పాలపిట్ట.. జమ్మి చెట్టు.. కొర్ర మీను (అన్ని పోటీ పరీక్షల కోసం..)
ముల్కీ ఉద్యమం మొదలు.. స్వరాష్ట్ర సాధనకు ఎన్నెన్నో పోరాటాలు, ఎందరో అమరుల త్యాగాలు ప్రపంచ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఘట్టాలు అత్యంత బలమైనవి. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసే విధంగా ఉద్యమం నిర్మించబడింది. అనేక పోరాటాల అనంతరం ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ దీక్షతో ఢిల్లీ కదిలివచ్చి తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చింది. 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన ఎల్లలు, ఉనికి, విస్తరణ, భౌగోళిక అంశాలు నిపుణ పాఠకుల కోసం…
2-6-2014న – 10 జిల్లాలు.
2016 అక్టోబర్ 11 న (దసరా రోజున) నూతనంగా 21 జిల్లాల ఏర్పాటు.
2019 ఫిబ్రవరి 17న 32వ జిల్లాగా ములుగు, 33వ జిల్లాగా నారాయణపేట ఏర్పాటు.
తెలంగాణ త్రిభుజాకారంలో (సమద్విబాహు త్రిభుజాకారంలో) ఉంటుంది.
నదులు
- వర్షాకాలంలో పర్వతాల వాలుతలాల నుంచి వర్షపునీరు ప్రవహిస్తుంది. ఈ జల ప్రవాహాలు కొంత కాలానికి ఎండిపోతాయి. ఎత్తయిన ప్రాంతాల నుంచి ప్రవహించే నీటివల్ల వాగులు ఏర్పడుతాయి. వర్షాలు తిరిగి ప్రాంరభం కాగానే నీరు అదే కాలువల గుండా ప్రవహిస్తుంది. ఈ విధంగా నదీమార్గాలు, నదీలోయలు ఏర్పడుతాయి.
- చిన్న చిన్న సెలయేర్లు/ వాగులు ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి. ఇలా నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ‘ఉపనదులు’ అంటారు. ఇలా ప్రధాన నదుల్లో నీరు పెరుగుతుంది. నది పెద్దదిగా, వెడల్పుగా ఏర్పడుతుంది.
- నది పెద్దదిగా, విశాలంగా ఏర్పడిన తర్వాత నీటి ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది. నదిలో నీటి ద్వారా కొట్టుకువచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి నది అడుగు భాగంలోని అంచులకు చేరుతాయి. ఇది మైదానాలు ఏర్పడటానికి కారణమవుతుంది.
- నదులు సముద్రంలో కలిసేచోట ‘డెల్టాలు’ ఏర్పడుతాయి.
ఉదా: గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా
ఆనకట్టలు-పంటలు
గోదావరి నదిపై మొదటి డ్యామ్ గంగాపూర్ దగ్గర ఉంది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీరు అందిస్తుంది. ఈ నదిపై జయక్వాడి, శ్రీరాంసాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. ఇవి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి.
మైదానాలు
- పర్వతాలు, పీఠభూమి వలే కాకుండా సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలే మైదానాలు.
- నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ మైదానాలు ఏర్పడుతాయి.
- సింధూనది, దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి.
- గంగానది ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్‌బెంగాల్ గుండా ప్రవహించి గంగా మైదానాన్ని ఏర్పరిచింది.
- ఈ రెండు విశాల మైదానాలను కలిపి గంగా-సింధూ మైదానంగా పిలుస్తారు.
- తూర్పు తీర మైదానం దేశంలో తూర్పు దిక్కున బంగాళాఖాతం తీరానికి ఆనుకొని ఉన్నది. దీనిలో
- తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉన్నాయి.
పశ్చిమ తీర మైదానం దేశపు పశ్చిమ దిక్కున అరేబియా తీరానికి ఆనుకొని ఉంది. ఇందులో గుజరాత్, - మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ర్టాలు కలవు.
జిల్లాలు – సరిహద్దు రాష్ట్రాలు
- ఛత్తీస్‌గఢ్- జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు.
- మహారాష్ట్ర- జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్.
- కర్ణాటక- నారాయణపేట, గద్వాల్, వికారాబాద్,
- ఆంధ్రప్రదేశ్- జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
- తెలంగాణ భూ విస్తీర్ణం- 1,12, 077 చ.కి.మీ.
- దేశ భూవిస్తీర్ణంలో రాష్ట్ర విస్తీర్ణ శాతం – 3.14శాతం (11వ స్థానం)
రాష్ట్ర చిహ్నాలు
- రాష్ట్రజంతువు జింక (మచ్చల జింక)
- రాష్ట్ర పక్షి పాలపిట్ట
- రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు
- రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు
- రాష్ట్ర పండుగ బతుకమ్మ, బోనాలు
- రాష్ట్ర ఫలం సీతాఫలం
- రాష్ట్ర నది గోదావరి
- రాష్ట్ర చేప కొర్రమీను
- రాష్ట్ర మాస పత్రిక తెలంగాణ
పెద్ద జిల్లాలు
1. భద్రాద్రి కొత్తగూడెం
2. నల్లగొండ
చిన్న జిల్లాలు
1. హైదరాబాద్
2. మేడ్చల్ మల్కాజ్గిరి
3. నాగర్ కర్నూల్
జనాభా- 3.50 కోట్లు ( కెనడా దేశ జనాభాతో సమానం)
దేశ జనాభాలో 2.89శాతం (12వ స్థానం)
ఎక్కువ జనాభా గల జిల్లాలు
1. హైదరాబాద్
2. మేడ్చల్ మల్కాజ్గిరి
తక్కువ జనాభా గల జిల్లాలు
1. ములుగు
2. జయశంకర్ భూపాలపల్లి
శీతోష్ణస్థితి
- దేశపు శీతోష్ణస్థితి ఏ విధంగా ఉంటుందో.. అదేరకంగా తెలంగాణ రాష్ట్ర శీతోష్ణస్థితి రుతుపవన శీతోష్ణస్థితిని కలిగిఉంది.
- ఉత్తర ఆయనరేఖ మండలంలో తెలంగాణ విస్తరించింది.
- ఆయనరేఖ రుతుపవన శీతోష్ణస్థితిగా తెలంగాణ శీతోష్ణస్థితిని చెప్పవచ్చు.
- తెలంగాణ ఉష్ణమండలంలో ఉంది.
- అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా- పెద్దపల్లి (రామగుండం)
- అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా- కుమ్రం భీం ఆసిఫాబాద్.
- అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లా- ఆదిలాబాద్.
- పవనాలు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తాయి. ఇవి వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి. వీటినే ‘రుతుపవనాలు’ అంటారు.
- రుతుపవనాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి.
1. నైరుతి రుతుపవనాలు (జూన్- సెప్టెంబర్). బంగాళాఖాతం శాఖ, అరేబియన్ శాఖ
2. ఈశాన్య రుతుపవనాలు (అక్టోబర్- డిసెంబర్). - రాష్ట్రంలో మార్చి నెలతో మొదలయ్యే ఉష్ణోగ్రతల పెరుగుదల జూన్ వరకు కొనసాగుతుంది. జూన్ మధ్య నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో పాటు..వాటి ప్రభావంతో కురిసే వర్షాల వల్ల వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తాయి.
- రాష్ట్రంలో నైరుతిరుతుపవనాల వల్ల సాధారణ వర్షపాతం నమోదవుతుంది.
- రాష్ట్రంలో ఉత్తర, తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం పొందుతుండగా. పీఠభూమిలోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి.
- రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదవున్నది.
- మే నుంచి అక్టోబర్ మధ్య బంగాళాఖాతంలో తుఫానులు సంభవిస్తాయి.
ఈశాన్య రుతుపవనాలు
అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుంచి నైరుతి దిక్కుకు వీస్తాయి. వీటి వల్ల అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షంపాతం నమోదవుతుంది.
గోదావరి నది
- విస్తీర్ణం-312812 చ.కి.మీ (ఇది భూభాగంలో 10వ వంతు) (ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కన్నా ఎక్కువ)
- జన్మస్థలం- మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం దగ్గర పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి కొండలు.
- నిర్మల్ జిల్లాలోని కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
- మొత్తం పొడవు-1465 కి.మి.
- తెలంగాణ, ఏపీలో పొడవు- 770 కి.మి.
- రాష్ట్రంలో ప్రవహించే జిల్లాలు- నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం.
గోదావరి ఉపనదులు
- ప్రవర, మంజీర, మానేరు-కుడివైపు నుంచి కలిసే ఉపనదులు
- పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర నదులు ఎడమ పక్క నుంచి కలిసే ఉపనదులు.
గోదావరి నది ప్రవహించే రాష్ర్టాలు
- మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి
గోదావరి మారుపేర్లు – ఇండియన్ రైన్, దక్షిణగంగ
గోదావరి నది వేరు చేసే జిల్లాలు
- నిర్మల్-జగిత్యాల
- మంచిర్యాల-జగిత్యాల
- నిర్మల్-నిజామాబాద్
- మంచిర్యాల-పెద్దపల్లి
- గోదావరి నది మూడు పాయలుగా విడిపోయి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సమీపాన బంగాళాఖాతంలో కలుస్తుంది.
తెలంగాణ ఉనికి-విస్తరణ
15 డిగ్రీల 46,-19 డిగ్రీల 47 ఉత్తర అక్షాంశం, 77 డిగ్రీల 16-81 డిగ్రీల 43 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.
సరిహద్దులు
- ఉత్తరం- ఛత్తీస్‌గఢ్
- వాయవ్యం- మహారాష్ట్ర
- తూర్పు- ఆంధ్రప్రదేశ్
- పడమర- కర్ణాటక
- దక్షిణం- ఆంధ్రప్రదేశ్
మస్తాన్ బాబు
విషయనిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు