జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
1. కింది వాటిలో సరికాని జతలను తెలపండి?
ఎ) గడ్డకట్టిన మహాసముద్రందక్షిణ ధ్రువంలో ఉంది
బి) మంచుతో నిండిన ప్రదేశంఅంటార్కిటిక్ మంచు కవచం
సి) అక్షాంశాలు, రేఖాంశాలు -ఊహారేఖలు
డి) అంతర్జాతీయ దిన రేఖ -ఒక అక్షాంశం
ఇ) భూమధ్యరేఖకు దక్షిణ భాగం -అధిక నేల భాగం
1) బి, సి, డి, ఇ 2) ఎ, సి, డి, ఇ
3) ఎ, డి, ఇ 4) బి, డి, ఇ
2. భూమికి కచ్చితమైన నమూనా ఏది?
1) గ్లోబ్ 2) ప్రపంచ పటం
3) అట్లాస్ 4) బంతి
3. భూమి నీలంగా ఉండటానికి గల కారణం?
1) కాంతి వివర్తనం
2) కాంతి పరావర్తనం
3) భూమిపై అధికంగా జలభాగాలు
ఉండటం
4) ఆకాశం నీలంగా ఉండటం
4. భూమధ్యరేఖ 13 దేశాల గుండా ప్రయాణిస్తుంది. ఈ 13 దేశాలు ఏ ఖండాలకు సంబంధించినవి?
1) ఆఫ్రికా, యూరప్, ఆసియా
2) ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా
3) దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా
4) ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా
5. తెలంగాణ పీఠభూమి ఏ వైపునకు వాలి ఉంది?
1) పశ్చిమ వైపునకు
2) తూర్పు వైపునకు
3) దక్షిణం వైపునకు
4) ఉత్తరం వైపునకు
6. సంగారెడ్డి, మహబూబ్నగర్ నల్లగొండ పట్టణాలు ఏ పీఠభూమిలో ఉన్నాయి?
1) దిగువ తెలంగాణ పీఠభూమి
2) ఎగువ తెలంగాణ పీఠభూమి
3) పై రెండు 4) పైవేవీకాదు
7. భూ స్వరూపాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం?
1) పీఠభూములు ఎత్తయిన ప్రదేశాలు, ఉపరితలాలు విశాలంగా ఉంటాయి
2) నదులు లోతైన, విశాలమైన లోయలను ఏర్పరుస్తాయి
3) మైదానాల్లో జనసాంద్రత
ఎక్కువగా ఉంటుంది
4) పర్వతాలు స్వల్ప అసమాన
ఎత్తు పల్లాలు కలిగి ఉంటాయి
8. ఎగువ తెలంగాణ పీఠభూమిలో లేని కొండలు గుర్తించండి?
1) అనంతగిరి కొండలు
2) రాఖీ కొండలు
3) దేవర కొండలు
4) కందికల్ కొండలు
9. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
ఎ) తెలంగాణ రాష్ట్రం పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి గలదు
బి) గోదావరి, కృష్ణా నదులు దిగువ తెలంగాణ పీఠభూమి గుండా తూర్పునకు ప్రవహిస్తున్నాయి
సి) తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో కృష్ణానది ముఖ్యమైంది
1) బి.సి సరైనవి 2) ఎ సరికాదు
3) ఎ, బి, సి సరైనవి
4) బి, సి సరైనవి కావు
10. ఒండ్రు మట్టితో ఏర్పడే త్రిభుజాకార ప్రాంతాలు?
1) నదులు 2) డెల్టాలు
3) త్రిభుజాలు
4) ఒండ్రు భూములు
11. సంవత్సరం అంతా ఒకే విధమైన శీతోష్ణస్థితి ఉంటే అది…?
1) సముద్ర ప్రభావ శీతోష్ణస్థితి
2) ఖండంతర్గత శీతోష్ణస్థితి
3) మధ్యధరా శీతోష్ణస్థితి
4) పైవేవీకావు
12. ఒక రోజులో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతను నమోదు చేయడానికి ఉపయోగించే ఉష్ణమాపకం?
1) సిక్స్ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణమాపకం
2) సెల్పియస్ ఉష్ణమాపకం
3) ఫారెన్ హీట్ ఉష్ణమాపకం
4) పైవేవీకాదు
13. సాధారణంగా సంవత్సరమంతా శీతోష్ణస్థితులు ఒకే రకంగా ఉండే ప్రాంతం?
1) ఢిల్లీ 2) లడఖ్
3) హైదరాబాద్ 4) చెన్నై
14. బలం ద్వారా గెలవడం కంటే ధమ్మ (ధర్మం) ద్వారా గెలవడం మేలని నమ్మినవారు?
1) శాంతమూలుడు
2) వరహమిహిరుడు
3) అశోకుడు 4) బింబిసారుడు
15. అధికారులు ఎలా పనిచేస్తున్నారనే అంశాన్ని సమాచారాన్ని రాజుకు అందించేవారు?
1) వేగులు 2) దూతలు
3) గవర్నర్లు 4) మహామాత్రులు
16. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధానికి స్వస్తి పలికిన రాజు పరిపాలన ఏ సామ్రాజ్యానికి చెందింది?
1) మౌర్య 2) మగధ
3) శాతవాహనులు 4) 1, 2
17. మౌర్య సామ్రాజ్యంలో గల ప్రాదేశిక రాజధానుల్లో సరైనవి?
1) నలంద, తక్షశిల, ఉజ్జయిని
2) గయ, పాటలీపుత్ర, తక్షశిల
3) తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి
4) కశ్మీర్, పానిపట్టు, ఉజ్జయిని
18. మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా లేనిది?
ఎ) హిందూకుష్ పర్వతాలు
బి) గంగా, యమున లోయలు
సి) మాళ్వా పీఠభూములు
డి) కృష్ణ, గోదావరి లోయ
1) ఎ, బి 2) బి మాత్రమే
3) సి, డి 4) ఎ, డి
19. జలస్తరం అంటే?
1) భూమిలోని ఇసుక పొరల మధ్య చేరిన నీటి పొర
2) భూమిలోని మట్టి పొరల మధ్య చేరిన నీటి పొర
3) భూమిలోని గ్రానైట్ పొరల మధ్య చేరిన నీటి పొర
4) భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర
20. సముద్ర జల ఉపరితల ఉష్ణోగ్రత?
1) -2 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 29 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య స్థిరంగా ఉంటుంది
2) -4 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 24 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య స్థిరంగా ఉంటుంది
3) -2 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 29 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య మారుతుంది
4) -4 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 24 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య మారుతుంది
21. సరైన జతలను గుర్తించండి?
ఎ) స్కాండినేవియన్ దేశాలు
నార్వే, స్వీడన్
బి) బ్రిటన్ ద్వీపకల్పం
సి) హంగేరి – ఖండాంతర శీతోష్ణస్థితి
డి) గ్రీస్- మధ్యధరా శీతోష్ణస్థితి
ఇ) నెదర్లాండ్స్ – అట్లాంటిక్ తీరం
ఎఫ్) ఆస్ట్రియా – ఉత్తర సముద్ర తీరం
1) ఎ, సి, డి, ఇ 2) ఎ, డి, ఇ, బి
3) ఎ, డి 4) పైవన్నీ
22. జతపరచండి.
1) నైలు నది ఎ) ఉగాండా,
టాంజానియా
2) కాంగో నది బి) మధ్యధరా
సముద్రం
3) జాంబేజీ నది సి) అట్లాంటిక్
మహాసముద్రం
4) విక్టోరియా డి) ఇథియోపియా,
సరస్సు లైబీరియా
5) స్వతంత్ర ఇ) హిందూ మహా
దేశాలు సముద్రం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-సి
3) 1-ఇ, 2-డి, 3-బి, 4-సి, 5-ఎ
4) 1-బి, 2-సి, 3-ఇ, 4-ఎ, 5-డి
23. ఓడల ద్వారా భారత్ తీరాన్ని చేరుకొని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నది?
1) గ్రీకు వ్యాపారులు
2) రోమన్ వ్యాపారులు
3) అరబ్ యాత్రికులు
4) ఐరోపా వ్యాపారులు
24. కింది వాటిలో మన రాష్ర్టానికి సంబంధించి సరైనవి?
1) తెలంగాణ ప్రాంతంలో 60 శాతం ప్రజలు అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డారు
2) తెలంగాణలో ప్రజలు సేకరించే అటవీ ఉత్పత్తుల జాబితాలో 60 వస్తువులు ఉన్నాయి
3) 40 శాతం అడవులు గిరిజనులు
నివసిస్తున్న ప్రాంతంలో ఉన్నాయి
4) 17 శాతం విస్తీర్ణంలో
అటవీ చెట్లు ఉన్నాయి
25. ఎక్కువ వర్షపాతంలో పెరిగే అడవులు ఏ జిల్లాలో ఉన్నాయి?
ఎ) ఆదిలాబాద్ బి) కుమ్రం భీమ్
సి) మెదక్ డి) మంచిర్యాల
1) ఎ 2) బి 3) ఎ, బి, డి 4) సి
26. సరికాని జతలు గుర్తించండి?
1) పోడు వ్యవసాయం – కోలాంలు
2) స్థిర వ్యవసాయం- సవరలు
3) రక్షిత అడవులు – ప్రజలు
వినియోగించలేరు
4) రిజర్వు – అందరికీ అనుమతి ఉంది
5) తెలంగాణలో 60 శాతం గిరిజనులు అడవుల్లో నివసిస్తున్నారు
1) 1, 2, 5 2) 2, 3, 4
3) 2, 4, 5 4) 1, 4, 5
27. నూతన జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
1) 1993 2) 1992
3) 1952 4) 1953
28. గాజు, సిరామిక్ వస్తువుల తయారీకి ఉపయోగించే ముడి ఖనిజం?
1) బెరైటీస్ 2) ఆస్బెస్టాస్
3) క్రోమ్ 4) ఫెల్డ్ స్పార్
29. తెలంగాణలో ఏ తెగవారు నేటికి ఆహార సేకరణ ద్వారా జీవనాన్ని గడుపుతున్నారు?
1) యానాదులు 2) చెంచులు
3) సవరలు 4) 1, 2
30. బందిని అంటే?
1) రంగులు చల్లడం
2) రంగులు అద్దడం
3) రంగును తీయడం 4) పైవేవీకావు
31. పోచంపల్లి చేనేత కార్మికులు, చీరల తయారీ దారులకు సంబంధించి సరికాని అంశం?
1) పట్టుదారం, రంగులు, మొదలైనవి వీరే సొంతంగా ఉత్పత్తి చేస్తారు
2) పోచంపల్లి చుట్టుపక్కల దాదాపు 10,000 కుటుంబాల వారు ఈ పని చేస్తున్నారు
3) పోచంపల్లి చీరలకు ఇక్కత్ బ్రాండ్ ఉంది
4) పోచంపల్లి చీరలకు మొట్టమొదటి పేటెంట్ హక్కు లభించింది
32. డిజిటల్ చెల్లింపు విధానాలు గురించి సరికానిది?
ఎ) NEFT – National
electronic fund transfer
బి) UPI – unified
payment internet
సి) VPA – Virtual
payment address
డి) BHIM – Bharat
interface for money
1) ఎ 2) ఎ, బి 3) బి 4) సి, డి
33. ‘అసెంబ్లీ లైన్’ విధానాన్ని మొదటగా ప్రవేశ పెట్టిన పరిశ్రమ?
1) వస్త్ర 2) ఆటోమొబైల్
3) సాంకేతిక- ప్రసార 4) కంప్యూటర్
34. ‘గాంధీజీ స్వరాజ్యం వస్తుంది. ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టం’ అని ప్రకటించి ప్రజలకు నాయకత్వం వహించినవారు?
1) మదన్ మోహన్ మాలవీయ
2) సి. రాజగోపాలచారి
3) డి. గోపాల కృష్ణయ్య
4) అసఫ్ అలీ
35. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని అన్నవారు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
2) డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్
3) హృదయనాథ్ కుంజ్రూ
4) మహాత్మాగాంధీ
36. మన దేశం గురించి ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’ మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ లక్షణాన్ని ప్రతిపాదించే ఒక పదం?
1) ప్రజాస్వామ్య 2) సామ్యవాద
3) లౌకిక 4) సర్వసత్తాక
37. భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా వర్ణించారు?
1) సామ్యవాద, లౌకిక, గణతంత్ర, సర్వసత్తాక, ప్రజాస్వామ్య
2) సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర
3) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర
4) లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, సర్వసత్తాక
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు