది ఏ నిర్దిష్ట పద్ధతిని అనుసరిస్తుంది?
1) పునఃప్రవచన పద్ధతి 2) విశ్లేషణ పద్ధతి
3) సాదృశ్యాల పద్ధతి
4) చిత్రీకరణ పద్ధతి
116. జియోబోర్డు ఉపయోగం?
1) చతుర్విధ పరిక్రియలు బోధించవచ్చు
2) చతుర్భుజ రకాలు ప్రదర్శించవచ్చు
3) స్థాన విలువలు అవగాహన పరచవచ్చు
4) ఆరోహణ, అవరోహణ వివరించవచ్చు
117. కింది వాటిలో ‘గణితం-జీవశాస్త్రం’ మధ్య సహసంబంధం తెలియజేసే అంశం?
1) ఉష్ణోగ్రత, వర్షపాతం
2) రసాయన మిశ్రమాలు, సమ్మేళనాలు
3) ఆటస్థలాలు, కోర్టులు గీయడం
4) క్రిమి సంహారక మందులు, భూసార పరీక్షలు
118. ప్రస్తుతం మనం పాఠశాలల్లో రేఖాగణితం పేరుతో చదువుతున్న అంశాలన్నింటికీ మూలమైన గ్రంథం, గ్రంథకర్త?
1) ఆర్యభట్టీయం- ఆర్యభట్ట
2) సిద్ధాంత శిరోమణి-భాస్కరాచార్య
3) బ్రహ్మస్ఫుట సిద్ధాంతం- బ్రహ్మగుప్త
4) ఎలిమెంట్స్- యూక్లిడ్
119. గణితంలోని సంగ్రహణాత్మక మూల్యాంకనం అనుసరించి ‘భిన్నాలు’ పాఠ్యాంశంలో ‘కారణాలు చెప్పడం- నిరూపణలు చేయడం’ అనే విద్యా ప్రమాణాన్ని సూచించే సరైన అంశం?
1) సజాతి భిన్నాలను కూడిక చేస్తాడు
2)భిన్నాలను ఆరోహణ-అవరోహణ క్రమంలో రాస్తాడు
3) భిన్నాలను దైనందిన జీవితానికి అనుసంధానిస్తాడు
4) భిన్నాలను సంఖ్యారేఖపై సూచిస్తాడు
120. కింది వాటిలో ఏ అంశానికి హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడ్డాయి?
1) భాషాశైలి 2) మనోవైజ్ఞానికాధారం
3) పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు
4) పుస్తకం భౌతిక రూపం
ఈవీఎస్
121. ద్రవాలను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
1) మీటర్లు 2) గ్రాము
3) చదరపు మీటర్లు 4) లీటర్లు
122. అతిపెద్ద పుష్పం?
1) రఫ్లీషియా 2) సఫ్లవర్
3) తామర 4) పాస్సిఫ్లోరా
123. గాలిలో ఉండే ధూళి, పొగ రేణువుల వల్ల మానవుల్లో కలిగే వ్యాధి?
1) ఆర్థరైటిస్ 2) ఎనిమియా
3) గాస్ట్రెటిస్ 4) బ్రాంఖైటిస్
124. కింది వాటిలో పప్పు ధాన్యాల పంట కాదు?
1) వేరుశనగ 2) రాగులు (తైదలు)
3) మినుములు 4) బఠాణీ
125. కింది వాటిలో ప్రొటీన్లు అధికంగా ఉండేవి?
1) కందులు 2) మొక్కజొన్నలు
3) గోధుమలు 4) బియ్యం
126. సాధారణ మానవుని నోటిలో గల అగ్రచర్వణకాల (నమిలే దంతాలు) సంఖ్య?
1) 4 2) 6 3) 8 4) 2
127. వైశాల్యపరంగా భారత్ కంటే చిన్న దేశం?
1) ఆస్ట్రేలియా 2) అర్టెంటీనా
3) కెనడా 4) బ్రెజిల్
128. కింది వాటిలో బాలలు పొందలేని హక్కు?
1) గౌరవాన్ని పొందే హక్కు
2) ఉపాధి పొందే హక్కు
3) యుద్ధం నుంచి రక్షణ పొందే హక్కు
4) జీవించే హక్కు
129. భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు?
1) బీఆర్ అంబేద్కర్ 2) కేఎం మున్షి
3) నెహ్రూ
4) డాక్టర్ రాజేంద్రప్రసాద్
130. భూమికి అతిదగ్గరగా ఉన్న పొర?
1) స్ట్రాటో ఆవరణం
2) మెసో ఆవరణం
3) ఎక్సో ఆవరణం
4) ట్రోపో ఆవరణం
131. కింది వాటిలో ఎప్పటికీ తగ్గిపోని వనరులు?
1) బొగ్గు, సూర్యకాంతి, గాలి
2) సహజ వాయువు, నీరు
3) గాలి, సూర్యకాంతి
4) కిరోసిన్, గాలి, నీరు
132. ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మించినది ఎవరు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) సర్ వికార్ ఉల్- ఉమ్రా
3) మూడవ సాలార్జంగ్
4) కులీ కుతుబ్ షా
133. మానవునిలో స్కర్వి వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది?
1) కాల్సి ఫెరాల్ 2) ఆస్కార్బికామ్లం
3) ఫోలికామ్లం 4) రిబోఫ్లావిన్
134. మానవుని శరీర భాగాల నుంచి హృదయం (గుండె)లోని ఈ గదిలోకి ఆమ్లజని రహిత రక్తం చేరుతుంది?
1) కుడి కర్ణిక 2) ఎడమ జఠరిక
3) కుడి జఠరిక 4) ఎడమ కర్ణిక
135. కిరణజన్య సంయోగక్రియకు ఆవశ్యకమైన కారకాలు?
1) CO2, O2 పత్రహరితం, సూర్యకాంతి
2) గ్లూకోజ్ CO2, పత్రహరితం, సూర్యకాంతి
3) CO2, పిండి పదార్థం, పత్రహరితం, సూర్యకాంతి
4) CO2, H2O, పత్రహరితం, సూర్యకాంతి
136. మానవుని పరిధీయ నాడీవ్యవస్థలో ఉండేవి?
1) వెన్నుపాము, వెన్నునాడులు
2) మెదడు, వెన్నుపాము
3) కపాలనాడులు, వెన్నునాడులు
4) మెదడు, కపాలనాడులు
137. ‘ఫలదళం’ పుష్పం ఏ భాగానికి చెందినది?
1) ఆకర్షక పత్రావళి 2) కేసరావళి
3) అండకోశం 4) రక్షక పత్రావళి
138. ఏ గ్రంథి జీర్ణ ఎంజైమ్‌లను స్రవించదు?
1) జఠర గ్రంథులు 2) కాలేయం
3) క్లోమం 4) లాలాజల గ్రంథులు
139.భ్రమరాంబికా సంవాదం గ్రంథకర్త?
1) పావురం రంగాచార్యులు
2) బహిరి గోపాలరావు
3) కడుకుంట్ల పాపశాస్త్రి
4) అనుముల వేంకట సబ్రమణ్యశాస్త్రి
140. గండిపేట చెరువును ఏమని పిలుస్తారు?
1) అలీసాగర్ 2) ఉదయ సముద్రం
3) ఉస్మాన్‌సాగర్ 4) స్సేన్‌సాగర్
141. కింది వాటిలో తెలంగాణలో ప్రవహించని నది?
1) తుంగభద్ర 2) కిన్నెరసాని
3) పెన్నా 4) ప్రాణహిత
142. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎల్లోరా గుహలు ఎవరి కాలానికి చెందినవి?
1) మౌర్యులు 2) విజయనగర
3) కాకతీయులు 4) గుప్తులు
143. ప్రస్తుతం పోస్టాఫీసులు ఏ సేవలను అందించడం లేదు?
1) జీవిత బీమా
2) ఉత్తరాలను చేరవేయడం
3) టెలిగ్రామ్ పంపడం
4) డబ్బు దాచుకోవడం
144. మండల ప్రజాపరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారు?
1) మండల విద్యాధికారి
2) మండల పరిషత్ అభివృద్ధి అధికారి
3) వ్యవసాయ అధికారి
4) తహసీల్దార్
145. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1) భావావేశ రంగంలో కింది స్థాయి-శీలస్థాపనం
2) మానసిక చలనాత్మకరంగంలో 2వ అత్యున్నత స్థాయి- సమన్వయం
3) జ్ఞానాత్మకరంగం ఆధిపత్యశ్రేణిలో 2వ స్థానం-సంశ్లేషణ 4) పైవన్నీ సరైనవి
146. కింది వాటిలో ఒక కృత్యం విజ్ఞానశాస్త్రం, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మడిగా చేయలేరు?
1) నేలలు, పంటల పరిశీలన
2) ఒక నెలలో వాతావరణ నమోదు
3) నీటి వనరులకు క్షేత్రపర్యటన
4) పోస్టాఫీసు సందర్శన
147. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులో అగ్రభాగం నుంచి ఆధార భాగానికి జరిగే చర్యల్లో సరైనవి?
ఎ. మూర్తం పెరుగుదల, అమూర్తం తగ్గుదల
బి.అనుభవాల నివృత్తి పెరుగుతుంది
సి. మూర్తం తగ్గుదల, అమూర్తం పెరుగుదల
డి. అనుభవాల విస్తృతి తగ్గుతుంది
1) ఎ, బి సరైనవి 2) బి, సి సరైనవి
3) సి, డి సరైనవి 4) డి, ఎ సరైనవి
148. ‘మొక్కలు-జంతువులు’ పాఠ్యాంశాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడు మౌఖిక ప్రశ్నల ద్వారా విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని ఏ దశలో పరీక్షిస్తాడు (హెర్బర్ట్ సోపానాలను అనుసరించి)?
1) సన్నాహం 2) సమర్పణ
3) సంసర్గం 4) అన్వయం
149. ‘తెలంగాణ అభివృద్ధికి కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం’ అనే అంశాన్ని ఉత్తమంగా ఏ పద్ధతిలో బోధించవచ్చు?
1) ఉపన్యాస పద్ధతి
2) సమస్యా పరిష్కార పద్ధతి
3) ప్రాజెక్టు పద్ధతి
4) వాద-సంవాద పద్ధ్దతి
150. కింది వాటిలో వ్యాసరూప ప్రశ్న గుర్తించండి?
1) మూడు రాజధానుల గొప్ప దనాన్ని సోదాహరణంగా వివరించండి
2) మూడు రాజధానుల్లో పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నగరమేది?
3) మూడు రాజధానుల పట్టణాలను ఆనుకొని ప్రవహిస్తున్న నదులేవి?
4) ప్రపంచంలో మూడు రాజధానులు కలిగిన దేశమేది?
సమాధానాలు
1-1 2-4 3-2 4-4 5-3 6-1 7-3 8-2 9-3 10-1 11-2 12-2 13-2 14-4 15-3 16-1 17-3 18-4 19-2 20-2
21-4 22-2 23-4 24-4 25-1 26-3 27-3 28-2 29-2 30-3 31-1 32-1 33-2 34-3 35-4 36-2
37-3 38-2 39-1 40-3 41-3 42-1 43-4 44-1 45-2 46-3 47-1 48-3 49-4 50-3 51-3 52-4
53-4 54-3 55-4 56-3 57-3 58-1 59-4 60-1 61-3 62-2 63-2 64-3 65-3 66-1 67-2 68-2
69-2 70-1 71-3 72-3 73-3 74-3 75-2 76-1 77-2 78-2 79-1 80-2 81-4 82-2 83-3 84-2
85-4 86-2 87-2 88-2 89-1 90-2 91-1 92-4 93-1 94-4 95-2 96-2 97-3 98-4 99-4 100-2
101-4 102-3 103-2 104-2 105-1 106-2 107-4 108-4 109-3 110-3 111-1 112-2
113-4 114-4 115-3 116-2 117-4 118-4 119-2 120-2 121-4 122-1 123-4 124-2
125-1 126-3 127-2 128-2 129-1 130-4 131-3 132-2 133-2 134-1 135-4 136-3
137-3 138-2 139-3 140-3 141-3 142-4 143-3 144-2 145-2 146-4 147-1 148-1 149-4 150-1
ఏకేఆర్స్టడీసర్కిల్, వికారాబాద్
అధ్యాపక బృందం: శివపల్లి (సైకాలజీ), రాజేంద్రచారి (ఇంగ్లిష్), శివశంకర్ (తెలుగు), బీ.వీ.రమణ(మ్యాథ్స్) సత్యనారాయణ, ఢిల్లీబాబు,శ్రీకాంత్(ఈవీఎస్) ఈ ప్రశ్న పత్రాన్ని రూపొందిచారు.
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?