ఖజానా సంరక్షకుడు ..కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (Comptroller and Auditor General-CAG)
పోటీ పరీక్షల ప్రత్యేకం
రాజ్యాంగంలోని Vవ భాగంలో ప్రకరణ 148 నుంచి 151 వరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే రాజ్యాంగబద్ధమైన పదవిని ఏర్పాటు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ పదవిని అత్యంత ముఖ్యమైన పదవిగా, భారత ఖజానా సంరక్షకుడిగా అభివర్ణించారు. కాగ్ గురించి తెలుసు కుందాం..
నియామకం
# ప్రకరణ 148(1) రాష్ట్రపతి తన రాజముద్రతో స్వయంగా సంతకం చేసిన ఆదేశం (By a warrant under his and seal) ద్వారా నియమిస్తారు. రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు (ప్రకరణ 148(2)).
#రాజ్యాంగ పదవుల్లో పదవీ ప్రమాణం చేసే ఏకైక పదవి ఇదే.
#కాగ్ పదవీకాలం ఆరు సంవత్సరాలు. పదవీ విరమణ వయస్సు 65. ఈ రెండింటిలో ఏది ముందయితే దాని ఆధారంగా పదవీ కాలం నిర్ణయిస్తారు.
#పదవీ విరమణ తర్వాత కాగ్ ఏ ఇతర ప్రభుత్వ నియామకాలకు అర్హు కారు.
తొలగింపు
# ప్రకరణ 148 ప్రకారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించే పద్ధతిలోనే తొలగిస్తారు. అవినీతి, అసమర్థత అనే కారణాలపై పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో వేర్వేరుగా తీర్మానం చేస్తే, ఆ తీర్మానం మేరకు రాష్ట్రపతి కాగ్‌ను తొలగిస్తారు.
జీత భత్యాలు
# కాగ్ జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్లో ప్రస్తావించారు.
#పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.
#కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
# సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తుల జీతభత్యాలతో సమానంగా చెల్లిస్తారు.
#ప్రస్తుతం కాగ్ వేతనం రూ.2,50,000
అధికారాలు
# ప్రకరణ 149 ప్రకారం పార్లమెంట్ నిర్ణయించిన అధికారాలను కాగ్ నిర్వహిస్తారు. పార్లమెంట్ 1971లో రూపొందించిన ఈ చట్టాన్ని 1976లో సవరించారు.
#కేంద్ర సంఘటిత నిధి, రాష్ట్ర సంఘటిత నిధి, కేంద్ర ఆగంతుక నిధి, రాష్ట్ర పబ్లిక్ నిధి, అలాగే శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల అకౌంట్లు కూడా ఇస్తారు.
#వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు నిర్వహిస్తున్న వ్యాపార ఉత్పత్తి, లాభనష్టాలకు సంబంధించిన నివేదిక ఇస్తారు.
#వివిధ ప్రభుత్వరంగ సంస్థల వ్యాపార, లావాదేవీలను కూడా పరిశీలించి నివేదిక ఇస్తారు.
#కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయ, వ్యయాలకు సంబంధించిన నియమాలను, పద్ధతులను ఆడిట్ చేసి సక్రమంగా ఉన్నాయో లేదో నివేదిక ఇస్తారు.
# కేంద్ర అకౌంట్లకు సంబంధించి ప్రకరణ 151 ప్రకారం రాష్ట్రపతికి, రాష్ట్ర అకౌంట్‌కు సంబంధించి గవర్నర్‌కు నివేదిక సమర్పిస్తారు.
#పార్లమెంటరీ ఆర్థిక కమిటీ అయిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి తత్వవేత్తగా, స్నేహితుడి (Philosopher, Friend)గా వ్యవహరిస్తారు.
# పన్నుల విభజనకు సంబంధించి నికర మొత్తాలు అనే ధృవీకరణ పత్రాన్ని జారీచేస్తారు.
#కాగ్ సలహా మేరకు రాష్ట్రపతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాల నిర్వహణకు సంబంధించిన ఆదేశాలను జారీ చేస్తాయి. ఆర్థిక అంశాలు, పద్దులు, ప్రభుత్వరంగ సంస్థలు (Audit Report on Finance Accounts, Audit Report on Public undertakings. Audit report on And priation Accounts) వంటి మూ రకాలైన నివేదికలను రాష్ట్రపతికి సమర్పిస్తారు.
#ఈ నివేదికలను రాష్ట్రపతి పార్లమెంట్ ముందుంచుతారు. ఆ తర్వాత ప్రభుత్వ ఖాతాల కమిటీ వీటిని పరిశీలిస్తుంది.
ఆర్థిక కమిటీలు
ప్రభుత్వ ఖాతాల కమిటీ (Public Accounts Committee)
#దీన్ని 1921లో ఏర్పాటు చేశారు.
#ఇది పార్లమెంటరీ సంయుక్త కమిటీ.
# దీనిలో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు.
#15 మంది లోక్‌సభ నుంచి, ఏడుగురు రాజ్యసభ నుంచి సంవత్సర కాలానికి ఎన్నికవుతారు. సాధారణంగా రెం సంవత్సరాల వరకు కొనసాగుతారు.
#మంత్రులు ఈ కమిటీల్లో ఉండటానికి అర్హులు కాదు.
# ఈ కమిటీ చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు.
# 1967 నుంచి లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక సభ్యుడిని చైర్మన్‌గా నియమిస్తున్నారు.
విధులు
#కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను ఆధారంగా చేసుకొని కొన్ని అంశాలను
పరిశీలిస్తుంది.
#ఖాతాలో చూపిన విధంగా చట్టబద్ధంగా ఉద్దేశించిన అంశాల కోసం ఖర్చు పెట్టారా లేదా అని పరిశీలిస్తారు.
# పార్లమెంట్ ఆమోదించిన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉన్నదా లేదా అని
సమీక్షిస్తారు.
#పునర్ వ్యయం నిబంధనల మేరకు, అర్హత కలిగిన అధికారుల ఆజ్ఞానుసారం నిధుల ఖర్చు జరిగిందో లేదో పరిశీలిస్తారు.
#ప్రభుత్వ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తారు.
#ఈ కమిటీకి సాంకేతిక, ఇతర సలహాలను కాగ్ అందిస్తారు. అందుకే కాగ్‌ను ఈ కమిటీకి మార్గదర్శకుడి (Guide)గా, తత్వవేత్త (Philoso pher)గా, స్నేహితుడి (Friend)గా
పరిగణిస్తారు.
అంచనాల కమిటీ (Estimates Committee)
# 1950లో ఆనాటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ సిఫారసు మేరకు పార్లమెంట్ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
# ఇందులో 30 మంది సభ్యులుంటారు.
#ఈ కమిటీ చైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు.
#ఒక సంవత్సర కాలానికి లోక్‌సభ నుంచి మాత్రమే ఎన్నికవుతారు. 3 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. అంటే 1/3వ వంతు మంది పదవీ విరమణ చేస్తారు.
విధులు
# ప్రభుత్వ అంచనాలను దృష్టిలో పెట్టుకుని పొదుపును పాటించడం
# పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం
# వ్యవస్థలను అభివృద్ధిపరచడం
#పాలనా రంగంలో సంస్కరణలను సూచించడం
# ఆయా అంచనాల నిధులు, ఆ మేరకు ఉన్నాయో లేదో పరిశీలించడం
# అంచనాలు ఏ రూపంలో పార్లమెంటుకు సమర్పించాలో సూచించడం
#అంచనాల సంఘం తన నివేదికను లోక్‌సభకు సమర్పిస్తుంది.
#దీని ప్రస్తుత చైర్మన్ గిరీష్ బాపట్.
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
(Committee on Public Undertakings)
#1964లో కృష్ణమీనన్ కమిటీ సలహా మేరకు ఏర్పాటు చేశారు.
#1974 వరకు ఇందులో 16 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు.
# ఆ తర్వాత సభ్యుల సంఖ్య 22కు పెంచారు.
#ఇందులో 15 మంది లోక్‌సభ నుంచి, ఏడుగురు రాజ్యసభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికవుతారు.
#కమిటీ చైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు.
#ప్రస్తుతం సంతోష్ గాంగ్వార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
విధులు
# ప్రభుత్వరంగ సంస్థల నివేదికలను, ఖాతాలను పరిశీలించడం
# ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించడం
#సంస్థలు తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయా లేదా సమీక్షించడం
# ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి ఇతర విధులను నిర్ణయించడం
క్యాబినెట్ సచివాలయం
# పార్లమెంటరీ వ్యవస్థలో క్యాబినెట్ కీలక పాత్రను పోషిస్తుంది. అన్ని ముఖ్య నిర్ణయాలు క్యాబినెట్ తీసుకుంటుంది. దీనికి అవసరమైన పరిపాలనా సహాయాన్ని క్యాబినెట్ సచివాలయం అందిస్తుంది. ఇది ప్రధాన మంత్రి నేతృత్వంలో స్టాఫ్ ఏజెన్సీగా పనిచేస్తుంది. విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. 1947లో క్యాబినెట్ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి డిపార్ట్మెంట్ హోదా ఉంది.
నిర్మాణం
# క్యాబినెట్ సచివాలయంలో మూ విభాగాలు ఉంటాయి. అవి.. 1. సివిల్ వింగ్, 2. మిలిటరీ వింగ్, 3. ఇంటెలిజెన్స్ వింగ్
# ఈ మూ విభాగాలకు సహాయంగా మరిన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తాయి.
# రిసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW)
#డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ
#స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్
# జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ
#నేషనల్ అథారిటీ ఆన్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్స్
# డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్
విధులు
# 1961లో క్యాబినెట్ సచివాలయ విధుల కేటాయింపు వ్యవహార నియమాలను రూపొందించారు. దాని ప్రకారం విధులు కింది విధంగా ఉన్నాయి.
#క్యాబినెట్ సమావేశాల ఎజెండాను తయారు చేస్తుంది. క్యాబినెట్ సమావేశాలకు సెక్రటేరియట్ సహాయాన్ని అందిస్తుంది.
#రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇతర కేంద్ర మంత్రులకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలియజేస్తుంది.
# కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధిస్తుంది. మంత్రులకు శాఖల కేటాయింపు, వారి రాజీనామాలు మొదలైన పనులను పర్యవేక్షిస్తుంది.
# వివిధ మంత్రిత్వ శాఖలకు సమాచారాన్ని చేరవేస్తుంది.
# క్యాబినెట్ సచివాలయానికి క్యాబినెట్ సెక్రటరీ పరిపాలనా అధికారిగా ఉంటారు.
కార్యదర్శి
#క్యాబినెట్ సచివాలయానికి పరిపాలనా అధిపతిగా క్యాబినెట్ కార్యదర్శి వ్యవహరిస్తా. ఈ పదవిని 1950లో ఏర్పాటు చేశారు. సివిల్ సర్వీస్ అధికారుల అవగాహనలో ఇది అత్యున్నత పదవి.
#కేంద్ర పరిపాలనకు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
#కేంద్ర సచివాలయంలో ముఖ్య అధికారుల ఎంపిక బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
#రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల వార్షిక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
#ప్రధాన మంత్రికి ముఖ్య సలహాదారుఢఙగా పనిచేస్తారు.
#దేశంలోని సివిల్ సర్వెంట్లకు మార్గదర్శిగా ఉంటారు.
# ప్రధాన మంత్రికి కళ్లు, చెవులుగా పనిచేస్తారు.
ప్రధాన మంత్రి కార్యాలయం
#ప్రభుత్వాధిపతిగా ప్రధాన మంత్రి కార్య నిర్వాహక అధికారాల్లో కీలక పాత్ర వహిస్తారు. తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రధాన మంత్రికి సహాయపడటానికి ప్రధాన మంత్రి కార్యాలయం లేదా సచివాలయం ఏర్పాటు చేశారు. ఇది స్టాఫ్ ఏజెన్సీ. అంతేకాదు రాజ్యాంగేతర సంస్థ. దీనికి డిపార్ట్మెంట్ హోదా ఉంది. దీనిని 1947లో ఏర్పాటు చేశారు. అప్పటి గవర్నర్ జనరల్ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో ఈ కార్యాలయం పనిచేసేది. 1977 నుంచి దీనిని మంత్రి సచివాలయంగా పిలుస్తున్నారు. ప్రధాన మంత్రి దీనికి అధిపతిగా ఉంటారు. పరిపాలన పరంగా ప్రిన్సిపల్ కార్యదర్శి ఉంటారు. ఒకరు లేదా ఇద్దరు అదనపు కార్యదర్శులు, మూ లేదా ఐదుమంది సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, సహాయ కార్యదర్శులు, ఇతర సిబ్బంది ఉంటారు.
విధులు
# ప్రధాన మంత్రికి అవసరమైన సెక్రటేరియల్ సర్వీసులు అందిస్తుంది.
# ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయాన్ని చేకూరుస్తుంది.
#ప్రధాన మంత్రికి థింక్ ట్యాంక్ లేదా ్యహకర్తగా వ్యవహరిస్తుంది.
#ఇతర శాఖలకు కేటాయించని అంశాలను పర్యవేక్షిస్తుంది. అందుకే దీనిని అవశిష్టదత్త సంస్థగా పేర్కొంటారు.
#ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన మంత్రి కార్యాలయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార కేంద్రంగా పరిణమించింది. అందుకే దీనిని ‘సూపర్ క్యాబినెట్ లేదా మైక్రో క్యాబినెట్, సూపర్ మినిస్టీ, సూపర్ సెక్రటేరియట్ అలాగే ప్రభుత్వం పైన ప్రభుత్వంగా అభివర్ణిస్తారు.
ఎన్బీ చారి
ఎంఏ (పీహెచ్డీ)
పోటీ పరీక్షల నిపుణులు
9063131999
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?