ప్రాణ ప్రదాయిని రక్తం-దానిలోని అంశాలు
జీవుల శరీరంలో వివిధ పదార్థాల రవాణాలో రక్తం ప్రధాన పాత్ర వహిస్తుంది. అమీబా వంటి ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా జీవపదార్థంలో విసరణం వల్లగానీ, జీవపదార్థ చలనం వల్లగానీ జరుగుతుంది. కాని బహుకణ జీవుల శరీరంలో పదార్థల రవాణా రక్తం, శోషరసం వంటి ప్రత్యేక ద్రవాల ద్వారా జరుగుతుంది. కాబట్టి జీవులలో రక్తం పదార్థాల రవాణాలో ముఖ్యపాత్రను చూపుతుంది.
-రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమాటాలజి (Haematolog) అంటారు.
-రక్తం ద్రవ రూప కణజాలం. దీనిలో వివిధ రకాల కణాలున్నాయి. ఇవి వివిధ రకాల పనులను నిర్వర్తిస్తాయి. వీటిని రక్తకణాలంటారు
-రక్తంలో కణాంతర ద్రవాన్ని (కణాల మధ్య ద్రవం) ప్లాస్మా అంటారు.
-ఆరోగ్యవంతుడైన పెద్దవారిలో సుమారుగా 5లీటర్ల రక్తం ఉంటుంది.
-దీని PH 7.4, రక్తం క్షార స్థితిలో ఉంటుంది.
-సోడియం ఆక్సలేట్, సోడియం సిట్రేట్ ద్రావణాలు రక్తాన్ని గడ్డకట్టనీయవు.
-పై పదార్థాలను రక్తపరీక్ష చేసే సందర్భాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉపయోగిస్తారు.
-రక్తం గడ్డకట్టకుండా సేకరించిన ద్రవం ప్లాస్మా
-రక్తం గడ్డకట్టకుండా ఏర్పడిన ప్లాస్మా ద్రవం వేరుచేయగా మిగిలిన ఎర్రటి మడ్డికి సుమారు 10మి.లీకు 0.9శాతం సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని కలుపగా ఏర్పడిన దాన్ని స్లైన్ అంటారు.
-రక్తం గడ్డకట్టగా ఏర్పడిన దాన్ని సీరం అంటారు.
ప్లాస్మా
-ఇది గడ్డిరంగులో ఉంటుంది. కొద్దిగా ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది.
-రక్తంలో మాతృక(Matrix). ఇది రక్తంలో 60శాతం ఉంటుంది.
-దీనిలో 85 నుంచి 90 శాతం నీరు, 10 శాతం కర్బన, అకర్బన పదార్థాలుంటాయి.
-అకర్బన పదార్థాలు:- Na, K, NH3, Ca, Mg, క్లోరైడ్స్, ఫాస్పేట్లు, సల్ఫేట్లు, బైకార్బోనేట్లు ఉంటాయి. అతి స్వల్పంగా Fe, I, P. స్వల్పంగా O2, CO2 ఉంటాయి.
-లవణాలు – 0.85 నుంచి 0.9 శాతం ఉంటాయి.
-కర్బన పదార్థాలు : ప్లాస్మాలో ఇవి 6 నుంచి 8శాతం ఉంటాయి. వీటిలో గ్లూకోజ్, అమైనోఆమ్లాలు, ప్రోటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు ముఖ్యమైనవి.
-యూరియా, యూరికామ్లం, విటమిన్లు, హార్మోన్లు స్వల్పంగా ఉంటాయి.
-రక్తంలో హిపారిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తానాళాల్లో రక్తాన్ని గడ్డకట్టకుండా చూస్తుంది.
ప్లాస్మాలోని ప్రోటీన్లు
1. ఆల్బుమిన్లు – ఇవి ప్లాస్మాలో అతిముఖ్యమైనవి. పదార్థాల రవాణా, ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడటంలో పాత్రవహిస్తాయి.
2. గ్లోబ్యులిన్లు – రక్తంలో శరీర రక్షణ చర్యలో పనిచేస్తాయి.
3. పైబ్రినోజన్, ప్రోత్రాంబిన్ – రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డకట్టడంలో ఇవి పాత్రవహిస్తాయి.
-రక్తంలో ప్రోటీన్లు కాకుండా ఎంజైమ్లు కూడా ఉంటాయి.
రక్తకణాలు
-రక్తంలో మూడు రకాల కణాలుంటాయి.
అవి
1. ఎర్రరక్త కణాలు – ఎరిత్రోసైట్లు (Erythroytes)
2. తెల్లరక్త కణాలు – ల్యూకోసైట్లు (Leucocytes)
3. రక్తఫలకికలు – త్రాంబోసైట్లు (Platelets)
ఎర్రరక్తకణాలు(RBC)
-ఒక మి.లీ రక్తంలో ఇవి 4.5 నుంచి 5.5 X 106 ఉంటాయి.
-పురుషుల్లో 1ఘన మి.లీ రక్తంలో 5 మిలియన్లు, స్త్రీలలో 4.5 మిలియన్లుంటాయి.
-అన్ని సకశేరుకాల్లో ఇవి గుండ్రంగా, ద్విపుటాకారంగా ఉంటాయి.
-పరిణతి చెందిన ఎర్రరక్తకణాల్లో కణాంగాలైన (Organelles) మైటోకాండ్రియా, కేంద్రకం, లైసోజోమ్లు, గాల్జిసంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలం (Endoplasmic reticulum), రైబోజోమ్లుండవు.
-పరిణతి చెందిన ఎర్ర రక్త కణాల్లో ప్లాస్మాత్వచం, జీవపదార్థం మాత్రమే ఉంటాయి.
-ఒంటె వంటి కొన్ని జీవుల ఎర్రరక్తకణాల్లో కేంద్రం ఉంటుంది.
-ఉభయజీవుల ఎర్రరక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది.
-RBCలో హిమోగ్లోబిన్(Hb) అనే శ్వాసవర్ణకం ఉండటంతో ఎర్రరంగులో ఉంటాయి.
-Hbలో Fe ఉంటుంది.
-ఆరోగ్యవంతుడైన మానవుని 100ml రక్తంలో 14గ్రాములు Hb ఉంటుంది.
-Hbలో హిమ్ అనే ప్రోటీన్హ్రిత భాగం, గ్లోబిన్ అనే ప్రోటీన్ భాగం ఉంటాయి.
-RBC సంఖ్యను హిమోసైటో మీటర్ ద్వారా లెక్కిస్తారు.
-లెక్కించే ైస్లెడ్ను న్యూబార్ వాంబర్ అంటారు.
-రక్తపరీక్షలో ఉపయోగించే ైస్లెయినింగ్ను లీప్మాన్స్టీవ్ అంటారు.
-రక్తకణాలు ఫ్రౌడ మానవులోని ఎముక మజ్జలో ఉత్పత్తవుతాయి.
-పిండదశలో కాలేయం, ప్లీహంలో ఉత్పత్తవుతాయి. ఎర్రరక్తకణాల ఉత్పత్తిని ఎరిత్రోపాయిసిస్ అంటారు.
-మానవునిలో వీటి జీవిత కాలం -120 రోజులు
-కప్పలో వీటి జీవిత కాలం – 100 రోజులు
-అరిగిపోయిన ఎర్రరక్తకణాలు ప్ల్లీహం, కొంత కాలేయంలో విచ్చిన్నమవుతాయి.
-ప్లీహన్ని ఎర్రరక్తకణాల శ్మశాన వాటిక లేదా Burial Groud of RBC అంటారు
-ప్రతిరోజు 10 X 1012 విచ్ఛిన్నమై అదే సంఖ్యలో కొత్త కణాలు ఏర్పడుతాయి.
-ఎత్తైన ప్రదేశాలు, పర్వతాల్లో పనిచేసే వారికి, అధిక శ్రమ చేసే వారిలో O2 ఒత్తిడితో RBC సంఖ్య పెరుగును. దీన్ని పాలిసైథిమియా అంటారు.
-రక్త కణాల ఉత్పత్తిని హిమోపయాసిస్ అంటారు.
-ఎర్రరక్త కణాల ఉత్పత్తిని నిరోధించుటను -ఎరిత్రోక్లాసియా అంటారు.
తెల్ల రక్తకణాలు(WBC)
-వీటిని ల్యూకోసైట్లు లేదా శ్వేత రక్తకణాలు అంటారు.
-వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు.
-ఒక మి.లీ రక్తంలో 5 నుంచి 9 X 103 కణాలుంటాయి.
-వీటి జీవిత కాలం 12 నుంచి 13 రోజులు
-ఇవి ప్లీహం, లింప్కణాల్లో ఏర్పడుతాయి.
-అరిగిపోయినవి రక్తం, కాలేయం, లింప్ద్రవంలో విచ్ఛిన్నమవుతాయి.
-శరీరంలోకి వచ్చి క్రిములను కబలిస్తాయి కాబట్టిని వీటిని భక్షక కణాలు లేదా Phogocyte అంటారు.
-వీటిలో రెండు రకాల కణాలుంటాయి
-మి.లీ రక్తంలో WBCలు 9,000 ఉంటాయి.
1. గ్రాన్యులో సైట్లు – కణికభకణాలు
2. ఎగ్రాన్యులోసైట్లు – కణికభరహిత కణాలు
-గ్రాన్యులోసైట్లు:- ఇవి మూడు రకాలు 1. ఎసిడోఫిల్స్ 2. బేసోఫిల్స్ 3. న్యూట్రోఫిల్స్
ఎసిడోఫిల్స్(ఇస్నోఫిల్స్)
-ఇవి WBC లో మి.లీ రక్తంలో 275 కణాలుంటాయి. ఆమ్ల రంజకాలు.
-వీటి కేంద్రకంలో రెండు తమ్మెలుంటాయి.
-దేహంలోకి ప్రవేశించిన పరాన్నజీవులను ప్రతిఘటిస్తాయి.
-శరీరంలో ఎలర్జీ ప్రతి చర్యలను తగ్గిస్తాయి.
-విషపదార్థాలను (TOXINS) నాశనం చేస్తాయి.
బేసోఫిల్స్
-ఇవి క్షార రంజకాలతో నిర్మితమవుతాయి.
-కేంద్రకం పొడవుగా S ఆకారంలో ఉంటుంది.
-శరీరంలోకి ప్రవేశించిన భక్షక కణాలను నాశనం చేయడంతో పాటు గాయాలు మాన్పడంలో పాత్ర వహిస్తాయి.
-వీటి సంఖ్య WBCలో మి.లీ రక్తంలో 35 కణాలుంటాయి.
న్యూట్రోఫిల్స్
-ఇవి తటస్థ రంజకాలు. వీటి కేంద్రకంలో 5 నుంచి 6 తమ్మెలుంటాయి.
-వీటి జీవపదార్థంలో బ్యాక్ట్టీరియా సంహరణ జరుగుతుంది.
-శరీరంలో వీటిని సూక్ష్మ రక్షక భటులు (Mcroscopic Policemen) అంటారు.
-వీటి సంఖ్య WBCలో 5,400 ఉంటాయి. అన్ని కణాల కంటే వీటి సంఖ్య ఎక్కువ.
-ఎగ్రాన్యులోసైట్లు : ఇవి రెండు రకాలు 1. లింపోసైట్లు 2. మోనోసైట్లు
లింపోసైట్లు
-WBCలో అతి చిన్నవి. జీవ పదార్థం తక్కువ, వీటి సంఖ్య 2,700 ఉంటుంది.
-కేంద్రకం గుండ్రంగా పెద్దదిగా ఉంటుంది.
-శరీరంలో ప్రవేశించిన ప్రతి జనకాలను (Antigens) గుర్తించి వాటికి ప్రతి రక్షకాలను (Antibodies) ఉత్పత్తి చేస్తాయి.
-వ్యాధులకు మాపు (Immunity) ఏర్పర్చుకోవడంలో పాత్ర వహిస్తాయి.
-ఎయిడ్స్ (AIDS – Acquired Immuno Deficiency Syndrome) రోగుల్లో ఈ కణాలు బలహీనపడి నాశనమవుతాయి. అందుకే ఇతర వ్యాధులను తట్టుకొనే శక్తి నశిస్తుంది.
మోనోసైట్లు
-WBCలో ఇవి అతి పెద్ద కణాలు. వీటిలో కేంద్రకం మూత్రపిండం ఆకారంలో ఉంటుంది.
-ఇవి అంటు రోగం కలిగిన స్థానానికి వెళ్లి బ్యాక్ట్టీరియాలను సంహరిస్తాయి.
-శరీరంలో చనిపోయిన బ్యాక్టీరియాలు, చనిపోయిన కణాలను బయటకు పంపిస్తాయి.
-WBC లు రక్తకేశనాళిక గుండా బయటకు రావడాన్ని డయాపడిసిస్ అంటారు.
రక్తఫలకికలు
-వీటిలో కేంద్రకం ఉండదు. అండాకారంగా, గుండ్రంగా లేదా ద్వికుంభాకారంగా ఉంటాయి.
-ఇవి గాయం అయినప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడంలో పాత్ర వహిస్తాయి.
-విటమిన్ – K ఉంటుంది.
-రక్తం గడ్డకట్టడంలో, గాయాలు మాన్పడంలో ముఖ్యంగా ఉపయోగపడుతాయి.
-మూలకం – Ca.
-రక్తప్రసరణ వ్యవస్థని కనుగొన్నది – బ్రిటిష్ వైద్యుడు విలియం హార్వే
-సిరల అధ్యయనాన్ని కనుగొన్నది – 1574లో ఇటాలియన్ డా. గైరోలమాఫాబ్రిసి
-ప్రపంచంలో మొదటిసారిగా గుండె మార్పిడి చికిత్సను చేసినది – 1967లో దక్షిణాఫ్రికాలో క్రిస్టియన్ బెర్నార్డ్
-దేశంలో మొదటి సారిగా గుండె మార్పిడి చికిత్సను చేసినది – 1984లో న్యూఢిల్లీలోని AIIMS- డా.వేణుగోపాల్ (All India Institute of Medical Science)
-ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ గుండె (Artificial Heart) తయారు చేసింది – 1957లో నెదర్లాండ్లో విలియం కోల్ఫ్
-మొదటి కృత్రిమ గుండె పేరు – జార్విక్ 7
-స్టెతస్కోపును కనుగొన్నది – 1816లో రెని లెన్నెక్
-గబ్బిలం రెక్కలపై అధ్యయనం చేసింది – 1661లో మార్సెల్లో మాల్ఫీజి. ఇతను గబ్బిలం రెక్కలో అతి పలుచని పోర (పెటాజియం) ఉంటుందని తెలిపాడు.
ప్రాక్టీస్ బిట్స్
1. శరీర సూక్ష్మ రక్షక భటులు ?
ఎ. న్యూట్రోఫిల్స్ బి. బేసోఫిల్స్
సి. లింపోసైట్లు డి. ఎరిత్రోసైట్లు
2. ఎర్రరక్తకణాల శ్మశాన వాటిక ?
ఎ. కాలేయం బి. ప్లీహం సి. క్లోమం డి. ఎముక మజ్జ
3. ఎయిడ్స్ వ్యాధిలో నశించే కణాలు?
ఎ. న్యూట్రోఫిల్స్ బి. ఇస్నోఫిల్స్
సి. లింపోసైట్లు డి. మోనోసైట్లు
4. రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతం?
ఎ. 1.85 -1.9 బి. 11.85 – 11.9
సి. 2.85 – 2.9 డి. 0.85 – 0.9
5. తెల్లరక్త కణాల్లో అతి పెద్దవి ?
ఎ. లింపోసైట్లు బి.మోనోసైట్లు
సి. న్యూట్రోఫిల్స్ డి. బేసోఫిల్స్
6. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకండా చేసిది ?
ఎ. హీమోగ్లోబిన్ బి. హిపారిన్
సి. థైరాక్సిన్ డి. ఎరిత్రోసైట్లు
7. రక్తంలో హిపారిన్ గల కణాలు ?
ఎ. బేసోఫిల్స్ బి.న్యూట్రోఫిల్స్
సి. మోనోసైట్లు డి. ఎరిత్రోసైట్లు
8. రక్తం గురించి చదివే శాస్త్రం ?
ఎ.హెమటాలజి బి. న్యూరాలజీ
సి. ఎంటమాలజి డి. ఏదీకాదు
9. తెల్లరక్త కణాల జీవిత కాలం ?
ఎ. 120 రోజులు బి. 12- 13 రోజులు
సి. 120 -125 రోజులు డి. 15 – 20 రోజులు
10. కేంద్రంకం S ఆకారంలో గల కణాలు ?
ఎ. బేసోఫిల్స్ బి. మోనోసైట్లు
సి. ఇస్నోఫిల్స్ డి. లింపొసైటు
11. ఎర్రరక్త కణాల్లో కేంద్రకం గల జీవి ?
ఎ. ఏనుగు బి. ఒంటె సి. పంది డి. నక్క
12. రక్తం PH ?
ఎ. 7.4 బి. 5.9 సి. 7.2 డి. 7
జవాబులు
1. ఎ 2. బి 3. సి 4. డి 5. బి 6. బి 7. డి 8. ఎ 9. బి 10. ఎ 11. బి 12. ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు