కపిలి అనే కాగులను తయారు చేసేవారు?
1) కిందివాటిలో ఉత్తర, దక్షిణ భారతదేశాలకు ముఖద్వారంగా సంస్కృతి గల రాష్ట్రం? (3)
1) మహారాష్ట్ర 2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ 4) మధ్యప్రదేశ్
2) కిందివారిలో ఎవరు లేకుంటే పల్లెల్లో సంప్రదాయ పనులు జరగవు? (1)
1) చాకలి 2) మంగలి
3) కుమ్మరి 4) కమ్మరి
3) ఎవరి పనికి ప్రతిఫలంగా మేర అనే వరి మోపు ఇచ్చేవారు? (2)
1) చాకలి 2) మంగలి 3) కమ్మరి 4) కుమ్మరి
4) కపిలి అనే కాగులను తయారు చేసేవారు? (4)
1) కుమ్మరి 2) కమ్మరి
3) మేదర 4) మాదిగ
5) తెలంగాణలో కన్పించే సంచార జాతి? (1)
1) దొమ్మర 2) వడ్డెర
3) కటిక 4) పైవారందరూ
6) పశువుల క్రయ, విక్రయాలు జరిగే సంతలనేమంటారు? (1)
1) పరస 2) మేర
3) అరివేణి 4) పైవన్నీ
7) గోండులు ఏ పండుగ ముందురోజు గుస్సాడీలుగా మారుతారు? (3)
1) సంక్రాంతి 2) దసరా 3) దీపావళి 4) ఏదీకాదు
8) కిందివారిలో గొల్ల/కురుమ కులానికి ఉపకులస్థులు ఎవరు? (3)
1) ఒగ్గువాళ్లు 2) గుస్సాడీలు
3) 1, 2 4) ఎవరూకాదు
9) పట్టి పండుగ చేసుకునేవారు ఎవరు? (3)
1) దొమ్మరులు 2) గోండులు
3) బగ్గుగాళ్లు 4) మంగలి
10) మాల కులస్థుల పెండ్లిళ్లకు పురోహితులుగా వ్యవహరించేది ఎవరు? (1)
1) పంబాలవాళ్లు 2) గుస్సాడీలు
3) ఒగ్గువాళ్లు 4) 1, 2
11) మాదిగ కులస్థుల పెండ్లిళ్లకు పురోహితులుగా వ్యవహరించేది ఎవరు? (4)
1) పంబాలవాళ్లు 2) బాలసంతులు
3) గుస్సాడీలు 4) బైండ్లు
12) బైండ్ల కథ ఎవరి ప్రార్థనతో మొదలవుతుంది? (3)
1) పోచమ్మ 2) ఎల్లమ్మ
3) శారదాదేవి 4) జంపన్న
13) తెలంగాణ రాష్ర్టానికి ఎన్ని రాష్ర్టాలు సరిహద్దులుగా ఉన్నాయి? (1)
1) నాలుగు 2) మూడు 3) ఐదు 4) ఆరు
14) తెలంగాణకు ఉత్తరాన ఉన్న రాష్ట్రమేది? (1)
1) ఛత్తీస్‌గఢ్ 2) మహారాష్ట్ర
3) కర్ణాటక 4) ఆంధ్రప్రదేశ్
15) లేసు అల్లికల పరిశ్రమలకు ప్రసిద్ది చెందినది? (3)
1) నిర్మల్ 2) పోచంపల్లి
3) దుమ్ముగూడెం 4) వరంగల్
16) రాష్ట్రంలో ఎన్ని నగర పంచాయతీలున్నాయి? (3)
1) 15 2) 20 3) 25 4) 30
17) రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలున్నాయి? (4)
1) 30 2) 33 3) 35 4) 37
18) రాష్ర్టానికి వాయవ్య సరిహద్దులో ఉన్న రాష్ట్రమేది? (2)
1) ఆంధ్రప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) కర్ణాటక 4) ఛత్తీస్‌గఢ్
19) రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏది? (4)
1) రామగుండం 2) పాల్వంచ
3) కొత్తగూడెం 4) పైవన్నీ
20) రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలున్నాయి? (2)
1) 117 2) 119 3) 122 4) 125
21) రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి? (1)
1) 17 2) 19 3) 12 4) 20
22) రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయి? (2)
1) 9 2) 7 3) 6 4) 5
23) రాష్ట్రంలో ఎన్ని మండలాలున్నాయి? (4)
1) 455 2) 456 3) 458 4) 459
24) రాష్ట్రంలో అత్యధిక మండలాలు కలిగిన జిల్లా? (1)
1) మహబూబ్‌నగర్ 2) ఖమ్మం
3) మెదక్ 4) నల్లగొండ
25) రాష్ట్రంలో అత్యల్ప మండలాలు కలిగిన జిల్లా? (3)
1) రంగారెడ్డి 2) నిజామాబాద్
3) హైదరాబాద్ 4) ఖమ్మం
26) కిందివారిలో ఎవరు బుడిగ జంగం కులంలో ఒక తెగ? (1)
1) బాలసంతులు 2) గుస్సాడీలు
3) ఒగ్గువాళ్లు 4) పంబాలవాళ్లు
27) గొల్లవాళ్లు చేసుకునే బీరప్ప పండుగకు పూజారులు ఎవరు? (2)
1) గుస్సాడీలు 2) ఒగ్గువాళ్లు
3) 1, 2 4) ఎవరూకాదు
28) రాష్ట్రంలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి? (4)
1) 5 2) 7 3) 8 4) 6
29) రాష్ట్రంలో ఎన్ని గ్రామపంచాయతీలున్నాయి? (2)
1) 8,691 2) 8,687 3) 8,587 4) 8,487
30) రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా? (1)
1) మహబూబ్‌నగర్ 2) ఖమ్మం
3) మెదక్ 4) ఆదిలాబాద్
31) సామాజిక స్థరీకరణ అంటే ఏమిటి? (2)
1) సామాజిక సమూహాల ప్రభావం
2) సమాజంలో అంతస్తులు, వృత్తుల్లో ఉండే క్రమానుగత శ్రేణి
3) సమాజంలో వివిధ కులాల్లో ఉండే శ్రమ విభజన
4) ఏదీ కాదు
32) జెండర్ వ్యత్యాసాలు కిందివాటిలో దేనిలో ఉన్నాయి? (4)
1) విద్య 2) ఆరోగ్యం 3) ఉద్యోగం 4) పైవన్నీ
33) కార్ల్‌మార్క్స్ ప్రకారం సామాజిక అసమానతకు కారణం? (1)
1) ఉత్పత్తికి చెందిన విధానం
2) నరవర్గ జాతిపర భేదాలు
3) సాంస్కృతిక, మతపర విభేదాలు
4) పైవన్నీ
34) భారత సమాజంలో స్థరీకరణలో ప్రాథమిక యూనిట్ ఏది? (2)
1) వర్గం 2) కులం 3) పై రెండూ 4) ఏదీకాదు
35) సామాజిక స్థరీకరణకు కారణంగా ఓపెన్ హేమర్ అనే శాస్త్రవేత్త చెప్పిన అంశం? (3)
1) తెగల వైవిధ్యం
2) కుటుంబ సంబంధాలు
3) ఒక సమూహం మరో సమూహంపై దాడి చేయడం
4) పైవన్నీ
—————–
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు