సంగమ వాజ్ఞ్మయం ఏ భాషకు చెందినది? (TET special)
భాష, లిపి, గొప్ప గ్రంథాలు
- తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు భాషలు ద్రావిడ భాషా కుటుంబం లోనివి.
- సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ, ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినవి.
- తెలుగు భాషలోకి సంస్కృతం, మరాఠీ, అరబ్బీ, పర్షియన్ పదాలు చేరాయి.
- సింధూ నాగరికత ప్రజలు బొమ్మల లిపిని ఉపయోగించారు.
- బ్రాహ్మీ లిపి అశోకుడి కాలానికి చెందినది. మన దేశంలో ఉపయోగిస్తున్న అనేక లిపులకు ఇదే మూల లిపి.
- తెలుగు రాష్ర్టాల్లో కృష్ణా డెల్టాలోని ‘భట్టిప్రోలు’ స్థూపంలోని శిలాశాసనం లిపి క్రీ.పూ. 200 నాటిది.
- గుడ్డమీద, ఆకుల మీద, చెట్ల బెరడు మీద, కుండల మీద మొదట్లో రాసేవారు.
- దక్షిణ భారతదేశంలో తాటి ఆకుల మీద ఘంటంతో రాసేవారు.
- ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో లభ్యమయ్యే భూర్జ పత్రాల మీద, చెట్ల బెరడు మీద రాసేవారు.
- నోటి మాటలతో ముఖతః ఒక తీరం నుంచి మరో తీరానికి చేరుతూ మౌఖికంగా నిలిచిన దాన్ని మౌఖిక సాహిత్యం అంటారు.
- విశ్వం ఎలా ప్రారంభమైందో రుగ్వేదంలోని నాసదీయ సూక్త మంత్రంలో చెప్పారు.
- వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని ఆదికావ్యంగా పరిగణిస్తారు. మొదట్లో దీన్ని పాడుతూ ప్రచారం చేసేవారు. క్రమంగా గ్రంథస్థం చేశారు.
- మహాభారతాన్ని వ్యాసమహర్షి సంస్కృతంలో రచించారు. మొదట్లో వీధి భాగవతులు గానం చేసిన
- అనంతరం గ్రంథస్థం అయ్యింది. ప్రపంచంలో ఎక్కువ శ్లోకాలు కలిగి, వందల కొద్దీ చిన్న చిన్న కథలు గల కావ్యం.
- రామాయణ, మహాభారత ఇతిహాసాలు సుమారు 1600 సంవత్సరాల క్రితం గ్రంథస్థ రూపం దాల్చినట్లు చరిత్రకారుల భావన.
- జాతక కథలు 1600-1800 సంవత్సరాల క్రితం సంకలనం చేశారని పరిశోధకుల భావన.
- మరణం సహజమని బుద్ధుడు కిసా గౌతమి జాతక కథ ద్వారా ప్రవచించారు
- ఆయుర్వేదం వైద్య విధానంలో మూలికలు, ఆకులు, గింజలతో మందుల తయారీ విధానం ‘చరక సంహిత’ గ్రంథం వివరించగా, ‘సుశ్రుత సంహిత’ శస్త్ర చికిత్సల గురించి తెలిపిన గ్రంథం.
- ఆర్యభట్ట తన ‘ఆర్య భట్టీయం’ గ్రంథం ద్వారా భూభ్రమణం వల్ల రాత్రింబవళ్ళు ఏర్పడుతాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని సిద్ధాంతాలను ప్రవచించారు.
- పాణిని సంస్కృతంలో ‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథం రచించారు.
- కుషానుల కాలంలో అశ్వఘోషుడు ‘బుద్ధ చరిత్ర’ గ్రంథం రచించారు. ఇది
సంస్కృతంలో మొదటి పద్య కావ్యం. - రెండవ చంద్ర గుప్తుని ఆస్థానంలోని అమరసింహుడు ‘అమరకోశము’ అనే ప్రసిద్ధ నిఘంటువు రచించారు.
- బాసుడు నాటక కర్త, రామాయణ, మహాభారతాల ఆధారంగా 13 నాటకాలు రాశారు.
- కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే నాటకాన్ని రచించారు.
- శూద్రకుడు ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించారు.
ప్రాక్టీస్ బిట్స్
1. ద్రావిడ భాషా కుటుంబానికి చెందని భాష
1) మలయాళం 2) మరాఠీ
3) తెలుగు 4) తమిళం
2. కింది వాటిలో ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినది?
1) కన్నడ 2) మరాఠీ
3) గోండు 4) ఆంగ్లం
3. భారత్లో బొమ్మల లిపిని ఉపయోగించిన ప్రజలు
1) వేదకాలపు సంస్కృతి
2) సింధూలోయ నాగరికత
3) తమిళ సంగం యుగపు ప్రజలు
4) అజిటెక్ నాగరికత
4. అశోకుడు తన శాసనాల్లో ఉపయోగించిన లిపి ?
1) ఖరోష్ఠి లిపి 2) దేవనాగరి లిపి
3) బ్రాహ్మీ లిపి 4) తమిళ లిపి
5. బ్రాహ్మీలిపి కింది లిపుల్లో దేనికి మూలలిపి కాదు?
1) దేవనాగరి 2) తెలుగు
3) తమిళ 4) రోమన్
6. అశోకుని శాసనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం
1) అవి శిలాశాసనాలు
2) భూర్జపత్రాల శాసనాలు
3) కుండలపై ఉన్న శాసనాలు
4) తాటి ఆకులపై ఉన్న శాసనాలు
7. మౌఖిక సాహిత్యానికి సంబంధించి కింది వాటిని పరిగణించండి
ఎ) నోటిమాటలతో నిలిచి ఉన్నవి
బి) తాత, అవ్వల ద్వారా విన్నవి
సి) ఒక తీరం నుంచి మరో తీరానికి చేరుతూ మౌఖికంగా నిలిచేవి
డి) వాస్తవంగా చేతితో రాసి పెట్టినవి
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) బి, డి 4) డి
8. రుగ్వేదంలో నాసదీయ సూక్త మంత్రం కింది ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది
1) విశ్వం ఎలా ప్రారంభమయ్యిందో
2) గాయత్రి మంత్రం ఆవశ్యకత
3) పరమాత్మ స్వరూపం
4) మానవ జన్మ ఆవిర్భావం ఎలా అయ్యిందో
9. ఇతిహాసాలకు సంబంధించిన కింది విషయాలను పరిగణించండి
ఎ) మంచి చెడులకు, ధర్మ అధర్మాలకు మధ్య కలిగే సంఘర్షణలు తెలియజేస్తాయి
బి) గ్రంథస్థం చేసి సంస్కృతంలో రచించినవి
సి) కథకులు పాడుతూ ప్రచారం చేశారు
డి) కాల్పనిక సాహిత్యం
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, డి 4) ఎ, బి, డి
10. ‘ఆదికావ్యం’గా పరిగణించే కావ్యం?
1) మహాభారతం 2) రామాయణం
3) భాగవతం 4) వేదకావ్యం
11. ప్రపంచంలోనే ఎక్కువ శ్లోకాలు, వందల గాథలున్న కావ్యం?
1) రామాయణం 2) మహాభారతం
3) అభిజ్ఞాన శాకుంతలం 4) శివ పురాణం
12. గౌతమ బుద్ధుడు ధర్మాన్ని ప్రపంచానికి అనేక జన్మలు ఎత్తినట్లుగా తెలిపిన బౌద్ధ సాహిత్యం
1) త్రిపీటకాలు 2) ద్వాదశ అంగాలు
3) బుద్ధ చరిత్ర 4) జాతక కథలు
13. సంగమ వాజ్ఞ్మయం ఏ భాషకు చెందినది?
1) తమిళ 2) కన్నడ
3) తెలుగు 4) మలయాళం
14. ఆయుర్వేద వైద్య విధానానికి చెందిన శస్త్ర చికిత్స గ్రంథం?
1) చరక సంహిత 2) సుశ్రుత సంహిత
3) వైద్యరత్నాకరం 4) ఆయుర్వేదం
15. ఆర్యభట్ట తన ఆర్యభట్టీయంలో ఏ సిద్ధాంతాలను ప్రవచించాడు?
ఎ) భూ భ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి
బి) సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు
సి) విశ్వానికి కేంద్రం అంగారకుడు
డి) ప్రజలు ఇతని సిద్ధాంతాలను ఆదరించారు
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ, డి 4) డి
16. కింది వాటిని జతపరచండి
పుస్తకాలు రచయితలు
ఎ) అష్టాధ్యాయి 1) కాళిదాసు
బి) బుద్ధ చరితం 2) శూద్రకుడు
సి) అభిజ్ఞానశాకుంతలం 3) అమరసింహుడు
డి) మృచ్ఛకటికం 4) అశ్వఘోషుడు
5) పాణిని
1) ఎ-1, బి-2, సి-3, డి-5
2) ఎ-3, బి-5, సి-1, డి-2
3) ఎ-5, బి-4, సి-1, డి-2
4) ఎ-5, బి-1, సి-4, డి-3
17. సంస్కృత భాషలోని మొట్టమొదటి పద్యకావ్యం
1) బుద్ధ చరిత్ర 2) అభిజ్ఞానశాకుంతలం
3) గయోపాఖ్యానం 4) శ్రీచక్ర భాష్యం
18. నాటి పట్టణ ప్రజల జీవితాలను వర్ణించిన మృచ్ఛకటికం-నాటక కర్త
1) కాళిదాసు 2) బాసుడు
3) శూద్రకుడు 4) పతంజలి
19. కింది గ్రంథాలు, వాటి ప్రాధాన్యతలను జతపరచండి
గ్రంథాలు ప్రాముఖ్యత
ఎ) చరక సంహిత 1) సంస్కృత నిఘంటువు
బి) సుశ్రుత సంహిత 2) విశ్వరహస్యాలు
సి) ఆర్యభట్టీయం 3) శస్త్ర చికిత్స
డి) అమరకోశం 4) ప్రాచీన వైద్యం
5) వ్యాకరణం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-5
3) ఎ-5, బి-1, సి-2, డి-4
4) ఎ-5, బి-2, సి-1, డి-2
జవాబులు
1. 2 2. 2 3. 2 4. 3 5. 4 6. 1 7. 2 8. 1 9. 2 10. 2 11. 2 12. 4 13. 1 14. 2 15. 1 16. 3 17. 1 18. 3 19. 1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు