దేశంలో నదీవ్యవస్థ.. తెలంగాణలో నీటిపారుదల
జీవనదీ వ్యవస్థ
-నిరంతరం నీరు ప్రవహించే నదులను జీవనదులు అంటారు. ఇవి నౌకాయానానికి అనుకూలమైనవి కావు.
-జీవనదుల్లో పురాతన నది – బ్రహ్మపుత్ర
వర్షాధార నదీవ్యవస్థ
-వీటిని ద్వీపకల్ప నదులని కూడా అంటారు.
-వర్షాలు వచ్చినపుడు ప్రవహించే నదులే ఇవి.
-ఇవి ఇండియాలో పురాతన నదులు.
అంతర్ భూభాగ నదీ వ్యవస్థ
-భూమి అంతర్భాగంలో జన్మించి, ఇసుక, ఎడారి ప్రాంతాల్లో అంతమయ్యే నదులను అంతర్భూభాగ నదీవ్యవస్థ అంటారు.
తెలంగాణలో ప్రవహించే నదులు
గోదావరి
-ద్వీపకల్ప నదుల్లో ఇది అతిపెద్ద నది.
-గోదావరి నదిని దక్షిణగంగ, వృద్ధగంగ, భారతదేశపు రైన్ నది అని కూడా పిలుస్తారు.
-ఈ నది జన్మస్థలం – మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకం అనే ప్రాంతం. దీని పొడవు – 1465 కి.మీ.
-ఈ నది తెలంగాణలోకి ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద ప్రవేశించి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం మీదుగా ఆంధ్రవూపదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
-ఈ నది ఉపనదులు – ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్థా, పెన్‌గంగ, వెయిన్‌గంగ.
-ఈ నది ముఖ్యపట్టణం తెలంగాణలోని భద్రాచలం.
-గోదావరి నది ఒడ్డునగల నగరం – బాసర.
-గోదావరి నదిపై తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు – కరీంనగర్లో ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, వరంగల్‌లో దేవాదుల ఎత్తిపోతల పథకం, పీవీ నర్సింహారావు పథకం, ఖమ్మంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు.
కృష్ణానది
-తెలంగాణలో రెండో అతిపొడవైన నది.
-అత్యధిక నీటి ప్రవాహం గల నది.
-ఇది పశ్చిమ కనుమల్లోని మహాబళేశ్వర్ వద్ద జన్మించింది.
-ఈ నది తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్ల్లో ప్రవహిస్తుంది.
-కృష్ణా నది రాష్ట్రంలోకి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలంలోని తంగడి గ్రామం వద్ద ప్రవేశిస్తుంది.
-ఈ నది మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల గుండా ప్రయాణించి ఆంధ్రవూపదేశ్‌లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-ఉపనదులు : డిండి, కొయినా, ఘటవూపభ, మలవూపభ, దూద్గంగ, భీమ, తుంగభద్ర, మున్నేరు, మూసీ.
-కృష్ణానది ఉపనదుల్లో తుంగభద్ర పెద్దది.
-కృష్ణానదిపై తెలంగాణలోగల ప్రాజెక్టులు – మహబూబ్‌నగర్‌లో జూరాల/వూపియదర్శిని ప్రాజెక్టు, నల్లగొండలో – నాగార్జునసాగర్ ప్రాజెక్టు.
తుంగభద్ర నది
-తుంగభద్ర నది కృష్ణా ఉపనదుల్లో ఒకటి.
-ఈ నది కర్ణాటకలోని వరాహ కొండల్లో జన్మిస్తుంది.
-ఈ నది తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక.
-ఈ నదిపై తెలంగాణలో ఆలంపూర్ పుణ్యక్షేత్రం ఉంది.
-తెలంగాణ-కర్ణాటకల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ తుంగభవూద.
-తుంగభద్ర నది ఉపనదులు – డిండి, మూసీ, భీమ, కొయినా, మున్నేరు.
డిండి నది
-ఈ నదిని మీనాంబరం అని కూడా పిలుస్తారు. ఇది మహబూబ్‌నగర్‌లోని షాబాద్ గుట్టల్లో జన్మించి దేవరకొండ (నల్లగొండ జిల్లా) ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు 153 కి.మీ.
మూసీ నది
-ఇది రంగాడ్డి జిల్లా శివాడ్డిపేట వద్ద అనంతగిరి కొండల్లో జన్మించి, హైదరాబాద్ గుండా ప్రవహించి నల్లగొండ జిల్లాలో వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనికి మరోపేరు ముచుకుంద.
-ఈ నదిపై హైదరాబాద్‌కు పశ్చిమాన ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్ ఉంది.
ప్రాణహిత నది
-ఇది మధ్యవూపదేశ్‌లోని సాత్పూరా పర్వతాల్లో పుట్టి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల గుండా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు వద్ద గోదావరిలో కలుస్తుంది.
-ఈ నది పెన్‌గంగా, వెయిన్‌గంగా, వార్ధా నదుల కలయికవల్ల ఏర్పడుతుంది.
-దీనిపై ప్రాణహిత-చే ఎత్తిపోతల పథకం ఉంది.
మంజీరా నది
-ఇది మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లో పుట్టి మెదక్ జిల్లాలో ప్రవేశిస్తుంది. నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరిలో కలుస్తుంది. దీని పొడవు 644 కి.మీ.
-ఈ నదిపై సింగూరు (మెదక్), నిజాంసాగర్ (నిజామాబాద్) ప్రాజెక్టులు ఉన్నాయి.
పాలేరు నది
-ఇది వరంగల్ జిల్లా దక్షిణ భాగంలో పుట్టి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రయాణించి ఆంధ్రవూపదేశ్‌లో ప్రవేశించి కృష్ణానదిలో కలుస్తుంది. దీనిపొడవు 145 కి.మీ.
మున్నేరు నది
-ఇది కృష్ణానది ఉపనది.
-వరంగల్ జిల్లా పాకాల చెరువు నుంచి బయల్దేరి కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు 198 కి.మీ.
నీటిపారుదల సౌకర్యాలు
-వర్షపాతం ద్వారా కాకుండా ఇతర కృత్రిమ పద్ధతుల ద్వారా పంటలకు నీటి సరఫరా చేయడాన్ని ‘నీటిపారుదల’ అంటారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో నీటిపారుదల కింద ఎక్కువ భూమి సాగవుతుంది. నీటిపారుదల సౌకర్యాలను మూడు వర్గాలుగా విభజించారు. అవి..
బావులు
-బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల గల రాష్ట్రాలు ఉత్తరవూపదేశ్, పంజాబ్, బీహార్, రాజస్థాన్.
-రాష్ట్రంలో దాదాపు 23 లక్షల ఎకరాలు బావుల ద్వారా సాగవుతుంది.
కాలువలు
-కాలువల ద్వారా అత్యధికంగా నీటిపారుదలగల రాష్ట్రాలు- తెలంగాణ, ఉత్తరవూపదేశ్, రాజస్థాన్, హర్యానా.
-రాష్ట్రంలో కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న జిల్లాలు- కరీంనగర్, వరంగల్, ఖమ్మం
-రాష్ట్రంలో మొత్తం 4.7 లక్షల హెక్టార్లు కాలువల ద్వారా సాగవుతున్నది.
చెరువులు
-రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగవుతున్న భూమి 2.83 లక్షల హెక్టార్లు. అత్యధికంగా సాగవుతున్న జిల్లా వరంగల్.
-అత్యధికంగా చెరువుల ద్వారా నీటిపారుదల అవుతున్న రాష్ట్రాలు- ఆంధ్రవూపదేశ్, తమిళనాడు, కర్ణాటక, యూపీ.
నాగార్జునసాగర్
-ఇది రాష్ట్రంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు. అత్యంత ఎత్తయిన రాతికట్ట, తాపి ఆనకట్ట.
-ఈ ప్రాజెక్టుకు 1955, డిసెంబర్ 10న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం 1963లో పూర్తయ్యింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ‘మ్యాన్‌మేడ్’ రిజర్వాయర్.
-ఇది నల్లగొండ జిల్లాలోని నందికొండ వద్ద కృష్ణా నదిపై ఉంది.
-దీని ఎడమ కాలువ పేరు లాల్‌బహదూర్ శాస్త్రి కాలువ, దీనిపొడవు 210 కి.మీ. కుడి కాలువ జవహర్లాల్ నెహ్రూ కాలువ. దీని పొడవు 310 కి.మీ.
-ఈ ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజినీర్ మీర్ జాఫర్ అలీ.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
-ఈ ప్రాజెక్టు 1963, జూలై 26న ప్రారంభమైంది. దీనిని నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు.
-దీని వల్ల నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు ప్రయోజనం పొందుతున్నాయి. దాదాపు 3.97 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరందుతుంది.
-ప్రాజెక్టుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ అని మూడు కాలువలు ఉన్నాయి. అయితే ప్రధానమైనది మాత్రం కాకతీయ కాలువ.
-ఇది కొన్ని జాతీయ ప్రాజెక్టులకు నీరందిస్తున్నది. దీని పూర్వనామం పోచంపాడు ప్రాజెక్టు.
-గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ అయిన దీన్ని మాజీ ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. దీని గరిష్ట ఎత్తు 1,091 అడుగులు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
-ఇది మహబూబ్‌నగర్‌లో ప్రముఖమైనది. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు.
-ఈ ప్రాజెక్టును గద్వాలకు 16 కి.మీ. దూరంలో ఉన్న ధరూర్ మండలంలోని రేవులపల్లి దగ్గర నిర్మించారు.
-ఇది సుమారు 20 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరందిస్తుంది. రెండు ప్రధాన కాలువులు ఉన్నాయి. అవి సోమనాద్రి కాలువ (కుడి), ఎన్టీఆర్ కాలువ (ఎడమ).
నెట్టెంపాడు
-ఇది మహబూబ్‌నగర్‌లో కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం.
-ఈ ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ మీద ఆధారపడి ఉంటుంది.
కోయిల్‌సాగర్
-ఈ ప్రాజెక్టును మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవహించే పెద్దవాగుపై దేవరకద్ర మండలంలోని బొల్లార గ్రామం వద్ద 1945లో నిర్మించారు.
-దీనివల్ల 12 వేల ఎకరాల సాగు భూమికి నీరు అందుతుంది. దీని నీటి సామర్ధం 2,276 టీఎంసీలు.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)
-మహబూనగర్ జిల్లాలో ఉంది.
-ఈ ప్రాజెక్టును తుంగభద్ర నదిపై కర్ణాకటలోని రాయచూర్ జిల్లాలో నిర్మించారు. దీని ద్వారా రాష్ట్రంలోని గద్వాల, ఆలంపూర్ ప్రాంతాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
సరళాసాగర్ ప్రాజెక్టు
-మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలంలో ఉంది.
-దీన్ని సైఫోన్స్ (Siphons) టెక్నాలజీతో నిర్మించారు. ఈ టెక్నాలజీతో నిర్మించిన పెద్ద ప్రాజెక్టుల్లో ఆసియాలోనే ఈ ప్రాజెక్టు మొదటిది, ప్రపంచంలో రెండోది.
-ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు సాగు నీటినే కాకుండా తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
నిజాంసాగర్ ప్రాజెక్ట్
-గోదావరి ఉపనది అయిన మంజీరా నదిపై నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ మండలం అచ్చంపేట వద్ద నిర్మించారు.
-ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆయకట్టు 2,31,339 ఎకరాలు. దీన్ని 1923లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు.
మాధవరెడ్డి ప్రాజెక్టు
-ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్న నల్లగొండ జిల్లా కోసం ఈ ప్రాజెక్టును 1983లో ప్రారంభించారు.
-దీన్ని ఎస్ఎల్బీసీ అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టు లక్షం 2,70,000 ఎకరాలకు సాగునీరు అందించడం.
దేవాదుల ప్రాజెక్టు
-ఈ ప్రాజెక్టును వరంగల్ జిల్లాలోని కరువు ప్రాంతాల్లో సాగునీరందించేందుకు గోదావరి నదిపై రూపొందించారు.
-దీన్ని వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం దేవాదుల, గంగారం గ్రామాల వద్ద నిర్మిస్తున్నారు.
-238 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లనున్న ఈ ప్రాజెక్టు దేశంలో మొదటిది.
ప్రాజెక్టులు పాత పేరు – కొత్త పేరు
-దుమ్ముగూడెం ప్రాజెక్టు – మహాత్మా జ్యోతిరావ్‌ఫూలే
-ప్రాణహిత-చే – బీఆర్ అంబేద్కర్ చేవెళ్ల సుజల స్రవంతి
-హైదరాబాద్-గోదావరి – మౌలానా అబుల్‌కలాం సుజల మంచినీటి సరఫరా పథకం
-కంతానపల్లి ఎత్తిపోతల పథకం – పీవీ నరసింహారావు ప్రాజెక్టు
రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు
-స్వర్ణ ప్రాజెక్టు – ఆదిలాబాద్‌లోని జౌలి వద్ద నిర్మిస్తున్నారు
-ఊచికట్ట వాగు పథకం – మహబూబ్‌నగర్ జిల్లా
-వెంగళరావు లిఫ్ట్ ఇరిగేషన్ – మహబూబ్‌నగర్ జిల్లా
-మల్లూరువాగు ప్రాజెక్టు – వరంగల్ జిల్లా
-ఎగువ కౌలాసనాలా ప్రాజెక్టు – నిజామాబాద్ జిల్లా
-వట్టివాగు ప్రాజెక్టు – ఆదిలాబాద్ జిల్లా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు