జపనీయులు పూలను అలంకరించే విధానాన్ని ఏమంటారు..? (TET special)
మొక్కలు – జంతువులు
పరిసరాల్లో మొక్కలు రెండు రకాలు. అవి..
1. అడవి మొక్కలు: ఉదా: గడ్డి, తుమ్మ, మర్రి, వేప, తంగేడు మొదలైనవి.
2. పెరటి మొక్కలు: ఉదా: గులాబి, మామిడి, బెండ, మందార, తోటకూర, నిమ్మ, చిక్కుడు, బంతి మొదలైనవి.
- పరిమాణం ఆధారంగా మొక్కలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి.. గుల్మాలు, పొదలు, వృక్షాలు.
- సన్నటి కాండంతో ఉన్న మిరప, ఆవ వంటి చిన్న మొక్కలను గుల్మాలు అంటారు.
- గులాబి, గన్నేరు, మల్లె వంటి గుబురుగా పెరిగే మొక్కలను పొదలు అంటారు.
- మామిడి, వేప లాంటి పెద్ద చెట్లను వృక్షాలు అంటారు.
- పెరిగే ప్రదేశాల ఆధారంగా మొక్కలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి.. నేలపై పెరిగే
- మొక్కలు, నీటిలో పెరిగే మొక్కలు, ఎడారిలో పెరిగే మొక్కలు.
- నేలపై పెరిగే మొక్కలు: గులాబి, మామిడి, మర్రి, వేప మొదలైనవి.
- నీటిలో పెరిగే మొక్కలు: కలువ, తామర, హైడ్రిల్లా, యుట్రిక్యులేరియా మొదలైనవి.
- ఎడారిలో పెరిగే మొక్కలు: కలబంద, బ్రహ్మజెముడు, నాగజెముడు మొదలైనవి.
జీవితకాలం ఆధారంగా మొక్కలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి.. ఏకవార్షికాలు, ద్వివార్షికాలు, బహువార్షికాలు.
ఏకవార్షికాలు: వరి, గోధుమ, గుమ్మడి, బెండ, బఠాణి, ఆవాలు.
ద్వివార్షికాలు: క్యారెట్, బీట్రూట్, ముల్లంగి.
బహువార్షికాలు: మామిడి, వేప, జామ, చింత, సపోటా, కొబ్బరి, అల్లం, పారిజాతం.
పుష్పాల ఆధారంగా మొక్కలను రెండు రకాలు వర్గీకరించవచ్చు. అవి.. 1. పుష్పించని మొక్కలు (క్రిప్టోగామ్స్), 2. ఫుష్పించే మొక్కలు (ఫెనెరోగామ్స్).
పుష్పించని మొక్కలు
- ఫుష్పించని మొక్కలను (క్రిప్టోగామ్స్) మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా.
- థాలోఫైటాను తిరిగి రెండు రకాలుగా విభజించవచ్చు. అవి. శైవలాలు, శిలీంధ్రాలు.
- శైవలాలకు ఉదాహరణ క్లామిడోమోనాస్. శిలీంధ్రాలకు ఉదాహరణ పుట్ట గొడుగులు.
- బ్రయోఫైటాకు ఉదాహరణ మాస్ మొక్క.
- టెరిడోఫైటాకు ఉదాహరణ ఫెర్న్ మొక్క.
పుష్పించే మొక్కలు
- పుష్పించే మొక్కలను (ఫెనిరోగామ్స్ను) రెండు రకాలుగా విభజించవచ్చు. అవి.. వివృత బీజాలు, ఆవృతబీజాలు.
- వివృతబీజాలకు ఉదాహరణ సైకస్.
- ఆవృతబీజాల్లో మళ్లీ రెండు రకాలుంటాయి. అవి.. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలకు ఉదాహరణ వరి, ద్విదళ బీజాలకు ఉదాహరణ చిక్కుడు.
- ఏకదళబీజ మొక్కల్లో ఒకే బీజదళం ఉంటుంది. ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. గుబురు లేదా పీచు లేదా అబ్బురపు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.
- ద్విదళబీజ మొక్కల్లో రెండు బీజదళాలు ఉంటాయి. ఈనెల వ్యాపనం, జాలాకార ఈనెల వ్యాపనం. తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.
- మొక్కల్లో ఉండే రసాయనాలను అనేక వ్యాధుల చికిత్సలో ఔషధాలుగా ఉపయోగిస్తారు. ఇలాంటి మొక్కలనే ఔషధ మొక్కలు అంటారు.
- మొక్కల నుంచి లభించే ఉత్పాదనలు: 1. ఆకులు, 2. పువ్వులు, 3. కలప, 4. పండ్లు, 5. కాయలు, 6. గింజలు.
ఆకుకూరలుగా ఉపయోగించే మొక్కలు
- తోటకూర, గోంగూర, బచ్చలికూర, మెంతికూర, పాలకూర మొదలైనవి. ఆకుల్లో క్లోరోఫిల్ ఉండటంవల్ల ఆకుపచ్చగా కనిపిస్తాయి.
- ప్రపంచంలో దాదాపు 1,50,000 రకాల పువ్వులు పూస్తాయి.
- రాత్రి పూసే పువ్వులు తెల్లగా ఉండి, సువాసన కలిగి ఉంటాయి.
ఉదా: మల్లె, జాజి, సన్నజాజి, పారిజాతం, మొగలిపువ్వు మొదలైనవి. - పగలు పూసే పువ్వులు వివిధ రంగులు కలిగి ఉంటాయి.
ఉదా: చామంతి, గులాబి, గన్నేరు, తామర, సూర్యకాంతం మొదలైనవి. - జపనీయులు పూలను ఎంతో అందంగా అలంకరిస్తారు. వారు పూలను అమర్చే విధానాన్ని ఇకేబానా అంటారు. ఇది ప్రపంచం అంతటా ప్రసిద్ధిగాంచింది.
- ప్రపంచంలో అతిపెద్ద పువ్వు – రఫ్లీషియా. దీని వ్యాసం ఒక మీటరు. బరువు నాలుగు నుంచి 11 కిలోల వరకు ఉంటుంది. కుళ్లిన మాంసం వాసన వస్తుంది. దీని వాసన రెండు కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది.
సువాసన కలిగివుండే పువ్వులు
- గులాబీలు, మల్లెలు, పారిజాతాలు, మొగలిపువ్వులు, పిటూనియా మొదలైనవి. ఈ పువ్వుల నుంచి సెంట్లు, స్ప్రేలు అనే సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు.
- వృక్షాల నుంచి కలపను తీస్తారు. కలప నుంచి గృహోపకరణాలను తయారుచేస్తారు. ఉదా: వేప, వెదురు.
- కొన్ని మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఉదా: చెరుకు, పసుపు, బంగాళా దుంప.
- కొన్ని మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఉదా: ముల్లంగి, క్యారెట్.
- ఎడారి మొక్కల్లో కాండం కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది.
మొక్కల భాగాలు
1. వేర్లు, 2. కాండం, 3. కొమ్మలు, 4. శాఖలు, 5. ఆకులు, 6. పువ్వులు, 7. కాయలు, 8. పండ్లు మొదలైన భాగాలుంటాయి.
వేర్లు
వేర్లలో గుబురు వేరువ్యవస్థ లేదా పీచువేరు వ్యవస్థ, ప్రధాన వేరు వ్యవస్థ అని రెండు రకాలు ఉంటాయి. గుబురు వేరువ్యవస్థ/పీచు వేరువ్యవస్థలకు ఉదా: జొన్నగడ్డి, వరి, మొక్కజొన్న, తాటి, ఈత మొదలైనవి.
ప్రధాన వేరు వ్యవస్థ
దీనిలో తల్లివేర్లు, పిల్లవేర్లు ఉంటాయి. ఉదా: చిక్కుడు, ఆవ, మిరప, చింత, మామిడి, వేప, కంది మొదలైనవి.
భూమిలోపల పాతుకుపోయి, మొక్కలకు నీటిని, ఖనిజ లవణాలను అందిస్తూ యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే వ్యవస్థను వేరువ్యవస్థ అంటారు. దీనిలో తల్లి వేరువ్యవస్థ, పీచు వేరువ్యవస్థ అని రెండు రకాలు ఉంటాయి.
తల్లి వేరువ్యవస్థ (Tap Root System)
మధ్యలో తల్లివేరు, చుట్టూ చిన్నచిన్న పార్శ వేర్లు ఉంటాయి. వీటిపై మూలకేశాలు ఉండి నీటిని, లవణాలను పీల్చుకుంటాయి. ఇది ద్విదళబీజ మొక్కల్లో కనిపిస్తుంది. ఉదా: చిక్కుడు, బఠాణి.
పీచు వేరువ్యవస్థ (Fibrous Root System)
కాండం కింది భాగం నుంచి గుబురుగా, సమానంగా వేర్లు ఉద్భవిస్తాయి.
వేరు చివరలో కప్పివున్న తొడుగు భాగాన్ని వేరు తొడుగు అంటారు.
పీచు వేరువ్యవస్థ ఏకదళబీజ మొక్కల్లో కనబడుతుంది. ఉదా: వరి, గోధుమ.
నీటిలో పెరిగే ఉల్ఫియా, యుట్రిక్యులేరియా మొక్కల్లో వేర్లు ఉండవు.
వేరు తొడుగు పైభాగంలో మూలకేశాలు ఉంటాయి.
వేరు రూపాంతరాలు (Root Modifications)
కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వర్తించడం కోసం వేర్లలో కలిగే మార్పులను రూపాంతరాలు అంటారు.
1. దుంప వేర్లు (Tuberous Roots)
వేర్లలో ఆహార పదార్థాలు నిలువ ఉండటంవల్ల దుంపలవలె మారుతాయి. ఉదా: క్యారెట్, బీట్రూట్, ముల్లంగి (రాడిష్). ఇవి రెండేండ్లు జీవించే మొక్కలు. వీటిని ద్వివార్షికాలు అంటారు.
2. ఊడ వేర్లు (Prop Roots)
కొన్ని వృక్షాలు, మొక్కల్లో కొమ్మల బరువు మోయడానికి కాండం నుంచి కొన్ని శాఖలు ఏర్పడి భూమిలోకి వెళ్లి వేర్లుగా రూపాంతరం చెందుతాయి. వీటిని ఊడ వేర్లు అంటారు. ఉదా: మర్రి (ఫైకస్)
భారతదేశంలో అతిపెద్ద మర్రిచెట్టు లక్నోలోని నేషనల్ బొటానికల్ గార్డెన్లో ఉన్నది. తెలంగాణలో అతిపెద్ద మర్రిచెట్టు పిల్లలమర్రి. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది.
3. ఊత వేర్లు (Stilt Roots)
మొక్క గాలి తాకిడిని తట్టుకుని నిలబడటానికి ఊతంగా కాండం నుంచి కొన్ని వేర్లు ఏర్పడుతాయి. వీటిని ఊతవేర్లు అంటారు. ఉదా: చెరుకు, వెదురు, మొగటి (పెండనస్).
4. వెలామిన్ వేర్లు (Velamin Roots)
ఇవి ఎత్తయిన మొక్కలపై పెరిగి ఆధారాన్ని పొందడం వల్ల తగిన సూర్యరశ్మి లభిస్తుంది. ఉదా: వాండా, వానిల్లా. వానిల్లాను ఐస్క్రీమ్ తయారీలో ఫ్లేవర్గా ఉపయోగిస్తారు.
కాలాన్ని బట్టి కాసే పండ్లు
వేసవి కాలం – మామిడి
వర్షాకాలం – బత్తాయి, సీతాఫలం
చలికాలం – ఆపిల్
కాలాన్ని బట్టి పూసే పువ్వులు
వేసవి కాలం – మల్లెలు
వర్షాకాలం – కనకాంబరాలు
చలికాలం – చామంతి
ఔషధ మొక్కలు – ఉపయోగాలు
తులసి ఆకులు – దగ్గు, పుండ్లు, నరాల బలహీనత, చర్మ వ్యాధుల చికిత్స
వేప ఆకులు, గింజలు, బెరడు – చర్మ వ్యాధులు, పుండ్ల చికిత్సకు
నీలగిరి (యూకలిప్టస్) ఆకులు – జలుబు, నొప్పులు, వాపుల చికిత్సకు
వెల్లుల్లి పాయుగర్భం – రక్తపోటు, జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు
పుదీనా ఆకులు – అజీర్తి, జలుబు
ప్రాక్టీస్ బిట్స్
1. రాజ్యాంగంలోని ఏ అధికరణం 6-14 సంవత్సరాల మధ్య బాలబాలికలందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమికవిద్యను అందించాలని తెలిపింది?
1) అధికరణ- 45 2) అధికరణ- 46
3) అధికరణ- 47 4) అధికరణ- 48
2. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత?
1) 60-70 2) 80-90
3) 120-140 4) 60-90
3. పృదఃకరణం ఎవరికి సంబంధించిన విద్యా కార్యక్రమం?
1) ప్రతిభావంతులైన పిల్లలు
2) బుద్ధిమాంద్యులైన పిల్లలు
3) శ్రవణ వైకల్యంగల పిల్లలు
4) అభ్యసన వైకల్యంగల పిల్లలు
4. కాళ్లు, చేతులు, భుజాలు నోరు ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికలతో ఏర్పడే సమస్యాత్మక పరిస్థితి?
1) ఎథోటోసిన్ 2) అటాక్సియా
3) అనమ్యత 4) స్పాస్టిసిటీ
5. బుద్ధిమాంద్యులకు బోధించే విద్య దేనిని ఉద్దేశించినది?
1) నైతిక ైస్థెర్యం ఇవ్వటం కోసం
2) వ్యక్తిగత సామాజిక వృత్తిపరమైన స్వాతంత్య్రాన్ని పెంపొందించడం
3) వైద్య, ఆరోగ్య స్వావలంబనకు
4) ఏదీకాదు
6. మౌఖిక సంజ్ఞల, సమగ్ర సమాచార పద్ధతులను ఏ లోపం ఉన్న వారికి బోధించడానికి ఉపయోగిస్తారు?
1) దృష్టి లోపం 2) వినికిడి లోపం
3) చలన వైకల్యం 4) అభ్యసన వైకల్యం
7. సంవృద్ధిమత్వం ఎవరికి సంబంధించిన విద్యా కార్యక్రమం?
1) ప్రతిభావంతులు
2) మందకొడిగా అభ్యసించే వారు
3) శ్రవణలోపం గలవారు
4) మానసిక వికలాంగులు
8. కింది వాటిలో ప్రతిభావంతుల లక్షణం?
1) మంచి సర్దుబాటు ఉండటం
2) సహకార భావం కలిగి ఉంటారు
3) సృజనాత్మకతతో ఉంటారు
4) పైవన్నీ
9. కింది వాటిలో భాషణ వైకల్యం ఏది?
1) డిస్ ఫేసియా 2) అఫేసియా
3) శ్రవణ వచోఘాతం 4) పైవన్నీ
10. ఏ వైకల్యం ఉన్న పిల్లలకు బోధించటానికి పెదవుల పఠనం అనే టెక్నిక్ ఉపయోగిస్తారు?
1) వినికిడి లోపం 2) దృష్టి లోపం
3) అభ్యసన వైకల్యం
4) మస్తిష్క పక్షవాతం
11. ఇతరులు వ్యక్త పరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సామర్థ్యం లేకపోవటం ?
1) డిస్ఫేసియా 2) డిస్గ్రాఫియా
3) డిస్లెక్సియా 4) డిస్కాల్కులియా
12. ఎవరి కండరాల్లో అసంకల్పిత ప్రతీకార్యచర్య ఉండటం వల్ల కండరాల కదలిక వారు నిర్దేశించే విధంగా ఉండదు?
1) ఎథోటోసిన్ 2) అటాక్సియా
3) స్పాస్టిసిటీ 4) అనమ్యత
13. ముద్రిత భాషను చదవడం, రాయడంలో ఉండే అశక్తత గల వైకల్యం?
1) అలెక్సియా 2) అఫేసియా
3) అగ్రాపియా 4) ఏదీకాదు
14. ఏ సమ్మిళిత విద్యా నమూనా యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?
1) దూర అభ్యసన నమూనా
2) ద్వంద్వ బోధన నమూనా
3) సంచారక బోధన నమూనా
4) పైవేవి కావు
15. మౌఖిక, సంజ్ఞ సమగ్ర సమాచార పద్ధతులను ఏ లోపం ఉన్న వారికి బోధించడానికి ఉపయోగిస్తారు?
1) అభ్యసన వైకల్యం
2) చలన వైకల్యం
3) వినికిడి వైకల్యం
4) దృష్టి లోపం
16. దృష్టిలోపం ఉన్న వారు రాసే లిపి?
1) ప్రత్యేక లిపి 2) సాధారణ లిపి
3) బ్రెయిలీ లిపి 4) విశేష లిపి
17. దృష్టిలోపం ఉన్న పిల్లలకు ఎలాంటి బోధనోపకరణాలను ఉపయోగిస్తారు?
1) తాకటం లేదా స్పర్శ 2) వినడం
3) పై రెండూ 4) ఏదీ కాదు
జవాబులు
1.1 2.3 3.1 4.1 5.2 6.2 7.1 8.4 9.4 10.1 11.1 12.2 13.1 14.2 15.3 16.3 17.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు