హైదరాబాద్‌ను 7వ జోన్‌గా మార్చేశారు
రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయించబడిన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, స్పెషల్ ఆఫీస్‌లు మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆఫీసులు మొదలగునవన్నీ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉండటం వల్ల హైదరాబాద్ నగరంలోని ఉద్యోగ నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని అది ఫ్రీ జోన్ అని, ఏడో జోన్ అనే వాదనను లేవనెత్తి రాష్ట్రపతి ఉత్తర్వులకు వక్ర భాష్యాలు చెప్పి నమ్మబలికి యథేచ్ఛగా ఇక్కడ నియామకాలు చేశారు. దాంతో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో స్థానికులకన్నా స్థానికేతరులే అధికంగా ఉన్నారు.
-రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 11-1-1975 నాడు వెలువడిన జీవో.నెం. 729 లోని పేరా 19, 20 ప్రకారం హైదరాబాద్ నగరం 6వ జోన్ పరిధిలోకి వస్తుందని స్పష్టంగా చెప్పాయి. హైదరాబాద్ నగరంలో మినహాయించిన ఆఫీసులకు కాకుండా మిగతా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో లోకల్ రిజర్వేషన్ పాటించాలని, మినహాయింపు పొందిన రాష్ట్రస్థాయి ఆఫీసుల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో ఫేర్‌షేర్ సూత్రాన్ని పాటించి అన్ని ప్రాంతాల నుంచి సమ పద్ధతుల్లో నియామకాలు చేపట్టాలని అదే జీవోలోని పేరా 21 స్పష్టం చేసింది. అధికారులు ఈ జీవోను పాటించకపోవడంతో చాలామంది ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించారు.
-రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా హైదరాబాద్ విషయంలో అది ఫ్రీజోన్ అనే ప్రస్తావన గాని ఏడో జోన్ అనే ముచ్చటగాని లేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల షెడ్యూల్ 2 ప్రకారం హైదరాబాద్‌ను 6వ జోన్లో చేర్చారు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు వివిధ కేసుల్లో ధృవీకరణ అయ్యింది. 1998లో హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్లకు సంబంధించిన కేసులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైదరాబాద్ 6వ జోన్లో భాగమని చెప్పడం జరిగింది.
-ఈ ఆరుసూత్రాల పథకంలోని నాలుగో సూత్రం ప్రకారం రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను రాష్ట్రపతి ఉత్తర్వుల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. అయితే ఇందులోని జడ్జిలు అధికారుల నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ పాటించాలనే నిబంధన లేనందువల్ల 90 శాతం ఆంధ్రవాళ్లే నియమించబడుతున్నారు. దీంతో న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన తెలంగాణ ఉద్యోగులకు అన్యాయమే ఎదురైంది. ఈ ఆరుసూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనలను పర్యవేక్షించేందుకు స్వయం ప్రతిపత్తిగల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఇది ఉల్లంఘనలకు గురైంది. రాష్ట్ర సచివాలయంలో జి.ఎ.డి. శాఖలో ఒక ఎస్.పి.ఎఫ్. సెక్షను ఉన్నప్పటికీ అందులో ఉన్నదంతా ఆంధ్రా అధికారులే. దీంతో న్యాయం కోసం ఎదురుచూసిన తెలంగాణ ఉద్యోగులకు నిరాశే ఎదురయ్యేది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు