కుతుబ్‌షాహీల పాలనలో ప్రధాన ఓడరేవు ఏది? (TS TET Special)
1. విజయనగరాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు?
1) కృష్ణా 2) భీమా
3) తుంగభద్ర 4) మూసీ
2. విజయనగరాన్ని 1336లో విద్యారణ్యస్వామి ఆశీస్సులతో నిర్మించినది ఎవరు?
1) హరిహర బుక్కరాయలు
2) ప్రౌఢ దేవరాయలు
3) ఆళియ రామరాయలు
4) శ్రీకృష్ణ దేవరాయలు
3. విజయనగర రాజుల ఇలవేల్పు ఏ దేవుడు?
1) శ్రీకృష్ణుడు 2) విరూపాక్షుడు
3) రాముడు 4) శ్రీవేంకటేశ్వరుడు
4. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల వరుసక్రమాన్ని పేర్కొనండి.
1) తుళువ, అరవీటి, సంగమ, సాళువ
2) సంగమ, సాళువ, తుళువ, అరవీటి
3) అరవీటి, సంగమ, తుళువ, సాళువ
4) సాళువ, సంగమ, అరవీటి, తుళువ
5. బహమనీ సామ్రాజ్యం ఏ ముఖ్యపట్టణంలో ఆవిర్భవించింది?
1) అహ్మద్‌నగర్ 2) బీరార్
3) బీదర్ 4) గుల్బర్గ
6. బహమనీల అనంతరం ఐదు రాజ్యాలుగా విడిపోయిన పాలకులు ఏ దేశాలకు చెందిన సుల్తాన్లు?
1) టర్కీ 2) ఇరాక్
3) ఇరాన్, అరేబియా 4) పాలస్తీనా
7. గోల్కొండ, బీజాపూర్, బీరార్, బీదర్, అహ్మద్‌నగర్ రాజ్యాల్లో పెద్ద రాజ్యాలుగా అవతరించినవి ఏవి?
1) అహ్మద్‌నగర్, గోల్కొండ
2) గోల్కొండ, బీజాపూర్
3) బీదర్, గోల్కొండ
4) బీదర్, బీజాపూర్
8. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన యాత్రికులను, వారి దేశాలతో జతపర్చండి.
యాత్రికులు దేశం
ఎ. నికోలో కాంటి 1. పోర్చుగీసు
బి. అబ్దుల్ రజాక్ 2. పర్షియన్
సి. డొమింగో పేజ్ 3. ఇటలీ
4. టర్కీ
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-1, బి-2, సి-4
4) ఎ-1, బి-3, సి-4
9. విజయనగర పట్టణం ఏడు వలయాల్లో ఏర్పడి, కోటగోడలు కలిగి ఉందని తెలిపిన విదేశీ యాత్రికుడు ఎవరు?
1) నికోలో కాంటి 2) న్యూనిజ్
3) డొమింగో పేజ్ 4) అబ్దుల్ రజాక్
10. విజయనగరం విశాలమైన వీధులతో, అందమైన భవనాలతో ఉండేదని.. వీధుల్లో ముత్యాలు, వజ్రాల వ్యాపారం జరిగేదని తెలిపిన విదేశీ యాత్రికుడు ఎవరు?
1) డొమింగో పేజ్ 2) అబ్దుల్ రజాక్
3) న్యూనిజ్ 4) నికోలో కాంటి
11. నిర్మాణానికి సంబంధించి కింది వాటిని జతపర్చండి.
ఎ. మొదటి భాగం 1. అంతఃపుర రాజభవనాలు
బి. రెండో భాగం 2. సామాన్య ప్రజలు
సి. మూడో భాగం 3. పంటభూములు, కాల్వలు
డి. నాలుగో భాగం 4. ఉద్యాన వనాలు
5. గుట్టలపైన ఆలయాలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-1, డి-5
3) ఎ-5, బి-3, సి-1, డి-2
4) ఎ-5, బి-1, సి-4, డి-3
12. విజయనగర రాజులు మేలురకపు గుర్రాలను ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు?
1) టర్కీ, అఫ్గానిస్థాన్
2) అరేబియా, ఇరాన్
3) పోర్చుగల్ 4) పర్షియా
13. తన సైన్యంలో ముస్లిం యోధులను నియమించి, మసీదును నిర్మించిన విజయనగర రాజు?
1) శ్రీకృష్ణ దేవరాయలు
2) రెండో హరిహరరాయలు
3) రెండో దేవరాయలు
4) అచ్యుత రాయలు
14. పోర్చుగీస్ యాత్రికుడైన డొమింగో పేజ్ ఎవరి పాలనాకాలంలో విజయనగరాన్ని సందర్శించాడు?
1) మొదటి బుక్కరాయలు
2) రెండో దేవరాయలు
3) అళియ రామరాయలు
4) శ్రీకృష్ణ దేవరాయలు
15. అమర నాయకులకు సంబంధించి కింది విషయాలను పరిగణించండి.
ఎ. అమరం అంటే ఒక ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం పొందడం
బి. సైనిక దళాలను పోషించి యుద్ధ సమయాల్లో రాజు తరఫున పాల్గొనడం
సి. వీరి అధీన ప్రాంతాలపై అధికారాలు ఉండేవి కావు
డీ. చాలా మంది అమర నాయకులు కన్నడ వారే
సరైనదాన్ని ఎన్నుకోండి.
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) సి, డి 4) ఎ, బి, సి
16. గోవా ఓడరేవుపై నియంత్రణ సాధించి సైన్యంలో పోర్చుగీసు దళాలను ఏర్పాటు చేసిన విజయనగర రాజు?
1) రెండో దేవరాయలు
2) బుక్క రాయలు
3) శ్రీకృష్ణ దేవరాయలు
4) రామరాయలు
17. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన దేవాలయాల ముఖద్వారాలను ఏమంటారు?
1) రాయగోపురం 2) మహాగోపురం
3) సఖా మండపం 4) రంగ గోపురం
18. ఆముక్తమాల్యద గ్రంథాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ఏ కవయిత్రి జీవితం ఆధారంగా తెలుగులో రాశాడు?
1) భక్త శబరి 2) ఆండాళ్
3) మృణాళ్ 4) మొల్ల
19. శ్రీకృష్ణ దేవరాయల కొలువును అలంకరించిన కవి పండితులను ఎలా పిలిచారు?
1) నవరత్నాలు 2) అష్టదిగ్గజాలు
3) పంచరత్నాలు 4) పంచ పండిత సభ
20. 1565లో జరిగిన రక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధంలో ఓడిపోయిన విజయనగర పాలకుడు?
1) విరూపాక్ష రాయలు
2) అళియ రామరాయలు
3) నాలుగో హరిహరరాయలు
4) కంపరాయలు
21. విజయనగర సామ్రాజ్య చివరి పాలకులు ఏ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు?
1) చంద్రగిరి 2) పెనుగొండ
3) తిరుపతి 4) విద్యనగరం
22. బహమనీ సుల్తాన్ల రాజ్య వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకున్న విజయనగర ప్రభువు?
1) నాలుగో బుక్కరాయలు
2) సాళువ నరసింహ రాయలు
3) వెంకటపతి రాయలు
4) అళియరామ రాయలు
23. సైనిక వ్యవస్థను మెరుగుపర్చి తుపాకులు, ఫిరంగులు ప్రవేశపెట్టిన విజయనగర రాజు?
1) రెండో దేవరాయలు
2) శ్రీకృష్ణ దేవరాయలు
3) సాళువ నరసింహ రాయలు
4) రెండో హరిహర రాయలు
24. విజయనగర రాజులకు సవాలుగా నిలిచిన శక్తిమంతమైన అమర నాయకులు?
1) అరవీటి వేంకటపతి రాయలు
2) సాళువ నరసింహ రాయలు
3) తుళువ వీర నరసింహ
4) సంగమ బుక్క
25. తల్లికోట యుద్ధానంతరం విజయనగర పాలకులు రాజధానిగా చేసుకున్న పట్టణం?
1) తిరుపతి 2) హంపి
3) చంద్రగిరి 4) చెన్నపట్నం
26. బహమనీ సుల్తాన్ల గవర్నర్ కులీకుతుబ్‌షా ఏ సంవత్సరంలో స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు?
1) 1565 2) 1512
3) 1532 4) 1548
27. కుతుబ్షాహీలలో ఏ సుల్తాన్‌ను మల్కిభరాముడని ప్రశంసించారు?
1) కులీకుతుబ్‌షా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) జంషెడ్ కులీ
4) తానీషా
28. ఇబ్రహీం కుతుబ్‌షా పోషణలో లేని ప్రముఖ తెలుగు కవి?
1) అద్దంకి గంగాధరుడు
2) కందుకూరి రుద్రకవి
3) పొనగంటి తెలగనార్యుడు
4) బమ్మెర పోతన
29. 1562లో నిర్మించిన హుస్సేన్‌సాగర్ చెరువుకు ఆ పేరు ఎందుకు పెట్టారు?
ఎ. సూఫీ సంతు హజరత్ హుస్సేన్ షావలి గౌరవార్థం
బి. మహ్మద్ హుస్సేన్ అబ్దుల్లా గౌరవార్థం
సి. ప్రధాని హుస్సేన్ ఇబ్రహీం తవ్వించినందున
డి. చెరువు రేఖాచిత్ర తయారీలో పాల్గొన్నందున
1) ఎ, సి, డి 2) ఎ, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
30. ప్రఖ్యాతిగాంచిన పురానాపూల్ (పాత వంతెన)ను నిర్మించినది ఎవరు?
1) మహ్మద్ కులీకుతుబ్ షా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) అబ్దుల్లా కుతుబ్‌షా
4) జంషీద్ కుతుబ్‌షా
31. హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా నిర్మించిన సుల్తాన్?
1) అబుల్హసన్ తానీషా
2) మహ్మద్ కులీకుతుబ్ షా
3) కులీ కుతుబ్‌షా
4) జంషీద్ కులీ
32. హైదరాబాద్ నగర నిర్మాణంలో కీలక భూమిక పోషించిన వజీరు, వాస్తుశిల్పి ఎవరు?
1) మీర్ మోమిన్ అస్త్రబాది
2) మీరు ఉస్మాన్ అలీఖాన్
3) మీర్ ఖమ్రుద్దీన్
4) మీర్ బక్షీ
33. చార్మినార్‌ను కట్టించిన కుతుబ్‌షాహీ సుల్తాన్ ఎవరు?
1) మహ్మద్ కులీ
2) జంషీద్
3) తానీషా
4) మహ్మద్ కులీకుతుబ్‌షా
34. కింది వాటిలో మహ్మద్ కులీకుతుబ్‌షా నిర్మాణాలు కానివి?
1) చార్మినార్
2) మక్కామసీదు
3) జామామసీదు
4) హుస్సేన్‌సాగర్ చెరువు
35. కింద పేర్కొన్న కుతుబ్‌షాహీ సుల్తాన్లు, వారి సేవలను జతపర్చండి.
ఎ. కులీకుతుబ్‌షా 1. క్షేత్రయ్యను సత్కరించాడు
బి. ఇబ్రహీం కుతుబ్‌షా 2. హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు
సి. మహ్మద్ కులీకుతుబ్‌షా 3. తెలుగు కవులను ఆదరించాడు
డి. అబ్దుల్లా కుతుబ్‌షా 4. కుతుబ్‌షాహీ రాజ్యస్థాపన చేశాడు
5. మాసాబ్ ట్యాంక్ చెరువును నిర్మించాడు
1) ఎ-4, బి-2, సి-1, డి-5
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4
సమాధానాలు
1-3 2-1 3-2 4-2 5-4 6-3 7-2 8-1 9-4 10-1 11-3 12-2
13-3 14-4 15-1 16-3 17-1 18-2 19-2 20-2 21-1 22-4 23-1 24-2
25-3 26-2 27-2 28-4 29-2 30-2 31-2 32-1 33-4 34-4 35-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు