చట్టం ముందు అందరూ సమానులే..
భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను 3వ భాగంలో 12 అధికరణ నుంచి 35 నిబంధనల వరకు పొందుపరిచారు. గత వ్యాసంలో 12, 13, 33, 34, 35 అనుబంధ అధికరణలు వివరించడమైంది. ఇందులో సమానత్వపు హక్కు గురించి వివరించడం జరిగింది.
-ప్రాథమిక హక్కులు మొదట 7 ఉండగా ఆస్తిహక్కు తొలగించడంతో ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి.
-సమానత్వపు హక్కు (Right to Equality)-14 నుంచి 18 నిబంధనలు
-రాజ్యం స్వభావం ఆ దేశ ప్రజలకు కల్పించిన హక్కుల ద్వారా తెలుస్తుందని హెచ్.జె.లాస్కీ పేర్కొన్నారు.
14 వ నిబంధన :
-చట్టం ముందు అందరూ సమానులే.
-చట్టం ముందు అందరూ సమానులే అనే పదం బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
-బ్రిటన్ దేశానికి చెందిన ఏవీ డైసీ Law of the British Constitution అనే గ్రంథంలో సమన్యాయ పాలన (Rule of Law) గురించి వివరించాడు.
-భారతదేశ ప్రజలందరికీ సామాజిక న్యాయాన్ని సాధించే లక్ష్యంతో రాజ్యాంగంలో సమానత్వపు హక్కును పొందుపరిచారు.
-చట్ట సమానత్వాన్ని పౌరులందరికీ అంతస్తుల్లోనూ, అన్ని అవకాశాల్లోనూ కల్పించారు.
-14 (b) నిబంధన ప్రకారం చట్టం అందరికి సమానంగా రక్షణ కల్పిస్తుంది.
-రక్షణ అనే పదం అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
-14 (b) నిబంధనలోని రక్షణ అనే పదం వర్గశాసన నిర్మాణం Class Legislationను నిషేధిస్తుంది.
-14వ నిబంధన విదేశీ రాయబారులకు వర్తించదు.
-361వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ విధుల నిర్వహణలో ఏ న్యాయస్థానంలో కూడా జవాబుదారి కారు. వారిని అరెస్టు చేయరాదు.
-361వ నిబంధన భారత రాష్ట్రపతికి, గవర్నర్లకు ప్రత్యే క రక్షణ కల్పిస్తుంది. రాష్ట్రపతి, గవర్నర్లు పదవిలో ఉండగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు, అరెస్టు చేయరాదు. వారిపై సివిల్ కేసు వేయాలంటే 2 నెలల ముందుగా నోటిస్ ఇవ్వాలి.
-చట్టం ముందు అందరూ సమానులే అనే నియమం నుంచి రాష్ట్రపతి, గవర్నర్లకు మినహాయింపు లభిస్తుంది.
-చట్టం ముందు అందరూ సమానులే అనే అంశం నకారాత్మకమైనది అని రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ప్రకటించింది.
-రణధీర్‌సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1982) కేసులో సుప్రీంకోర్టు సమానమైన పనికి సమానవేతనం ప్రాథమిక హక్కు కానప్పటికీ ఇది 14, 16, 39(d) అధికరణాల కింద కచ్చితంగా రాజ్యాంగబద్ధమైన లక్షణమేనని, నైపుణ్యాలు (Skills) విషయంలో ఈ హక్కును అమలు చేయవచ్చని తెలిపింది.
-విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (1997) కేసులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖ లు చేయగా 14, 19, 21 నిబంధన పరిధిలో మహిళల హక్కులను పురుషులతో సమానంగా విధి విధానాలను రూపొందించాలని ప్రకటించింది.
-సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు వారు నిర్వర్తించిన విధులకు.. అంటే వారు ఇచ్చిన తీర్పులకు జవాబుదారులు కారు.
15 వ నిబంధన:
-5 రకాల వివక్షతలు నిషేధం
-15(1) అధికరణ ప్రకారం జాతి, కుల, మత, లింగ, జన్మ సంబంధమైన వివక్షతలు ఎవరిపట్ల చూపరాదు.
-15(2) అధికరణ ప్రకారం ప్రభుత్వ ప్రదేశాల్లో కానీ, బహిరంగ ప్రదేశాలల్లో కానీ, రహదారులు, ప్రభుత్వ ధన సహాయంతో నడిచే సంస్థల్లో ఎవరిపట్ల జాతి, కుల, మత, లింగ, జన్మ సంబంధమైన వివక్ష చూపకూడదు.
-15(3) అధికరణ ప్రకారం స్త్రీలకు, పిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలను వివక్షగా భావించరాదు. అంటే స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చు.
ఉదా: గృహహింస నిరోధక చట్టం-2005
-15(4) అధికరణ : ఎస్సీ, ఎస్టీ కులాల వారికి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురయ్యారనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి కల్పించే రిజర్వేషన్లను వివక్షగా భావించరాదు.
-15(4) నిబంధనను 1951 జూన్ 18 న మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
-15(5) నిబంధన ప్రకారం ప్రయివేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.
-15(5) నిబంధనను 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2006 లో చేర్చారు. మైనార్టీ విద్యా సంస్థలకు దీని నుంచి మినహాయింపునిచ్చారు.
16వ నిబంధన:
– ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం.
-16(1) అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో జాతి, కుల, మత, లింగ, జన్మతః (పుట్టుక), వారసత్వ, స్థిర నివాస ప్రాతిపదికన వివక్ష చూపరాదు.
-16(3) అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు మినహాయింపులు ఇచ్చే అధికారం భారత పార్లమెంట్‌కు ఉంది.
ఉదా: 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 6 సూత్రాల పథకాన్ని 371(D) అధికరణలో చేర్చారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు