సామాజిక నిర్మితి, అంశాలు – ప్రజా విధానాలు
మతం, కులం పునాదుల మీద నిర్మితమైందే భారతీయ సమాజం. వివాహం, బంధుత్వం అందులోని అంశాలు, భారతీయ సమాజం స్త్రీని రెండో తరగతి మహిళగానే పరిగణించింది. పురుషాధిక్య సమాజం మహిళను నాలుగ్గోడల మధ్య బంధించింది. బాల్యవివాహం, సతీ ఆచారం, వితంతుపునర్వివాహం లేక పోవడం, విద్యకు దూరం చేయడం, దేవదాసి, జోగిని వ్యవస్థల్లాంటి ఎన్నో సాంఘిక దురాచారాలు బంధీ చేశాయి.
ఆచారాలపేరుతో నిర్బంధానికి గురయింది. అలాగే కులం పేరుతో సమాజాన్ని విడదీసి కొందరిని అంటరానివారిగా చేసింది. ఆ అంటరానివారి కోసం ప్రముఖులు చేసిన ఉద్యమాలు, ఆవిర్భావ సిద్ధాంతాలు సామాజిక నిర్మితిలోని భాగంగా చదవాల్సి ఉంటుంది. గ్రూప్-2లో 50 మార్కులకు కేటాయించిన అంశం సోషల్ స్ట్రక్చర్, పబ్లిక్ పాలసీస్లో మొదటి చాప్టర్ చాలా కీలకమైనది. మొదటి చాప్టర్ విశ్లేషణ గ్రూప్స్ విద్యార్థుల కోసం..
మొదటి యూనిట్లో పొందుపరిచిన అంశాలు
1. భారతీయ సమాజం – విశిష్ట లక్షణాలు
2. కులం 3. కుటుంబం
4. వివాహం 5. బంధుత్వం
6. మతం 7.గిరిజనులు
8. మహిళ
9.మధ్యతరగతివర్గం
10. తెలంగాణ సమాజం – సామాజిక-సాంస్కృతిక లక్షణాలు
-పైన తెలిపిన అంశాల్లో మొదటి అంశం అయిన భారతీయ సమాజం – విశిష్ట లక్షణా దోహదపడిన అంశాలను అధ్యయనం చేయాలి. అలాగే ఇవ్వబడిన మిగతా ఉపశీర్షికలను క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేయడమనేది ఈ యూనిట్ ముఖ్య ఉద్దేశం. భారతీయ సామాజిక నిర్మాణం, అందులోని అంశాలు, ఆయా అంశాల్లో వస్తున్న మార్పులు, దోహదపడుతున్న కారకాలపై అభ్యర్థులకు గల అవగాహనను పరీక్షించడం, గమనించి ఆ దృక్పథంతోనే అధ్యయనం చేయాలి. అభ్యసించిన అంశాలను కిందివిధంగా భావించవచ్చు.
I. భారతీయ సమాజం-విశిష్ట లక్షణాలు (salient Features of indian society)
-విశిష్ట లక్షణాలతో కూడిన భారతీయ సమాజం
-జాజ్‌మానీ వ్యవస్థ
-వివిధ సముదాయాల కలయిక
-గ్రామ సముదాయం
-నగర సముదాయం
-గిరిజన సముదాయం
ఏకత్వం- భిన్నత్వం
-జాతి భిన్నత్వం
-భాషా భిన్నత్వం
-మతభిన్నత్వం
-ఆవాసభిన్నత్వం
-సాంసృ్కతిక భిన్నత్వం
-ఏకత్వంలో భిన్నత్వం
-కుల రూప సామాజికస్తరీకరణ
-ఉమ్మడి కుటుంబాలు
-పితృస్వామిక వ్యవస్థ
పై అంశాల్లో ముఖ్యంగా..
-భిన్నత్వ లక్షణాలు, భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణంపై అభ్యర్థులు అధ్యయనం చేయాలి.
-జాజ్‌మానీ వ్యవస్థ అంటే ఏమిటి? దాని వల్ల కలిగిన నష్టాలు, ఉపయోగాలు.
-ఎన్ని రకాల జాతుల కలయికతో భారతీయ సమాజం నిర్మితమైంది.
-పితృస్వామిక వ్యవస్థ, సమాజంపై ముఖ్యంగా మహిళాలోకంపై దాని ప్రభావం
-సాంస్కృతిక సర్దుబాటు, విలీనం, సంస్కృతీకరణ లాంటి అంశాలు
-భారతదేశ సముదాయంలో గోచరిస్తున్న వివిధ సముదాయ రూపాలు – వాటి లక్షణాలు
-భాషలు, భాషాపరమైన భిన్నత్వానికి సంబంధించిన అంశాలు
-భారతీయ సమాజం ఎక్కువశాతం హిందూ సామాజిక వ్యవస్థీకరణతో కూడుకొని ఉంది. కావున ఆ సామాజిక వ్యవస్థీకరణకు సంబంధించిన ముఖ్యాంశాలు.
-ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలి.
-ఈ అంశం నుంచి ప్రశ్నలు సాధారణంగా కిందివిధంగా వచ్చే అవకాశం ఉంది.
1. సామాజిక గతిశీలతకు ఎక్కువస్థాయిలో అవకాశం గల సముదాయం?
ఎ) గ్రామ సముదాయం బి) నగర సముదాయం
సి) గిరిజన సముదాయం డి) పైవన్నీ
2. జాజ్‌మానీ వ్యవస్థకు సంబంధించి కిందివాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) స్వయంపోషిత గ్రామాలను ఏర్పరచింది.
బి) వారసత్వ వృత్తులతో మార్పునకు అవకాశం కలిగించింది.
సి) వృత్తిపరమైన సేవలకు సరసమైన వెలను అందించింది.
డి) కులవ్యవస్థను బలహీనం చేసింది.
3. భారతీయ సమాజంలో భినత్వానికి కారణం కానిదేది?
ఎ) సాంస్కృతిక బహుళత్వం
బి) భాషాపరమైన బహుళత్వం
సి) వైవిధ్యభరితమైన భౌగోళిక పరిస్థితులు
డి) విజ్ఞానపరమైన బహుళత్వం
II. కులం (Caste)
-Indiaలోనే జనించి Indiaకే పరిమితమై, భారతీయ సమాజాన్ని నిట్టనిలువుగా విభజించిన స్తరీకరణ రూపం కులం. కులానికి సంబంధించి అభ్యర్థులు సాధారణంగా అభ్యసించాల్సిన అంశాలు
కులం
-కులం వల్ల ఉద్భవించిన అశక్తతలు
-కులం ఆవిర్భావం, సిద్ధాంతాలు
-హిందువుల్లో గల కులాలు, హిందువేతరుల్లో గల కుల రూప పోకడలు
-కుల వ్యవస్థ అభివృద్ధి చెందుటకు దోహదపడిన అంశాలు
-లక్షణాలు
-కుల వ్యవస్థలో వచ్చిన మార్పులు దోహదపడిన అంశాలు
-బ్రిటీష్ పాలన పారిశ్రామికీకరణ
-సంఘసంస్కర్తలు-కృషి
-కులం వల్ల ఉద్భవించిన సామాజిక అశక్తతలను నిర్మూలించేందుకు రాజ్యాంగం, సామాజిక శాసనలు, నిర్వహిస్తున్న పాత్ర
(సామాజిక శాసనాలు)
-కులం అనే అంశంపై ముఖ్యమైన గ్రంథాలు, వ్యాఖ్యానాలు
-కులంపై సంస్కృతీకరణ, పాశ్చ్యాతీకరణ, ఆధునీకరణ ప్రభావం
-కులంపై గాంధీ, అంబేద్కర్, ఫూలేల ఆలోచనా విధానాలు
-కులం ప్రాథమిక భావనలు
-వికార్యాలు (disfunctions)
-భారతీయ సమాజంలో కులం అనబడే సామాజిక స్తరీకరణ రూపం సమాజంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలకు, మానవహక్కులు , వెట్టిచాకిరీ, బానిసత్వం, బాలకార్మికులు, జోగిని, దేవదాసి, అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలకు కారణమై సమాజంలోని కొన్ని వర్గాలను సామాజిక అవకాశాలకు తరతరాలుగా దూరం చేస్తే సామాజిక వెలి కి కారణమైంది. సంపద, అధికారం సమాజంలోని కొన్ని వర్గాల చేతుల్లోనే ఉంచింది.
పై అంశాలకు సంబంధించి ప్రశ్నలు కిందివిధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
1. కిందివానిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) Casta అనే స్పానిష్ పదం నుంచి Caste ఉద్భవించింది.
బి) Castes అనబడే లాటిన్ పదం నుంచి Caste ఉద్భవించింది.
సి) కులం తన వారసత్వ వృత్తులు అనే లక్షణం ద్వారా
వ్యక్తులకు సామాజిక గతిశీలత లేకుండా చేస్తుంది.
డి) Casta అంటే వంశక్రమం, కాస్టస్ అనగా స్వచ్ఛత అని అర్థం.
1) ఎ,డి లు సరైనవి 2) బి.సిలు సరైనవి
3) ఎ,సి,డిలు సరైనవి 4) ఎ,బి,సి,డిలు సరైనవి
2. Caste and Race in India అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
ఎ) ఘర్వే బి) ఐరావతి కార్వే
సి)మజుందార్ డి)మోర్గాన్
3. కిందివాటిలో కులం లక్షణం కానిదేది?
ఎ) వారసత్వం బి) కులవృత్తులు
సి) సమానత్వం డి) ఆహారనియమాలు
4. కుల-ఆవిర్భావ సిద్ధాంతాలకు సంబంధించి కిందివాటిలో సరైనది గుర్తించండి?
ఎ) సాంస్కృతిక సమీకృత సిద్ధాంతాన్ని శరత్చంద్రరాయ్ తెలిపాడు
బి) పరిణామ సిద్ధాంతాన్ని డేంజిల్ ఎబ్బెస్టన్ ప్రతిపాదించాడు
సి) భౌగోళిక సిద్ధాంతాన్ని హట్టన్ ప్రతిపాదించాడు
డి) బహుళ-కారకాల సిద్ధాంతాన్ని కేట్కర్ ప్రతిపాదించాడు
1) ఎ,బిలు సరైనవి 2) సి,డి సరైనవి
3) ఎ,బి,సి,డిలు సరైనవి 4) ఎ,బి,సిలు మాత్రమే సరైనవి.
5. ఇస్లాం సమాజంలో హిందూ వర్ణవ్యవస్థను పోలిన సామాజిక స్తరీకరణను తెలిపినవారు?
ఎ) అహ్మద్‌ఖాన్ బి) హుస్సేన్‌వలీ
సి) షేక్‌మస్తాన్ డి) నజ్మల్ కరీం
తరతరాలుగా ఉన్న కులవ్యవస్థలో బ్రిటీష్ పాలన, పారిశ్రామీకరణ, సంఘసంస్కర్తల కృషి వల్ల వచ్చిన మార్పులు కూడా అధ్యయనం చేయాలి.
-కుల ఆశక్తతల నిర్మూలన చట్టం-1850
-కులాంతర, మతాంతర వివాహాల చట్టం (Special marriage Act-1872) లాంటి అంశాలు, కులం అశక్తతలపై పొందిన వివిధ సంఘసంస్కర్తలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రశ్నలు రావచ్చు. ఎందుకంటే కులవ్యవస్థలో గల తీవ్రమైన దురాచారాలను వీరు ఎంత వరకు బ్రిటీష్ వారి సహకారంతో రూపుమాపడం జరిగింది.
Eg: ఈ కిందివాటిలో భాగ్యరెడ్డివర్మకు సంబంధించి సరైనదానిని గుర్తించండి?
ఎ) 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించాడు
బి) 1911లో మన సంఘాన్ని స్థాపించాడు
సి) దళితులను ఆదిహిందువులని పేర్కొన్నాడు
డి) 1901లో మహిష్య సమితిని స్థాపించాడు
1. ఎ,బిలు సరైనవి 2. బి,సిలు సరైనవి.
3. సి,డిలు సరైనవి 4. ఎ,బి,సిలు సరైనవి
-ఇలా కులానికి సంబంధించి ఆవిర్భావం, కామెంట్లు, గ్రంథాలు, రచయితలతో పాటుగా కులం వల్ల భారతీయ సమాజంలో ఉద్భవించిన సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి రాజ్యాంగం, సాంఘిక శాసనాల ద్వారా ప్రభుత్వాలు చేస్తున్న కృషికి సంబంధించిన వివరాలు అభ్యసించాలి.
1. అధికరణ కులం ప్రాతిపదికన బహిరంగ ప్రదేశాల వినియోగానికి సంబంధించి తరతరాలుగా ఉన్న నిషేధాన్ని పాటించకూడదని తెలుపుతుంది?
1. 15(2) 2) 16(1) 3) 17 4) 14
2. రాజ్యాంగంలోని ఏ అధికరణం ఆధారంగా అస్పృశ్యతా నేరాల చట్టం 1955ని రూపొందించారు ?
1) 16 2) 15 3) 19 4)17
3. protection of civil Liberties Act-1976 ప్రకారం అస్పృశ్యతను పాటించే వారికి విధించే జైలు శిక్ష?
1) 1 Year 2) 2Year
3) 6months 4) 6 months to 1 year
ప్రభుత్వాలు చేస్తున్న కృషి, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో పాటుగా సామాజిక పరివర్తనకు చెందిన అంశాలైనా సంస్కృతీకరణ, పాశ్చ్యాతీకరణ, ఆధునికీకరణ లాంటి అంశాలు కూడా కొంతవరకు కులవ్యవస్థ, అందులో దురాచారాల పట్ల కొంతమేర మార్పులకు తోడ్పడినవి. కావున ఆయా భావనలు ఎలా రూపొందినవి, ఎవరు వాటిని ప్రవేశపెట్టారు, వాటి ప్రభావం కులంపై ఏ మేరకు ఉంది లాంటి అంశాలను కూడా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు కింది రూపంలో ప్రశ్నలు అభ్యర్థులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
1. సంస్కృతీకరణం అంటే ?
ఎ) సంస్కృతి మార్పునకు లోనవడం
బి) సొంత సంస్కృతిని పరిరక్షించుకోవడం
సి) ఎవరి సంస్కృతి ప్రభావానికి లోనవుతారో దానిని
అనుకరించడం
డి) దృఢమైన మార్పులేని సంస్కృతిని పాటించడం
2. సంస్కృతీకరణం అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు?
ఎ) ఎంఎన్.శ్రీనివాస్ బి) కుప్పుస్వామి
సి) మజుందార్ డి) మోర్గాన్
3. సంస్కృతీకరణకు సంబంధించి సరైన దానిని గుర్తించండి?
ఎ) ప్రాబల్య కులాల (dominant Caste)లను అనుసరిస్తారు
బి) ఒకరి సంస్కృతిని అనుకరించి ముందు తరాలకు
వారసత్వంగా అందించడం
సి) సంస్కృతీకరణ, సాంస్కృతిక గతిశీలతకు దోహదం చేస్తుంది
1) ఎ,బి సరైనవి 2) బి,సిలు సరైనవి
3) ఎ,బి,సిలు సరైనవి 4) బి మాత్రమే సరైనది.
III. యూనిట్-1లోని మూడో అంశం కుటుంబం
-భారతీయ సామాజిక నిర్మాణం విశిష్టత అనే భారతీయ ఉమ్మడి కుటుంబ నిర్మాణంపై ఆధారపడి ఉంది. ఈ సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు కాలక్రమేణా మార్పునకు లోనై వివిధ రూపాలను సంతరించుకున్నవి. సమాజ నిర్మాణానికి ప్రాథమిక యూనిట్‌గా కుటుంబాన్ని భావిస్తారు. అది మనుషులను సృష్టించే సామాజికంగా మనుషులుగా తయారుచేసే నిరంతర కర్మాగారం. అందులో వచ్చిన మార్పుల వల్ల సమాజంలో కూడా మార్పులు సంభవించాయి. ఇలా భారతదేశంలో కుటుంబ నిర్మాణం ఎలా ఉంది. సాధారణంగా కుటుంబాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. వాటిపై ప్రభావం చూపిస్తున్న అంశాలు, ఉమ్మడి కుటుంబం ఉపయోగాలు, నష్టాలు వంటి అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
కుటుంబం
-నగరీకరణ ప్రభావం
-భారతీయ ఉమ్మడి కుటుంబం లక్షణం- ఉపయోగాలు, పరిమితులు
-పారిశ్రామిక ప్రభావం 8 ఎలా పరిణామం చెందింది
-కుటుంబ రకాలు/రూపాలు 8 కుటుంబం విధులు
-ఇతర ప్రాథమిక భావనలు
-కుటుంబ వ్యవస్థ మార్పులకు గల కారణాలు
పైన తెలిపిన అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం కలదు. ముఖ్యంగా అభ్యర్థులు ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు సంబంధించిన సమగ్ర అంశాలు, సామాజిక పరివర్తనలో భాగంగా అందులో వచ్చిన ప్రకార్యాత్మక, నిర్మాణాత్మక మార్పులను నిషితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, శాస్త్రవేత్తల బోధనలు, పదజాలం, ముఖ్యమైన నిర్వచనాలు, కుటుంబం పరిణామక్రియ లాంటి అంశాలకు సంబంధించి పూర్తి పరిజ్ఞానంపై పట్టుసాధించాలి.
Eg. (కుటుంబం) Family అనే పదానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి?
ఎ) ఫేమలస్ అనే రోమన్పదం నుంచి గ్రహించారు
బి) ఫేమిలియం అనే రోమన్ పదం నుంచి గ్రహించారు
సి) ఫెమిలియం అంటే సేవకుడు అని అర్థం
డి) ఫేమలస్ అంటే సేవకులు, బానిసలు, కుటుంబ సభ్యుల
సమూహం అని అర్థం.
1) ఎ,బిలు సరైనవి 2) ఏ.బి,సి,డిలు సరైనవి
3) బి.సిలు సరైనవి 4) డి మాత్రమే సరైనది
2. కుటుంబానికి సంబంధించి నాలుగు ప్రమాణాలతో కూడిన నిర్వచనం తెలిపినదెవరు?
1) ముర్దాక్ 2) స్టీఫెన్సన్ 3) కార్వే 4) డెంజిల్
సమాజంలో కుటుంబ నిర్మాణం, అది నిర్వహించే పాత్రలు భిన్నంగా ఉంటాయి. సిలబస్‌ను అనుసరించి అభ్యర్థులు భారతదేశ కుటుంబ రూపాలు, మార్పులు లాంటి అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. దీంతో పాటు ఇతర సమాజాల్లో కుటుంబ వ్యవస్థపై కూడా సాధారణ అవగాహనను కలిగి ఉంటే మంచిది. ముఖ్యంగా భారతీయ కుటుంబ వ్యవస్థకు సంబంధించి ఈ కింది కోణాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ఇలా కనీసం మూడుతరాలకుపైగా కుటుంబసభ్యులు ఒకే నివాసం, అధికారం, వంటశాల కలిగి తమ జీవనం కొనసాగిస్తే దానిని ఉమ్మడి కుటుంబం అంటారు. అందులో ఈ క్రమంలో భారతీయ సమాజంలో గల ప్రత్యేక లక్షణాలు గల నాయర్ల తారావాడ్ కుటుంబం, నంబుద్రాల ఇల్లామ్ కుటుంబం వంటి అంశాలపై కూడా అవగాహన కలిగి ఉండాలి. అలాగే కేంద్రక కుటుంబం ఉపయోగాలు, నష్టాలు అదే కోణంలో ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన అవగాహన కూడా అవసరం. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అందుకు దోహదపడుతున్న అంశాలపై కూడా అవగాహన అవసరం. ఆయా అంశాలపై ఉదాహరణ ప్రశ్నలను గమనించండి.
1. ఉమ్మడి కుటుంబాల స్థానంలో కేంద్రక కుటుంబాలు ఏర్పడటానికి గల కారణం?
ఎ) నగరీకరణ బి) పారిశ్రామికీకరణ సి) వైయుక్తీకరణ
డి) లింగపర శ్రమవిభజన అంశంలో సంబంధించిన మార్పులు
1) ఎ,బిలు సరైనవి 2) సి,డిలు సరైనవి
3) ఎ,బి,సిడిలు సరైనవి 4) కేవలం ఎ మాత్రమే సరైనది.
-నగరీకరణ వల్ల నగర ప్రాంతంలో స్థిరపడే వారి సంఖ్య పెరిగి నూతనంగా స్థానిక కుటుంబాలు పెరిగి తల్లిదండ్రులు గ్రామాల్లో, సంతానం నగరాల్లో స్థిరపడే ధోరణి కనబడుతుంది.
-పారిశ్రామికీకరణ వల్ల జీవనోపాధులు పెరిగి కులవృత్తులు బలహీనమై జీవనోపాధి నిమిత్తం ప్రస్తుత తరం ఉమ్మడి కుటుంబాన్ని వదిలి సొంతంగా కుటుంబాన్ని ఏర్పర్చుకుంటుంది.
8 స్వేచ్ఛ, ప్రేమవివాహం, కుటుంబ బాధ్యతల కంటే తన సొంత అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల వివాహం అయిన వెంటనే వేరు కాపురం పెట్టడం జరుగుతున్నవి. ఫలితంగా కేంద్రక కుటుంబాలు ఏర్పడుతున్నాయి.
8 లింగపర శ్రమ విభజన అంటే మహిళలు ఇంటి పనే చేయాలి. అనే భావన నుంచి భార్యభర్తలు ఉద్యోగాలు చేయడం లాంటి మార్పులతో కుటుంబాలు కేంద్రక కుటుంబాలుగా మారుతున్నాయి. కావున పైన ఇచ్చిన ఐచ్ఛికాలు సరైనవే. ఇలా విశ్లేషనాత్మకంగా అభ్యర్థులు సిద్ధం కావాల్సి ఉంటుంది.
బంధుత్వం
-రక్త సంబంధం లేదా వివాహ సంబంధం వల్లగాని ఏర్పడే సంబంధాన్ని బంధుత్వం అంటారు. మానవ సమాజంలో గల ప్రత్యేక లక్షణాలతో బంధుత్వం ఒకటే, పశువుల సమాజంలో బంధుత్వాలు, అనుబంధాలు, ఆగమ్యగమన నిషేధాలుండవు. బంధుత్వానికి సంబంధించి విద్యార్థులు ఈ కింది పరివర్తన కలిగిఉండాలి.
-బంధుత్వ ప్రాథమిక భావనలు
-బంధుత్వ సంకేతాలు
-బంధుత్వ పరిభాషలు – ఉపయోగరీతి
భాషానిర్మాణం – ప్రాథమిక పథం
అనువర్తనా పరిధి -ఉత్పన్నపథం
వివరణాత్మక పథం
-బంధుత్వరీతులు
-బంధుత్వ రకాలు/బంధు సమూహాలు
-బంధుత్వస్థానాలు – ప్రాథమిక బంధువులు
– ద్వితీయ బంధువులు
– తృతీయ బంధువులు
బంధుత్వ ఆచరణలు – వైదొలుగు నడవడి
– పరిహాస సంబంధాలు
– సాంకేతిక బోధన
– కుహన ప్రసూతి
– మాతులాధికారం
– పితృష్వాధికారం
– మన్ననలు
-వంశం, గోత్రం లాంటి అంశాలను ప్రామాణిక పుస్తకాల సహాయంతో అభ్యసించాలి.
మతం :సామాజిక నిర్మాణంలో మతం ఎలాంటి పాత్ర పోషిస్తున్నది, ఎన్ని రకాల మతరూపాలున్నవి, వాటి ముఖ్య సిద్ధాంతాలు, ఆచరణలు, మతగ్రంథాలు, మతశాఖలు వంటివాటితోపాటు కింది అంశాలు అధ్యయనం చేయాలి.
1. మతం అంటే ఏమిటి, మత లక్షణాలు ఏమిటి?
2. మతాల ఆవిర్భావాన్ని వివరించే సిద్ధాంతాలు
3. మత విశ్వాసాలు, సంస్కారాలు – సర్వాత్మకవాదం
– జీవాత్మకవాదం
– ప్రకృతి ఆరాధన
– ఏకదేవతారాధన
– తొటెమ్వాదం
– ప్రకార్యవాదం
4. మతం సమాజానికి చేస్తున్న మేలు, కీడు
5. మతంపై ఆధునికత, సెక్యులరిజం, పారిశ్రామికీకరణ ప్రభావాలు
6. హిందూమతంపై జైనం, క్రిస్టియానిటీ, బౌద్ధం, ఇస్లాంల ప్రభావం
7. మతం, భక్తి ఉద్యమాలు మొదలగు అంశాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నవి. బట్టి ఆయా అంశాలను అధ్యయనం చేయాలి.
వివాహానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు
-వివాహ లక్షణాలు 8 వివాహం ప్రకార్యాలు, విధులు
-వివాహం సమాజంతో ఎలా పరిణామం చెందింది
-వివాహ రూపాలు 8 వివాహ నియమాలు
-వివిధ వివాహ రూపాలు- వాటి పరిమితులు
-భారతదేశంలో వివాహ వ్యవస్థ 8 హిందువుల్లో వివాహ వ్యవస్థ
-ముస్లింలో వివాహ వ్యవస్థ 8 క్రిస్టియన్ల్లో వివాహ వ్యవస్థ
-వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులు దోహదపడుతున్న అంశాలు
-వివాహ వ్యవస్థలో మహిళల పట్ల వివక్షత అంటే వరకట్నం, కన్యాశుల్కం, బహుభర్తత్వం, విడాకులకు సంబంధించిన అంశాలు చట్టపరమైన ఏర్పాట్లతో మేళవించి అధ్యయనం చేయాలి. ఈ క్రమంలో హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, వరకట్న నిషేధ చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం లాంటివి క్షుణ్ణంగా అభ్యసనం చేయాలి.
-అలాగే వివాహ వ్యవస్థపై పట్టణీకరణ, పాశ్చ్యాతీకరణ, ఆధునీకరణ, ప్రభావాలపై అవగాహన ఏర్పర్చుకోవాలి.
ఉదాహరణ ప్రశ్నలు
1) హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గ్రంథ రచయిత ఎవరు?
ఎ) మాలినోవ్స్కీ బి)మోర్గాన్ సి) వెస్టర్‌మార్క్ డి) మెకైవర్
2. శారదాచట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) ఏప్రిల్ 1, 1929 బి) ఏప్రిల్ 1, 1930
సి) ఏప్రిల్ 1, 1932 డి) ఏప్రిల్,1 1931
3. సంప్రదాయ హిందూ వివాహరూపాల్లో అత్యుత్తమైంది ఏది?
ఎ). ఆర్షవివాహం బి) బ్రహ్మవివాహం
సి) గాంధర్వవివాహం డి ) దైవవివాహం
4. కిందివాటిలో వివాహ నియమం ఏది?
ఎ) అంతర్వివాహం బి) నిషిద్ధ నియమం
సి) బహుభార్యత్వం డి) ఏక వివాహం
గిరిజనులు :
అనే అంశం కింద, గిరిజనులు అంటే ఎవరు?
భారతదేశంలో గిరిజనులు, తెలంగాణ గిరిజనులు, గిరిజన సంస్కృతులు, జీవన విధానాలు, గిరిజనులు సామాజిక-ఆర్థిక పరిస్థితులు లాంటి మౌలిక అంశాలు అభ్యసనం చేయాలి. మిగతా యూనిట్లో గిరిజన ఉద్యమాలు, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు కూడా ఉన్నందున ఆయా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని ఒకేసారి అధ్యయనం చేయాలి.
మహిళ :
ప్రకృతిలో మనుషుల మధ్య ఏర్పడిన మొదటి స్తరీకరణ రూపం లింగపరమైన భేదాలు, ఇందుకు దోహదపడిన మౌలిక భావనలు, పితృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థ, సమసామ్యవ్యవస్థ మీద చారిత్రక కాలాల్లో మహిళల స్థాయి లాంటి అంశాలతో పాటుగా సమకాలిన సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, వివిధ రూపాల్లో ఉన్న హింసలను బ్రూణహత్యల నుంచి మొదలు గృహ హింస వరకు వాటి ప్రభావం, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ఎన్ని కేసులు నమోదవుతున్నాయి. రాజ్యాంగం ఏం చెబుతుంది, సామాజిక శాసనాలు ఎలాంటి రక్షణ ఇస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉపయోగపడుతున్నాయో కోణంలో అధ్యయనం చేయాలి.
మధ్య తరగతివర్గం :
బ్రిటీష్ వారి కాలం నుంచి ప్రముఖంగా భారతీయ సమాజంలో ఉద్భవించిన మధ్య తరగతి వర్గానికి సంబంధించి అభ్యసించేందుకు మిగతా వాటితో పోలిస్తే మెటీరియల్ లభ్యత తక్కువగా ఉందనే చెప్పవచ్చు. అయినా ప్రముఖ గ్రంథాలయాల్లో సమాచారం సేకరించి సమకాలీన సమాజంలో మధ్య తరగతి వర్గానికి సంబంధించి సమస్యలను ఈ అంశాన్ని అన్వయం చేసుకొని అధ్యయనం చేయాలి.
శ్రవణ్‌కుమార్ శ్రీరామ్
డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్
ఎంజీ యూనివర్సిటీ, నల్లగొండ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు