అభినవ పోతన అని ఎవరిని పిలుస్తారు? ( తెలుగు టెట్ ప్రాక్టీస్ బిట్స్)
1. మధురాంతకం రాజారాం గారి రచన?
1) ఇక్కడ మేమంతా క్షామం
2) ఇక్కడ మేమంతా క్షేమం
3) కమ్మని తెమ్మెరలు వీస్తున్నాయి
4) రేపటి ప్రపంచంలో సమస్యలు
2. ‘మేము సైతం’ పాఠం ప్రక్రియ?
1) లేఖ 2) కరపత్రం
3) పోస్టర్ 4) వ్యాసం
3. ‘రెక్కలొచ్చిన పక్షులు’ అనే జాతీయం ఉపయోగించే సందర్భం?
1) పిల్లలకు ఉపాధి దొరికినప్పుడు
2) పిల్లలకు శారీరక బలం పెరిగినప్పుడు
3) పెద్దలకు ఆరోగ్యం చేకూరినప్పుడు
4) పెద్దలు విదేశాలకు వెళ్ళినప్పుడు
4. ‘రాతిరి’ అనే పదానికి ప్రకృతి పదం?
1) రేయి 2) రాత్రి
3) అర్ధరాత్రి 4) రేలు
5. ‘పిత్రార్జితం’ సంధి విడదీస్తే?
1) పిత్ర+అర్జితం 2) పిత్రః+ఆర్జితం
3) పితృ+ఆర్జితం 4) పిత్రా+ఆర్జితం
6. గంధం చెక్కను అరగదీయడానికి ఉపయోగించే రాయి?
1) బండ 2) సాన
3) శానం 4) రాయి
7. ‘ప్రకటన’ పాఠం ఇతివృత్తం?
1) దేశభక్తి 2) నైతిక విలువలు
3) సామాజిక విలువలు 4) శాంతి
8. ఒక భాషలో కొన్ని పదాలు కలిపి ఒక విశేష
అర్థాన్ని ఇచ్చే పద బంధాన్ని ఏమంటారు?
1) జాతీయం 2) సామెత
3) రూపాంతరం 4) న్యాయం
9. ‘ఉల్లము’ అంటే అర్థం?
1) మనసు 2) చురుకుదనం
3) సంతోషం 4) ఉత్సాహం
10. ‘భాష’ పదానికి నానార్థాలు?
1) సరస్వతీ దేవి, మాట
2) మాట, పలుకు 3) పలుకు, నుడి
4) నుడి, నుడికారం
11. షట్చక్రవర్తులలోని చక్రవర్తి?
1) సగరుడు 2) రాముడు
3) భగీరథుడు 4) అశోకుడు
12. ‘నరకంలో హరిశ్చంద్రుడు’ నాటక రచయిత?
1) గౌరన 2) సి. నారాయణ రెడ్డి
3) నార్ల వెంకటేశ్వరరావు 4) నార్ల చిరంజీవి
13. ‘ఖగము’ అనే పదానికి పర్యాయపదాలు?
1) పక్షి, విమానం
2) సూర్యుడు, విమానం
3) సూర్యుడు, చంద్రుడు
4) పక్షి, విహగము
14. కడవతో వడివడిగా గడపదాటిందొక పడతి- దీనిలోని అలంకారం ?
1) వృత్త్యానుప్రాస 2) యమకం3) ఉత్ప్రేక్ష 4) లాటానుప్రాస
15. ‘మా తల్లి తండ్రి వచ్చారు’ ఈ వాక్యంలో ‘తల్లితండ్రి’ సమాసం పేరు?
1) బవ్రీహి సమాసం
2) ద్విగు సమాసం
3) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) షష్ఠీతత్పురుష సమాసం
16. ‘వలదధిక దీర్ఘవైరవృత్తి’ అన్నది ఎవరు?
1) ఆవు 2) ధర్మరాజు
3) శ్రీకృష్ణుడు 4) మంధరుడు
17. జంఘాల శాస్త్రి పాత్రను అత్యద్భుతంగా
మలచిన రచయిత?
1) జంధ్యాల పాపయ్య శాస్త్రి
2) చిలకమర్తి లక్ష్మీనరసింహం
3) పానుగంటి లక్ష్మీనరసింహారావు
4) మునిమానిక్యం నరసింహారావు
18. ‘నాశనం లేనిది’ అనే వ్యుత్పత్తి గల పదం?
1) విద్య 2) ధర్మం
3) అక్షరం 4) న్యాయం
19. ‘ఉట్టికెగర లేనమ్మ స్వర్గానికెగిరినట్లు’ జాతీయానికి అర్థం?
1) ఏ పని చేయలేకపోవడం
2) చిన్న పనినే చేయలేని వారు పెద్ద పనికి
ప్రయత్నించడం
3) స్వర్గానికి వెళ్లాలనే కోరిక
4) ఉట్టి కొట్టడానికి ఎగరడం
20. ఇ, ఉ, ఋ అనే అక్షరాలకి అసవర్ణమలైన అచ్చులు పరమైతే ఈ అక్షరాలు ఆదేశంగా వస్తాయి?
1) ఏ, ఓ, ఆర్ 2) య, వ, ర
3) ఙ, ఞ, ణ 4) ఖ, ఘ, ఛ
21. ‘మీరు విమర్శించవద్దు’ – ఈ వాక్యం?
1) సామార్థ్యార్థకం 2) ప్రార్థనార్థకం
3) నిషేధార్థకం 4) ఆశ్చర్యార్థకం
22. రావాణాసురుని తండ్రి?
1) పులస్త్యుడు 2) విశ్రవసుడు
3) బ్రహ్మ 4) పులస్త్య బ్రహ్మ
23. ‘కవి సార్వభౌమ’ బిరుదాంకితుడు?
1) పోతన 2) తిక్కన
3) శ్రీనాథుడు 4) నన్నయ
24. ‘అంగన’ అనే పదానికి వ్యుత్పత్తి?
1) ఆకర్షించే కనులుగలది
2) శ్రేష్టమైన అవయవములు కలది
3) అందమైనది
4) సుకుమారమైనది
25. ‘ఇంటి పైకప్పును తుఫాను ఎగరకొట్టినట్టుగా నా మొహాన్ని ఏదో బలంగా తాకింది’ – ఇందులో అలంకారం?
1) రూపకం 2) అర్థాంతరన్యాసం
3) అతిశయోక్తి 4) ఉపమాలంకారం
26. చంపకమాలలో ఆరవ గణం తప్పని సరిగా?
1) జ గణం 2) న గణం
3) భ గణం 4) ర గణం
27. వివిధ విషయాల పట్ల విమర్శదృష్టితో వ్యంగ్య హాస్యధోరణిలోవ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియ?
1) ఆత్మకథ 2) అధిక్షేప వ్యాసం
3) పుస్తక పరిచయం 4) వ్యాసం
28. గ్రంథాన్ని గాని, గ్రంథ నేపథ్యాన్ని గాని పరిచయం చేస్తూ రచయిత గాని, వేరొకరు గాని రాసే పరిచయ వాక్యాలే?
1) మంగళశాసనం 2) ముగింపు
3) విషయ సూచిక 4) పీఠిక
29. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి కలం పేరు?
1) ఉదయశ్రీ 2) విజయశ్రీ
3) కరుణశ్రీ 4) ఉషశ్రీ
30. గుఱం జాషువా బిరుదు?
1) నవయుగ కవి చక్రవర్తి
2) సాహితీ సమరాంగణ సార్వభౌముడు
3) చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి
4) ప్రతివాది మదగజ పంచానన
31. బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బుద్ధుని శిష్యులుగా ఉండేవారిని ఏమంటారు?
1) శ్రమణకులు 2) విశ్రవణులు
3) శ్రీకరులు 4) శిష్టులు
32. ‘గజల్’ ప్రక్రియలో చివరి చరణంలోని నామముద్ర
1) మత్లా 2) మక్తా
3) పల్లవి 4) తఖల్లస్
33. విజ్ఞానమార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడని తెలిపే ఉద్దేశ్యంతో రూపొందిన పాఠం
1) ధన్యుడు 2) మాణిక్యవీణ
3) మా ప్రయత్నం 4) భిక్ష
34. ‘జారిన గుండె’ పాఠంలోని ఇతివృత్తం
1) వృద్ధులపట్ల వైఖరి 2) త్యాగబుద్ధి
3) స్నేహం విలువ
4) వికలాంగుల ఆత్మవిశ్వాసం
35. మధువనం పాఠ్యభాగ నేపథ్యం
1) హనుమంతుడు లంకాదహనం చేయడం
2) హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరడం
3) కపివీరులు సుగ్రీవుని వనంలో ప్రవేశించడం
4) వానర సైన్యం సముద్రానికి వారధి కట్టడం
36. హరిశ్చంద్రుని గుణగణాలను ఇంద్రసభలో ప్రకటించిన వాడు
1) దేవేంద్రుడు 2) వశిష్ఠుడు
3) విశ్వామిత్రుడు 4) బృహస్పతి
37. ‘విక్రాంతి’ అనే పదానికి అర్థం
1) శాంతి ప్రియత్వం 2) అసహనం
3) తెలివితేటలు 4) పరాక్రమం
38. ‘అభినందనలు’ అనే పదానికి పర్యాయపదాలు
1) పొగడ్తలు, ప్రశంసలు
2) తెగడ్తలు, పొగడ్తలు 3) అగడ్తలు, తెగడ్తలు
4) మెచ్చుకోళ్ళు, నిందలు
39. పాము, నెమలి, వరుణుడు అనే నానార్థాలుగల పదం
1) అండజము 2) కుండలి
3) ఉరగము 4) కలాపి
40. భారమైన జడలు కలవాడు – వ్యుత్పత్తిగాగల పదం
1) శంకరుడు 2) త్రినేత్రుడు
3) పరమేశ్వరుడు 4) ధూర్జటి
41. ‘ఓగిరము’ అనే పదానికి ప్రకృతి
1) క్షీరము 2) నీరము
3) ఆహారము 4) సింగారము
42. ‘కుడ్యము’నకు వికృతి పదం
1) గోడ 2) మేడ
3) బాట 4) ఆనకట్ట
43. హఠాత్తుగా జరిగిన సంఘటనకు ఆశ్చర్యపడే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు?
1) గుండెలు బాదుకోవడం
2) తెల్లముఖం వేయడం
3) పాపం పండటం
4) కాళ్లావేళ్లా పడటం
44. ‘మొక్కై వంగనిది మానై వంగుతుందా?’ ఇది ఒక
1) శబ్దవైచిత్రి 2) అలంకారం
3) జాతీయం 4) సామెత
45. ఒకే పదం రెండుసార్లు వెంటవెంటనే పలికితే, ఆ రెండవ పదమే?
1) వ్యంజనం 2) పూర్వస్వరం
3) పరస్వరం 4) ఆమ్రేడితం
46. కింది వాటిలో నుగాగమ సంధికి ఉదాహరణ?
1) పద్మనయన 2) చెఱువు నీరు
3) అతడు నమ్మకస్తుడు 4) విధాతృనానతి
47. పదాబ్జరతి – సంధి పేరు?
1) శ్చుత్వ సంధి 2) జత్త సంధి
3) ఉత్త సంధి 4) సవర్ణదీర్ఘ సంధి
48. కాపలా కాస్తూ హాయిగా కూర్చో- ఈ వాక్యం?
1) చేదర్థక వాక్యం 2) క్తార్థాక వాక్యం
3) శత్రర్థక వాక్యం 4) ప్రశ్నార్థక వాక్యం
49. పద్యపాదంలో రెండో అక్షరం?
1) ప్రాస 2) ప్రాసయతి
3) మైత్రి 4) యతి
50. ఆ తోరణం శత్రువులతో రణానికి కారణ
మైంది. ఈ వాక్యంలోని అలంకారం?
1) రూపకాలంకారం 2) ముక్తపదగ్రస్తం
3) యమకాలంకారం 4) వృత్త్యానుప్రాస
51. షడ్రుచులు – సమాసం పేరు?
1) ద్వంద్వ సమాసం
2) ద్విగు సమాసం
3) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) విశేషణ ఉభయపద కర్మధరయ సమాసం
52. కర్మణి వాక్యంలో కర్త ప్రక్కన చేరే విభక్తి ప్రత్యయం?
1) ద్వితీయా విభక్తి 2) తృతీయా విభక్తి
3) చతుర్ధీ విభక్తి 4) పంచమీ విభక్తి
53. స్వభాష పాఠంలో ‘తెలుగులో మాట్లాడలేనన్న అధ్యక్షుని’ వృత్తి?
1) వైద్య వృత్తి 2) ఉపాధ్యాయ వృత్తి
3) న్యాయవాద వృత్తి 4) వ్యవసాయ వృత్తి
54. కథాకావ్యం – అంటే?
1) అనేక కవితల సమాహారం
2) వివిధ కథల సమాహారం
3) వివిధ పద్యాల సమాహారం
4) ఆధునిక కవితల సమాహారం
55. పాండవులు కోరుకున్న ఐదు ఊళ్ళలో ఇదొకటి?
1) హస్తిన 2) అయోధ్య
3) ఇంద్రప్రస్థం 4) ద్వారక
56. ‘ఆజ్ఞ’ పదానికి పర్యాయపదాలు?
1) ఆదేశము, ఉత్తరువు
2) ఆన, శపథం
3) నిర్ధేశం, విజ్ఞప్తి
4) ప్రార్థన, అనుమతి
57. ‘వాటిక’ అనే పదానికి వికృతి?
1) ఊరు 2) వాడ
3) మేడ 4) పేట
58. హిరణ్యకశిపుని వన విహారం నేపథ్యంగా గల పాఠం?
1) మాతృభావన 2) ధన్యుడు
3) భిక్ష 4) వెన్నెల
59. ‘అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో’ ఇది ఏ పద్యపాదం?
1) ఉత్పలమాల 2) చంపకమాల
3) మత్తేభం 4) శార్దూలం
60. ‘పేద ప్రజలకు చేసెడి సేవ సేవ’ – ఈ వాక్యంలోని అలంకారం?
1) వృత్త్యానుప్రాస 2) ఛేకానుప్రాస
3) లాటానుప్రాస 4) యమకం
61. ‘అజంతా చిత్రాలు’ – పాఠ్య రచయిత
1) నార్ల వెంకటేశ్వరరావు
2) సి. నారాయాణరెడ్డి
3) కొడవటిగంటి కుటుంబరావు
4) నండూరి రామమోహనరావు
62. పాడుకోవడానికి అనువై మాత్రా ఛందస్సును అనుసరించి లయాత్మకంగా సాగే రచన?
1) పద్యకవిత 2) వచన కవిత
3) గేయ కవిత 4) చంపూకవిత
63. రాయప్రోలు సుబ్బారావు రచించిన గ్రంథం?
1) ఆంధ్రప్రశస్తి 2) కృష్ణపక్షం
3) కృషీవలుడు 4) మాధురీదర్శనం
64. డా. వానమామలై వరదాచార్యులు గారి బిరుదు?
1) అభినవ తిక్కన 2) అభినవ పోతన
3) అభినవ శ్రీనాథుడు
4) నవయుగ కవితాచక్రవర్తి
65. ‘నమస్కారంబు నీ ప్రజ్ఞకున్’ అని జాషువా ఎవరిని కీర్తించిచారు?
1) చిత్రకారుని 2) కవిని
3) శిల్పిని 4) సూత్రధారుని
66. అష్టాంగ ధర్మాలను ప్రబోధించిన వారు?
1) ఆదిశంకరాచార్యులు
2) రామకృష్ణ పరమహంస
3) వివేకానందుడు 4) గౌతమబుద్ధుడు
67. ‘సామాజిక స్పృహ’ ఇతివృత్తంగాగల పాఠం?
1) ఎలుకమ్మ పెళ్లి 2) మధువనం
3) మేము సైతం 4) వేసవి సెలవల్లో
68. ‘హరిశ్చంద్రుడు’ పాఠంలోని ఇతివృత్తం?
1) నైతిక విలువలు 2) వ్యక్తిత్వ విలువలు
3) సామాజిక స్పృహ 4) జాతీయ సమైక్యత
69. శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపే సన్నివేశం నేపథ్యంగా గల పాఠం?
1) శాంతికాంక్ష 2) ధర్మదీక్ష
3) ప్రభోధం 4) ఆడినమాట
70. కాశీలో వ్యాసుడికి భోజనం దొరకకపోవడానికి కారణం?
1) కాశీ విశాలాక్షికి వ్యాసునిపై కోపం రావడం
2) వ్యాసునికి కాశీ పై ద్వేషం కలగడం
3) అగస్త్యుని ఆహ్వానంపై వ్యాసుడు కాశీ విడవాలనుకోవడం
4) కాశీ విశ్వనాథుడికి వ్యాసుని పరీక్షించాలనే
సంకల్పం కలగడం
71. ‘పుత్రుడు’ అనే పదానికి వికృతి పదం?
1) పుట్టెడు 2) బొట్టెడు
3) తనూజుడు 4) తనయుడు
72. ‘మనసు’ అనే పదానికి పర్యాయపదాలు?
1) ఎద, ఆలోచన 2) గుండె, ప్రయత్నం
3) చిత్తం, మది 4) యోచన, ఎడద
విజేత కాంపిటిషన్స్ వారి సౌజన్యంతో
జవాబులు
1.1 2.1 3.1 4.2 5.3 6.2 7.4 8.1 9.1 10.1 11.1 12.3 13.4 14.1 15.4 16.2 17.3 18.3 19.2 20.2
21.3 22.2 23.3 24.2 25.4 26.1 27.2 28.4 29.3 30.1 31.1 32.4 33.2 34.1 35.3 36.2
37.4 38.1 39.2 40.4 41.3 42.1 43.2 44.4 45.4 46.4 47.4 48.3 49.1 50.3 51.2 52.2
53.3 54.2 55.3 56.1 57.2 58.4 59.2 60.3 61.1 62.3 63.4 64.2 65.3 66.4 67.3 68.2
69.1 70.4 71.2 72.3
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు