భారత్‌ని అర్ధ సమాఖ్యగా వర్ణించినది ఎవరు?
1. శక్తివంతమైన కేంద్రం గల సమాఖ్య వ్యవస్థ స్వరూపాన్ని భారత్ ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించింది?
1) జపాన్ 2) అమెరికా 3) బ్రిటన్ 4) కెనడా
2. గణతంత్ర రాజ్య భావన, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆదర్శాల నుంచి గ్రహించారు?
1) అమెరికా 2) బ్రిటన్ 3) ఫ్రెంచి 4) రష్యా
3. శాంతియుత సహజీవనం, మద్యపాన నిషేధం, అంటరాని తనంపై నిషేధం, గ్రామీణ స్వపరిపాలన సంస్థల బలోపేతం (గ్రామ స్వరాజ్), ఆర్థిక వికేంద్రీకరణ, ప్రజల మధ్య సమానత్వం తదితర సూత్రాలను తెలిపేది ?
1) ప్రజాస్వామ్య సామ్యవాదం 2) లౌకికవాదం
3) గాంధేయవాదం 4) ప్రజాస్వామ్యవాదం
4. ముసాయిదా రాజ్యాంగ కమిటీలో సభ్యులు కానివారు ?
1) సయ్యద్సాదుల్లా 2) డా. కేఎం మున్షీ
3) డీపీ ముఖర్జీ 4) శ్యాంప్రసాద్ ముఖర్జీ
5. రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించిన సరైన అంశాలు ?
ఎ) రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను
తయారు చేసి, ప్రజల్లో విస్తృత చర్చ కోసం
ఫిబ్రవరి 1948లో విడుదల చేసింది.
బి) 7635 సవరణలు ప్రతిపాదించగా 2473
సవరణలు ఆమోదం పొందాయి.
సి) రాజ్యాంగ ముసాయిదా నవంబర్ 14, 1949 నుంచి
నవంబర్ 26, 1949 వరకు నిబంధనల క్రమంలో అతి
సునిశితంగా అధ్యయనం చేశారు.
డి) భారత రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949లో
ఆమోదించింది.
1) డి 2) బి,సి 3) ఎ,సి,డి 4) ఎ,బి,సి,డి
6. దేశాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించిన రాజ్యాంగ నిపుణుడు ?
1) కేసీ వేర్ 2) బీఆర్ అంబేద్కర్
3) సీహెచ్ కామత్ 4) వెల్లోడి
7. ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన సరైన అంశాలను సూచించండి.
ఎ) భారత ఎన్నికల సంఘాన్ని జనవరి 25, 1950లో
వ్యవస్థీకరించారు.
బి) 2010 సంవత్సరంలో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
నిర్వహించారు.
సి) జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న నిర్వహిస్తారు.
డి) ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్-1950
1) ఎ,డి 2) ఎ,బి,డి 3) బి,సి,డి 4) ఎ,బి,సి,డి
8. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న షెడ్యూళ్లు ?
1) 8 2) 9 3) 11 4) 12
9. కింది స్టేట్మెంట్లో సరైనవాటిని తెల్పండి.
ఎ) భారత రాజ్యాంగాన్ని సవరించడానికి ధృడ-అధృడ
పద్ధతులు ఉన్నాయి.
బి) భారత సమాఖ్యలో నూతన రాష్ర్టాల ఏర్పాటు, రాష్ర్టాల
సరిహద్దులు మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన
నియమ నిబంధనలు మొదలైనవి సాధారణ
మెజారిటీతో సవరించవచ్చు. ఇది అధృడ పద్ధతి.
సి) భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, నిర్దేశిక
నియమాలు తదితర అంశాలను పార్లమెంట్లో
మూడింట రెండొంతుల మెజారిటీ (2/3)తో
సవరించవచ్చు. ఇది ధృడ పద్ధతి.
డి) రాజ్యాంగంలో మరికొన్ని అంశాల సవరణకు ఒక
ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంటుంది. దీని ప్రకారం
పార్లమెంట్‌లోని రెండు సభల్లో 2/3 వంతు
మెజారిటీతో పాటు, కనీసం 50 శాతం రాష్ర్టాల శాసన
సభలు సవరణకు ఆమోదించాలి. ఇది చాలా సంక్లిష్టమైన ధృడ పద్ధతి.
1) సి,డి 2) ఎ,సి,డి 3) బి,సి,డి 4) అన్నీ సరైనవే
10. భారత రాజ్యాంగ రచనకు పట్టిన సమయం ?
1) 2 ఏండ్ల 10 నెలల 22 రోజులు
2) 2 ఏండ్ల 11 నెలల 18 రోజులు
3) 2 ఏండ్ల 11 నెలల 22 రోజులు
4) 2 ఏండ్ల 11 నెలల 24 రోజులు
11. రాజకీయ భావజాలంతో సంబంధం లేకుండా కేంద్రంలో – రాష్ర్టాల్లో అధికారం చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.
1) ప్రాథమిక హక్కులు 2) ప్రాథమిక విధులు
3) ఆదేశిక సూత్రాలు 4) పైవన్నీ
12. ఏ అధికరణం ప్రకారం పార్లమెంట్ ఉభయసభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్టినెన్సులను జారీ చేయవచ్చు. ఇటువంటి ఆర్టినెన్సు పార్లమెంట్ జారీచేసిన చట్టంతో సమానమైన అధికారాలాను, ప్రభావాన్ని కలిగి ఉంటాయి ?
1) 121 2) 123 3) 142 4) 143
13. పార్లమెంట్ రెండు సభలతో,రాష్ట్రపతితో ఆమోదించబడే బిల్లు ?
1) ఉపకల్పనా బిల్లు 2) ముసాయిదా బిల్లు
3) చట్టం 4) బడ్జెట్
14. కొన్ని ప్రత్యేక శాఖల అంశాలను పరిశీలించడానికి ఓటింగ్ ద్వారా లేదా నామినేషన్ ద్వారా ప్రతి సంవత్సరం, సంవత్సర సమయం కోసం నియమించబడే సభ్యుల సంఘం ?
1) స్థాయీసంఘం 2) ఉపసంఘం
3) ఉపాధ్యక్షుల జాబితా 4) ఏదీకాదు
15. సుప్రీంకోర్టు జడ్జిలను రాష్ట్రపతి ఏ అధికరణం ద్వారా నియమిస్తారు ?
1) 123 2) 124 3) 124(2) 4) 125
16. ఎవరిని రాజ్యాంగ సంరక్షుడిగా భావిస్తారు?
1) పార్లమెంట్ 2) సుప్రీంకోర్టు
3) రాష్ట్రపతి 4) ప్రధానమంత్రి
17. గవర్నర్ నియామక విషయంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు.
1) అమెరికా 2) రష్యా 3) కెనడా 4) జపాన్
18. ఏ ప్రకరణలో రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో శాసనమండలి ఏర్పా టు లేదా రద్దు ప్రస్థావన ఉంది ?
1) 169 2) 153 3) 167 4) 213
19. గవర్నర్ ఏ ప్రకరణను అనుసరించి సీఎంని నియమిస్తారు ?
1) 161 2) 162 3) 163 4) 164
20. శాసనమండలికి సంబంధించి సరైన అంశాలు గుర్తించండి.
ఎ) శాసనమండలి ప్రస్తుతం ఏడు రాష్ర్టాల్లో ఉంది.
బి) శాసనమండలి సభ్యత్వ సంఖ్య కనీసం 40 లేదా శాసన
సభ్యుల్లో 1/3 వంతు ఉండాలి.
సి) శాసనమండలి శాశ్వత సభ. ప్రతిరెండేండ్లకు ఒకసారి
1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్ర్తా.
డి) ప్రతి సభ్యుడు ఆరేండ్ల పదవీకాలం కలిగి ఉంటాడు.
1) ఎ,సి 2) ఎ,బి,డి 3) ఎ,డి 4) అన్నీ సరైనవే
21. రాజ్యాంగం ఏ భాగంలో 245 – 255 వరకు గల ప్రకరణలు కేంద్ర-రాష్ర్టాల మధ్య శాసన సంబంధాలను స్పష్టంగా పేర్కొన్నవి.
1) 8వ 2) 9వ 3) 10వ 4) 11వ
జవాబులు
1)4, 2)3, 3)3, 4)4, 5)4, 6)1, 7)4, 8)4, 9)4, 10)2, 11)3, 12)2, 13)3, 14) 1, 15)3, 16)2, 17)3, 18)1, 19)4, 20)4, 21)4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు