జోగుళాంబ ఆలయం శిల్పశైలి ఏమిటి?
1. ‘పూర్ణకుంభం’ శిల్పం ఏ గుహలపై ఉంది ?
ఎ) అజంతా బి) ఎల్లోరా
సి) ఎ, బి డి) ఉండవల్లి
2. కీసర సమీపంలో ఘటికాస్థానాన్ని (ఘట్కేసర్) నిర్మించినదెవరు?
ఎ) ఇంద్రభట్టారక వర్మ బి) విక్రమేంద్ర భట్టారక
సి) విక్రమేంద్ర వర్మ డి) పైవారందరూ
3. ‘జనాశ్రయ ఛందోవిచ్ఛిత్తి’ అనే సంస్కృత అలంకార గ్రంథం ఎవరు రాశారు?
ఎ) గుణభరుడు బి) గుణాఢ్యుడు
సి) గుణస్వామి డి) గుణక
4. ఇంద్రపాలపురంలో బౌద్ధ భిక్షవులకు విహారాన్ని నిర్మించిన విష్ణుకుండినుల రాణి ఎవరు? ఎ) బోధిశ్రీ బి) మహాదేవి సి) ఇంద్రాదేవి డి) ఎవరూ కాదు
5. ఉండవల్లి, భైరవకోన గుహలను చెక్కించిన రాజు?
ఎ) మాధవ వర్మ-I బి) విక్రమేంద్ర వర్మ-II
సి) గోవింద వర్మ డి) ఇంద్ర వర్మ
6. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా కొండలను తొలిచి ఆలయాలను నిర్మించింది ఎవరు?
ఎ) శాతవాహనులు బి) పల్లవులు
సి) విష్ణుకుండినులు డి) మౌర్యులు
7. తొలి జంట కవులుగా ప్రసిద్ధిచెందినవారు?
ఎ) నన్నయ-తిక్కన బి) నంది మల్లయ్య-ఘంట సింగన
సి) పంప-రన్నడు డి) అందరూ
8. ‘ప్రబోధ చంద్రోదయం’ రాసిందెవరు?
ఎ) నంది మల్లయ్య-ఘంట సింగన బి) తిక్కన- ఎరాప్రగడ
సి) పంప డి) పొన్న-రన్నడు
9. కునాల సరస్సు యుద్ధంలో మంచన భట్టారకుడిని ఓడించి వేంగిని ఆక్రమించిందెవరు?
ఎ) పులకేశి-1 బి) పులకేశి-II
సి) గుణగ విజయాదిత్యుడు డి) ఎవరూ కాదు
10. విష్ణుకుండినుల రాజ్య మతం ఏది?
ఎ) వైష్ణవం బి) శైవం సి) బౌద్ధం డి) జైనం
11. విష్ణుకుండినుల రాజభాష ఏది? (ఎ)
ఎ) సంస్కృతం బి) తెలుగు సి) ప్రాకృతం డి) పైశాచి
12. కీసరలో రామలింగేశ్వర, అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలను నిర్మించిన విష్ణుకుండినుల రాజు?
ఎ) మాధవ వర్మ-I బి) మాధవ వర్మ-II
సి) విక్రమేంద్ర వర్మ-II డి) మాధవ వర్మ-IV
13. ‘నరబలి’ ఏ విష్ణుకుండినుల రాజు కాలంలో ప్రోత్సహింబడింది?
ఎ) మంచన భట్టారక బి) గోవింద వర్మ
సి) మాధవ వర్మ-II డి) విక్రమేంద్ర వర్మ
14. కింది వాటిని జతపర్చుము?
A) విక్రమేంద్ర వర్మ 1. విక్రమాశ్రయుడు
B) గోవింద వర్మ 2. ప్రియపుత్ర
C) ఇంద్ర వర్మ 3. విక్రమ మహేంద్ర
C) మాధవ వర్మ 4. మహాకవి
ఎ) A-1, B-2, C-3, D-4 బి) A-2, B-1, C-4, D-3
సి) A-3, B-2, C-1, D-4 డి) A-4, B-3, C-1, D-2
15. బాదామి/పశ్చిమ చాళుక్యుల వంశ మూలపురుషుడు ఎవరు?
ఎ) పులకేశి-I బి) రణరాగుడు
సి) జయసింహవల్లభుడు డి) కీర్తి వర్మ
16. పశ్చిమ చాళుక్యుల్లో గొప్పవాడెవరు?
ఎ) పులకేశి-II బి) పులకేశి-I సి) కీర్తివర్మ-I డి) కీర్తివర్మ-II
17. పశ్చిమ చాళుక్యుల రాజ లాంఛనం, రాజ భాష ఏది?
ఎ) సింహం-ప్రాకృతం బి) గరుడ-కన్నడం
సి) వరాహం-సంస్కృతం డి) కపోతం-పైశాచి
18. పశ్చిమ చాళుక్యులలో చివరి రాజు ఎవరు?
ఎ) పులకేశి-II బి) మంగళేశుడు సి) కీర్తివర్మ-II డి) రణరాగుడు
19. నర్మదా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
ఎ) పులకేశి-II – హర్షవర్ధనుడు బి) పులకేశి-II – మహేంద్రవర్మ-II
సి) పులకేశి-II – మంగళేశుడు డి) పులకేశి-II – నరసింహవర్మ-I
20. పులకేశి-II విజయాలను తెలిపే శాసనమేది?
ఎ) అలహాబాద్ శాసనం బి) ఐహోల్ శాసనం
సి) మధుబన్ డి) హర్షుడు
21. పారశీక చక్రవర్తి ఖుస్రూకి పులకేశి-IIకి మధ్య రాయబారం గురించి పేర్కొన్నదెవరు?
ఎ) ఇత్సింగ్ బి) పాహియాన్
సి) రవికీర్తి డి) తబారి
22. పశ్చిమ చాళుక్యులు ఆరంభించిన శైలి ఏది?
ఎ) వేసర శైలి బి) నగర శైలి
సి) ద్రావిడ శైలి డి) గాంధార శైలి
23. అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయ శైలి ఏది?
ఎ) ద్రావిడ బి) వేసర
సి) నగర శైలి డి) మధుర శైలి
24. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన గుహాలయం గల ప్రదేశం ఏది?
ఎ) బాదామి బి) పట్టడకల్
సి) మధురై డి) లలంపూర్
25. చాళుక్యుల దేవాలయాల్లో అతి ప్రాచీ న దేవాలయం ఏది?
ఎ) విజయేశ్వర దేవాలయం బి) హొచిమళ్ల దేవాలయం
సి) లడఖాన్ దేవాలయం డి) పట్టడిగల్ దేవాలయం
26. కీర్తివర్మ-II ను ఓడించి ‘రాష్ట్రకూట’ వంశ స్థాపన చేసిందెవరు?
ఎ) దంతిదుర్గుడు బి) కృష్ణుడు-I
సి) ఇంద్రుడు-III డి) తైలపుడు-I
27. పెరువళ్లునూరు యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగినది?
ఎ) విక్రమాదిత్య-I – నరసింహవర్మ-I
బి) విక్రమాదిత్య-I -పరమేశ్వర-I
సి) విక్రమాదిత్య-II -పరమేశ్వర-II
డి) కీర్తివర్మ-II – పరమేశ్వర-II
28. రాష్ట్రకూటుల తొలి రాజధాని నగరం ఏది?
ఎ) ఎల్లోరా బి) మాన్యఖేట సి) బాదామి డి) కంచి
29. పృథ్వీ వల్లభ, ఖడ్గావలోక అనే బిరుదు ఎవరికి కలవు?
ఎ) ధృవుడు బి) అమోఘవర్షుడు
సి) మూడో ఇంద్రుడు డి) దంతిదుర్గుడు
30. రాష్ట్రకూటుల మాతృభాష?
ఎ) తెలుగు బి) తమిళం సి) కన్నడం డి) మలయాళం
31. ఎల్లోరాలో ‘దశావతార గుహాలయం’ను ఎవరు నిర్మించారు?
ఎ) కృష్ణుడు-I బి) ధృవుడు
సి) దంతిదుర్గుడు డి) అమోఘవర్షుడు
32. ‘హిరణ్యగర్భ దాన’ యాగం చేసిన రాష్ట్రకూట రాజు?
ఎ) ధృవుడు బి) అమోఘవర్షుడు
సి) దంతిదుర్గుడు డి) గోవిందుడు-II
33. పాలరాజులను, ప్రతిహరులను ఓడించి గంగానది, యమునా నది గుర్తులను తన రాజపతకంలో చేర్చినవాడు ?
ఎ) ధృవుడు బి) కృష్ణుడు-I సి) నృపతుంగ డి) ఎవరూకాదు
34. కైలాసనాథ ఆలయం (ఎల్లోరా) ఎవరు నిర్మించారు? ఇది ఎన్నో గుహలో ఉంది?
ఎ) కృష్ణుడు-I, 15వ గుహ బి) కృష్ణుడు-II, 16వ గుహ
సి) కృష్ణుడు-III, 16వ గుహ డి) గోవిందుడు-II, 16వ గుహ
35. కన్నడంలో తొలి అలంకార గ్రంథం (కవిరాజమార్గం) రాసింది ఎవరు?
ఎ) అమోఘవర్షుడు బి) శాత్తాయన సి) రన్నడు డి) పొన్నడు
36. ఎలిఫెంటా గుహలు ఎవరి కాలానికి చెందినవి?
ఎ) రాష్ట్రకూటులు బి) తూర్పు చాళుక్యులు
సి) వేములవాడ చాళుక్యులు డి) బాదామి చాళుక్యులు
37. కన్నడ కవిత్రయంలో ఆది కవి పంప ఎవరి ఆస్థానంలో ఉన్నాడు?
ఎ) రాష్ట్రకూటులు బి) వేములవాడ చాళుక్యులు
సి) కళ్యాణి చాళుక్యులు డి) వేంగి చాళుక్యులు
38. దశావతార ఆలయంలో ప్రసిద్ధి చెందిన శిల్పం ఏది?
ఎ) హిరణ్యకస్యప, నృసింహం విగ్రహం బి) త్రిమూర్తి విగ్రహం
సి) పద్మసంభవుని విగ్రహం డి) విష్ణువిగ్రహం
39. అరబ్ యాత్రికుడు సులేమాన్ ప్రశంసలు పొందినవాడు?
ఎ) ధృవుడు బి) దంతిదుర్గుడు
సి) కృష్ణుడు-III డి) అమోఘవర్షుడు
40. అల్‌మసూది ఏ రాష్ట్రకూట రాజు కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు?
ఎ) అమోఘవర్ష బి) ఇంద్రుడు-II
సి) కృష్ణ-II డి) ఇంద్రుడు-III
సమాధానాలు
1) డి 2) ఎ 3) సి 4) బి 5) ఎ 6) సి 7) బి 8) ఎ 9) బి 10) ఎ 11) ఎ 12) బి 13) సి 14) డి 15) సి 16) ఎ 17) సి 18) సి 19) ఎ 20) బి 21) డి 22) ఎ 23) ఎ 24) ఎ 25) సి 26) ఎ 27) బి 28) ఎ 29) డి 30) సి 31) సి 32) సి 33) ఎ 34) ఎ 35) ఎ 36)ఎ 37) బి 38) ఎ 39) డి 40) డి
పాలకూరి అశోక్‌కుమార్
ఉస్మానియా యూనివర్సిటీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు