అధికరణ 19(ఎఫ్)ను తొలగించిన రాజ్యాంగ సవరణ?
1. భారతీయ సమాజంలో సామాజికంగా విప్లవాన్ని ప్రతిపాదించే గొప్ప సాంఘిక పత్రంగా భారత రాజ్యాంగాన్ని కొనియాడినవారు? (సి)
ఎ) బార్కర్ బి) ఎ.వి.డైసి
సి) గ్రాన్వెలీ ఆస్టిన్ డి) కె.సి వేర్
2. భారతదేశం ఒక రిపబ్లిక్ రాజ్యంగా ఎప్పుడు ఆవతరించింది? (డి)
ఎ) 1947 ఆగస్టు 15 బి) 1949 నవంబర్ 26
సి) 1950 జనవరి 24 డి) 1950 జనవరి 26
3. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రను భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర గా చెప్పవచ్చును అన్నవారు? (ఎ)
ఎ) డా. పట్టాభి సీతారామయ్య బి) స్వామి రామానందాతీర్థ
సి) బూర్గుల రామకృష్ణారావు డి) నీలం సంజీవరెడ్డి
4. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినవారు? (బి)
ఎ) కారన్‌వాలీస్ బి) లార్డ్ డల్హౌసి
సి) వెల్లస్లీ డి) ఎవరు కాదు
5. భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన భారత స్వాతంత్రోద్యమ చరిత్రను మూడు దశలుగా విభజించినవారు? (బి)
ఎ) డా. పట్టాభి సీతారామయ్య బి) డా.రమేష్‌చంద్ర మజుందార్
సి) సావర్కర్ డి) బాలగంగాధర్‌తిలక్
6. మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంటు ఏ సంవత్సరంలో సవరించడం జరిగింది? (సి)
ఎ) 2004 బి) 2005 సి) 2006 డి) 2007
7. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన లోక్‌సభ స్థానాల సంఖ్య? (డి)
ఎ) 6 బి) 5 సి) 3 డి) 2
8. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పునర్విభజన కమిషన్‌ను ఏ రోజున ఏర్పాటుచేసింది? (ఎ)
ఎ) 1953, డిసెంబర్ 22 బి) 1953 డిసెంబర్ 23
సి) 1953 నవంబర్ 22 డి) 1953 నవంబర్ 25
9. రాష్ర్టాల పునర్విభజన కమిషన్‌లో సభ్యులుకాని వారు? (డి)
ఎ) సయ్యద్ ఫజల్ అలీ బి) హృదయనాథ్ కుంజ్రూ
సి) కె.ఎమ్. పణిక్కర్ డి) జె.వి.నర్సింగరావు
10. లౌకికవాదం అనేది మతానికి మతానికి మధ్య అభిమానాన్ని వివక్షతను చూపడం కాదు. అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన గౌరవాన్ని ప్రదర్శించడమే లౌకికవాదం. కేవలం మత సహనాన్ని ప్రదర్శించడం ద్వారానే ఏ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ప్రతి మత సముదాయానికి చెందినవారు ఇతర మతాల సముదాయాలకు చెందిన వారి పట్ల సానుకూల గౌరవాన్ని చూపడమనేది అందరి కర్తవ్యం అని పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని? (ఎ)
ఎ) ఇందిరాగాంధీ బి) నెహ్రూ
సి) పి.వి నరసింహారావు డి) రాజీవ్‌గాంధీ
11 .జలియన్‌వాలాబాగ్ మారణకాండ జరిగిన రోజు (బి)
ఎ) ఏప్రిల్ 12, 1919 బి) ఏప్రిల్ 13, 1919 సి) ఏప్రిల్ 17, 1919 డి) ఏప్రిల్ 19, 1919
12. గాంధీ-అంబేద్కర్ మధ్య పూన ఒప్పందం ఏ సంవత్సరం జరిగింది (బి)
ఎ) 1931 బి) 1932 సి) 1933 డి) 1934
13. పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి ప్రవేశపెట్టి ఓటుహక్కును కేవలం ఆస్తిపరులకు, విద్యావంతులకు పరిమితం చేసిన చట్టం? (బి)
ఎ) మింటో-మార్లే చట్టం – 1909 బి) మాంటేగ్ – చేమ్స్ఫర్డ్చట్టం -1919
సి) భారత ప్రభుత్వ చట్టం – 1909 డి) ఏదీకాదు
14. బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్‌మౌంట్ బాటన్‌ను భారతదేశాన్ని విభజించడానికి, భారత, పాకిస్తాన్లకు అధికారాన్ని బదిలీ చేయడానికి ఒక ప్రణాళికను తయారుచేయమని బ్రిటీష్ పార్లమెంటు ప్రకటించిన రోజు? (ఎ)
ఎ) 20 ఫిబ్రవరి, 1947 బి) 21 ఫిబ్రవరి 1947 సి) 22 ఫిబ్రవరి 1947 డి) 23 ఫిబ్రవరి 1947
15 . రాజ్యాంగ పరిషత్‌లో సభా వ్యవహారాల పర్యవేక్షణ కమిటీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించినవారు? (సి)
ఎ) వల్లబాయిపటేల్ బి) జె.బి కృపలానీ
సి) రాజేంద్రప్రసాద్ డి) ఎ.వి.టక్కర్
16. చట్టం నిర్దారించిన పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు (డి)
ఎ) ఐర్లాండ్ బి) కెనడా సి)జర్మని డి) జపాన్
17. భారతదేశాన్ని అర్ధసమాఖ్య అని వ్యాఖ్యానించినవారు? (సి)
ఎ) ఐవర్జెన్సింగ్స్ బి) డా॥బి.ఆర్. అంబేద్కర్ సి) డా॥ కె.సి.వేర్ డి) మిత్తల్
18. వయోజన ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాలుగా ఉన్న దానిని 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు? (బి)
ఎ) 60వ సవరణ బి) 61వ సవరణ
సి) 63వ సవరణ డి) 68వ సవరణ
19. భారత రాజ్యాంగంలో అధికార భాషల గురించి ఏ షెడ్యూల్లో ఉంది? (బి)
ఎ) ఏడో షెడ్యూల్ బి) ఎనిమిదో షెడ్యూల్
సి) తొమ్మిదో షెడ్యూల్ డి) పదో షెడ్యూల్
20. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల ప్రస్థావన ఏ భాగంలో ఉంది? (బి)
ఎ) మూడోభాగం బి) నాలుగో భాగం
సి) నాలుగు – ఏ భాగం డి) ఐదో భాగం
21. అధికరణ 19(ఎఫ్)ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? (డి)
ఎ) 41వ సవరణ బి) 42వ సవరణ
సి) 43వ సవరణ డి) 44వ సవరణ
22. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ చట్టం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో నిర్బంధ ఉచిత విద్యను ప్రభుత్వాలు అందించాలని పేర్కొనే అధికరణ? (సి)
ఎ) 20వ అధికరణ బి) 21వ అధికరణ
సి) 21-బి అధికరణ డి) 22వ అధికరణ
23. ఏ అధికరణ మత, భాషాపరంగా అల్ప సంఖ్యాకులు ఇష్టమైన విద్యాసంస్థలను స్థాపించుకొని నిర్వహించుకొనే హక్కు కలిగి ఉన్నాయని తెలుపుతుంది (డి)
ఎ) 27వ అధికరణ బి) 28వ అధికరణ
సి) 29వ అధికరణ డి) 30వ అధికరణ
24.అధికరణ 20, 21లను మినహాయించి, 3వ భాగంలోని అన్ని అధికరణలపై కింది సందర్భాల్లో పరిమితులను విధించవచ్చు? (డి)
ఎ) 352 అధికరణ విధించిన సందర్భం
బి) 360 అధికరణ విధించిన సందర్భం
సి) 356 అధికరణ విధించిన సందర్భం డి) ఎ,బి,సి
25. పర్యావరణ పరిరక్షణ, అడవులను, వన్యప్రాణాల్ని సంరక్షించాలని ప్రభుత్వానికి సూచించే అధికరణ? (డి)
ఎ) 46వ అధికరణ బి) 47వ అధికరణ
సి) 48వ అధికరణ డి) 48-ఎ అధికరణ
26. పదకొండో ప్రాథమిక విధి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? (ఎ)
ఎ) సెప్టెంబర్ 12, 2002 బి) సెప్టెంబర్ 12, 2002 సి) ఆగస్టు 15, 2002 డి) జనవరి 26, 2002
27. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన వయస్సు (సి)
ఎ) 25 సంవత్సరాలు బి) 30 సంవత్సరాలు
సి) 35 సంవత్సరాలు డి) 21 సంవత్సరాలు
28. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తారు (డి)
ఎ) ఇద్దరిని బి) 5 మందిని
సి) 8 మంది డి) 12 మంది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు