పరిణయం అనే నాటకాన్ని రచించినవారు? నవీన సాహిత్యం
ఒద్దిరాజు సోదరులు
# సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధి చెందారు.
#వీరు వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తికి చెందినవారు.
#విజ్ఞాన ప్రచారిణీ పేరుతో గ్రంథమాలను నిర్వహించారు. వీరు ‘తెనుగు’ అనే వార పత్రికను నడిపారు.
#ఒద్దిరాజు సోదరులు ఎనిమిది సాంఘిక నాటకాలు రాణా ప్రతాపసింహ చారిత్రక నాటకం రాశారు.
# ఒద్దిరాజు సీతారామచంద్రరావు (1887-1956) రుద్రమదేవి చారిత్రక నవల మద్రాస్ విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి నవలల పోటీలో బంగారు పతకాన్ని గెలుపొందింది.
#ఈయన శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసం అనే చారిత్రక నవలలు, స్త్రీ సాహసం, ముక్తలవ అనే సాంఘిక నవలలు, ‘సౌదామిని పరిణయం’ అనే పద్యకావ్యం రాశాడు.
#ఒద్దిరాజు రాఘవ రంగారావు (1894-1973): వీరావేశం, వరావాముద్ర అనే చారిత్రక నవలలు, ‘తపతీ సంవరణోపాఖ్యానం’నకు వ్యాఖ్యానం రాశారు.
#రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘నౌకాభంగం’ను తెలుగులోకి అనువదించాడు.
మాడపాటి హనుమంతరావు
#‘ఆంధ్రాపితామహ’ బిరుదు పొందారు.
# 1951 హైదరాబాద్ మున్సిపల్ మేయర్‌గా, 1958లో రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా పనిచేశారు.
#తెలంగాణ విమోచన ఉద్యమ చరిత్రను ‘తెలంగాణ ఆంధ్రోద్యమం’ (1950) పేరుతో ఒక గ్రంథం రచించారు.
# మాడపాటి రచించిన ‘హృదయ శల్యం’ కథ ‘ఆంధ్రభారతి’లో 1912లో ప్రింటయ్యింది. ఇది తెలంగాణ నుంచి వచ్చిన మొట్టమొదటి కథ. ‘నేనే’ అని మరో స్వతంత్ర కథను రాశారు.
#1940లో అణా గ్రంథమాల హైదరాబాద్ నుంచి రెండు కథలను ‘మాలతీ గుచ్ఛము’ పేరుతో ప్రచురించారు.
సురవరం ప్రతాపరెడ్డి
#ఈయన బముఖ ప్రజ్ఞాశాలి. 1932లో ముడుంబై వెంకటరాఘవాచార్యులు అనే ఆంధ్రపండితుడు తెలంగాణలో ‘కవులు పూజ్యం (శూన్యం)’ అని విమర్శించాడు. దీంతో సురవరం ప్రతాపరెడ్డి 354 మంది తెలంగాణ కవులు, కవితలతో గోలకొండ కవుల సంచికను 1934లో విడుదల చేసి తెలంగాణలో తెలుగు కవులు పూజ్యం కాదు పూజనీయులు అని సురవరం చాటి చెప్పారు.
# సురవరం రచించిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు 1952లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత సురవరం ప్రతాపరెడ్డి.
# అరెవీరులు (1924) నవలను రచించారు. ఇది సినిమాగా తెరకెక్కింది.
# ‘శుద్ధాంతకాంత’ (1913) గ్రాంథిక భాషలో ఉంది. ఇది అముద్రితంగా ఉండిపోయింది.
# ‘మొగలాయి కథలు’ సమాజంలో ఉన్న అంశాలు కథలుగా రాశారు.
# ‘సురవరం కథలు’ పేరుతో 1940 దశకంలో పత్రికల్లో అచ్చయిన కథలను ఆంధ్రసారస్వత పరిషత్తు 1867లో ప్రచురించింది.
#‘హైందవ ధర్మవీరులు’లో 16 మంది వీరుల సాహస చరిత్రలను రాశారు.
#సామాన్య జనుల ప్రజాస్వామ్య హక్కులను వివరిస్తూ ‘ప్రజాధికారాలు’ రాశారు.
#‘రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి’ జీవిత చరిత్రను రాశారు.
# రాజా బదూర్ ప్రేరణతో గోలకొండ వారపత్రిక (1926)ను స్థాపించారు. దీనిలో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సంపాదకీయాలు రాశారు.
# రచయితలు, కవులను తయారుచేయడానికి ‘విజ్ఞాన వర్ధిని పరిషత్తు’ను స్థాపించారు.
# సంఘాల పంతులు, గ్యారా ఖద్దు బారా కొత్వాల్ కథల ద్వారా నిజాం పాలనలో దోపిడీని వివరించారు.
ఇతర రచనలు
1. హిందువుల పండుగలు
2. రామాయణ విశేషాలు
3. హరిశర్మోపాఖ్యానం
4. నిజాం రాష్ట్ర పాలనలు
5. చంపకీ భ్రమర విషాదం
6. గ్రామ జనదర్పణం
7. భక్తతుకారాం
#తెలుగు భాషా సాహిత్యాభివృద్ధి కోసం సురవరం ప్రతాపరెడ్డి 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించారు. 1953లో సురవరం మరణించారు.
సోమరాజు ఇందుమతిబాయి
#గోలకొండ కవుల సంచికలో ప్రచురితమైన పదిమంది కవయిత్రుల్లో ఈమె ఒకరు.
# శకుంతలా పరిణయం, గౌరి అనే ఖండ కావ్యాలు, వేణుగోపాల స్వామి శతకం రచించారు.
కందాళ బాలసరస్వతి
#వరంగల్ జిల్లా రామన్నపేట నివాసి అయిన ఈమె ‘పరిణయం అనే నాటకం’ రచించారు.
రూప్ఖాన్పేట రత్నమ్మ
#ఈమె పరిగికి చెందినవారు.
# వెంకట రమణ శతకం, శ్రీనివాస శతకం, కృష్ణుని దశావతార వర్ణన పద్యాలు రచించారు.
దాశరథి కృష్ణమాచార్యులు (1925-87)
# 1925 జూలై 22న వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని చినగూడూరులో జన్మించారు.
# 1944-46లో ఆంధ్రమహాసభ, జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1947-48లో జైలు శిక్షను అనుభవించారు.
# దాశరథి రచించిన కవితలు అగ్నిధార, రుద్రవీణ, మహోంధ్రోదయం, మహాబోధి, పునర్నవం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, నవమంజరి, నవమి, కవితాపుష్పకం, ఆలోచనాలోచనలు, దాశరథి శతకం, నిప్పుపూలు.
#గాలిబ్ గజల్స్‌ను ‘గాలిబ్ గీతాలు’ పేరిట 1961లో ప్రచురించారు.
# ‘మహాశిల్పి జక్కన’ అనే నవలను రచించారు.
# కళాప్రపూర్ణ బిరుదుతో పాటు ఆగ్రా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు.
# 1977లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి అయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చివరి ఆస్థాన కవి.
# ‘కవితా పుష్పకం’ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, ‘తిమిరంతో సమరం’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందాయి.
# ‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’ అని నిజాం నవాబును ధిక్కరించిన కవి ఈయన.
# ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’గా అభివర్ణించిన అభ్యుదయ కవి.
# అభ్యుదయ కవిత్వ ఉద్యమ నాయకుడైన దాశరథి 1987 నవంబర్ 5న మరణించారు.
గంగు శాయిరెడ్డి
# 1927-34 మధ్య కాలంలో ‘కాపుబిడ్డ’ (ఖండకావ్యం) కావ్యాన్ని రచించారు. ఇందులో తెలంగాణ పోరాటానికి గల కారణాలు ప్రస్తావించారు.
# దళితుల పక్షం వహించి వాళ్ల కోసం పాఠశాలలు నడిపిన సంఘ సంస్కర్త.
గార్లపాటి రాఘవరెడ్డి
#వరంగల్‌కు చెందిన ఈయన సావిత్రి, రతీ విలాపం వంటి పద్యకావ్యాలు రాశారు.
# ఈయనను పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు తమ గురువుగా పేర్కొన్నారు.
కాంచనపల్లి చిన వెంకటరామారావు (1921-92)
#ఈయన ‘మా ఊళ్లో కూడానా’ అనే కథల సంపుటి రచించారు.
# 1960లో నల్లగొండలో ‘దర్పణం’ పత్రికకు సంపాదకుడిగా ఉంటూ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
వట్టికోట ఆళ్వారుస్వామి (1915-61)
#ఈయన 1915 నవంబర్ 1న నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చెరువుమాదారం గ్రామంలో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యుల దంపతులకు జన్మించారు.
# గ్రంథాలయోద్యమంలో మొదలైన ప్రేరణ ఈయనను నిజాం వ్యతిరేక ఉద్యమం వరకు నడిపించింది.
# 1944లో ఆంధ్రమహాసభ చీలిపోయినప్పుడు ఈయన కమ్యూనిస్టుల పక్షంలో నిలిచారు.
# 1942-43, 1946-51 కాలంలో కఠినజైలు శిక్షను అనుభవించారు.
# జైలులో ఉన్నప్పుడు జైలు శిక్షను అనుభవించే ఖైదీల జీవిత వృత్తాంతాలను తీసుకొని ‘జైలులోపల’ అనే నవల రాశారు. (ఇది తెలుగులో జీవితం మీద రాసిన మొదటి రచన)
# 1938లో దేశోద్దారక గ్రంథమాలను స్థాపించారు. దీని తరఫున ‘జీవనరాగం’ అనే నాటికను రెండు సంపుటాలుగా ప్రచురించారు.
నోట్: కాశీనాథుని నాగేశ్వరరావుకు దేశోద్దారక బిరుదు ఉంది.
#1952లో ‘ప్రజల మనిషి’ నవలను అచ్చువేశారు.
# తెలంగాణ పోరాట చరిత్రను ‘గంగు’ నవలగా రచించారు.
# ‘ఉదయ ఘంటలు’ పేరుతో కవితాగేయాల సంకలనాన్ని తెచ్చారు.
#1956లో ‘పరిసరాలు’ పేరుతో తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన రచయితల కథలు ప్రచురించారు.
# ‘తెలంగాణ’ పేరుతో తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన వ్యాసాలు అచ్చువేశారు.
#అవకాశమిస్తే’ కథలో ఆళ్వారుస్వామి స్త్రీల ఇంటి చాకిరీ, వాళ్ల ప్రతిభ, కార్యనిర్వహణ కౌశలాన్ని ఎలా హరించి వేస్తుందో తెలియజేశారు.
# సామాజిక, రాజకీయ అంశాలపై ‘రామప్ప రభస’ వ్యాసాలు రాశారు.
కాళోజీ నారాయణరావు (1914-2002)
#ఈయన వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు.
#తల్లిదండ్రులు రమాబాయి, రంగారావు, భార్య రుక్మిణీబాయి, సోదరుడు రామేశ్వరరావు.
#కాళోజీ కవితలను ‘నా గొడవ’ పేరుతో ఏడు సంపుటాలుగా ఆళ్వారుస్వామి దేశోద్దారక గ్రంథమాల తరుఫున అచ్చువేశారు. నా గొడవ ద్వారా ప్రజల కష్టనష్టాలను వివరించారు.
# ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. మరణం తర్వాత శరీరాన్ని కూడా దవాఖానకు దానం చేసిన ఘనుడు.
# లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ గురించి ‘పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది’ అని అన్నారు.
# కాళోజీ జీవితం కూడా అంతే. కాళోజీ జీవితమే ఉద్యమం. ఉద్యమమే కాళోజీగా బతికారు.
కాళోజీ కథలు
1. మనమే నయం (పశుహింసను గురించిన కథ)
2. తెలియక ప్రేమ తెలిసి ద్వేషం (కుల విభేదాలు దేవాలయ ప్రవేశం గురించి రాసిన కథ)
3. విభూతి (వేలం వేయడాన్ని విమర్శించే కథ)
4. లంకా పునరుద్ధరణ (మిలిటరీ ప్రభుత్వం 1948లో తెలంగాణలో చేసిన ఆగడాలను వర్ణించే కథ)
5. ఆగస్టు 15
6. జీవనగీత
# కాళోజీ ‘ఇది నా గొడవ’ పేరుతో ఆత్మకథ కూడా రచించాడు.
# 1992లో పద్మవిభూషణ్ అవార్డు. ఇదే సంవత్సరం కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
#ఈయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా 2015 సంవత్సరానికి గాను కాళోజీ పురస్కారాన్ని అమ్మంగి వేణుగోపాల్‌కు ప్రదానం చేసింది.
నోట్: సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా
ప్రకటించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు