‘సార్వత్రిక వ్యాకరణం అంటే ఏమిటి? (TET Special)
1. కింది వాటిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది?
1) మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు
2) శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు
3) శారీరక, మానసిక అభివృద్ధి లేదు
4) శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతాడు
2. కింది వాటిలో మరుగుజ్జులకు చెందిన వాక్యం ఏది?
1) మానసిక అభివృద్ధి లేదు. కానీ శారీరక అభివృద్ధి ఉంది
2) శారీరక అభివృద్ధి లేదు కానీ మానసిక అభివృద్ధి ఉంది
3) శారీరక, మానసిక అభివృద్ధి లేదు
4) శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతాడు
3. వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి?
1) పెరుగుదల, వికాసంలో లీనమై ఉంటుంది
2) వికాసం, పెరుగుదలలు వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి
3) వికాసం, పెరుగుదలల్లో వైయక్తిక భేదాలు ఉండవు
4) వికాసం పరిమాణాత్మకం, పెరుగుదలకు గుణాత్మకం
4. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) శిశువు సంకలనం తర్వాత వ్యవకలనం, తర్వాత గుణకారం, తర్వాత భాగహారం నేర్చుకోవడం-క్రమానుగతం
2) శిశువు సంకలనం ఆధారంగా గుణకారం, వ్యవకలనం ఆధారంగా భాగహారం నేర్చుకోవడం- సంచితం
3) శిశువులో భాషా వికాసం నిరంతరం జరగడం-విచ్ఛిన్నం
4) వివిధ రకాల వికాసాలు విడివిడిగా గాక కలిసి పనిచేయడం- ఏకీకృతం
5. నవజాత శిశువు ‘సాధారణ ఉత్తేజం’ ‘ఆహ్లాదం’ ప్రతిస్పందనలుగా విడిపడటం ఈ సూత్రం ద్వారా వివరించవచ్చు?
1) వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది
2) వికాసం సులభ అంశాల నుంచి జఠిల అంశాలకు సంభవిస్తుంది
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసం కచ్చితమైన దిశగా సాగుతుంది
6. వ్యక్తి వికాసంపై పరిసర ప్రభావాన్ని సమర్ధించే వారిలో సరికానిది ఏది?
1) పాఠశాల వసతులు, వ్యక్తుల వికాసం- డబ్ల్యూసీ బాగ్లే
2) పెంపుడు శిశువులు- స్కోడాక్
3) జిప్సీ నడిపేవారి పిల్లలు- గోర్డన్
4) 19 జతల సమరూప కవలలు- వాట్సన్
7. ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి అశ్రద్ధ, నిర్లక్ష్యం కావని వారి అనువంశికత ప్రభావం అని తెలియజేసే నియమం?
1) సామ్య నియమం
2) ప్రతిగమన నియమం
3) వైవిధ్య నియమం
4) ప్రవర్తనా నియమం
8. ఒక వ్యక్తి తనని నిరంతరం బాధకి గురిచేసే విషయాల వల్ల కలిగిన ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకు సంతోషాన్ని కలిగించే వేరే పనుల్లో నిమగ్నం కావడం తన అలవాటుగా మార్చుకున్నాడు. ‘ఆ వ్యక్తిలో జరిగిన అభ్యసనం’ ‘ఆ విధానాలు’ వరుసగా?
1) ఉత్తర బాల్యదశ, యత్నదోష అభ్యసన పద్ధతి, ఉద్వేగ కేథార్సిస్
2) పూర్వ బాల్యదశ, ఉద్వేగ కేథార్సిస్, యత్నదోష అభ్యసనం
3) ఉత్తర బాల్యదశ, అంతరదృష్టి అభ్యసనం, ఉద్వేగ కేథార్సిస్
4) పూర్వ బాల్యదశ, నిబంధనం, ఉద్వేగ కేథార్సిస్
9. భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని విద్యార్థి పియాజే సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? దాన్ని ఏమంటారు?
1) ఇంద్రియ చాలక దశ- వస్తు స్థిరత్వ భావన
2) పూర్వ ప్రచాలక దశ- ఎనిమిజం
3) పూర్వ ప్రచాలక దశ- ఏకమితి
4) మూర్త ప్రచాలక దశ- ఆగమనాత్మక ఆలోచన
10. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడం- అవిపర్యయాత్మక భావనా లోపం
2) ఒక వస్తువు ఆకారన్ని మార్చినా, స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది- కన్జర్వేషన్
3) ఒక ఆట వస్తువును వేరొక ఆట వస్తువులాగా భావించడం- ప్రతిభాసాత్మక ఆలోచన
4) ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించే సర్వాత్మవాదం
11. పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయం తో పాలు తాగే పిల్లవాడి నైతిక వికాస దశ ఏది?
1) 1వ దశ- పూర్వ సాంప్రదాయ స్థాయి
2) 2వ దశ- పూర్వ సాంప్రదాయ స్థాయి
3) 3వ దశ- సాంప్రదాయ స్థాయి
4) 4వ దశ- సాంప్రదాయ స్థాయి
12. ‘మానవ హక్కులను గౌరవించి, మెర్సీకిల్లింగ్ను అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి నిర్ణయానికి వదిలివేయాలి. అవసరమైతే సమాజ సంక్షేమం కోసం సంబంధిత చట్టాలను సవరించాలి’ అనే వ్యక్తి, నైతిక స్థాయి ఏది?
1) 3వ దశ- సాంప్రదాయ స్థాయి
2) 4వ దశ- సాంప్రదాయ స్థాయి
3) 5వ దశ- ఉత్తర సాంప్రదాయ స్థాయి
4) 6వ దశ- ఉత్తర సాంప్రదాయ స్థాయి
13. ఛోమ్‌స్కీ ప్రకారం కింది వాటిలో సరికానిది?
1) పిల్లలు పుట్టుకతోనే భాషను అభ్యసించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు
2) పిల్లలు కేవలం పరిశీలన, అనుకరణల ద్వారా భాషను అభ్యసిస్తారు
3) ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది
4) భాషాపరమైన నిర్మాణాలు పిల్లవాడి మేథస్సులో ముద్రించబడి ఉంటాయి
14. ఛోమ్‌స్కీ ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అంటే?
1) ప్రతి ఒక్కరు అనుభవాల ద్వారా భాషను పొందడం
2) ప్రపంచ వ్యాప్తంగా ఒకే గ్రామర్ ఉండటం
3) వ్యాకరణాన్ని అర్థం చేసుకొనే శక్తి ప్రతి ఒక్కరికి అనువంశికంగా సంక్రమించడం
4) ప్రపంచం అంతటికి ఉపయోగపడలేనిది
15. ఆత్మభావనను పిల్లల్లో మాపనం చేసే పద్ధతి?
1) సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీ
2) ది వైన్‌లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్
3) సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్
4) ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్
16.కార్ల్ రోజర్స్ ప్రకారం మానవుల ప్రేరణలు, ప్రవృత్తులు అనేవి?
1) ఆదర్శాత్మకంగా ఉండాలి
2) సకారాత్మకంగా ఉండాలి (పాజిటివ్)
3) నకారత్మకంగా ఉండాలి(నెగెటివ్)
4) ప్రయోజనాత్మకంగా ఉండాలి
17. చొరవ చూపడం, తప్పుచేశానన్న భావన ఎరిక్ సన్ ప్రకారం ఏ వయస్సులో కనుక్కోవచ్చు?
1) 6 ఏండ్ల నుంచి 12 ఏండ్ల మధ్య
2) 3 ఎండ్ల నుంచి 5 ఏండ్ల మధ్య
3) మొదటి సంవత్సరం నుంచి 3 ఏండ్ల మధ్య
4) 12 ఏండ్ల నుంచి 20 ఏండ్ల మధ్య
18. ఎరిక్సన్ ప్రకారం పరిపక్వ దశలో వ్యక్తిలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏవి?
1) సమగ్రత- నిరాశ
2) ఉత్పాదకత- స్తబ్దత
3) సాన్నిహిత్యం- ఏకాంతం
4) పాత్ర గుర్తిపు- పాత్ర సందిగ్ధం
19. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థులందరి నుంచి సరైన నిష్పాదన రాబడుతున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు తన బోధనలో అనుసరించిన విధానంలో కింది వాటిలో సరైనది?
1) ఆ ఉపాధ్యాయుడు బోధన పట్ల ఆసక్తి, ఉత్సుకత కలిగి ఉన్నాడు
2) అతడు తరగతి గదిని అందంగా, ఆకర్షణీయంగా మార్చాడు
3) బోధనోపకరణాలను విరివిగా ఉపయోగించాడు
4) బోధనను వైయక్తిక భేదాలను అనుసరించి జరిపాడు
20. కింది వాటిలో అంతస్థ వైయక్తిక భేదాన్ని గుర్తించండి?
1) రహీమ్ ఆటలు ఆడటం ఇష్టపడినంతగా చదువును ఇష్టపడడు
2) అక్బర్ రాయడానికి ఇష్టపడితే, కిరణ్ చదవడానికి ఇష్టపడతాడు
3) రవి గౌరవించినంతగా ఉపాధ్యాయులను రాము గౌరవించడు
4) గిరి, హరి ఇద్దరిలో ఉపాధ్యాయులిచ్చిన ఇంటి పనిని హరి బాగా చేస్తాడు
21. కింది వాటిలో ప్రజ్ఞను గురించిన అపోహను గుర్తించండి?
1) ప్రజ్ఞ అనేది ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించడం
2) ప్రజ్ఞ అనేది అమూర్తీకరణంగా వ్యవహరించడం
3) ప్రజ్ఞ అనేది కొత్త పరిస్థితులకు అనుకూలమవ్వడం
4) ప్రజ్ఞ అనేది జ్ఞానం
22. కింది వాటిలో ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది?
1) సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం
2) వనరులను సమర్థంగా ఉపయోగించే సామర్థ్యం
3) అనుగుణ్యతా సామర్థ్యం
4) సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం
23. ప్రజ్ఞాలబ్ధి(IQ)కి సరైన ప్రవచనం కానిది?
1) ప్రజ్ఞ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది
2) ప్రజ్ఞకు జాతి, మత, లింగ భేదాలుంటాయి
3) 8 సంవత్సరాల శ్వేత ప్రజ్ఞాలబ్ధి 100 అయితే 16 సంవత్సరాలకు కూడా అంతే ఉంటుంది
4) అశోక్ మానసిక వయస్సు, శారీరక వయస్సుల నిష్పత్తిని 100తో లబ్దం చేస్తే వస్తుంది
24. లక్ష్మి అనే విద్యార్థిని తన ఉపాధ్యాయుడు ప్రజ్ఞకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నంలో ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ఉపయోగించి ప్రజ్ఞను కనుక్కోవాలనుకున్నాడు. అయితే ఇది ప్రతి తరగతిలో చేయగా లక్ష్మి ప్రజ్ఞ కింది వాటిలో ఏ విధంగా ఉంటుంది?
1) లక్ష్మి వయస్సు పెరిగే కొద్ది ప్రజ్ఞాలబ్ధి తగ్గిపోతుంది
2) లక్ష్మి వయస్సు పెరిగే కొద్ది ప్రజ్ఞాలబ్ధి పెరుగుతుంది
3) లక్ష్మి ప్రజ్ఞాలబ్ధ్ది పెరగక, తగ్గక స్థిరంగా ఉంటుంది
4) లక్ష్మి ప్రజ్ఞాలబ్ధ్ది ప్రతి సంవత్సరంలోను తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది
25. కింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి?
1) శారీరక వయస్సు కంటే మానసిక వయస్సు ఎక్కువ అయితే I.Q సగటు కంటే ఎక్కువ ఉంటుంది
2) శారీరక, మానసిక వయస్సులు సమానమైన ప్రజ్ఞాలబ్ధి సగటు (100) అవుతుంది
3) మానసిక వయస్సు, శారీరక వయస్సు కంటే తక్కువ అయిన I. Q సగటు కంటే తక్కువ ఉంటుంది 4) పైవన్నీ సరైనవి
26. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసస్ అనే ప్రజ్ఞా పరీక్ష?
1) పేపర్ పెన్సిల్, వేగ పరీక్ష
2) నిష్పాదన, వ్యక్తిగత పరీక్ష
3) శాబ్దిక, వ్యక్తిగత పరీక్ష
4) సామూహిక, అశాబ్దిక పరీక్ష
27. కింది వాటిలో వేగ పరీక్ష కానిది?
1) ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష
2) ఆర్మీ ఆల్ఫా పరీక్ష
3) కెటిల్ కల్చర్ ఫేర్ టెస్ట్
4) రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసస్ పరీక్ష
28. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకతల మధ్య సంబంధాన్ని వివరించని వాక్యం?
1) ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత వ్యక్తికి పుట్టుకతోనే వస్తాయి
2) సహజ సామర్థ్యాలు వ్యక్తిలో ఉన్నప్పుడు వాటిని శిక్షణ, అభ్యాసం, అభ్యసనం ద్వారా మెరుగుపర్చవచ్చు
3) ప్రజ్ఞ వ్యక్తిలో ఉన్నప్పుడు దాన్ని శిక్షణ, అభ్యాసం, అభ్యసనం ద్వారా మెరుగుపర్చవచ్చు
4) ప్రజ్ఞాలబ్ధ్ది పెరగక, తగ్గక స్థిరంగా ఉంటుంది
29. ఒక ఉపాధ్యాయుడిగా, సహజ సామర్థ్యాలు నిర్వచనం కాని దాన్ని గుర్తించండి?
1) రవి ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించడం
2) కిరణ్‌లో ఉన్న జ్ఞానం, నైపుణ్యం, నిర్దిష్ట ప్రతిస్పందనల సముదాయం
3) ఆనంద్ చదరంగంలో ఉన్నత స్థాయికి చేరిన కౌశలం
4) కలం పట్టి కవిత్వం రాయలేని కోహ్లీ, బ్యాట్‌తో పరుగుల వరద పారించడం
30. ప్రకటిత అభిరుచిలో ?
1) ఉపాధ్యాయులు పరిశీలన ద్వారా పిల్లల అభిరుచులను తెలుసుకుంటారు
2) పరిశీలన ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచులను తెలుసుకుంటారు
3) పిల్లలే స్వయంగా తమ అభిరుచులను తెలుపుతారు
4) పేపర్-పెన్సిల్ పరీక్షలు ద్వారా అభిరుచులను అంచనా వేస్తారు
31. తరగతి గదిలో విద్యార్థుల అభిరుచులను తెలుసుకొనేందుకు అభిరుచుల లక్షణం కాని దానిని ఉపాధ్యాయుడిగా ఎలా గుర్తిస్తావు?
1) అంతర్గత ప్రేరణకు దోహదపడటం
2) నిగూఢ అభ్యసనం
3) విద్యార్థుల్లోని అభిరుచులు మాపనం చేయడం
4) ఒక వస్తువు పట్ల అనుకూలంగా ప్రవర్తించే ధోరణి
32. వైఖరులకు సంబంధించి కింది వాటిలో అసత్య ప్రవచనం?
1) వ్యక్తుల వైఖరులను బాహ్య ప్రవర్తనల ద్వారా తెలుసుకోగలం
2) వైఖరులు వ్యక్తిలో విడిగా ఉండక అతని మానసిక శక్తులతో కలిసి పనిచేస్తాయి
3) వైఖరులు పుట్టినప్పటి నుంచి స్థిరంగా ఉంటాయి
4) వైఖరులు అభ్యసనం వల్ల ఏర్పడుతాయి
33. ప్రభుత్వ పాఠశాలల పట్ల కొందరు అనుకూలంగా ఉంటూ మరికొందరు ప్రతికూల అభిప్రాయం కలిగి ఉండటం అనేది వారి వైఖరుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని సూచించే వైఖరి లక్షణం?
1) దిశ 2) తీవ్రత
3) వ్యాప్తి 4) ఆలోచన
34. మూర్తిమత్వానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) వ్యక్తిలో స్ఫురద్రూపం ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తుంది
2) మూర్తిమత్వం మనుషులకు మాత్రమే పరిమితం అయిన అంశం కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది
3) మానవ శరీరంలోని గ్రంథులు స్రవించే స్రావాలు మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది
4) నాడీ వ్యవస్థ పనితీరుకు, ప్రేరణకు సంబంధం ఉంటుంది
సమాధానాలు
1-2, 2-2, 3-1, 4-3, 5-1, 6-4, 7-2, 8-1, 9-3, 10-2 11-1, 12-3, 13-2, 14-3, 15-3, 16-2, 17-2, 18-1, 19-4, 20-1, 21-4, 22-1, 23-2, 24-3, 25-4, 26-4 , 27-4, 28-3, 29-1, 30-3, 31-4, 32-3, 33-3, 34-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు