పాశ్చాత్యీకరణలో పరుగులు – ఆర్థిక సంస్కరణల పర్యవసానాలు
సామాజిక పరివర్తన-Nort South Divide
వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, మూడో ప్రపంచ దేశాలు అనే భావన తగ్గిపోయి ప్రపంచం నార్త్, సౌత్‌గా విడిపోయింది.
పారిశ్రామిక దేశాలన్నీ నార్త్ దేశాలుగా, వెనుకబడిన దేశాలన్నీ సౌత్ దేశాలుగా మారాయి. అయితే కొన్ని ఏషియన్ టైగర్స్‌గా దూసుకెళ్లడం వల్ల ఈఎంఈ (ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకానమీ)గా పిలువబడుతున్నాయి.
ఈ దేశాలు సాంఘికవృద్ధి కంటే ఆర్థికవృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, Jobless Growthను ప్రోత్సహించడం వల్ల వ్యతిరేక సామాజిక మార్పు వస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
హైపర్ గ్లోబలైజర్స్ (Hyper Globalisers)
ప్రపంచీకరణ రెండు రకాల మార్పులను కలిగి ఉంటుంది.
ధనాత్మకంగా చూస్తే లేని వస్తువులను పొందవచ్చు. మిగులు శ్రామికులను ఇతర దేశాలకు పంపవచ్చు.
సులభమైన ఎగ్జిమ్ విధానం వల్ల అభివృద్ధి సత్వరంగా మార్చవచ్చు. కానీ ప్రపంచీకరణ అధికంగా జరిగితే చైనా వస్తువులు పూర్తిగా డంపిగ్ అయి స్వదేశీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయి నిరుద్యోగం పెరుగుతుంది.
అదేవిధంగా టీఎన్సీ (టర్మ్స్ నేషనల్ కంపెనీస్) ప్రభావం పెరిగి ప్రభుత్వాలనే తమ చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉంది. దీంతో దేశంలో వ్యతిరేక సామాజిక పరివర్తన ఏర్పడవచ్చు.
ఇంటర్ రీజనైలేజషన్, ఇంటర్నేషనల్
ప్రపంచీకరణ వల్ల అభివృద్ధి చెందిన దేశాల మధ్య 80 శాతం వ్యాపారం జరుగుతున్నది. ముఖ్యంగా ఈయూ, ఎన్ఏఎఫ్టీఏ, జపాన్. దీన్నే Inter nationalisation అంటారు.
దీనివల్ల అభివృద్ధి చెందిన దేశాలే మరింత అభివృద్ధి చెంది వెనుకబడిన దేశాలు వ్యతిరేక సామాజిక పరివర్తనకు లోనవుతున్నాయి. అంటే గ్లోబలైజేషన్ కాస్తా ఇంటర్నేషనలైజేషన్ అవుతున్నాయి.
అదేవిధంగా సంస్కరణల వల్ల దేశంలోని కొన్ని రాష్ర్టాల మధ్య వాణిజ్యం చోటుచేసుకోవడం వల్ల అభివృద్ధి చెందిన రాష్ర్టాలే ఇంకా అభివృద్ధికి నోచుకుంటున్నాయి. దీన్నే Inter regionalisation అంటారు.
జాతీయ ఆదాయంలో ప్రపంచంలో భారతదేశం 7వ స్థానంలో, మానవ అభివృద్ధిలో 130వ స్థానంలో ఉంది.
స్త్రీ విద్య
సాక్షర భారత్ పథకం తర్వాత దేశంలో స్త్రీ అక్షరాస్యత వృద్ధి రేటు పురుష అక్షరాస్యత వృద్ధిని మించింది.
అందువల్ల స్త్రీ ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, ఉన్నత విద్య, వయోజన విద్యకు ప్రాధాన్యత ఇస్తే సాంఘిక పరివర్తన ఒక ధనాత్మకతను కలిగి ఉంటుంది.
స్థూల సాగుభూమి
దేశంలో స్థూల సాగుభూమి పెంచేందుకు పెద్ద మొత్తంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం, దాంతో మిలియన్ల ప్రజలు స్థానచలనానికి గురవ్వడం జరిగింది.
అందువల్ల స్థాన భ్రంశం పొందిన ప్రజలు పేదరికానికి గురవ్వడం, వ్యతిరేక సామాజిక మార్పుతో ఉన్నారు.
2013లో వచ్చిన ఎల్ఏఆర్ఆర్ కొంత వరకు న్యాయం చేస్తుంది.
ఇంటర్నెట్
దేశంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరుగుతున్నకొద్ది సమాజంలో మార్పులు తొందరగా చోటుచేసుకుంటాయి.
ప్రపంచ ఇంటర్నెట్ ఉపయోగస్తుల్లో మన దేశానికి చెందినవారు సుమారు 8.33 శాతం ఉండగా, దేశంలో 19.19 శాతం వ్యక్తులు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు.
గ్రామ జనాభా
దేశంలో 1951లో గ్రామ జనాభా 82.7 శాతం ఉండేది. అది 2011 నాటికి 69 శాతానికి పడిపోయింది. అంటే అభివృద్ధి జరుగుతున్నకొద్ది పట్టణీకరణ పెరుగుతున్నది.
కానీ గమన శీలత దేశంలో ఎక్కువగా పుల్ ఫ్యాక్టర్ కాకుండా పుష్ ఫ్యాక్టర్ ద్వారా జరుగుతుంది.
స్త్రీ పురుష నిష్పత్తి
ఆర్థిక అభివృవద్ధి జరగుతున్న కొద్ది సాంఘిక మార్పు అనుకూలంగా ఉంటుందని ఆర్థిక సూత్రాలు పేర్కొంటున్నాయి. కానీ దేశంలో దీనికి వ్యతిరేకంగా ఉంది.
1951-1991 మధ్యలో స్త్రీ పురుష నిష్పత్తి తగ్గిపోయింది. అయితే ఇది 2001 నుంచి పెరుగుతూవస్తున్నది.
2001లో 933 నమోదవగా, 2011లో 943కి పెరిగింది. కానీ పిల్లల (సీఎస్ఆర్) నిష్పత్తి 916 నమోదయ్యింది.
సంస్కరణల తర్వాత
దేశంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు పేదరిక నిర్మూలనపై కేంద్రీకరణ చేయకుండా వృద్ధిపై కేంద్రీకరణ చేయడం వల్ల సాంఘికంగా ఆశించిన మార్పు లేదు.
ఆర్థిక మార్పులకే ఆర్థిక ప్రాధాన్యత ఇవ్వడం, సాంఘిక మార్పులను పట్టించుకోకపోవడం జరిగింది.
సంస్కరణలు గాంధీయ సిద్ధాంతానికి దూరంగా ఉండటంతో సమాజంలో కొంత నిరసన, అసహనం పెరిగింది.
సంస్కరణల వల్ల ఉపాధిలేని వృద్ధి పెరిగిపోవడం, మార్క్స్ పేర్కొన్న Industrial Reserved Army ప్రత్యక్షమయ్యింది.
నిరుద్యోగం, ఉత్పత్తి పెరుగుదల పక్కపక్కనే ఉన్నాయి.
దేశంలో 100 శాతం జీడీపీలో 31 శాతంగా ఉన్న పట్టణ వాసులు 65 శాతం జీడీపీని అందిస్తున్నారు.
అందువల్ల గ్రామీణ ప్రజలు వలసకు గురవుతున్నారు.
ప్రపంచీకరణలో భాగంగా దేశంలో కొన్ని వృత్తులకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోతున్నది. విదేశాల నుంచి వృథా పేపర్ దిగుమతుల వల్ల చెత్తను ఏరుకునేవారు జీవనం కోల్పోతున్నారు. చైనా నుంచి తక్కువ ధరకు దారం దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో స్పిన్నింగ్ వ్యవస్థకు ఆధరణ కరువవుతుంది.
ఆధునికతతో వినియోగంలో మార్పు వస్తుంది. ప్లాస్టిక్, డిటర్జంట్స్, మైనింగ్, పొల్యూషన్ మొదలైన కార్యకలాపాలు సాంఘిక వ్యవస్థలో ఎంతో మార్పును సృష్టిస్తున్నాయి.
ఆధునికతతో వచ్చిన ఐసీఆర్ (ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ రెవల్యూషన్)ను ఉపయోగించుకున్న వారు ఎక్కువగా అభివృద్ధి చెందడం, దానికి దూరంగా ఉన్నవారు పూర్తిగా వెనుకబడి పోవడం వల్ల డిజిటల్ డివైడ్‌కు దారితీస్తుంది.
పాశ్చాత్యీకరణ (Westernisation)
ప్రపంచీకరణలో భాగంగా ప్రజలు కొంతవరకు పాశ్చాత్య సంస్కృతిని పొందుతున్నారు.
ఉద్యోగులుగా వెళ్లి, ఉత్పత్తిదారులుగా తిరిగి వస్తున్నారు. ఈ విధంగా జరగడం వల్ల ప్రపంచ సంస్కృతిని భారత్ పొందుతున్నది.
సమాజంలో పనికిరాని కొన్ని కట్టుబాట్లు కొంతవరకు దూరమై అభివృద్ధివైపు వెళ్లడం, ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న కుటుంబాలు ఏర్పడటం వల్ల సామాజిక మార్పులు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల వల్ల అభివృద్ధి జరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో స్వార్థం పెరిగి సహకారం తగ్గి అవసరమైన కొన్ని సాంఘిక అంశాలు దూరమవుతున్నాయి.
కాబట్టి పాశ్చాత్యీకరణలో ఉన్న మంచిని మాత్రమే గ్రహించాలి.
ధనిక పేద మధ్య భేదం పెరిగిపోయి వర్గ సంఘర్షణ ధోరణులు పెరిగి హింసకు దారితీస్తుంది.
సంస్కరణల ఫలాలను గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ర్టాలు అధికంగా ఉపయోగించుకున్నాయి. బీహార్, ఒడిశా వంటి రాష్ర్టాలకు సంస్కరణల ఫలాలు అందకపోవడంతో అక్కడి ప్రజలు వలసకు గురవుతున్నారు. దీంతో సంపద ఒకే చోట కేంద్రీకరణ జరగడం వల్ల ప్రాంతీయ అసమానతలు, రాష్ర్టాల మధ్య అంతరాలు పెరిగి సాంఘిక అసంతులనం అధికమయ్యింది.
అభివృద్ధిలో భాగంగా కొంత అసంతులనం పెరిగి పోయింది. స్థాన భ్రంశం, పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, కాలుష్యం, మొదలైన పరిస్థితుల వల్ల సాంఘిక సంబంధాలు వ్యతిరేక దృక్పథాన్ని పెంచాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల ఫలాలను అధికంగా సేవారంగం ఉపయోగించుకుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో White color Jobs ఎక్కువ ప్రాధాన్యతను పొందుతాయి.
ఉత్పాదక రంగంలోని Blue color jobsలో పెద్దగా మార్పు రాలేదు. దీనివల్ల అధికశాతం పనిచేసే వ్యవసాయరంగం వెనుకబడిపోవడం, కొద్ది మంది పనిచేసే సేవారంగం అభివృద్ధి చెందడం జరిగింది.
ఆర్థిక సంస్కరణలు దేశ జీడీపీని పెంచాయి. కానీ సమ్మిళిత వృద్ధిని అధికం చేయలేకపోతున్నాయి.
గ్రామాల నుంచి పట్టణాలకు పుష్ ఫ్యాక్టర్స్ ద్వారా వెళ్లడం ద్వారా పట్టణాల్లో మురికివాడల వ్యవస్థ పెరిగిపోవడం, పట్టణాల్లో పేద, ధనిక వర్గాలు అధికమవ్వడంతో చట్టవ్యతిరేక పనులు, హింస పెరిగిపోతున్నాయి.
మోడ్రనైజేషన్
ఆర్థిక వ్యవస్థ (వస్తు సేవలు)ను యంత్రాల ద్వారా అంటే పారిశ్రామిక విప్లవం, సమాచార సాంకేతిక విప్లవం ద్వారా సాధించడాన్ని ఆధునికత అంటారు. ఈ వ్యవస్థ ద్వారా ఆర్థిక వృద్ధి తప్పకుండా ఉంటుంది. కానీ ఆ అభివృద్ధి ఒక ఆర్థికవృద్ధికే పరిమితం కాకుండా సాంఘికవృద్ధిని కూడా పెంచాలి.
ఆధునికతలో మరో ముఖ్యమైన అంశం పర్యావరణ రక్షణ. పర్యావరణ డిమాండ్ పెరిగి సప్లయ్ తగ్గడం దాంతో ఉద్ఘారాలు పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతున్నది.
సెక్యులరైజేషన్
ఆధునీకరణ, పాశ్చాత్యీకరణ వల్ల కులాలు, మతాలు కొంత ఉనికి కోల్పోతున్నాయి. దీనినే సెక్యులరైజేషన్ అంటారు.
కుల, మత సంస్కృతుల్లో రేషనలైజేషన్ ఉండాలి. అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి.
Parito ప్రకారం వెస్ట్రనైజేషన్, మోడ్రనైజేషన్, సెక్యులరైజేషన్ ఏదైనా కానీ ఒక వర్గం అభివృద్ధి వేరొక వర్గం పతనానికి దారితీయరాదు. అంటే Better off కోసం Worse offను ఆహ్వానించకూడదు.
కాబట్టి కులం, మతం, సంస్కృతి, ఆధునికత, పాశ్చాత్యీకరణ, సెక్యులరైజేషన్ ఏదైనా చివరికి ప్రజల సంక్షేమాన్ని పెంచాలి.
ప్రజాస్వామ్యం
భారతదేశం డెమోక్రసి అనే ఒక మంచి విధానాన్ని ఏర్పాటు చేసుకుంది. దేశంలోని ప్రజలు తమకు కావలసిన వాటిని ఎంచుకోవడంలో, తమ ఇష్టాలకు అనుగుణంగా జీవించడంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. అయితే ఇందులో సమ్మిళితి లోపించి ప్రజాస్వామ్యం కొందరికే పరిమితమై సమాజంలో అసమానతలు పెరిగిపోయాయి.
దేశంలోని కొన్ని రాష్ర్టాలు, ప్రాంతాల్లో, ధనికులు మాత్రమే ప్రజాస్వామ్య ఫలితాలను పొందుతున్నారు.
దేశ మొత్తం జనాభాలో 50 శాతంగా మహిళలు ఉండగా లోక్‌సభలో మాత్రం 12 శాతమే ఉన్నారు. దీంతోపాటు స్త్రీ పురుష అక్షరాస్యత భేదం సుమారు 20 శాతం.
సాంఘిక పరివర్తన-పట్టణీకరణ
దేశంలో గ్రామ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. అదేవిధంగా గ్రామ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడటం, వ్యవసాయం వర్షాలపై ఆధారపడటంతో గమనశీలత గ్రామాల నుంచి పట్టణాలకు జరుగుతుంది.
దీనివల్ల ప్రాంతీయ అసమానతలు, జన సాంద్రత పెరిగిపోవటం, మురికి వాడల జనాభా పెరగటం, ఆహార పదార్థాల కొరత, పట్టణాల్లో అసమానతలు పెరగటం కూడా సాంఘిక పరివర్తనకు దారితీస్తాయి.
అర్బనైజేషన్ విత్ పుల్ ఫ్యాక్టర్ పర్మిటెడ్ అనేది గమనించాలి.
1951లో భారత పట్టణ జనాభా శాతం 17.3 శాతం ఉండగా 2011లో పట్టణ జనాభా శాతం 31 శాతానికి పెరిగింది.
ఆర్థిక సంస్కరణల ప్రభావం
పేదరికం
పేదరికంలో ఉన్నవారు సామాజిక మార్పును ఆస్వాదించలేరు. వీరు వీద్యపై, ఆరోగ్యంపై ఖర్చుచేయలేరు.
తక్కువ పేదరికం ఎక్కువ సామాజిక మార్పును ఆస్వాదిస్తుంది.
ఉన్నతవిద్య
ఉన్నత విద్యను అధికంగా కలిగి ఉన్న దేశంలో సామాజిక పరివర్తన ఎక్కువగా ఉంటుందని ఆర్థికవేత్తల అభిప్రాయం.
భారతదేశంలో ఉన్నత విద్య అక్షరాస్యత 19.4 శాతం ఉండగా అమెరికాలో 95 శాతం ఉన్నది.
అంటే ఉన్నత విద్య కలిగిన వారు వాస్తవ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమాజంలో అనుత్పాదక అంశాలను, వ్యతిరేక అంశాలను పూర్తిగా తీసివేయగలుగుతారు.
విద్యలో ఉన్నత విద్య అనే పరిశోధనను, నాణ్యతగల వస్తువుల ఉత్పత్తిని సమాజంలో ధనాత్మక మార్పులను తీసువస్తుంది.
కాలం విలువ
ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక విప్లవం, శాస్త్ర సాంకేతిక విప్లవం (ఐసీఆర్), వ్యవస్థా పూర్వక మార్పులు (Institutional Changes), అవస్థాపన మార్పులు (Infrastructural Changes), సరళీకరణ, ప్రపంచీకరణ మొదలైన మార్పులు చోటుచేసుకుంటే కాలం విలువ కొన్నిరెట్లు పెరిగి సామాజిక పరివర్తన పూర్తి మార్పులకు గురవుతుంది.
అయితే కోరుకునే సామాజిక మార్పు వ్యక్తి స్వేచ్ఛను హరించి వేయకూడదు. అదేవిధంగా స్త్రీ సాధికారతను దెబ్బతీయకూడదు.
బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాండ్ ఫండ్
అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాండ్ ఫండ్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది.
ఈ కార్యక్రమాన్ని 2007, ఫిబ్రవరి 19న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ అసోం రాష్ట్రంలోని బార్పేటలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమం 27 రాష్ర్టాల్లోని 250 జిల్లాల్లో కొనసాగుతుంది.
232 జిల్లాల్లో రాజ్యాంగంలోని IX-A భాగంలో నిర్దేశించిన పంచాయతీలు, మున్సిపాలిటీలు వస్తాయి. మిగిలిన 18 జిల్లాల్లో ఆరో షెడ్యూల్లోని అటానమస్, ప్రాంతీయ కౌన్సిళ్లు, నాగాలాండ్, మణిపూర్‌లోని కొండ ప్రాంతాలు వస్తాయి.
ప్రతి జిల్లాలో సమస్యలను గుర్తించి పరిష్కరించేదుకు తగు ప్రణాళికలను రూపొందించడం దీని ఉద్దేశం.
ఈ కార్యక్రమానికి 2006-07లో రూ. 19.25 బిలియన్లు కేటాయించారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధితో ప్రాంతీయ అసమానతలు తొలగించి జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించడం, పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేయడం, అభివృద్ధికి కావలసిన నిధుల సేకరణ ఈ కార్యక్రమ లక్ష్యాలు.
పంచాయతీలకు వృత్తి నైపుణ్యం కల్పించడం, ప్రణాళికల తయారీ, అమలు, పర్యవేక్షణ దీని ముఖ్య విధి.
వెనుకబడిన జిల్లాల్లో తాగునీటి వసతులు, ఆరోగ్యం, విద్య, కనెక్టివిటీ, అంగన్వాడీ భవన నిర్మాణాలు, వీధి దీపాల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, పంచాయతీలకు భవనాలు నిర్మించడం, లింక్ రోడ్లు, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం. సామాజిక రంగాలు, విద్యుదీకరణ తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఇది కృషి చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు