నవీన సాహిత్యం ( తెలంగాణ సాహిత్యం)
దాశరథి రంగాచార్య
# ఇతను దాశరథి కృష్ణమాచార్యుల సోదరుడు.
బిరుదు: అభినవ వ్యాసుడు.
ఆత్మకథ: జీవనయానం
రచనలు: 1. శ్రీమద్రామాయణం
2. శ్రీమహాభాగవతం
3. వేదం-జీవనాదం
నవలలు
1. చిల్లర దేవుళ్లు (1969)
2. రానున్నది ఏది నిజం
3. మోదుగుపూలు (1971)
4. అమృతంగమయ
5. జనపథం (1976)
6. శరతల్పం
జీవిత చరిత్రలు
1. శ్రీమద్రామానుజాచార్యులు
2. బుద్ధుని కథ
# చిల్లర దేవుళ్లు నవల తెలంగాణ మాండలికంలో వెలువడిన తొలి నవల. 1971లో ఈ నవలకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
#ఈ నవలను టీ మధుసూదనరావు స్వీయ దర్శకత్వంలో కాకతీయ పిక్చర్స్ సినిమాగా తెరకెక్కించారు.
అడ్లూరి అయోధ్య రామకవి (1922)
#ఈయన వరంగల్ వాసి. ‘తెలంగాణ మంటల్లో’ కథల సంపుటిని 1948లో విజయవాడ నుంచి ప్రచురించారు.
# ఆంధ్రకేసరి, ఘంటారావం, దీపావళి వంటి ఖండ కావ్యాలు రాశారు.
# 1949-50లో ‘భాగ్యనగర్’ పత్రికను నడిపారు. ‘విజ్ఞాన గ్రంథమాల’ను స్థాపించారు.
# బుర్రకథలను రచించి ఊరూరా తిరిగి చెబుతూ ప్రజలను ఉద్యమోన్ముఖులను చేశారు.
ఆవుల పిచ్చయ్య
#ఈయన సూర్యాపేటలో జన్మించారు.
#2010లో పిచ్చయ్య కథలను సంగిశెట్టి శ్రీనివాస్ సేకరించి పుస్తకంగా అచ్చువేశారు.
# 1944లో ఆంధ్రమహాసభ చీలినప్పుడు అతివాదుల పక్షాన నిలిచారు.
ముఖ్యమైన కథలు
#ఈతగింజ ఇచ్చి తాటి గింజలాగిన జమిందార్
దౌరా ఊరేగింపులు
వెట్టిచాకిరీ దినచర్య
పొట్లపల్లి రామారావు (1925)
# ‘దాంపత్యం’ పేరుతో కథల సంపుటిని వరంగల్‌లోని ‘విజ్ఞాన గ్రంథమాల’వారు 1943లో ప్రచురించారు.
#ఈయన వరంగల్ జిల్లాలో సాహితీ సామాజిక చైతన్యానికి మార్గదర్శిగా నిలిచారు.
# ‘శ్రావణి’ అనే కథల పుస్తకం రాశారు.
బండారు అచ్చమాంబ
#ఈమె కొమరాజు వెంకట లక్ష్మణరావు సోదరి.
# స్వస్థలం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు.
# తెలుగులో అచ్చమాంబ రచించిన మొట్టమొదటి కథ ‘ప్రేమపరీక్షణం’
రచనలు: లలితా శారద, ధనత్రయోదశి, దంపతుల ప్రథమకలహం, బీదకుటుంబం, అబలాసచ్చరిత్ర రత్నమాల, గుణవతియగు స్త్రీ.
వానమామలై వరదాచార్యులు
#ఈయన వరంగల్ జిల్లా మడికొండ వాస్తవ్యులు.
# ‘పోతన చరిత్ర’ను రచించారు.
# ‘మణిమాల రచన’ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చింది.
#వరదాచార్యుల సోదరుడు జగన్నాథాచార్యులు ‘రైతు రామాయణం’ అనే ఆధునిక ఇతివృత్తం గల కావ్యం రచించారు.
# సుంకర వాసిరెడ్డి రాసిన ‘మా భూమి’ నాటకం తెలంగాణలో వెయ్యి ప్రదర్శనలు జరుపుకొంది.
# రాజారావు రాసిన ‘వీరనారి’ నాటకం తెలంగాణ నారీమణులు చేసిన వీరోచిత పోరాటాలను చిత్రించిన నాటకం.
# పొట్లపల్లి రామారావు పగ, న్యాయం వంటి భూస్వాముల దౌర్జన్యాలను, వెట్టిచాకిరీ, దోపిడీలను చిత్రించే నాటికలు రాశారు.
#వెల్దుర్తి మాణిక్యరావు గోలకొండ పత్రికకు సహ సంపాదకుడిగా వ్యవహరిస్తూ ‘దయ్యాల పన్గడ’ నాటకాన్ని మాండలిక భాషలో రాశారు.
#కోదాటి నారాయణరావు ప్రగతి, బాలసరస్వతి వంటి పత్రికలు నడిపారు.
# ఏలె ఎల్లయ్య ‘బీదరైతు’ వంటి నాటకాలు రచించారు.
# షబ్నవీసు తన భార్య స్మృతితో ‘రాజ్యలక్ష్మి’ కావ్యాన్ని రచించారు. షబ్నవీసు రచించిన ‘బాలికా విలాపం’ కథ సంఘసంస్కరణ భావాలను చిత్రిస్తున్నది.
#షబ్నవీసు 1922లో నల్లగొండ నుంచి నీలగిరి పత్రికను నడిపారు.
#ధవళా శ్రీనివాసరావు (1918) ‘ధవళశ్రీ’ అనే కవితా సంపుటిని ప్రచురించారు.
#పాశం నారాయణ రెడ్డి (1909-82) ‘దయానంద సరస్వతి జీవిత చరిత్ర’ త్యాగమూర్తులు, సదాశివపేట పాలకుడు, సదాశివరెడ్డి, వీరుని చరిత్రను కావ్యంగా రాశారు.
#పల్లా దుర్గయ్య గంగిరెద్దు ఖండ కావ్యం రాశారు.
#తెలంగాణ మాండలికంలో ఎన్బీ సీతారామారావు 1939లో గరీబోణ్ణి కథ రాశారు.
# హైదరాబాద్‌లో బూర్గుల రంగనాథరావు, నెల్లూరు కేశవస్వామి, నందగిరి ఇందిరాదేవి వంటివాళ్లు, సాధనసమితి స్థాపించి రొమాంటిసిజం కథలు రాశారు.
# నెల్లూరు కేశవస్వామి ‘చార్మినార్’ కథలు రాశారు. ఇందులో హైదరాబాద్ సంస్థానం చివరి రోజుల్లో నవాబుల జీవితాలు, హిందూ, ముస్లిం సంబంధాలు వివరించారు.
సుద్దాల హనుమంతు
#ఈయన 1910 డిసెంబర్లో నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో జన్మించారు. ఈయన పాడిన పాటలు ‘పల్లెటూరి పిల్లగాడ’ పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ‘వీర తెలంగాణ యక్షగానం’ అసంపూర్తిగా రాయగా, ఈయన కుమారుడు సుద్దాల అశోక్‌తేజ పూర్తి చేశారు.
# ‘వెట్టిచాకిరీ విధానమో రైతన్నా… ఎంత జెప్పినా తీరదో కూలన్నా’ అనే పాట ద్వారా వెట్టిని గురించి వివరించారు.
తెలంగాణ ఉద్యమ సాహిత్యం
#తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వెలువడిన గ్రంథాలు
స్త్రీల రచనలు
# 1960 దశకంలో తెలుగు సాహిత్యంలో స్త్రీలు విస్తారంగా రచనలు చేశారు. తెలంగాణ నుంచి యశోదారెడ్డి, మాదిరెడ్డి సులోచన, పొల్కంపల్లి శాంతాదేవి, బొమ్మ హేమాదేవి కథలు, నవలలు రచించారు.
దిగంబర కవులు
# 1965-68 మధ్య దిగంబర కవులు కవిత్వాలు రాశారు. వీరు తమ కవితా ఖండికలను ‘దిక్’లని పిలవాలన్నారు.
#నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి తెలంగాణ వారు కాగా నగ్నముని, మహాస్వప్న, భైరవయ్య ఆంధ్రులు (ఇవన్ని వారి కలం పేర్లు) వీరు ఆరుగురు కలిసి దిగంబర కవులుగా ఏర్పడి కవితా సంపుటాలు ప్రచురించారు.
తెలంగాణ దిగంబర కవుల రచనలు
#చెరబండరాజు దిక్సూచి, గౌరమ్మ కలలు, ముట్టడి, గమ్యం, జన్మహక్కు, పల్లవి, ఊరు మేలుకుంది,
శాంతి యుద్ధం.
#జ్వాలాముఖి ఓటమి తిరుగుబాటు
#నిఖిలేశ్వర్ శవభోగులు, ఎప్పుడు ఏడ్వలేదని, మండుతున్న తరం
దిగంబర కవుల అసలు పేర్లు
అసలు పేరు కలం పేరు
బద్దం భాస్కర్ రెడ్డి చెరబండరాజు
వీర రాఘవాచార్యులు జ్వాలాముఖి
యాదవ రెడ్డి నిఖిలేశ్వర్
# కొంతకాలం తర్వాత నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి విప్లవ కవులుగా మారారు.
#వందేమాతరం కవితలో చెరబండరాజు ఆవేదనతో అమ్మభారతి నీ గమ్యం ఏమిటి తల్లి అని ప్రశ్నించారు.
#1968-70 మధ్య కాలంలో వరంగల్‌లో కిషన్‌రావు, సుదర్శన్‌రావు, లోచన్, యాదగిరిరావు, వరవరరావు, టంకశాల అశోక్, ఎన్కే తదితర కవులు తిరగబడు అనే సంకలనం వెలువరించారు.
చేతనావర్త కవులు
# 1968-70లో చేతనావర్త కవులు ఏర్పడ్డారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతిపై స్పందించినప్పటికి వీరు మార్కిస్టు దృక్పథాన్ని అవలంబించలేదు.
# వరంగల్ జిల్లాకు చెందిన సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, సంపత్కుమార, నరసింహారెడ్డి వంటి వారు చేతనావర్తన కవుల్లో సుప్రసిద్దులు.
రచనలు
సుప్రసన్న తేజశ్చక్రం, దుఃఖయోగిని, ఆధునీకం
పేర్వారం సాగర సంగీతం
సంపత్కుమార చేతనావర్తనం- అనుశీలనం (వ్యాసం)
చండ్రపుల్లారెడ్డి వీర తెలంగాణ విప్లవ పోరాటం (1968)
రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ- నా అనుభవాలు,
జ్ఞాపకాలు (1972), నా జీవన పథంలో
పుచ్చలపల్లి సుందరయ్య వీర తెలంగాణ విప్లవ పోరాటం
ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ పోరాట స్మృతులు
నల్లా నర్సింలు తెలంగాణ పోరాటం నా అనుభవాలు
మఖ్దూం మొహియుద్దీన్ యే జంగ్ హై జంగే ఆజాదీ, ఏక్ చవేళి క మండ్వా తలేవే
ఉద్యమ కవిత్వం
దాశరథి కృష్ణమాచార్యులు అగ్నిధార (1948), రుద్రవీణ (1950), పునర్నవం
(1956), మహోంద్రోదయం (1961) ఆరుద్ర త్వమేవాహం (1949)
అనిశెట్టి సుబ్బారావు అగ్నివీణ (1949)
కుందుర్తి ఆంజనేయులు తెలంగాణ (1956)
ఆవత్స సోమసుందర్ వజ్రాయుధం (1949)
రెంటాల గోపాలకృష్ణ సర్పయాగం (1957)
పొట్లపల్లి రామారావు ఆత్మవేదన (1957)
కాళోజీ నారాయణరావు నా గొడవ (1966)
నారపరెడ్డి నా వీణ (1970)
విశాలాంధ్ర తెలంగాణ పోరాట గేయాలు (1973)
తిరునగరి రామాంజనేయులు జ్వలిత జ్వాల (1976)
సంపాదకత్వం పాటలు
దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ
బండి యాదగిరి బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడు, వెయ్యర వెయ్యి
భాగ్యరెడ్డి వర్మ ( 22.05.1888-02.07.1960):
#ఈయన తల్లిదండ్రులు మాదరి వెంకటయ్య, రంగమాంబ.
# ఈయన దళితుడు. సంఘసంస్కర్తగా హరిజనోద్ధరణకు కృషి చేశారు.
# 1906లో జగన్మిత్ర మండలిని స్థాపించి సమాజంలో చైతన్యం తేవడానికి కృషి చేశారు.
# 1914లో హైదరాబాద్‌లో బ్రహ్మసమాజం స్థాపించారు.
#1915లో సంఘసంస్కార నాటక మండలిని స్థాపించి హరిజనుల చేత నాటకాలు వేయించారు.
# 1922లో ‘ఆది హిందూ సాంఘిక సేవా సమితి’ని స్థాపించారు.
# 1931లో భాగ్యనగర్ పత్రికను స్థాపించి విజ్ఞానాన్ని అందించారు.
# 1932లో ‘వెట్టిమాదిగ’ రచించారు. ఇది తెలుగులో దళిత కవి రాసిన మొదటి దళిత కథ.
నోట్: 1937లో భాగ్యనగర్ పత్రిక ‘ఆది హిందూ పత్రిక’గా రూపాంతరం చెందింది.
# నెల్లూరు కేశవస్వామి, యుగాంతం ఇతని ముఖ్యమైన రచనలు.
నవ్య సాంప్రదాయం
నవ్యసాంప్రదాయం యుగానికి యుగకర్తగా విశ్వనాథను పేర్కొంటారు.
తిరుమల శ్రీనివాసాచార్యులు ఉదయరాగం (ఖండకావ్యం),
కావ్యపుష్కరిణి (కవితా సంకలనం)
చెల్లూరు శ్రీనివాసరావు వివేకానంద చరిత్ర
వజ్జెల కాళిదాసు ఆంధ్రమహావిష్ణువు (ద్విపద)
జీవీ సుబ్రమణ్యం వీరరసం, రసోల్లాసం
అనుమాండ్ల భూమయ్య వెయ్యినదుల వెలుగు, ఆధునికేతిహాసం
ముదిగంటి సుజాతారెడ్డి నవల-రససిద్ధాంతం
దేవపూజ పబ్లికేషన్స్ (తెలంగాణ సమాజం) సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు