నిజాం పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు
వ్యవసాయం అభివృద్ధి- చెరువుల నిర్మాణం
# మొదటి సాలార్జంగ్ పాలనాకాలం నుంచి ప్రభుత్వం ప్రత్యక్ష పాలనలో 60 శాతం భూములుండేవి. వీటినే దివానీభూములు (ఖల్సాభూములు) అనేవారు. 10 శాతం భూములు సర్ఫేఖాస్ భూములు. ఈ భూము లు నిజాం రాచకుటుంబ ఖర్చుల కోసం కేటాయించబడ్డాయి. మిగిలిన 30 శాతం భూమి జమీందార్లు, జాగీర్దార్లు, నిజాం సైన్యాన్ని పోషించే నవాబులు, హిందూ సంస్థానాదీశుల ఆధీనంలో ఉండేవి.
ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు
# క్రీ.శ 1928- 29లో పరిశ్రమలకు ఆర్థిక, ఇతర సహాయ సహాకారాల కోసం ఒక కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేశారు.
# ఇతర పరిశ్రమలు: రాతి, పెంకు, సబ్బులు, అగ్గిపెట్టెలు, గ్లాసు, బూట్లు, చెప్పులు తదితర పరిశ్రమలు స్థాపించబడ్డాయి.
# నేత, సిల్క్ పరిశ్రమలు: సిద్దిపేట, గద్వాల, ఔరంగాబాద్‌లో నేత, సిల్క్ పరిశ్రమల్ని పునరుద్ధరించారు.
# కుటీర పట్టుపరిశ్రమలు: నిర్మల్, బీదర్‌లో కుటీర పట్టుపరిశ్రమల్ని పునరుద్దరించారు.
# రవాణాసౌకర్యాలు- అభివృద్ధి: బ్రిటీష్ వారి పాలనలో దేశంలో ఆధునిక రవాణా, సమాచార వ్యవస్థల ద్వారా దేశ సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి. దీని ద్వారా ప్రభావితమైన మొదటి సాలార్జంగ్ రవాణా, సమాచార రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. హైదరాబాద్ రాజ్యపు స్వరూప స్వభావాల్లో ముఖ్యంగా ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పు వచ్చింది.
#రోడ్డుమార్గాలు: నిజాం కొత్త రోడ్లు వేశాడు. అన్ని జిల్లా కేంద్రాలను కలుపుతూ రోడ్లు వేయించాడు. క్రీ.శ. 1911 వరకు 1614 మైళ్లు ఉన్న రోడ్లు, క్రీ.శ. 1940 నాటికి 5911 మైళ్లకు చేరాయి.
# బస్సు సర్వీసులు: క్రీ.శ. 1932లో 27 బస్సు సర్వీసులుండేవి. అనతి కాలంలోనే 500 బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలు బస్సులు నడిపేవి. రోడ్డు రవాణాకు సంబంధించి సర్వీసులు క్రమం తప్పకుండా నడపకపోవడం, చార్జీలను ఏకపక్షంగా అధికంగా విధించడంతో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించిన నిజాం ప్రభుత్వం క్రీ.శ 1932లో రోడ్డు రవాణా వ్యవస్థను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. నాటి రైలు, రోడ్డు వ్యవస్థలు కలిసి పనిచేయడంతో అభివృద్ధి సాధ్యమైంది.
# రైల్వే వ్యవస్థ: మీర్ ఉస్మాన్‌అలీఖాన్ కాలంలో అనేక రైలు మార్గాలు నిర్మించారు. సికింద్రాబాద్ నుంచి ద్రోణాచలం వరకు (148 మైళ్ల మీటర్గేజీ) రైలు మార్గం, ఖాజీపేట నుంచి బల్హర్ష వరకు ( 146 మైళ్లమార్గం), కారేపల్లి నుంచి కొత్తగూడెం (25 మైళ ్లబ్రాడ్గేజ్), పర్బని-పూరి (40 మైళ్ల మీటర్ గేజి), వికారాబాద్ నుంచి బీదర్‌కు (56 మైళ్లు), రైలు మార్గాలు నిర్మించారు. 1912-1948 మధ్య కాలంలో 1361 మైళ్ల మీటర్ గేజ్, 769 మైళ్ల బ్రాడ్‌గేజ్ మార్గాలు వేశారు.
# నాంపల్లి రైల్వేస్టేషన్ : నిజాం దీనిని క్రీ.శ. 1907లో నిర్మించారు. దీన్నే ‘హైదరాబాద్ దక్కన్ రైల్వేస్టేషన్’ అంటారు. ఇది తడిగా ఉన్న బురద ప్రాంతంలో నిర్మించడం వల్ల నాంపల్లి అనే పేరొచ్చింది. ఉర్దూభాషలో ‘నామ్’ అంటే తడి, ‘పల్లి’ అంటే ప్రాంతం అని అర్థం. మొదట్లో ఈ స్టేషన్‌ను వస్తువుల రవాణాకు ఉపయోగించేవారు. మొదటి ప్యాసింజర్ రైలు క్రీ.శ. 1921లో నాంపల్లి స్టేషన్ నుంచి నడిచింది.
#కాచిగూడ స్టేషన్ : ఇది క్రీ.శ.1916లో నిర్మించబడింది. ఈ స్టేషన్ నిజాం గ్యారెంటెడ్ రైల్వేస్టేషన్ హెడ్ క్వార్టర్స్‌గా క్రీ.శ. 1950 వరకు ఉంది. దీని కన్నా ముందు సికింద్రాబాద్ హెడ్‌క్వార్టర్స్‌గా ఉండేది. ఈ స్టేషన్ గోథిక్ శైలిలో నిర్మించబడింది.
విద్యాభివృద్ధి
# ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన: విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పాలని మొదటగా రఫత్యార్జంగ్, జమీలుద్దీన్ ఆఫ్ఘనీ అనే విద్యావేత్తలు ప్రతిపాదించారు. ఈ విషయాన్ని డబ్యూ.ఎస్.బ్లంట్ నాటి దివాన్ రెండో సాలార్జంగ్తో చర్చించడం, ఆ విషయాన్ని నాటి ఆరో నిజాంతో ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది. చివరకు నిజాం ఉస్మాన్ అలీఖాన్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయించడం జరిగింది. దీనికి ‘ఉస్మానియా విశ్వవిద్యాలయం’ అని నామకరణం చేశారు. హైదరాబాద్‌లోని తార్నాకలో 1400 ఎకరాల స్థలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించుటకు 1918, ఆగస్టు 28న రాజ శాసనాన్ని నిజాం జారీచేశారు. అబిడ్స్ గన్‌ఫౌండ్రీలోని తాత్కాలిక భవనాల్లో, ఆరంభ రోజుల్లో క్లాసులు జరిగేవి. యూనివర్సిటీ బోధన ఉర్దూలో కొనసాగేది. ఆర్ట్ సైన్స్‌ల్లో ఇంగ్లీషును బోధించేవారు. ఐరోపా దేశాలకు చెందిన వివిధ భాషల్లోని సైన్స్ పుస్తకాల్ని అనువదించి విద్యార్థులకు బోధించేవారు. అలాగే దేశంలోని ఇతర భాషల్లోని ప్రముఖ గ్రంథాలను అనువదించి విద్యార్థులకు బోధించడం జరిగింది. అనువాదం చేయుట కోసం 1918లో ట్రాన్స్లేషన్ కంపైల్మెంట్ బ్యూరోను స్థాపించారు.
#ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాముఖ్యం : ప్రముఖ శిల్పులు నవాబ్ జైన్‌యార్ జంగ్, సయ్యద్అలీరాజాలు ఐరోపా దేశాలు తిరిగి వివిధ నిర్మాణాల్ని పరిశీలించారు. అదేవిధంగా బెల్జియం శిల్పి ‘మాన్ష్యూర్ జాస్ఫర్’ను కలుసుకొని, అతన్ని క్రీ.శ. 1933లో హైదరాబాద్‌కు పిలిపించారు. జాస్ఫర్ మనదేశంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాల్ని చూసి ప్రాచీన, మధ్యయుగాల్లోని హిందూ, ముస్లిం శిల్పశైలుల్ని యూరప్‌లోని కట్టడాలు శిల్పశైలుల్ని మిళితం చేసి క్రీ.శ. 1934లో ఆర్ట్ కళాశాల నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనేక అనుబంధ కళాశాలలు వచ్చాయి.
# సిటీ కళాశాల : దీనిని అఫ్జల్‌గంజ్‌లో క్రీ.శ. 1922లో నిర్మించారు.
# ప్రభుత్వ గ్రంథాలయం : ప్రభుత్వ గ్రంథాలయాన్ని అఫ్జల్‌గంజ్‌లో క్రీ.శ. 1936 ఏర్పాటు చేశారు.
# జూబ్లీహాల్ మ్యూజియం : దీనిని క్రీ.శ. 1937లో ఏర్పాటుచేశారు.
# నాంపల్లిలో జనానా ఇంటర్మీడియట్ బాలికల కళాశాల, ఉస్మానియా మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు, ఇంటర్మీడియట్ కళాశాల (వరంగల్) మొదలైన విద్యాసంస్థలు స్థాపించబడ్డాయి. నిజాంపాలన అంతమయ్యే నాటికి 11 ఆర్ట్, సైన్స్ కళాశాలలు, 7 వృత్తి విద్యా కళాశాలలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం కింద ఉండేవి.
# ఉర్దూ భాష ప్రాధాన్యం: ఉస్మానియా విశ్వవిద్యాలయ కోర్సులు ఉర్దూ మాధ్యమంలో ఉండేవి. అంతేకాకుండా ప్రభుత్వోద్యోగానికి ఉర్దూ అర్హత ఉండటం వల్ల ఉస్మానియా కోర్సులకు డిమాండ్ పెరిగింది. దీనివల్ల ఉస్మానియా పాఠశాలల సంఖ్య పెరిగింది.
# ప్రాంతాల పేర్లు మార్చడం : మీర్ ఉస్మాన్ అలీ కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నాలు జరిగాయి. ఇతర మతస్థులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడం జరిగింది. అంతేకాకుండా ప్రాంతాల పేర్లు మార్చడం జరిగింది.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య: మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రఖ్యాత ఇంజినీర్. చెరువుల నిర్మాణంలో నిజాం కోరిక మేరకు సలహాలిచ్చి సహకరించేవారు. ఏడో నిజాం వ్యవసాయ అభివృద్ధి కోసం నీటిపారుదల వసతులను ఏర్పాటు చేశారు.
అలీ నవాబ్‌జంగ్: నిజాం రాజు కాలంలో అలీ నవాబ్ జంగ్ చీఫ్ ఇంజినీర్. ఇతని జన్మదినాన్ని ఇంజినీర్స్డే (జూలై 11)గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
స్థానిక సంస్థలు
8 జిల్లా బోర్డులు, తాలూకాబోర్డులు, పంచాయతీ, పట్టణ కమిటీలు మొదలైనవి హైదరాబాద్ రాజ్యంలోని స్థానిక సంస్థలు. భూమిశిస్తూ వసూళ్లలో ప్రతి రూపాయికి అణా చొప్పున విద్య, వైద్యం, పారిశుద్ధ్యం మొదలైన అవసరాలకు కేటాయించేవారు. పట్టణాల్లో మార్కెట్లు, విద్యుత్‌దీపాలు, ఎగుమతులు, దిగుమతులు, ఇళ్లపై, వాహనాలపై పన్నులు వసూల్ చేయబడేవి.
మౌలిక వసతులు, వాణిజ్యం-
వారసత్వ సంపద పరిరక్షణ
# పురావస్తు విషయాల పరిరక్షణ నిమిత్తమై క్రీ.శ. 1930లో నెలకొల్పడం జరిగింది.
# రామప్పగుడి, వేయిస్తంభాలగుడి, అజంతా, ఎల్లోరా మొదలైన ప్రసిద్ధ చారిత్రక కట్టడాల పరిరక్షణ నిమిత్తమై కృషి చేయడం జరిగింది.
ఉస్మానియా హాస్పిటల్
# క్రీ.శ. 1923 సంవత్సరంలో స్థాపించడం జరిగింది.
# ఇది అఫ్జల్‌గంజ్‌లో ఉంది.
హైకోర్టు స్థాపన
# హైకోర్టును 1919లో స్థాపించడం జరిగింది (ప్రస్తుత హైకోర్టు)
వ్యాపారం – అభివృద్ధి
నాటి హైదరాబాద్ ఆర్థిక ప్రగతి సాధించింది. ఎగుమతులు, దిగుమతులకు ప్రోత్సాహం లభించింది.
ఎగుమతులు
# పత్తి, ఆహారధాన్యాలు, నూనెగింజలు, నూనెలు, బొగ్గు, కలప, మొదలైన వాటిని ఎగుమతి చేసేవారు. హైదరాబాద్ రాజ్యం నుంచి ఎగుమతులు వివిధ దేశాలకు వెళ్లినట్లు తెలుస్తున్నది. చైనా, సౌదీఅరేబియా, శ్రీలంక, ఇరాన్, అమెరికా, జపాన్, నెదర్లాండ్స్ దేశాలకు వెళ్లేవి. అదేవిధంగా బ్రిటీష్ ఇండియా ప్రాంతాలకు కూడా వెళ్లేవి.
దిగుమతులు
# వెండి, బంగారం, రాగి, ఇనుము, నల్లమందు, నూలుదారం, పట్టు, ఉప్పు, చక్కెర మొదలైన వాటిని దిగుమతి చేసుకొనేవారు. బ్రిటన్, అమెరికా, జపాన్, చైనా, బర్మా, అరేబియా దేశాల నుంచి హైదరాబాద్ రాజ్యానికి దిగుమతులు వచ్చేవి. అదేవిధంగా బ్రిటీష్ ఇండియా ప్రాంతాల నుంచి కూడా దిగుమతి చేసుకొనేవారు.
ప్రాక్టీస్ బిట్స్
1. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మాన్‌సాగర్ చెరువు, నిజాంసాగర్ చెరువులను ఎవరు నిర్మించారు? (1)
1) ఉస్మాన్ అలీఖాన్ 2) నిజాం అలీఖాన్
3) సికిందర్ జా 4) మహబూబ్ అలీఖాన్
2. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం సంఘటన ఏ నవాబు కాలంలో జరిగింది? (2)
1) నిజాం అలీఖాన్ 2) ఉస్మాన్ అలీఖాన్
3) అఫ్జలుద్దౌలా 4) సలాబత్ జంగ్
3. హైదరాబాద్‌లో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు? (2)
1) 1878 2) 1887 3) 1897 4) 1868
4. సిటీ కళాశాలను ఎప్పుడు స్థాపించారు? (3)
1) 1920 2) 1921 3) 1922 4) 1923
5. అఫ్జల్‌గంజ్‌లో ప్రభుత్వ గ్రంథాలయం ఎప్పుడు ప్రారంభమైంది? (2)
1) 1935 2) 1936 3) 1937 4) 1938
మధుసూదన్. బి
నారాయణ ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్
94400 82663
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు