మొదటి పంచవర్ష ప్రణాళిక
స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం 1950 మార్చి, 15న కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రణాళిక సంఘం కేవలం సలహా సంఘం మాత్రమే. ఇది స్వతంత్ర, రాజ్యాంగేతర సంస్థ. ప్రణాళికలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి . రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లోని 39వ నిబంధన ప్రకారం ఏర్పాటు చేశారు. ప్రణాళిక సంఘం ప్రణాళిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ప్రణాళికలకు కావల్సిన సమాచారాన్ని కేంద్ర గణాంక సంస్థ (సి.ఎస్.ఒ) అందిస్తున్నది. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడితోపాటు మరికొంతమంది సభ్యులు ఉంటారు. ప్రణాళిక సంఘం తొలి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, తొలి ఉపాధ్యక్షుడు గుల్జారిలాల్ నందా. ఈయనకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ప్రణాళిక సంఘ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ప్రణాళిక సంఘం భవనాన్ని యోజన భవన్ అంటారు. ప్రణాళిక సంఘం పత్రిక పేరు యోజన.
జాతీయాభివృద్ధ్ది మండలి
list1-జాతీయాబివృద్ధ్ది మండలి ప్రణాళిక సంఘానికి సలహా సంఘంగా 1952, ఆగస్ట్ 6న ఏర్పాటు చేశారు. జాతీయాభివృద్ధి మండలి వివిధ రాష్ర్టాల మధ్య సమన్వయం, కేంద్ర, రాష్ట్ర ప్రణాళికల అమలును సమన్వయ పరుస్తున్నది. జాతీయాభివృద్ధ్ది మండలి మొదటి సమావేశం 1952, నవంబర్ 8, 9 తేదీల్లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది.
జాతీయాభివృద్ధ్ది మండలి సభ్యులు
-జాతీయాభివృద్ధి మండలిలో ప్రధానమంత్రి, ఉప ప్రధాని ఉంటే సభ్యుడిగా ఉంటారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ప్రణాళిక సంఘం సభ్యులు, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు (ఢిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు) 1967 నుంచి క్యాబినెట్ మంత్రులు, కేంద్రపాలిత గవర్నర్లు కూడా సభ్యులుగా ఉంటారు.
పంచవర్ష ప్రణాళికల ధ్యేయాలు
-జాతీయ, తలసరి ఆదాయాలను పెంచి తద్వారా ప్రజల జీవన ప్రమాణస్థాయిని మెరుగుపర్చడం.
-ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం
-త్వరగతిన పారిశ్రామికాభివృద్ధికి కృషి
-ప్రజల ఆదాయ సంపదల్లో ఉన్న వ్యత్యాసలను తగ్గించడం, ఆర్థిక శక్తిని సమానంగా పంపిణీ చేయడం.
-దేశంలో నిరుద్యోగితను నిర్మూలించి ఉద్యోగ అవకాశాలను కల్పించడం
-పేదరికాన్ని నిర్మూలించడం
-ప్రాంతీయ అసమానతలను తగ్గించడం
-విద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించడం.
-ఆర్థిక అసమానతలను తగ్గించి సామ్యవాద సమాజ స్థాపన ఏర్పాటుకు కృషి చేయడం.
మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)
-మొదటి ప్రణాళిక 1951, ఏప్రిల్ 1 నుంచి 1956 మార్చి, 31 వరకు అమల్లో ఉన్నది. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు గుల్జారిలాల్నంద (మధ్యలో కృష్ణమాచారి వచ్చారు). మొదటి పంచవర్ష ప్రణాళిక హరడ్ డోమర్ నమూనా ఆధారంగా తయారు చేశారు
-రెండో ప్రపంచ యుద్ధం, దేశ విభజన, ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం, ఆహారధాన్యాల సమస్య, ద్రవ్యోల్బణం పెరుగుదల, పాకిస్థాన్ నుంచి వచ్చిన కాందిశీకులను ఆదుకోవడం భారత్కు సవాళ్లుగా నిలిచాయి.
మొదటి ప్రణాళిక కాలంలో కార్యక్రమాలు
-జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. కౌలు సంస్కరణలు చేపట్టారు.
-02-10-1952 నాడు సమాజాభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది.
-1952లో జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించారు. ప్రపంచంలో తొలిసారిగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేశారు.
-భాక్రానంగల్, దామోదర్ వ్యాలీ, హిరాకుడ్ నీటిపారుదల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం.
-చంబల్, రిహాండ్ , కోయన , కోసి, నాగార్జునసాగర్, నీటిపారుదల ప్రాజెక్టు పనుల ప్రారంభం.
-రుతుపవనాలు అనుకూలించడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి 54 నుంచి 65 మిలియన్ టన్నులకు పెరిగింది.
-8.5 మిలియన్ల ఎకరాల భూమికి అదనంగా నీటిపారుదల సౌకర్యం కల్పించారు.
-జాతీయాదాయం రూ. 9,850 కోట్ల నుంచి రూ. 11, 670 కోట్లకు (18 శాతం) పెరిగింది. తలసరి ఆదాయం రూ. 275ల నుంచి రూ. 299లకు పెరిగింది.
-ధరల స్థాయి 13 శాతం తగ్గింది.
-సింధ్రిలో ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్లో ఇంజిన్ల కర్మాగారం, బెంగళూరులో టెలిఫోన్ కర్మాగారం, పింప్రిలో పెన్సిలిన్ మందుల ఉత్పత్తి కర్మాగారాలను ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు