ది రెడ్ క్రీసెంట్ సొసైటీ స్థాపకుడు ఎవరు
తెలంగాణలో జాతీయోద్యమం ( గ్రూప్-1,2,3 ప్రత్యేకం)
జాతీయోద్యమానికి మూలాలు పత్రికలు, గ్రంథాలయాలు, దాతృత్వం కలిగిన పెద్దలు, రవాణారంగం, నగరీకరణ, ఆధునిక న్యాయవిధానం, విద్యాసంస్థల ఏర్పాటు, సామాజిక సంస్కరణోద్యమాలు మొదలైనవి ముఖ్యకారణాలుగా చెప్పుకోవచ్చు.
తొలి పత్రిక: తెలంగాణలో తొలి పత్రిక 1886లో ‘సేద్యచంద్రిక’ (ఆంధ్రలో తొలి పత్రిక ‘సత్యదూత’ 1830 లో బళ్ళారి కైస్తవ సంఘం వారు ముద్రించారు). తెలంగాణలో మాత్రం సేద్యచంద్రిక వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల ప్రచారం కోసం వచ్చింది. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వంగడాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, భూములు- రకాలు, పూలతోటలు వాతావరణానికి తగిన పంటల ఎంపిక గురించి వ్యాసాలు వచ్చేవి. ఇవి తెలంగాణ వ్యవసాయ రంగంలో ఆధునికతకు చాలా ఉపయోగపడ్డాయి.
# 1913లో వచ్చిన ‘హితబోధిని’ తొలి పత్రికగా ప్రసిద్ధి. (భారతదేశంలో 1780లో వచ్చిన బెంగాల్‌గెజిట్ హిస్కిస్ చే స్థాపించబడింది.)
# అచ్చుయంత్రం: 1850లో వనపర్తి, 1875లో గద్వాల సంస్థానాల్లో ముద్రణాశాలలు ప్రారంభించారు. చాలా కాలం ముందునుంచే తెలంగాణ ప్రజలకు పత్రికలతో సంబంధం ఉంది. భారతదేశంలోని తొలి పత్రికల్లో ఒకటైన మిరాత్-ఉల్-అక్బర్ (రాజారాంమ్మోహన్ రాయ్ పత్రికల్లో ఇది ఒకటి) హైదరాబాద్‌తో సంబంధం కలిగి ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇం డియాలో అనేక పత్రికలు వచ్చాయి. అలాంటి పత్రికల్లో ‘రిసాలబ్బి’ అనే వైద్య పత్రిక ఉర్దూలో ప్రారంభమైంది. దీంతో హైదరాబాద్‌లో జర్నలిజానికి బీజాలు పడ్డాయి.
# సికింద్రాబాద్‌లో దక్కన్టైమ్స్: 1864
# హైదరాబాద్‌లో టెలిగ్రాఫ్:1882
#హైదరాబాద్‌లో రికార్డర్:1885
#మౌల్వి మొహిబ్ హుస్సేన్ జర్నలిజానికి పితగా ప్రసిద్ధి. తన పత్రిక మౌల్లిం-ఎ-షఫిక్ (1892)లో ప్రత్యేకంగా పలు అంశాలపై పోరాడింది.
# ముస్లిం స్త్రీల విద్యకై, పర్దా పద్ధతి తొలగించడం మొదలైన సామాజిక సంస్కరణలకై పోరాడింది. (ఇతనిని తెలంగాణ సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్‌గా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ముస్లిం స్త్రీల విద్య, పర్దా పద్ధతి నిషేధానికై పోరాడిన తొలి వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్) తర్వాత మౌల్లిం-ఎ-షఫిక్ పత్రికను ప్రభుత్వం నిషేధించింది. 1904లో ఉర్దూ వారపత్రికను ప్రారంభించాడు. 1890 నాటికే తెలంగాణలో, ఇంగ్లీష్‌లో 21 వార్తా పత్రికలు ఉన్నాయి.
# ఖమ్మం జిల్లా మధిర నుంచి 1909లో సంయుక్త సంఘ వర్ధమాని పత్రిక కైస్తవ మత ప్రచారం కోసం వెలువడింది. 1913లో శ్రీనివాసశర్మ సంపాదకత్వం లో హితబోధిని తొలిపత్రికగా పరిగణించారు. సేద్యచంద్రక తొలిపత్రిక అయినా అది అనువాద పత్రిక కావడంతో ‘హితబోధి’ని తొలి తెలుగు తెలంగాణ పత్రికగా పరిగణనలోకి వచ్చింది.
# దివ్యజ్ఞాన సమాజం 1857లో అమెరికాలో మేడం బ్లావట్కిచే స్థాపించబడిన సంస్థ. హైదరాబాద్‌లో 1892 లో ప్రారంభించారు. ఈ సంస్థ 1917లో ఆంధ్రమాత అనే పత్రికను ప్రారంభించింది.
# దివ్యజ్ఞాన సమాజ భావాలు అంటే విశ్వసోదర ప్రేమ (యూనివర్సిల్ బ్రదర్హుడ్)
# ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం. ప్రజలను రాజకీయ చైతన్యులను చేయడం ఈ పత్రిక ఆశయాలు
#ఇతర ముఖ్య పత్రికలు: ఖమ్మం నుంచి ములాగ్ వర్తమాన అనే కైస్తవ మతప్రచార పత్రిక మతప్రచారం కోసం ప్రారంభించబడింది. ఇది మత దృష్టితోనే కాక, ఆధునిక భావాలు, జాతీయ చైతన్యం కోసం కూడా ఉపయోగపడింది. ఇలాంటిదే మరో పత్రిక సువార్తమణి (1921లో) మహబూబ్‌నగర్ నుంచి వెలువడింది.
# 1902లో నీలగిరి పత్రిక ప్రారంభం తెలంగాణ పత్రికా రంగంలో మైలురాయి. 1925లో గోల్కొండ, 1926లో దేశబంధు, 1927లో సుజాత మొదలైన పత్రికలొచ్చాయి.
# ఉర్దూ భాషల్లో మిజాన్, ఇమ్రోజ్ పత్రికలు చెప్పుకోదగినవి. ఇమ్రోజ్ పత్రిక స్థాపకుడు షోయబ్ ఉల్లాఖాన్ తన పత్రికల్లో నిజాం పాలన వ్యతిరేకతపై పోరాడిన మహానుభావుడు.
ముఖ్యగ్రంథాలయాలు
# 1872: సోమసుందర్ మొదలియార్ సికింద్రాబాద్‌లో గ్రంథా లయం స్థాపించాడు. దీనిని తెలంగాణలోనే కా కుండా తెలుగు రాష్ట్రాల్లోనే తొలి గ్రంథాలయంగా చెప్పుకోవచ్చు. 1884లో ఈ గ్రంథాలయాన్ని మహబూబియా కాలేజీలో విలీనం చేశాడు. మహబూబియా కాలేజీని 1862లో సోమసుందరం మొదలియార్ స్థాపించాడు.
# 1892: అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ
# 1895: భారత గుణవర్ధక్ సంస్థ లైబ్రెరీ, శాలిబండ
# 1896: ఆల్బర్ట్ రీడింగ్ రూం, బొల్లారం
# 1901: శ్రీ కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం, హైదరాబాద్
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం
# ఈ గ్రంథాలయా న్ని మునగాల సం స్థానం రాజైన రా జా వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, కొమరాజులతో కలిసి స్థాపించాడు. ఈ గ్రంథాలయం హైదరాబాద్‌లో పోటీ పరీక్షలు నిర్వహించిన మొదటి సంస్థ. ఇది నవల పో టీలు కూడా నిర్వహించింది. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం తెలంగాణ గ్రంథాలయోద్యమానికి ఊపునిచ్చింది.
మరికొన్ని గ్రంథాలయాల స్థాపన, వాటి వివరాలు…
# రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం-1904, హన్మకొండ
# బాలభారతీ నిలయ ఆంధ్రభాషావర్తక సంఘం – 1905, శంషాబాద్
# విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి- 1906, హైదరాబాద్
# ఆంధ్రభాషా సంవర్ధిని-1905, సికింద్రాబాద్
# ఆంధ్రభాషా నిలయం-1910, మడికొండ (వరంగల్ జిల్లా)
# సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం- 1913, సికింద్రాబాద్
# రెడ్డిహాస్టల్ గ్రంథాలయం -1918, హైదరాబాద్
# వేమన ఆంధ్రభాషా గ్రంథాలయం -1923, హైదరాబాద్ (కేవీ రంగారెడ్డి)
# ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం – 1923, హైదరాబాద్
# ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయం – 1925, హైదరాబాద్
# ఆది హిందూ లైబ్రెరీ- 1926, హైదరాబాద్,
# జోగిపేట గ్రంథాలయం- 1930, మెదక్
వైమానిక మార్గం
# భారతదేశంలోనే వైమానిక మార్గాలు కలిగి ఉన్న ఏకైక సంస్థానం హైదరాబాద్. దిండిగల్, హకీంపేట, బేగంపేటలు ప్రత్యేక విమానమార్గాన్ని క లిగి ఉన్నాయి. 1935 లో భారతదేశంతో వైమానిక అనుసంధానం ఏర్పడింది.
కమ్యూనికేషన్స్
తంతిసౌకర్యం: 1856-57లో హైదరాబాద్- కర్నూల్- బొంబాయిల మధ్య తొలి తంతి సౌకర్యం ఏర్పడింది. (భారతదేశంలో 1853లో ఆగ్రా నుంచి కలకత్తా వరకు తొలి తంతి మార్గం వేయబడింది). 1862లో తపాలా కార్యాలయం (పోస్టల్‌శాఖ) ఏర్పడింది. ( 1853లో డల్హౌసి పోస్టల్‌శాఖను, కరాచీలో తొలి పోస్ట్ ఆఫీస్‌ను ప్రారంభించాడు).
నగరీకరణ: 1912 లో నగరాభివృద్ధి కోసం ‘నగరాభివృద్ధి సంస్థ’ ఏర్పడింది. హైదరాబాద్ మొత్తానికి మంచినీరు సరఫరా చేయడానికి 1917లో మూసీనదిపై ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్, 1922లో మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1934లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చబడింది.( భారతదేశంలో తొలి కార్పొరేషన్ మద్రాస్- 1688).
రవాణారంగం
# రైల్వేలు: నిజాం రాజ్యంలో తొలి రైల్వేమార్గాన్ని 1874 లో పూర్తి చేయబడింది (భారతదేశంలో 1853, ఏప్రిల్ 13న డల్హౌసి తొలిసారిగా రైల్వేలైను బొంబాయి నుంచి థానే వరకు ప్రవేశపెట్టాడు).
# హైదరాబాద్ రాష్ట్రంలో తొలి రైల్వేమార్గం ‘నాందెడ్ నుంచి వాడి’ వరకు, సికింద్రాబాద్ నుంచి వాడి వరకు ప్రవేశపెట్టబడింది.
# నాందెడ్- వాడి (1864)
# సికింద్రాబాద్- వాడి (1876, మహారాష్ట్ర)
# విజయవాడ- సికింద్రాబాద్ (1886)
# హైదరాబాద్- మన్మాడ్ (1900) (మీటర్‌గేజ్)
# రైల్వేలలో 3 గేజ్లుంటాయి. అవి బ్రాడ్, మీటర్. న్యారోగేజ్
రోడ్డురవాణా మార్గం
# భారతదేశంలోనే తొలి రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ) వ్యవస్థ హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడింది. హైదరాబాద్- షోలాపూర్ (1868) రోడ్డుమార్గం ఏర్పడింది.
# హైదరాబాద్‌లో బస్ డిపోలు (1932) ప్రారంభించబడ్డాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో బస్ డిపోలు (1936) స్థాపించబడ్డాయి.
దాతృత్వం కలిగిన దాతలు
మాడపాటిహన్మంతరావు: తెలంగాణలో సాహిత్యం, సాంస్కృతిక పునర్వికాసానికి పునాదులు వేశాడు. తెలంగాణలో బాలికల విద్యావ్యాప్తి కోసం పాఠశాలలు స్థాపించాడు. మాడపాటి హన్మంతరావు బాలికల పాఠశాల 1928లో నారాయణగూడ (హైదరాబాద్)లో స్థాపించాడు. బహుశా తెలంగాణలో ఇదే తొలి బాలికల పాఠశాల అయ్యిండొచ్చు?. నీలగిరి, తెనుగు, గోల్కొండ పత్రికల స్థాపనలో ప్రత్యక్ష పాత్రను పోషించాడు. ముషిరే దక్కన్ ఉర్దూ పత్రిక స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించాడు. 1915లో ‘మాలతోగుచ్చం’ కవితా సంకలనం రాశాడు. దీ నికి భారతప్రభుత్వం 1955లో పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. సహకారరత్నగా, ఆంధ్రాపితామడిగా ప్రసిద్ధి చెందాడు. చివరకు 1970లో స్వర్గస్థులయ్యారు.
సంగెం లక్ష్మీబాయమ్మ : సామాజిక, జాతీయోద్యమంలో ఏకకాలంలో నిబద్ధతతో నిల్చింది. పండితకార్వే మహిళా విశ్వవిద్యాలయం పూణా నుంచి (దేశంలో ఏర్పడిన తొలి మహిళా విశ్వవిద్యాలయం-1916) పట్టభద్రురాలైంది. విదేశీవస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొన్నది. మహిళల్లో చైతన్యం, పిల్లల సంక్షేమం కోసం ఇందిరా సేవాసదన్ (1952లో) స్థాపించింది. (ఇదే ప్రస్తుతం సంతోష్‌నగర్‌లో ఉన్న ఐఎస్ సేవాసదన్). ఈ సంస్థ సామాజిక సేవకు, త్యాగానికి గుర్తుగా మహిళల సేవలలో అంకితమైంది.
సురవరం ప్రతాపరెడ్డి (1896-1954): సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికకు ఎడిటర్‌గా పని చేశాడు. ఆంధ్రులసాంఘిక చరిత్ర, శుద్ధాంత కాంత నవల (1917), భక్తతుకారాం నాటకాలను రాశాడు. 1930 మెదక్‌లో జరిగిన మొదటి ఆంధ్రమహాసభకు అధ్యక్షుడయ్యాడు. తెలంగాణలో కవులులేరన్న ముడంబై వెంకట రాఘవచార్యుల ప్రశ్న కు సమాధానంగా గోల్కొండ కవుల సంచికను తన పేరుతో ప్రచురించాడు.
అఘోరనాథ్ ఛటోపాధ్యాయ : అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నాబీబిదాస్ బ్రహ్మసమాజంలోని శాఖలో చేరాడు. 1883లో తెలంగాణలోజరిగిన తొలి ప్రజాబాహుళ్య ఉద్యమం. చందానగర్ రైల్వే సంఘటనలో పాల్గొన్నాడు. 1887లో నిజాం కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా పని చేశాడు.
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు