ఎవరి కాలాన్ని ఎరా ఆఫ్ రిజర్వాయర్స్ అంటారు?

1.జతపర్చండి.
ప్రాజెక్ట్ – మరోపేరు
ఎ. దేవాదుల 1. చొక్కారావు
బి. పీవీ నర్సింహారావు సుజల స్రవంతి 2. కంతానపల్లి
సి. అంబేద్కర్ 3. ప్రాణహిత
డి. ఎల్లంపల్లి 4. శ్రీపాదరావు
ఎ బి సి డి
1) 1 2 4 3
2) 1 3 2 4
3) 1 2 3 4
4) 3 4 2 1
2.కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సామర్థ్యం-330 టీఎంసీలు
బి) నాటి ప్రభుత్వాలు కేటాయించిన మొత్తం-145 టీఎంసీలు
సి) వాస్తవానికి వినియోగించుకొన్న మొత్తం-90 టీఎంసీలు
1) ఎ,బి 2) బి,సి 3) ఎ,సి 4) పైవన్నీ సరైనవే
3.నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 10-12-1955 2) 10-12-1956
3) 10-12-1954 4) 4-5-1956
4.ఎక్కువ రాష్ర్టాలతో సరిహద్దులను కలిగి ఉన్న జిల్లాలు?
ఎ) ఖమ్మం బి) నల్లగొండ
సి) నిజామాబాద్ డి) మహబూబ్‌నగర్
1) ఎ,సి,డి 2) ఎ,సి 3) ఎ,డి 4) పైవన్నీ
5.కిందివాటిలో 610 జీఓలోని అంశాలను గుర్తించండి?
ఎ) బోగస్ సర్టిఫికెట్లతో తెలంగాణ ప్రాంతపు ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజీల్లో పేరు నమోదు చేసి అక్రమంగా ఉద్యోగాలను సంపాదించిన స్థానికేతరులపై చర్యలు తీసుకోవాలి
బి) అక్రమ నియామకాలు, ప్రమోషన్లకు వ్యతిరేకంగా తెలంగాణ అభ్యర్థులు చేసుకొన్న అప్పీళ్లన్నింటినీ 1986, మార్చి 31లోగా పరిష్కరించాలి
సి) ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలు, ప్రమోషన్లను పునఃపరిశీలించాలి. ఈ పనిని రాష్ట్ర సచివాలయంలోని విభాగాలు 1986, జూన్ 30లోగా పూర్తి చేయాలి
డి) 610 జీఓను 30-10-1985న జారీ చేయాలి
1) అన్నీ సరైనవే 2) బి, సి, డి
3) ఎ, సి, 4) ఎ, బి, సి
6.బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోని అంశాలను గుర్తించండి.
ఎ) ఈ ట్రిబ్యునల్ గోదావరి జలాలకు సంబంధించింది
బి) ఆంధ్రప్రదేశ్ 913 టీఎంసీలు, కర్ణాటక 1000 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీల నికర జలాలను కేటాయించింది
సి) ఈ ట్రిబ్యునల్ 2580 టీఎంసీల నీటినిల్వల ఆధారంగా జలాలను పంపిణీ చేసింది
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, సి
7.జూరాల ప్రాజెక్ట్‌కు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ) జూరాల ప్రాజెక్ట్ ఆరంభంలో 18 టీఎంసీల నీటిని కేటాయించారు. అనంతరం 12 టీఎంసీలకు తగ్గించారు
బి) 4 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని నిర్దేశించగా ప్రస్తుతం లక్ష ఎకరాలకు నీటిని అందిస్తున్నారు
సి) జూరాల ప్రాజెక్ట్‌ను మెదక్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు
డి) జూరాల ఎడమ కాలువ పేరు నల్లసోమాద్రి, కుడి కాలువ పేరు ఎన్టీఆర్ కాలువ
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఏదీకాదు
8.కింద పేర్కొన్న వాటిని కాలక్రమంలో అమర్చండి.
ఎ) రాష్ట్రపతి ఉత్తర్వులు బి) 8 సూత్రాల పథకం
సి) జీవో 674 డి) ఆరు సూత్రాల పథకం
ఇ) జీవో 610
1) బి, సి, డి, ఎ, ఇ 2) బి, సి, ఎ, డి, ఇ
3) బి, డి, ఎ, సి, ఇ 4) ఎ, బి, సి, డి, ఇ
9.రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ) తెలంగాణలో స్థానికేతరులపై జరుగుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ ఉత్తర్వులు తీసుకొచ్చారు
బి) జీవో నం. 674 ప్రకారం జోనల్ సిస్టం తీసుకొచ్చారు
సి) జిల్లాస్థాయి పోస్టులకు 80 శాతం, జోనల్ స్థాయి పోస్టుల్లో 70 శాతం, నాన్ గెజిటెడ్ పోస్టుల్లో 60 శాతం స్థానికంగా వర్తిస్తాయి
1) ఎ, సి 2) ఎ, బి, సి 3) ఎ, బి 4) బి, సి
10.ఎవరి కాలాన్ని ఎరా ఆఫ్ రిజర్వాయర్స్‌గా అభివర్ణిస్తారు?
1) అలీ నవాబ్‌జంగ్ 2) విశ్వేశ్వరయ్య
3) వెల్లోడి 4) చౌదరి
11.ఏ రోజును తెలంగాణ ఇంజనీర్స్‌డేగా ప్రభుత్వం నిర్వహిస్తుంది?
1) జూలై 11 2) జూన్ 11 3) జూన్ 12 4) మే 11
12.గోదావరి నదీజలాలతో వ్యవసాయాన్ని, విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసి తెలంగాణను అభివృద్ధి చేసే ప్రణాళికను 1944లో నిజాం ప్రభుత్వానికి సమర్పించిన కమిటీ ఏది?
1) బట్లర్ కమిటీ 2) స్లాటర్ కమిటీ 3) వెల్లోడి 4) చౌదరి
13.పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఎన్నేండ్ల ఆధారంగా స్థానికత నిర్ణయించాలని తీర్మానించారు?
1) 12 2) 11 3) 4 4) 9
జవాబులు
1-3, 2-4, 3-1, 4-3, 5-4, 6-3, 7-1, 8-3, 9-2, 10-2, 11-1, 12-2, 13-1
RELATED ARTICLES
-
Respiratory System – Gurukula JL special | పదార్థాల విచ్ఛిన్నం.. శక్తి ఉత్పన్నం.. ఉష్ణమోచకం
-
Geography | అత్యధిక వేలా పరిమితి ఎక్కడ నమోదవుతుంది?
-
Telangana History | తూముల యుద్ధం ఏయే రాజుల మధ్య జరిగింది?
-
INDIAN POLITY | ప్రకరణల ప్రకారం.. పరిపాలన విధానం
-
General Science | ఒక పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం?
-
Disaster Management | మనకు మాత్రమే కాదు.. భావి తరాలకు సొంతమే
Latest Updates
Child Rights UNCRC | బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
TSPSC Group-1 Prelims Practice Test | భారతదేశంలో అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
TSPSC Group-1 Prelims Practice Test | తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథ కర్త?
SBI Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు
ITBP Recruitment | ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
WCDSC Kamareddy Recruitment | కామారెడ్డి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
WCDSC Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
Current Affairs | ప్రపంచంలో ‘హంగర్ హాట్‌స్పాట్స్’ ఎన్ని ఉన్నాయి?
South Central Railway Recruitment | సౌత్ సెంట్రల్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
NIT Faculty Recruitment | మేఘాలయా నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు