చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలను ఏమనేవారు? (TET Special)
క్రీ.శ. 7-12 శతాబ్దాల మధ్య భారత ఉపఖండాన్ని గూర్జర ప్రతిహారులు, చౌహానులు, పరమారులు, తోమరులు, చండేలులు, గహద్వాలులు, పాలల సేనలు, రాష్ట్రకూటులు పాలించేవారు.
సామంతులకు అధికారం, సంపద లభించిన క్రమంలో మహా సామంతులుగా, మహామండలేశ్వరులుగా తమకు తాము ప్రకటించుకునేవారు.
రాష్ట్రకూటులు చాళుక్యుల సామంతులుగా నేటి కర్ణాటకలో పాలించారు. వీరిలో ముఖ్యుడైన దంతిదుర్గుడు చాళుక్యరాజును ఓడించి హిరణ్య గర్భ సంస్కార విధి నిర్వహించి క్షత్రియుడిగా పునర్జన్మ పొందుతానని భావించాడు.
కదంబమయూర శర్మ, గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు బ్రాహ్మణులైనప్పటికీ కర్ణాటక, రాజస్థాన్‌లలో రాజ్యాలను స్థాపించారు.
శాసనాల్లో మొదట పేర్కొన్న భాగాన్ని ప్రశస్తి అంటారు. దీనిలో వారి కుటుంబం, పూర్వపు రాజులు, పాలనాకాలం, ఘనత, విజయాలు వర్ణించుకునేవారు.
12వ శతాబ్దంలో కల్హణుడు కశ్మీరును పాలించిన రాజుల చరిత్రను సంస్కృతంలో రచించాడు. అందుకోసం శాసనాలు, రాతప్రతులు, పూర్వ చరిత్రలు, దృష్టాంతాలు వనరులుగా రచనకు వినియోగించాడు.
గంగానదీలోయ ప్రాంతంలోని కనోజ్‌పై నియంత్రణ కోసం గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాల వంశీయులు, త్రైపాక్షిక పోరాటం చేశారు.
సాధారణ శకం 997-1030 మధ్య అఫ్గానిస్థాన్‌ను మహ్మద్ గజనీ పాలించాడు.
గజనీ తన రాజ్యాన్ని మధ్య ఆసియా, ఇరాన్, భారత ఉపఖండ ప్రాంతాలకు విస్తరించాడు.
గజనీ గుజరాత్‌లోని సోమనాథ దేవాలయంపై 17 సార్లు దాడిచేసి, విధ్వంసం సృష్టించి, సంపదను దోచుకున్నాడు.
చౌహానులు ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాన్ని పాలించారు. గుజరాత్ పాలకులైన చాళుక్యులు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను పాలించిన గహద్వాలులు చౌహానులను వ్యతిరేకించారు.
చౌహాన్ వంశస్తుడైన మూడో పృథ్వీరాజ్ అఫ్గాన్‌కు చెందిన మహ్మద్ ఘోరీని (1191) ఓడించాడు. మరుసటి సంవత్సరమే 1192లో పృథ్వీరాజ్.. ఘోరీ చేతిలో ఓడిపోయాడు. పల్లవులకు సామంతులుగా కావేరి డెల్టా ప్రాంతంపై ముత్తరాయర్గా పిలిచే చిన్న కుటుంబం అధికారాన్ని పొందింది.
9వ శతాబ్దం మధ్యలో ఉరమూర్కు చెందిన పురాతన బోళవంశపు విజయుడు.. ముత్తరాయర్కు చెందిన డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకుని తంజావూరు పట్టణాన్ని, నిశంభసూది దేవతకు ఆలయాన్ని నిర్మించాడు.
సాధారణ శకం 985లో విజయాలయుని తర్వాత మొదటి రాజరాజు పాండ్య, పల్లవ రాజ్య భాగాలను ఆక్రమించి శక్తిమంతుడిగా పేరుగాంచాడు.
రాజరాజు కుమారుడైన మొదటి రాజేంద్రుడు నౌకాదళాన్ని అభివృద్ధిపర్చి శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలు, గంగానదీలోయ వరకు రాజ్యవిస్తరణ చేశాడు.
వీరు దేవాలయాలను నిర్మించి వాటి పోషణకు విరివిగా దానధర్మాలు చేశారు. అందువల్ల ఆలయాలు భూములతో సంపన్నమైనాయి. దేవాలయాల్లో పూజారులు, పూలమాలలు అల్లేవారు, వంటవారు, ఆలయాన్ని శుభ్రం చేసేవారు, సంగీత వాద్యకారులు, నాట్యకత్తెలు ఉపాధి పొందేవారు.
దేవాలయాలు పూజాకేంద్రాలుగానే గాక ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవన కేంద్రాలుగా వెలిశాయి.
వీరి పాలనాకాలం అందమైన కాంస్య విగ్రహాలకు ప్రసిద్ధి పొందినది.
వ్యవసాయాభివృద్ధికి కావేరి నదిపై కాలువలు, చెరువులు, బావులు నిర్మించారు.
రాజ్యాన్ని మండలాలుగా విభజించి, మండలాలను వలనాడులుగా, నాడులుగా విభజించి వికేంద్రీకృత పాలనను చేపట్టారు.
రైతులు నివసించే ప్రాంతాలను ఊరు అనేవారు. ఇలాంటి ఊర్లు కొన్ని కలిసి నాడులుగా ఏర్పడేవి.
నాడుల పరిపాలన వ్యవహారాలను గ్రామసభ చేపట్టి పన్నుల వసూలు, న్యాయ పరిపాలన చేసేవి.
నాడుల పాలన వెల్లాల కులానికి చెందిన సంపన్న రైతులు చేపట్టినారు.
చోళులు ధనవంతులైన భూస్వాములకు మువ్వేందవేలన్ (ముగ్గురు రైతులకు సేవలందించే రైతు), అరయ్యార్ (ముఖ్యుడు) అనే గౌరవ బిరుదులను ఇచ్చి కేంద్ర పాలనలో ముఖ్య బాధ్యతలను అప్పగించేవారు.
సామ్రాజ్యంలోని భూములను వాటి ఆధీనతనుబట్టి వెల్లన్ వాగై (బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి), బ్రహ్మదేయ (బ్రాహ్మణులకు బహూకరించిన భూమి), శాలభోగ (పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి), దేవాదాన, తిరునామత్తుక్కని (దేవాలయాలకు బహూకరించిన భూమి), పళ్లిచ్ఛందం (జైన సంస్థలకు విరాళమిచ్చిన భూమి) అని చోళుల శాసనాలు తెలుపుతున్నాయి.
బ్రహ్మదేయ గ్రామం బ్రాహ్మణ భూస్వాములతో కూడిన సభ సంరక్షణలో ఉండేది. నగరం అనే వర్తక సంఘాలు కూడా పరిపాలనలో పాల్గొనేవి.
పాలన వ్యవహారాల్లో సభ ఎలా నిర్వహించేవారో తమిళనాడు, చెంగల్పట్టు జిల్లా, ఉత్తర మేరూర్ శాసనం తెల్పుతుంది. సభలో అనేక కమిటీలు, నీటి పారుదల వసతులు, తోటలు, దేవాలయాలు, సంరక్షణ నిర్వహణ చేపట్టేవి.
కమిటీ సభ్యుల ఎన్నికకు అర్హులైన వారి పేర్లు తాటాకు మొక్కలపై రాసి, వాటిని కుండలో వేసి, చిన్న బాలునితో ఒక్కో ముక్కను ఒక్కో కమిటీ కోసం తీసి సభ్యులను ప్రకటించేవారు.
సభ సభ్యుల ఎంపిక-అర్హతలు: పన్ను చెల్లించే భూమి కలిగి ఉండాలి. సొంత ఇల్లు కలిగి 35-70 వయసు ఉండాలి. వేదాల గురించి తెలిసి ఉండాలి. నిజాయితీ కలిగి పాలనావ్యవహారాలు తెలిసిన వారై ఉండాలి.
అనర్హతలు: గత మూడు సంవత్సరాల్లో ఏదైనా కమిటీలో సభ్యుడిగా కొనసాగితే మరో కమిటీకి సభ్యుడు కారాదు. గతంలో కమిటీలో ఉండి లెక్కలు చూపని వారు, వారి బంధువులు పోటీ చేయరాదు.
తమిళ భాషలోని పెరియ పురాణం (12వ శతాబ్దం నాటిది) సామాన్యులైన పూలయ్యర్ల జీవనవిధానం గురించి తెలుపుతుంది.
మాదిరి ప్రశ్నలు
1. క్రతువుతో పునర్జన్మ పొంది క్షత్రియుడిగా ప్రకటించుకున్న రాజు?
1) రాష్ట్రకూట దంతిదుర్గుడు
2) రాష్ట్రకూట కృష్ణుడు
3) చాళుక్య సోమేశ్వరుడు
4) చోళ రాజరాజు
2. పుట్టుకతో క్షత్రియుడు కాకున్నా, క్రతువుతో పునర్జన్మ పొందడానికి నిర్వహించే సంస్కార విధి?
1) అక్షయ గర్భ 2) హిరణ్య గర్భ
3) క్షీర గర్భ 4) రజత గర్భ
3. బ్రాహ్మణులైనప్పటికినీ, ఆయుధాలు ధరించి రాజ్యాలు స్థాపించినవారు?
ఎ. కదంబ మయూరశర్మ
బి. చాళుక్య పులకేశి
సి. కాకతీయ రుద్రమ
డి. గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, డి 4) ఎ
4. శాసనాల్లోని ప్రశస్తిలో సాధారణంగా పేర్కొనని అంశాలు?
1) పాలకుల కుటుంబాలు, వారి పూర్వీకులు
2) వారి పరిపాలనా కాలం
3) వారి ఘనతలు, విజయాలు
4) వారి అపజయాలు, అవమానాలు
5. కశ్మీర్‌ను పాలించిన 12వ శతాబ్దంలో అసాధారణ సంస్కృత పద్యం రాసినది?
1) కల్హణుడు 2) భానుడు
3) గుణాఢ్యుడు 4) కాళిదాసు
6. గంగానది లోయలోని కనోజ్ కోసం జరిగిన యుద్ధంలో పాల్గొనని రాజవంశం?
1) గూర్జర ప్రతిహారులు 2) రాష్ట్రకూటులు
3) పాల వంశీయులు 4) కదంబులు
7. త్రైపాక్షిక పోరాటం ఎవరి మధ్య జరిగింది?
1) చోళులు, చాళుక్యులు, పల్లవులు
2) యాదవులు, చాళుక్యులు, కదంబులు
3) గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాల వంశీయులు
4) గహద్వాలులు, చౌహానులు, పరమారులు
8. గుజరాత్‌లోని సోమనాథ దేవాలయంపై దాడిచేసి సంపద దోచుకున్న పాలకుడు?
1) మహ్మద్ ఘోరీ
2) మహ్మద్ గజనీ
3) మహ్మద్ ఖాన్ ఖాసీం
4) మహ్మద్‌బీన్ తుగ్లక్
9. గజనీ మహ్మద్‌తో వచ్చి భారత ఉపఖండం గురించి రచనలు చేసిన పండితుడు?
1) అల్ బెరూనీ 2) అబుల్ ఫజల్
3) అబ్దుల్ లతీఫ్ 4) ఉస్తాద్ మన్సూర్
10. కితాబ్ అలహింద్ అనే అరబ్ గ్రంథాన్ని రాసినది?
1) తాన్సేన్ 2) గుల్బదన్ బేగం
3) అమీర్ ఖుస్రూ 4) అల్ బెరూనీ
11. చౌహానులు పాలించిన నేటి ప్రాంతాలు?
1) గుజరాత్ 2) ఢిల్లీ, అజ్మీర్
3) బెంగాల్ 4) బీహార్
12. చౌహానులను వ్యతిరేకించిన పాలకులెవరు?
ఎ. చాళుక్యులు బి. తోమరులు
సి. గహద్వాలులు డి. పాల వంశీయులు
1) ఎ, సి 2) ఎ, సి, డి
3) బి, సి 4) బి, సి, డి
13. 1191లో మూడో పృథ్వీరాజ్ చేతిలో ఓటమి పొందిన అఫ్గాన్ పాలకులు?
1) మహ్మద్ ఘోరీ 2) మహ్మద్ గజనీ
3) జలాలుద్దీన్ 4) బాబర్
14. 1192లో జరిగిన యుద్ధంలో మహ్మద్ ఘోరీ చేతిలో ఓటమి పొందిన రాజపుత్ర వీరుడు?
1) బప్పారావల్
2) మూడో పృథ్వీరాజ్ చౌహాన్
3) రన్ కుంభ
4) చిత్తోర్ను పాలించిన శివదేశ్
15. కంచి పల్లవులకు సామంతులుగా కావేరీ, డెల్టాపై అధికారం పొందినది?
1) వెల్లాల కుటుంబం
2) ఉత్తరాయర్ కుటుంబం
3) కలబూలు
4) కదంబులు
16. కింది వారిలో ఎవరు ఉత్తరాయర్ల కావేరీ డెల్టాపై దండెత్తి, ఆక్రమించి రాజ్యస్థాపనకు పూనుకున్నారు?
1) విజయాలయుడు
2) మొదటి రాజరాజు
3) రాజేంద్ర చోళుడు
4) రెండవ రాజరాజు
17. విజయాలయుడు నిర్మించిన పట్టణం, దేవాలయాలు ఏవి?
1) కాంచీపురం, మహేశ్వరాలయం
2) తంజావూరు, నిశుంభ సూదిని దేవాలయం
3) గంగైకొండ చోళపురం, రాజరాజేశ్వరాలయం
4) తంజావూరు, బృహదీశ్వరాలయం
18. చోళ రాజుల్లో అతి శక్తిమంతుడిగా కీర్తి పొందినది ఎవరు?
1) విజయాలయ-I
2) విజయాలయ-II
3) మొదటి రాజరాజు
4) రాజేంద్ర చోళుడు
19. రాజేంద్రచోళుడు పటిష్టపర్చిన సైనిక దళం?
1) కాల్బలం 2) అశ్విక దళం
3) గజ దళం 4) నౌకాదళం
20. మొదటి రాజేంద్రచోళుడు ఆక్రమించని ప్రాంతాలు?
1) గంగానది లోయ
2) శ్రీలంక
3) ఆగ్నేయాసియా
4) సింధులోయ ప్రాంతాలు
21. మొదటి రాజేంద్రుడు నిర్మించిన దేవాలయాలు, శిల్పకళాభివృద్ధి నిదర్శనాలు ఏవి?
1) తంజావూరులోని గంగైకొండ, చోళపురం దేవాలయాలు
2) కాంచీపురంలోని పరమ మహేశ్వరాలయం
3) తంజావూరులోని నిశుంభ సూదిని దేవాలయాలు
4) మధురైలోని కామాక్షి దేవాలయాలు
సమాధానాలు
1-1, 2-2, 3-3, 4-4, 5-1, 6-4, 7-3, 8-2, 9-1, 10-4, 11-2, 12-1, 13-1, 14-2, 15-2, 16-1, 17-2, 18-3, 19-4, 20-4, 21-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు