వినడం-చెప్పడం-చదవడం-రాయడంలో మొదటి అలవాటు ప్రక్రియ ఏది? (TET Special)
1. ఒకే రకం వైకల్యాన్ని మించి ఎక్కువ వైకల్యాలున్న వారిని ఏమంటారు?
1) బహుళ వైకల్యంగల పిల్లలు
2) బహుళ లోపంలేని పిల్లలు
3) బుద్ధిమాంద్యం గలవారు
4) ప్రజ్ఞావంతులు
2. బుద్ధిమాంద్యుల విద్యాప్రణాళికలోని విద్యావిషయక సూత్రాలేవి?
1) గుర్తుంచుకోవడం
2) అభ్యసనశక్తి, జ్ఞాపకశక్తి పెంపు
3) బహుమతులు, ప్రయోగాత్మకం
4) పైవన్నీ
3. బుద్ధిమాంద్యులకు చిన్న చిన్న సరళమైన పాటలు, పద్యాలకు పాడటం, నటించడం, అభినయించడం, నేర్పడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి?
1) సంఘీభావం, ఐక్యత
2) భాషాభివృద్ధి
3) సామాజిక స్పృహ 4) పైవన్నీ
4. పూర్వ ప్రాథమిక పాఠశాల విద్య వల్ల ప్రయోజనం?
1) ప్రాథమిక స్థాయిలో చదవడం సులభం
2) సెకండరీ స్థాయిలో ప్రయోజనం
3) ఇంటి దగ్గర పిల్లవాడి గోల తప్పుతుంది
4) చిన్న వయసులో పాఠశాలలో చేర్చడం వల్ల చలన కౌశలాలు వృద్ధి చెందుతాయి
5. మానసిక వికలాంగుల పాఠశాల బోధనాంతర సర్దుబాటు లక్ష్యం కానిది?
1) చదువు కొనసాగించడానికి సాయపడటం
2) వారి వైకల్యం మరిచిపోయి మెలగడం
3) ఏకీకృత పాఠశాల్లో చదవడానికి స్థిరపడటం
4) ఉద్యోగాన్వేషణ
6. బుద్ధిమాంద్యుల వ్యక్తిగత విద్యాపథకంలోని ముఖ్య చికిత్సాంశాలేవి?
ఎ) ఫిజియోథెరపి బి) ఔద్యోగిక చికిత్స
సి) ప్రవర్తన-నిర్వాహక చికిత్స
డి) భాషా చికిత్స
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, డి
7. బుద్ధిమాంద్యుల భాషాభివృద్ధి శిక్షణలో ఉపయోగపడే పునర్బలన పద్ధతి?
1) సాధారణీకరణం
2) పరిసర మార్పులు
3) సంకేతీకరణం
4) విచక్షణం
8. ఒక పరిస్థితిలో లేదా సన్నివేశంలో అభ్యసించిన ప్రవర్తనకు వేర్వేరు పద్ధతుల్లో ఉపయోగించడాన్ని ఏమంటారు?
ఎ) సాధారణీకరణం
బి) సామాన్యీకరణం
సి) సంకేతీకరణం
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, సి
9. బుద్ధిమాంద్యుల విద్యాభ్యాసం తరువాత కూడా పాఠశాల సిబ్బంది పర్యవేక్షణలో ఉండే విద్యా సదుపాయం?
1) ఆశ్రమ పాఠశాల
2) ప్రత్యేక పాఠశాల
3) సంచార పాఠశాల
4) సమైక్య విద్యా విధానం
10. వినడం-చెప్పడం-చదవడం-రాయడం అనే ముఖ్య ప్రక్రియల్లో మొదట అలవాటు కావాల్సిన ప్రక్రియ?
1) చెప్పడం
2) వినడం
3) చదవడం
4) రాయడం
11. దృష్టి లోపానికి సంబంధించి వనరుల గదిలో ఉండే బోధనా పరికరాలు?
1) స్నెల్లెన్ చార్ట్, ైస్లెడ్లు, చార్టులు
2) బ్రెయిలీ లిపికి సంబంధించిన పరికరాలు
3) టాకింగ్ బుక్స్, టచ్ బోర్డులు
4) పైవన్నీ
12. మస్తిష్క పక్షవాతం ఉన్న పిల్లల్లో సామర్థ్య స్థాయి?
1) భాషా అవగాహనా సామర్థ్యం తక్కువ
2) ప్రత్యక్షాత్మక సామర్థ్యం తక్కువ
3) స్వయం నిర్ణయ సామర్థ్యం తక్కువ
4) పైవన్నీ
13. తరగతి గది అభ్యసన వనరులేవి?
ఎ) ఉపాధ్యాయులు
బి) విద్యార్థులు
సి) సమాజం
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, సి
సమాధానాలు
1.1 2.3 3.4 4.1 5.4 6.3 7.3 8.3 9.1 10.2 11.4 12.4
13.2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు