అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో.. (పోటీ పరీక్షల కోసం..)
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలు లబ్ధిపొందేలా పథకాలు అమలు చేస్తుంది. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదిముబారక్, ఆసరా పింఛన్, హరితహారం,మన ఊరు- మన బడి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం..
కేసీఆర్ కిట్ పథకం
- ప్రారంభించిన తేదీ: 03 జూన్ 2017
- ప్రారంభించిన ప్రదేశం: పేట్లబుర్జు ఆసుపత్రి (హైదరాబాద్)
- లక్ష్యం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం.
ముఖ్యాంశాలు - అమ్మకు ఆత్మీయతతో..బిడ్డకు ప్రేమతో అనే నినాదంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
- ఈ పథకంలో ఒక్కో కాన్పుకు రూ.2 వేల విలువైన కేసీఆర్ కిట్‌ను ఉచితంగా అందిస్తారు. ఆడబిడ్డ జన్మిస్తే రూ. 13వేలు, మగబిడ్డ జన్మిస్తే రూ.12వేలు అందిస్తారు. రాష్ట్రంలోని 9 బోధన, ఆరు జిల్లా ఆసుపత్రులతో సహా మొత్తం 841 ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
- మొదటి విడుత- ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణిగా నమోదు చేయించుకుని, కనీసం రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత రూ. 3000 ఇస్తారు.
- రెండో విడుత- ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తర్వాత ఆడబిడ్డ పుడితే రూ. 5000, మగబిడ్డ పుడితే రూ. 4000, రూ. 2వేలు విలువ కలిగి 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ కూడా ఇస్తారు.
- మూడో విడుత- బిడ్డ పుట్టినప్పటి నుంచి 3 1/2 నెలల కాలంలో ఇవ్వాల్సిన టీకాలు తీసుకున్న తర్వాత రూ. 2 వేలు ఇస్తారు.
- నాలుగో విడుత- బిడ్డ పుట్టినప్పటి నుంచి 9 నెలల కాలంలో ఇచ్చిన టీకాలు, తీసుకున్న తర్వాత రూ. 3 వేలు ఇస్తారు.
- అమ్మ ఒడి అనే పథకం ద్వారా గర్భిణీలను ప్రభుత్వ వాహనంలోనే ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు.
- రెండు కాన్పులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కానీ గిరిజన మహిళలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.
- ఈ పథకం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 31 నుంచి 60 శాతానికి పెరిగింది.
- ఈ పథకం ద్వారా తెలంగాణలో శిశుమరణాల రేటు 39 శాతం నుంచి 29శాతానికి తగ్గింది.
- కేసీఆర్ కిట్‌లో ఉండే వస్తువులు 16
- దోమతెర, బేబీ మస్కిటోస్, బేబీ డ్రెసెస్ (2), బేబీ టవల్స్ (2), బైబీ డైపర్స్, బేబీ పౌడర్, బేబీ షాంపు, బేబీ ఆయిల్, బేబీ సోప్, బేబీ సోప్ బాక్స్, ఆట వస్తువులు, తల్లికోసం చీరలు (2), సబ్బులు (2), కిట్ బ్యాగ్, ప్లాస్టిక్ బకెట్.
- 2021-22 బడ్జెట్లో కేసీఆర్ కిట్ పథకం కోసం రూ. 330 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
రైతు బంధు పథకం
- రైతుబంధు పథకం (Farmers Invest ment Support Scheme (FISS)ను 2018 మే 10న ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లోప్రారంభించారు. ధర్మరాజ్ పల్లి రైతులకు మొదటి చెక్కును ఇచ్చారు.
- రైతులకు రుణభారం నుంచి విముక్తి కల్పించి, మళ్లీ అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడటం కోసం లేదా పెట్టుబడి సాయం లేదా సాగుకు అవసరమైన ఉత్పాదకాల (విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు, కూలీ, ఇతర పెట్టుబడులు) కోసం సహాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
- రాష్ట్రం మొత్తంలో కోటి 30 లక్షల ఎకరాలకు పంట పెట్టుబడి సహాయం అందుతుంది.
ఈ పథకం ప్రారంభంలో ఎకరానికి ఒక్కో సీజన్‌కు రూ.4,000 చొప్పున ప్రతి రైతు ఎకరానికి రూ. 8,000 లు అందించారు. తర్వాత 2019-20 నుంచి ఒక్కో సీజన్‌కు రూ.5,000లు రెండు పంటలకు రూ.10,000 ఇస్తున్నారు. - ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ‘ధర్మరాజ్పల్లి’ గ్రామస్తులకు భూప్రక్షాళనకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
- 2020-21 సంవత్సరం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో 75.4%, మొత్తం బడ్జెట్లో 7.7% రైతుబంధు పథకం కోసం కేటాయించారు.
- ఈ పథకాన్ని స్పూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నెలలో ‘ప్రధానమంత్రి కిసాన్’ పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా రూ.6వేలు వ్యవసాయ సాగు పెట్టుబడికి మద్ధతుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
- రైతుబంధు పథకం కింద 2021-22 యాసంగిలో రాష్ట్రంలో మొత్తం 66లక్షల మంది రైతులు పెట్టుబడి సహాయం అందుకున్నారు. 2021-22 యాసంగిలో 148 లక్షల ఎకరాలు ఈ పథకం కిందికి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,645.66కోట్లు పంపిణీ చేసింది. 2018 వానాకాలం నుంచి 2021-22 యాసంగి వరకు మొత్తం ఎనిమిది సీజన్లలో ప్రభుత్వం రూ.50,448 కోట్లు రైతులకు ఈ పథకం కింద పెట్టుబడి సహాయం అందించింది.
- 2021-22 యాసంగి పంటకోసం ప్రయోజనం పొందిన 66లక్షల మంది రైతుల్లో 53శాతం వెనుకబడిన వర్గాలకు చెందినవారు కాగా, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు 13శాతం ఉన్నారు. ఇతర వర్గాలకు చెందిన వారు 21శాతం లబ్ధిపొందారు.
- రైతబంధు పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధుల్లో 48శాతం వెనుకబడిన వర్గాలు, 30శాతం ఇతరులు, 13శాతం ఎస్టీలు, 9శాతం ఎస్సీలకు డబ్బులు అందాయి. 2021-22 బడ్జెట్లో వ్యవ సాయం దాని అనుబంధ రంగాలకు కేటాయించిన మొత్తంలో 55శాతం రైతుబంధు పథకానికి వర్తింపజేయడం విశేషం.
మన ఊరు- మన బడి/మన బస్తీ మన బడి
- తెలంగాణ ప్రభుత్వం మన ఊరు- మన బడి/మన బస్తీ మన బడి కార్యక్రమానికి జనవరి 2022న శ్రీకారం చుట్టింది.
- ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలోని బాలుర పాఠశాలలో 2022 మార్చి, 8న ప్రారంభించారు.
- ఈ పథకంలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు 2022-23 బడ్జెట్లో రూ.7, 289.54 కోట్లు మూడు సంవత్సరాలకు కేటాయించారు.
- ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తరగతి గదుల మరమ్మత్తులు, అవసరమైన ఫర్నీచర్, టాయిలెట్లు, డిజిటల్ క్లాసుల నిర్వహణ సౌకర్యాలు కల్పిస్తారు.
మూడు సంవత్సరాల కాలానికి 26,067 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 19,84,167 మంది విద్యార్థులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది. - ఇది 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.
- ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడం.
- ఈ కార్యక్రమానికి అదనంగా ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో రూ. 2కోట్లను కూడా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా బడులు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక వసతుల కల్పనకు ఉపయోగిస్తారు.
- 2021-22 సంవత్సరానికి ఈ కార్యక్రమంలో భాగంగా 9123 స్కూల్స్‌ను తీసుకొని దీనిలో మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు.
రైతు బీమా పథకం
- 2018 ఆగస్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో ప్రారంభించారు. 2018 ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చింది.
- రైతు ఏ కారణంతో మరణించాడనే విషయంతో సంబంధం లేకుండా సాధారణ మరణాలతో సహా రైతు మరణించిన పది రోజుల్లోగా రూ.5లక్షలు ప్రమాద బీమా చెల్లించే విధంగా రూపకల్పన చేశారు.
రాష్ట్రప్రభుత్వం ఎల్ఐసీతో కలిసి దీన్ని నిర్వహిస్తుంది. - రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టకుండానే, ప్రభుత్వమే ఒక్కోరైతుకు ఏడాదికి చెల్లిస్తుంది. ఒక్కో రైతుకు ప్రీమియం కింద రూ. 3,555.94ల మొత్తాన్ని చెల్లిస్తుంది. (ఇందులో ప్రీమియం రూ. 3,013, జీఎస్టీ రూ. 514.44).
- రైతు బీమా పథ కం అమలుకు ప్రత్యేకంగా జిల్లాకు ఒక నోడల్ అధికారి ఉంటాడు. వీరు జిల్లాలోని
- వ్యవసాయ అధికారులకు ఏఈఓలకు పథకం అమలుపై శిక్షణ ఇస్తారు.
- రైతు బీమా పథకంలో నమోదు కావడానికి వయోపరిమితి 18-59 సంవత్సరాలు.
- 2018 నుంచి ప్రభుత్వం…మరణించిన రైతులకు చెందిన 75,276 కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి రూ. 3,763.80 కోట్ల బీమా మొత్తాన్ని బదిలీ చేసింది.
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 32.7 లక్షల మంది రైతులు రైతు బీమా పథకం కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పథకం కింద 28,708 మంది రైతులకు రూ.1,453 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసింది.
- పథకం ప్రారంభం అయినప్పటి నుంచి రైతు బీమా కింద పరిష్కరించిన కేసుల్లో 49-59 మధ్య వయసుల(46శాతం) కు సంబంధించినవి అత్యధికంగా ఉన్నాయి. ఈ వయస్సుల్లో వారివి 30,279 ైక్లెయిమ్లు పరిష్కారం కాగా, తర్వాత స్థానం 39-48 సంవత్సరాల మధ్య వయస్సుల వారివి. 23,435 మంది ఈ వయస్సు రైతులు ైక్లెయిమ్లు పరిష్కారం కాగా, ఇవి 36శాతంగా నమోదు అయ్యాయి.
Previous article
తెలంగాణకు అశనిపాతం ఆరుసూత్రాలు ( గ్రూప్-1 ప్రత్యేకం )
Next article
మధ్యయుగ భారత్‌పైకి భక్తి ఉద్యమ ప్రభావం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు